ఈలాటి శబ్ద తరంగాలు ‘సెలెబ్రిటీ’ మోజు ఉన్నవారి కోసం. అంతే కాని ఇవి కవిత్వ ప్రియులను, సంగీత ప్రియులను రంజింప చేయలేవు.
ఉంటుంది, మనుషులకు కుతూహలం ఉంటుంది. అందమైన వర్ణ చిత్రాలను చూసినా, రచనలు చదివినా, ఆ కళాకారుడు ఎవరు, అతని ఫొటో చూడాలనో, స్వయంగా కలవాలనో ఉంటుంది. చూడొచ్చు, కలవొచ్చు. విశ్వనాథ సాహితీ ప్రియులకు కొందరికి ఆయన కంఠంలో ఆయన కవిత వినాలని ఉంటుంది. పాఠకుల విభిన్న మనస్తత్వాలను, ఇష్టాలను గ్రహించగలిగిన సంపాదకులు బహుశా ఆ కారణం చేత వీటికి ఈ పత్రికలో స్థానం ఇస్తూ ఉంటారు.
కాని, కవితా పఠనం బాగు ఓగుల దృష్యా చూస్తే, కిన్నెరసాని లోని ఊహకు, ఇక్కడ విశ్వనాథ కంఠం నుండి వెలువడే ధ్వనికి సమగ్ర సంయోగం లేదు. కవి -ప్రియురాలా! జవరాలా! అంటూ అస్పష్టపు కూనిరాగాలు తీస్తూ, కవిత చదువుతూ, ఆపుతూ, మధ్య మధ్యలో ఆ కిన్నెరసాని వాగు కథ చెపుతున్నారు. ఆయన మెదడులో ఉన్న ఆ దృశ్యం, ఆ ధ్వని, మన కళ్లకూ, చెవులకూ చేరే దృశ్యం, ధ్వనీ -ఒకటి కావు. మనలో చాలామందిమి, పాడుకుంటున్నప్పుడు జరిగేది ఇదే.
ఉదాహరణకు: నేను (లైలా)
“శ్రీమన్నారాయణ, శ్రీమన్నారాయణ, శ్రీమన్నారాయణ
నీ శ్రీపాదమే శరణు ఊ…..”
అని పాడుతుంటే, నాకు మెదడులో అప్పటికే రికార్డ్ ఐపోయి ఉన్న నా కిష్టమైన శ్రీమతి సుబ్బులక్ష్మి పాట వినిపిస్తుంటుంది, నామటుకి నేను ఒక ఆనంద ప్రపంచంలో ఉంటాను. నా పాట వింటున్న పక్క వాళ్లు, ముందు నేలమీద మొదలై, అకస్మాత్తుగా ఆకాశాన్నంటి, మళ్లీ గబుక్కున పాతాళంలోకి పోయి, స్వరానికీ స్వరానికీ పొంతన లేని అపశృతి మయమైన కఠోర శబ్దాలు వింటుంటారు. సుబ్బులక్ష్మి పాటనే కాక, నా పాట కూడా రికార్డ్ చేసుకుని నేను వింటే తప్ప, ఆవిడ అత్యంత మధురంగా పాడిన ఆ అన్నమాచార్యుని కీర్తనకు నేను ఎంతదూరంలో ఉన్నానో తెలియదు.
అది తెలియక, ఇంకా అదే చాపల్యంతో;
“కమలాసతీ ముఖ కమల కమల హిత, కమల ప్రియే, కమలేక్షణా
కమలాసన హిత, గరుడగమన, శ్రీ కమల నాభ! నీ పదకమలమే శరణు ఊ….”
అని నే పాడేస్తుంటాను.
నా అదృష్టవశాత్తు, నే వినేది నా మెదడులో, సుబ్బులక్ష్మి పాటనే. సంగీతం లక్షణాలలో, దాని పుణ్యమా అని, అది ఒకటి.
అదే విశ్వనాథకు కూడా జరుగుతున్నది. ఆయన తన కాలంలో చాలా మధుర గాయకులను వినే ఉంటారు. తన కిన్నెరసాని కవితను ఈ సభలో అలా పాడుతున్నాను అనుకుంటున్నారు. వాస్తవం అది కాదు. ఆ పఠనం అంత గొప్పగా లేదు.
