పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16471

  1. మనకు తెలియని మన త్యాగరాజు – 5 గురించి Dr P V Ramana అభిప్రాయం:

    04/12/2017 11:22 am

    Sai Brahmanandam Gaaru, I am in the process of compiling a curated version of Saint Thyagaraja’s History and other apsects such as Bhakti Yoga and Nada Yoga. This is a part of my ongoing project of Recording all known Carnatic Vocal Music in a teaching format. I have completed about 700 compositions so far, and hope to complete at least 1000 before December 2017, when we wish to launch the free website for advanced learners. This book will also be published at that time. I wish to correspond with you regarding the source material for your most extensive and wonderful essay on Manaku Teliyani Tyagaraju in 5 parts. Can you please give your email id and mobile number? More details about me and my project at http://www.itm.edu and http://www.carnaticheritage.in Thanks in advance and warm regards, Ramana

  2. విశ్వనాథ రెండు నవలికలు: తొలిపలుకు గురించి Bhaskar Kompella అభిప్రాయం:

    04/11/2017 11:02 pm

    సత్యనారాయణగారు పాతకాలం మనిషి. ఆయన నేను ఆధునికుణ్ణోయ్ అని ఎలుగెత్తి ఎప్పుడూ చాటలేదు. ఆయన కొత్తకాలంవాడు కాదోయ్ అని ఎందుకు గొంతు చించుకోవాలో అర్ధం కాదు. అరసవిరససారసావేశులంతా ఆయన భావాల్ని మెచ్చలేకపోయినా, భాషాసరస్వతిని కాదలేకపోయారు. అలా ఒప్పుకోవడం నామోషీ అనిపించిన జనాలు ఆ కారణాలూ ఈ కారణాలూ వెతుక్కున్నారు.

    ఈ శీర్షిక వ్రాసిన వెల్చేరు నారాయణరావుగారి మాటల్లోనే … “చెబుతూ ఉన్న విషయాన్ని వదిలి వేరే వైపుకి ఆయన వాగ్ధార వెళ్ళిపోయేది. అది కొన్నిసార్లు చాలాదూరమే వెళ్ళిపోయి ఆ సమయంలో తను అనుకుంటున్నవన్నీ… ఈ అప్రస్తుత ప్రశంసలు…”

    ఇది నారాయణరావుగారు వ్రాసిన ఈ ఉపోద్ఘాతంలో ఉన్న అప్రస్తుత ప్రశంసలకీ వర్తిస్తుంది. ఆ విషయం తప్పితే, మిగిలినదంతా బాగుంది.

  3. అంతా కొత్తగా… గురించి Vijay Koganti అభిప్రాయం:

    04/10/2017 1:02 pm

    ధన్యవాదాలండీ.

  4. బావి దగ్గర: ఒక ఎక్‌ఫ్రాస్టిక్ పోయెమ్ గురించి వేలూరి వేంకటేశ్వర రావు అభిప్రాయం:

    04/09/2017 4:12 pm

    Many many thanks to all the erudite readers for enlightening me about the beautiful poetry, “citra maalikalu” of Sri Setti Lakshminarasimham.

    Regards.

    Veluri Venkateswara Rao

  5. బావి దగ్గర: ఒక ఎక్‌ఫ్రాస్టిక్ పోయెమ్ గురించి VSTSayee అభిప్రాయం:

    04/09/2017 11:56 am

    ఏల్చూరి మురళీధరరావుగారు said:

    దృశ్యవర్ణనాత్మకమైన సెట్టి లక్ష్మీనరసింహకవి గారి ‘చిత్రమాలికలు’ సంపుటం మనస్సులో మెదిలింది

    ఆంధ్రసాహిత్యపరిషత్పత్త్రిక దుర్ముఖిసంవత్సర మార్గశిర్ష-పుష్యమాసముల సంచికలో “శ్రీ సెట్టి మేష్టరుగారి” రచనలోని చమత్కృతులను వివరించే రాజేశ్వరిగారి వ్యాసము –

    చిత్రమాలికలు – 1956 (pdf 3MB)

    నమస్సులతో,
    వాడపల్లి శేషతల్పశాయి.