ఒక కవిత్వం లోని అందాన్ని చూపలేని, పైగా తగ్గించే -ఈ కవన పఠనం, ఇప్పుడు ఎందుకు వింటం? అనుకుంటాను నేను. ఎప్పుడో ఒక సభలో ఆయనకు కవిత చదివే అవకాశమిచ్చారు. అప్పటి శ్రోతలు విన్నారు. దాని ఆవశ్యకత అంతటితో తీరిపోయింది. ఫేమస్ ఐన వాళ్ల ఒకప్పటి మాటలు పాటలు ఎట్లా ఉన్నాగాని కలెక్టబుల్స్ అనుకుని, ఆ route లో, నాస్టాల్జియా కలెక్షన్గా, ఇలా ఇప్పటి పత్రికలో వచ్చి చేరతాయి, కొన్ని గరగరల, అపశబ్దాల ఆడియోలు.
కళ మీద ఆసక్తి ఎక్కువ, వ్యక్తి మీద drooling తక్కువ ఉంటే, కిన్నెరసాని ఆకస్మిక కోపం, దు:ఖం, ఆమె నీరవటం, భర్త బండవటం, సముద్రుడు ఆమెకోసమై ఎగసిపడటం, ఆమె కళవళపడి గోదావరిలో లయించటం – ఈ గాథను ఇప్పటి గాన గంధర్వులతో పాడించి, లేదా మంచి వాయిద్యకారులతో సింఫొనీ మ్రోగింపచేయిద్దామని వారిని నియోగించి, ఆ కొత్త రికార్డింగ్ బాగుంటే విడుదల చెయ్యొచ్చు.
లేదూ, విశ్వనాథ కిన్నెరసాని దాని దోవన అది చదువుకుని, అప్పుడో మరోసారో, Edward Greg- Solveig’s song విన్నా. Svetlana – Moldau విన్నా, సుఖం ఉంది. ఆ సంగీత నదీ ప్రవాహాల చలనాలకి హృదయం కరిగి పోతుంది.
చక్కని శబ్దానికి, ఎక్కడిదైతేనేం మంచి శ్రోతగా మారితే చాలదా?
“వెన్నెలలో చంద్రకాంతశిల ద్రవిస్తున్నట్లుగా కనబడటం అటువంటి లోకవిరుద్ధమైన కవిసమయం కాదు. ఆనుభవికమైన దృగ్విషయమే.”
చెప్పింది అర్ధమయింది.
ఐనా, నాకైతే ఈ వర్ణన కవి సమయమే అనిపిస్తుంది. చంద్రకాంతికి ఏ రాయీ కరిగి ప్రవహించదు కదా. Crystallographers, geologists ఉన్నారు పాఠకులలో – వారు మనకు ఇందలి నిజానిజాలు చెప్పగలరేమో. ఈ క్రింది పద్యము చాలా అందమైన కవి సమయము కాదా? ఇది ప్రకృతి సహజమా?
వసుచరిత్రము ద్వితీయాశ్వాసము; పద్యము 21
సీ. రేలెల్ల నమృతమరీచి నంటున నంట గరగి నిర్మలపయోఝరుల దొరగి
బలువిడి పెనులోయ బడిన క్రొన్నెలరాల చఱులలో నిరుగడ దఱచు మెఱచు..
అలాగే -కోయిల పంచమ స్వనంలో పాడుతుంది అనటం కవి సమయమే. కోయిల కూత – భారత కోకిల లతా మంగేష్కర్ कुहू कुहू बोले कोयलिया ( కుహూ కుహూ బోలే కోయలియా) అని పాడింది. అది అమృత వర్షమే. అందులో తడిసి తనిసినారెందరో. ఐనా, కు హూ లో – ‘కు’ కింది స్థాయిలో ఉంటే ‘హూ’ దాని కన్నా రెండు మెట్లో ఏమో పై స్థాయిలో పాడతారు లతా, రఫీ. నిజం కోయిల అలా పలకదు. కూహ్ కూహ్ అంటుంది. పశ్చిమ కోకిల ఐతే, ‘కుకూ కుకూ కుకూ’ లో మొదటి హ్రస్వ స్వరం పై మెట్టు, రెండవ దీర్ఘ స్వరం దానికన్నా దిగువన పలికిస్తుంది. ఎంత సేపూ రెండు స్వరాలు వరసొరసనే పలికిస్తుంది. ఈ రెండు స్వరాలే కోయిల పాట. దానికి కవులు దుంపలు తెంపలు చేసుకుని కోకిల మీద, కోకిల అన్న మాటను వాడుతూనూ వందల వందల గీతాలు రాశారు. కొంతమంది అదృష్టం అది. లోకంలో వారికి ప్రచారకులు ఉంటారు. కోకిలకు అంత ప్రతిభ లేకున్నా కాని, చాలా సమర్ధులైన ప్రచారకులు ఉన్నారు.
A segment (from Saint-Saens “The Carnival of Animals”) called ‘The cuckoo in the depths of woods’ is worth listening. It is easily found on the net. For this segment Roger Moore gives a beautiful narration poking fun at cuckoo –
“….
And so without a proper song
He just sings cuckoo all day long
He is not what you would call a star
With such a basic repertoire
And yet that simple two word phrase
Casts such a spell on summer days…”
There is more of these words. I don’t know whose charming words these are. I don’t think it is Ogden Nash’s poetry. The back drop of piano chords in the music recital is soothing. The sounds of cuckoo D & lower B-flat are played on clarinet. The clarinetist is placed somewhere outside the orchestra. The cuckoo sounds surprise and then on are eagerly anticipated both by musicians and listeners alike.
The whole composition of Camille Saint –Saens is marvelous and is an example of self-deprecating humor of a musician/s. The musician did not dare release this light hearted music of his, in his lifetime, for the fear of being considered a frivolous artist by his contemporaries.
(Dear Readers! By now you noticed I have not digressed one bit, but am only elaborating on relevant themes. i.e., the oppression of artists by fellow contemporary artists. And కవి సమయములు. Mine is never an erratic, all over the place writing. It is always under control delivery. Some contemporaries just can’t stand my scientific approaches and would rather read gossip as theses. )
Anyways, another favorite is Robert Schumann’s ‘Cuckoo in hiding.’ In this piano piece, he uses a combination of notes and chords in the left and right hands to produce the cuckoo sounds. Even though considered as a beginners’ piece, by the teachers, perhaps adults are more charmed by this composition than kids. I love it. Sure there is a G (పంచమము) somewhere in the cuckoo sounds, but that is not the only note he used.
Surprise. Surprise. I am hearing an anxiety inducing grating, two note sound now, in the airport as our boarding passes are being scanned. Cuckoo. Cuckoo. Got to go board the plane.
So Long. Happy Easter!
Lyla
యుద్ధం ఉన్న వ్యవస్థలో రెడ్ బట్లర్ లాంటి వాళ్ళు అనుభవం ద్వారా పాత కొత్త విలువలను కలగలిపి చూసుకునే అవకాశం ఎలా వచ్చింది ధర్మారావు ఆ భౌతిక పరిస్థితులు లేక మారకుండా అదే అకర్మణ్య స్థితిలో ఉండిపోవటం బాగా పోల్చి చూపించారు. బాగుంది.
మీ వివరణకు ధన్యవాదాలు మురళీధరరావుగారూ! అన్నట్టు వేకట కవి తన సమకాలికులైనవారికి సమకాలికుడే గదా! మీరు ఉటంకించిన విశ్వనాథ పద్యపాదం – బాల్య యౌవన దశా పరిణాహ సంధిత్రపాముగ్ధ నేత్ర శోభాపయోధి – లోదేనా! తరువాతి చరణాలు నాకు గుర్తు రావటం లేదు
“అతని దృష్టికి జానకి ఆగలేదు
అతని ముష్టికి శివధనుస్సాగలేదు…..”