  6. నాకు నచ్చిన పద్యం: వసంతునితో వెన్నెలఱేడు పోటీ! గురించి ఏల్చూరి మురళీధరరావు అభిప్రాయం:

    04/09/2017 12:18 am

    మాన్యులు శ్రీ తః తః గారికి
    నమస్కారములతో,

    వెన్నెల అంజలిగ్రాహ్యమూ (దోసిళ్ళతో పట్టుకోదగినది), కుంభగ్రాహ్యమూ (కడవలలో నింపుకోదగినది) అని; చకోరపక్షి వెన్నెల కిరణాలను గ్రోలి జీవిస్తుందని ఉన్నవి కవిసమయాలు. వెన్నెలలో చంద్రకాంతశిల ద్రవిస్తున్నట్లుగా కనబడటం అటువంటి లోకవిరుద్ధమైన కవిసమయం కాదు. ఆనుభవికమైన దృగ్విషయమే. నేను చూచిన లక్షణగ్రంథాలలోని కవిసమయకోటిలో ఇది చేరినట్లుగా గుర్తురాలేదు. “కనంబడ ఱాల్ కరగంగజేసె” అని కవి సార్థకంగానే అన్నాడు. వెన్నెలలో పాలరాళ్ళు కరుగుతున్నట్లు కనబడటం వాస్తవికమే.

    “పునరుద్భవద్దంతముగ్ధచిక్కణకపోలక్షీరకాంతివేలాసుధాబ్ధి” అన్న విశ్వనాథ పద్యం ఊహలో ఉన్న అపురూపమైన మసృణత్వం దాని అభివ్యక్తిలో స్ఫుటగోచరం కాకపోవచ్చును. అది రసనిర్భరమైన ఆయన కావ్యగంభీరిమ లక్షణం. ఒకానొక కవి శైలి పైకి ఎంతో మెత్తగా కనబడి, అందులో ఏ మాత్రం తరచి చూడవలసిన లోతు లేకపోవటం కూడా ఉన్నదే. ఆ విధంగా ప్రసన్నతా సౌకుమార్యాలు బాహ్యచిహ్నాలుగా “కనంబడు” రచనలను చేయటం వెన్నెలలో రాళ్ళను కరుగుతున్నట్లుగా తోపజేయటం వంటిదే. పైగా అన్యులను మెచ్చలేకపోవటం వారి వ్యక్తిత్వంలోని లోపం. వారి రచనలేమైనా శాశ్వతికాలా? అంటే, వసంతుని వంటివారి రచనలలోని ఔదార్య రసోపగుంభితపదగంధత్వాదులకు అవి సాటి రావు.

    కవి “ఏ గతి రచియించిరేని సమకాలము వారలు మెచ్చరే కదా” అన్నాడు. మనము “స, ద్గతి రచియించిరేని కలకాలము వారలు మెత్తురే కదా” అనే అవకాశాన్ని ఇవ్వలేదు. అంటే సమకాలం వారు (చంద్రుని వలె) మెచ్చుకోకపోయినా, నిరవధికమైన కాలంలో అనంతమైన భూమండలంలో తనతో సమానధర్ముడు జన్మించితీరుతాడన్న నమ్మకం.

    సప్రశ్రయంగా,
    ఏల్చూరి మురళీధరరావు

    తా.క. మీరు ప్రస్తావించిన వేంకటకవి కులాన్ని గురించి పూర్వం విమర్శకులు వ్రాసినది చదివిన తర్వాత దానిని గురించిన స్థిరాభిప్రాయమేదీ నాకు కలుగలేదు. అందువల్ల ఆ అంశాన్ని గురించి చర్చింపలేను. కవి మనస్సుకు కష్టం కలిగిన మాట వాస్తవం. మెరుగైన వసంతుని రచనను చంద్రుడు మెచ్చుకోకపోవటం, ఆ మెచ్చుకోనివాని రచన అంతకంటె మేలైనదేమీ కాకపోవటం ఇందులోని చిత్రితాంశాలు. వసంతుడు కూడా ఆ వాగ్వాదంలోకి దిగలేదు కాబట్టి, సమకాలంలో మెచ్చనివారి జాతిలో అతడు లేడు. కాలిక కవిచంద్రులు శ్లాఘింపలేకపోయినా, తన రచన కాలపు ఇనుపతెరలను చీల్చుకొని చిరకాలం జీవిస్తుందని కవికి ఆత్మవిశ్వాసం ఉన్నది.