నాకు నారాయణరావుగారి పరిశోధనల గురించి తెలియదు. నేనెప్పుడూ చదవలేదు. ఆయన ప్రతిభావ్యుత్పత్తుల మీద అనుమానం కాని, ఆయనకి వి.స. మీద అభిప్రాయాలేమిటన్నది కాని ఇక్కడ చర్చనీయాంశం కాదు. ‘ఆంగ్ల పాఠకుడికి ఏమి అందుతోంది ఇది చదివితే’ అన్నదే నేను చూస్తున్నది.
కాని, రెండు నవలల అనువాదం ముందు, రచయితని పరిచయం చేస్తూ, ఆయన వ్రాసినది కొంత అటూ ఇటూ పోయింది.
కవి, రచయిత అయిన వి.స ఏమిటో చెప్పడంకన్న మిగతా విషయాలు ఎక్కువ చెప్పారు. నేనే ఆంగ్లపాఠకుణ్ణయితే “ఈ సోది ఏమిట్రా. అసలీ రచయిత వి.స. ఎవరు? ఏమి రాసారు? కథాశిల్పాన్ని ఎలా పోషించారు? అసలు ఈ నవల ఎందుకు రాయబడింది? ” అన్నదే ఆలోచిస్తాను. నాకు శ్రీశ్రీ ఏమన్నాడు, జరుక్ ఏమన్నాడు అన్నది అవసరంలేదు. అసలు వి.స. యే ఎవరో తెలియదు. మిగిలినవాళ్ళంతా అప్రస్తుతం. ఉదాహరణకి “విష్ణుశర్మ ఇంగ్లీష్ చదువు” తీసుకుంటే – ‘భాషల నిర్మాణంలో ఉన్న తేడాలు, తిక్కనగారి మనస్తత్వం, విష్ణుశర్మ చాకచక్యం, వాళ్ళు రచించిన గ్రంథాల ప్రభావం వాళ్ళ ప్రవర్తన తీరుతెన్నుల మీద ఎలా పడింది? తిక్కన గొప్పతనం’ … ఇలాంటివి ధ్యేయంగా వ్రాసిన నవల. (ఇంకా నాకుతెలియనివి చాలా ఉంటాయి). ఈ విషయాలు వె.నా.రా. ఆంగ్లపాఠకుడికి ముందుగా తెలియజెప్పాలి. అప్పుడే ఆ అనువాదితనవలలో ఒక అర్ధం పరమార్ధం చూస్తాడు పాఠకుడు. ఈ దిశగా వె.నా.రా ఏమీ చేసినట్టనిపించలేదు. మూడువందల పంక్తుల ఉపోద్ఘాతంలో “కట్టే – కొట్టె-తెచ్చె” అని మూడు ముక్కల్లో కథ రాసారు. ఇలాంటి అనువాదం చెయ్యడం రెండు సంస్కృతులకి వారధి కట్టడం. అందువల్ల పాఠకులకి మంచి పరిచయం కావాలి. ఊరికే “బోధకుడికీ విద్యార్థులకీ మధ్యన సంభాషణలు ఉల్లాసంగా నడుస్తాయి. ” అని చెపితే అనువాదం చదివినవాడికి ఉల్లాసం కలుగుతుందా? నాలాంటివాడు అనకాపల్లిలో కూర్చుని “Shakespearean Comedies” చదివినట్టుంటుంది.
ఆంగ్లపాఠకుడికి కావలసిన దినుసులకన్న, తెలుగు పాఠకులకి కావలసిన మసాలా ఎక్కువ కుమ్మారు వె.నా.రా. అని నాకు అనిపించింది. అది ఎంతవరకూ నిజమో ఆంగ్లపాఠకులే చెప్పాలి.
ఇది సంపాదకుల వ్యాసపరిష్కరణ సమయంలో జరిగిన చిన్న పొరపాటు. Digression అన్నపదానికి బ్రౌన్ నిఘంటువు అప్రస్తుత ప్రశంస అనే అర్థాన్నిచ్చింది. బహుశా అందువల్ల అనువాదకురాలు ఆ పదాన్ని వాడివుండచ్చు. ఐతే ప్రశంస అనేది సామాన్యార్థంలో ఆ ఉద్దేశ్యంలో వాడం కాబట్టి మూలార్థం విశదమయేట్టుగా ఆ పదాన్ని మార్చాం. ఇది గమనించి ఎత్తి చూపినందుకు కృతజ్ఞతలు.
భాస్కర్ గారు వ్యక్తపరచింది చిన్న సందేహం… ‘అప్రస్తుత ప్రశంస’ అన్నది సరైన అనువాదం అవుతుందా అని! మూల పాఠంలో ఉన్న digression అనే మాటకు ‘అప్రస్తుత ప్రశంస’, ‘అప్రస్తుత ప్రసంగం’ రెండూ సరైన పదాలు కావు. అప్రస్తుత మనుకునే ప్రతి విషయంలోనూ ప్రశంస ఉండాలనేమీ లేదు. ఇక ‘అప్రస్తుత ప్రసంగం’ అనే మాట, పైన ఉటంకించిన ఆంగ్ల పాఠంలోని ఉద్దేశిత అర్థం రీత్యానే కాక; మొత్తం వ్యాసం విశ్వనాథపై వ్యక్తపరచిన వైఖరి రీత్యా కూడా రచయిత పట్లా, ఆయన సందర్భం నుంచి పక్కకు వెళ్ళి చెప్పిన విషయాలపట్లా అమర్యాదను సూచిస్తుంది. కనుక digression అనే మాటను ఇక్కడ విషయాంతరంగా అనువదించుకోవడం సమంజసమనిపిస్తోంది.
భారతదేశంలో ఆధునికత గురించి వెల్చేరు నారాయణరావు గారు చేసిన సిద్ధాంతాల గురించి మీకు అంతగా పరిచయం ఉన్నట్టుగా లేదు. ఆయన పరిశోధనా గ్రంథాల గురించి కె. వి. ఎస్. రామారావు గారు రాసిన ఈ పరిచయవ్యాసం మీకు ఉపయోగపడవచ్చునేమో చూడండి: వెల్చేరు నారాయణ రావు: కొన్ని పరిశోధనా గ్రంథాల పరిచయం
స్థూలంగా చెప్పాలంటే, బ్రిటిష్ వారి పాలన తరువాత మనకు తెలిసిన మన సంస్కృతి, దానిలో తప్పులు, అంతా బ్రిటీషు వారు నేర్పించిందే. వారి రాక వల్లనే మనం ఆధునికులమైనామనీ, వారు వచ్చి మనల్ని సంస్కరించే ముందు మనమంతా చీకటిలో ఉన్నామనీ వారు చెబితే విని నేర్చుకున్నది. మన సాహిత్యం అశ్లీలమనీ, మనకు చారిత్రక స్పృహ లేదనీ, మన సారస్వతం కేవలం పుక్కిటి పురాణాలనీ వారు నమ్మి మనల్ని నమ్మించారు. మన సాహితీసంపద నుంచి మనల్ని దూరం చేశారు.
అయితే, వెల్చేరు గారి సిద్ధాంతం ప్రకారం, ఆధునికత 19వ శతాబ్దంలో బ్రిటీష్ పాలకులు మనకు ఇచ్చిన వరం కాదు. ఆధునికతా చైతన్యం మనకు ఇంకా ఎంతో ముందే వచ్చింది. వెల్చేరు గారు తన సహపరిశోధకులతో కలిసి, ‘ఆధునికత’కి నిర్దిష్టమైన లక్షణాలు ప్రతిపాదించారు. శ్రీనాథుడు, అన్నమయ్య, పింగళి సూరన, క్షేత్రయ్య, గురజాడ, విశ్వనాథల రచనలలో ఈ ఆధునికత పరిణామ క్రమాన్ని వెలికితీసి మనందరికీ చూపించారు.
ఇంకా ఈ సిద్ధాంతంపై ఆసక్తి ఉన్న పాఠకులు పైన పేర్కొన్న రచయితల గురించి వెల్చేరుగారు రాసిన పుస్తకాలలో ముందుమాటలు, వెనుకమాటలలో ఉన్న విపులమైన విశ్లేషణను పరిశీలించగలరని మనవి.