    పద్యంలో వ్యాఖ్యాతల దృష్టికి రాని శబ్దచిత్రం ఒకటున్నదని, అది కామేశ్వరరావు గారి ఉత్తమపరిచాయికకు పరిపూరకం కాగలదని ఈ మాటలను ఉద్దేశించాను. శ్రీమతి లక్ష్మీదేవి గారి అనుమోదానికి నా హృదయపూర్వక ధన్యవాదాలు.

  7. నాకు నచ్చిన పద్యం: వసంతునితో వెన్నెలఱేడు పోటీ! గురించి తః తః అభిప్రాయం:

    04/08/2017 7:23 pm

    శ్రీ మురళీధరరావుగారూ!

    “జాగ్రత్తగా చూస్తే కఠినమైన చంద్రకాంత శిల నిజంగా కరగటం జరగలేదు” కవి సమయాలను జగ్రత్తగా చూడకూడదు. ‘వారక ఈశ్వరుండు తలపైన… చంద్ర కాంతముల్ నీరగునే…’లో వారిజవైరి ఏమై పోవాలి?

    నమస్కారాలతో
    తః తః

  8. మనుషులెందుమూలంగా జీవిస్తారు? గురించి Sujata అభిప్రాయం:

    04/08/2017 3:05 pm

    Leo Tolstoy, Stories and Fablesలో ఈ కధ 2007లో చదివాను. మళ్లీ పదేళ్ల తరవాత తెలుగులో చదవగలగడం నా అదృష్టం. అద్భుతమైన కధ. చాలా కుదురుగా అనువదించారు. కళ్లలో నీరు తిరక్కుండా ముగించడం కష్టం.

  9. నాకు నచ్చిన పద్యం: వసంతునితో వెన్నెలఱేడు పోటీ! గురించి తః తః అభిప్రాయం:

    04/08/2017 2:38 pm

    శ్రీ మురళీధరరావుగారూ! సదరు పద్యమూ శ్రీకామేశ్వరరావు గారి వ్యాఖ్యానమూ చదివి “సమకాలము వారలు మెచ్చరే గదా” అన్న మాట, ఆపైన మూడు పాదాల్లో చెప్పిన దానికి ఏమాత్రం పొసగదు అని అనుకుంటూ మీ అభిప్రాయం చూసిన నాకు వచ్చిన ధైర్యంతొ ఇలా రాస్తున్నాను:

    వేంకట కవి అబ్రాహ్మణుడు. అబ్రాహ్మణుడు వేదంతో సమానమైన మాటలు రాసినా బ్రాహ్మణులు మెచ్చరన్న విషయమే కవి చెప్పాలనుకున్నాడని తేలికగానే తెలుస్తున్నది. ఇది అలా ఉంచి, శ్రీ కామేశ్వరరావు గారన్న ‘స్పర్థ’లో ‘బ్రసన్నతయును సౌకుమార్యము’ ఇముడుతాయా? ‘మెచ్చుచు చంద్రుడు మిన్నునం బ్రసన్నతయును సౌకుమార్యము గనంబడ ఱాల్ గరగంగజేసె! ‘యీ గతి రచి/ చరి యించిరేని సమకాలము వారలు సౌఖ్యమౌ గదా!’ అని వేంకట కవి వ్రాసి యుండి యుంటే ఆయన చెప్పదలచుకున్న విషయం బాగా హత్తుకుని ఉండేది.

    నమస్కారాలతో
    తః తః

  10. బావి దగ్గర: ఒక ఎక్‌ఫ్రాస్టిక్ పోయెమ్ గురించి P. Mohan అభిప్రాయం:

    04/08/2017 1:45 am

    Thanking you Srinivaasudu gaaru