భవభూతి భాస్కర్ గారు: వెల్చేరు వారు మూలంలో వాడిన పదం digression. దానిని ‘అప్రస్తుత ప్రశంస’గా అనువాదం చెయ్యడం వల్ల మూలంలోని భావానికి భంగం కలిగింది. ఈ కింది పారాగ్రాఫ్‌కు ఆంగ్లమూల పాఠం ఆ దిగువన పొందుపరిచాను, చూడండి:
నవలలను చెప్పి రాయించటం ఇంకొన్ని సమస్యలను కూడా తెచ్చి పెట్టింది. చెబుతూ ఉన్న విషయాన్ని వదిలి వేరే వైపుకి ఆయన వాగ్ధార వెళ్ళిపోయేది. అది కొన్నిసార్లు చాలాదూరమే వెళ్ళిపోయి ఆ సమయంలో తను అనుకుంటున్నవన్నీ పాత్రల మధ్య సుదీర్ఘ సంభాషణలు గానో, ఆ సందర్భానికి రచయిత చేసే విస్తృత వ్యాఖ్యానం గానో, నవల లోకి వచ్చి పడేవి. ఈ అప్రస్తుత ప్రశంసలు కూడా ఆయన నవలలకు ఒక ఆకర్షణని తెచ్చిపెట్టాయి. వాటిని చాలా ఇష్టంగా చదువుకొనే అభిమానులూ ఉన్నారు.
Dictating the novels caused other problems as well. As Satyanarayana dictated, he tended to digress frequently from the context of the narrative. Often the digressions were so far-out that whatever he was thinking at the moment found place in the novel, either as a part of the conversation between characters or as a long commentary by the author on the situation at hand. His novels acquired a charm of their own because of these digressions and are loved by his admirers.
మూలంలో ఏం ఉందోగాని, అనువాదకురాలు రాసిన “అప్రస్తుత ప్రశంస” అన్నది సరైన అనువాదం కాదేమోనని నా అనుమానం. అది “అప్రస్తుత ప్రసంగం” అయి ఉండాలని నా అనుమానం. మైథిలిగారు వివరించగలరు.
భాస్కర్
విశ్వనాథ గళంలో కిన్నెరసాని పాటలు గురించి lyla yerneni అభిప్రాయం:
04/15/2017 7:12 pm
ఈలాటి శబ్ద తరంగాలు ‘సెలెబ్రిటీ’ మోజు ఉన్నవారి కోసం. అంతే కాని ఇవి కవిత్వ ప్రియులను, సంగీత ప్రియులను రంజింప చేయలేవు.
ఉంటుంది, మనుషులకు కుతూహలం ఉంటుంది. అందమైన వర్ణ చిత్రాలను చూసినా, రచనలు చదివినా, ఆ కళాకారుడు ఎవరు, అతని ఫొటో చూడాలనో, స్వయంగా కలవాలనో ఉంటుంది. చూడొచ్చు, కలవొచ్చు. విశ్వనాథ సాహితీ ప్రియులకు కొందరికి ఆయన కంఠంలో ఆయన కవిత వినాలని ఉంటుంది. పాఠకుల విభిన్న మనస్తత్వాలను, ఇష్టాలను గ్రహించగలిగిన సంపాదకులు బహుశా ఆ కారణం చేత వీటికి ఈ పత్రికలో స్థానం ఇస్తూ ఉంటారు.
కాని, కవితా పఠనం బాగు ఓగుల దృష్యా చూస్తే, కిన్నెరసాని లోని ఊహకు, ఇక్కడ విశ్వనాథ కంఠం నుండి వెలువడే ధ్వనికి సమగ్ర సంయోగం లేదు. కవి -ప్రియురాలా! జవరాలా! అంటూ అస్పష్టపు కూనిరాగాలు తీస్తూ, కవిత చదువుతూ, ఆపుతూ, మధ్య మధ్యలో ఆ కిన్నెరసాని వాగు కథ చెపుతున్నారు. ఆయన మెదడులో ఉన్న ఆ దృశ్యం, ఆ ధ్వని, మన కళ్లకూ, చెవులకూ చేరే దృశ్యం, ధ్వనీ -ఒకటి కావు. మనలో చాలామందిమి, పాడుకుంటున్నప్పుడు జరిగేది ఇదే.
ఉదాహరణకు: నేను (లైలా)
“శ్రీమన్నారాయణ, శ్రీమన్నారాయణ, శ్రీమన్నారాయణ
నీ శ్రీపాదమే శరణు ఊ…..”
అని పాడుతుంటే, నాకు మెదడులో అప్పటికే రికార్డ్ ఐపోయి ఉన్న నా కిష్టమైన శ్రీమతి సుబ్బులక్ష్మి పాట వినిపిస్తుంటుంది, నామటుకి నేను ఒక ఆనంద ప్రపంచంలో ఉంటాను. నా పాట వింటున్న పక్క వాళ్లు, ముందు నేలమీద మొదలై, అకస్మాత్తుగా ఆకాశాన్నంటి, మళ్లీ గబుక్కున పాతాళంలోకి పోయి, స్వరానికీ స్వరానికీ పొంతన లేని అపశృతి మయమైన కఠోర శబ్దాలు వింటుంటారు. సుబ్బులక్ష్మి పాటనే కాక, నా పాట కూడా రికార్డ్ చేసుకుని నేను వింటే తప్ప, ఆవిడ అత్యంత మధురంగా పాడిన ఆ అన్నమాచార్యుని కీర్తనకు నేను ఎంతదూరంలో ఉన్నానో తెలియదు.
అది తెలియక, ఇంకా అదే చాపల్యంతో;
“కమలాసతీ ముఖ కమల కమల హిత, కమల ప్రియే, కమలేక్షణా
కమలాసన హిత, గరుడగమన, శ్రీ కమల నాభ! నీ పదకమలమే శరణు ఊ….”
అని నే పాడేస్తుంటాను.
నా అదృష్టవశాత్తు, నే వినేది నా మెదడులో, సుబ్బులక్ష్మి పాటనే. సంగీతం లక్షణాలలో, దాని పుణ్యమా అని, అది ఒకటి.
అదే విశ్వనాథకు కూడా జరుగుతున్నది. ఆయన తన కాలంలో చాలా మధుర గాయకులను వినే ఉంటారు. తన కిన్నెరసాని కవితను ఈ సభలో అలా పాడుతున్నాను అనుకుంటున్నారు. వాస్తవం అది కాదు. ఆ పఠనం అంత గొప్పగా లేదు.
ఒక కవిత్వం లోని అందాన్ని చూపలేని, పైగా తగ్గించే -ఈ కవన పఠనం, ఇప్పుడు ఎందుకు వింటం? అనుకుంటాను నేను. ఎప్పుడో ఒక సభలో ఆయనకు కవిత చదివే అవకాశమిచ్చారు. అప్పటి శ్రోతలు విన్నారు. దాని ఆవశ్యకత అంతటితో తీరిపోయింది. ఫేమస్ ఐన వాళ్ల ఒకప్పటి మాటలు పాటలు ఎట్లా ఉన్నాగాని కలెక్టబుల్స్ అనుకుని, ఆ route లో, నాస్టాల్జియా కలెక్షన్గా, ఇలా ఇప్పటి పత్రికలో వచ్చి చేరతాయి, కొన్ని గరగరల, అపశబ్దాల ఆడియోలు.
కళ మీద ఆసక్తి ఎక్కువ, వ్యక్తి మీద drooling తక్కువ ఉంటే, కిన్నెరసాని ఆకస్మిక కోపం, దు:ఖం, ఆమె నీరవటం, భర్త బండవటం, సముద్రుడు ఆమెకోసమై ఎగసిపడటం, ఆమె కళవళపడి గోదావరిలో లయించటం – ఈ గాథను ఇప్పటి గాన గంధర్వులతో పాడించి, లేదా మంచి వాయిద్యకారులతో సింఫొనీ మ్రోగింపచేయిద్దామని వారిని నియోగించి, ఆ కొత్త రికార్డింగ్ బాగుంటే విడుదల చెయ్యొచ్చు.
లేదూ, విశ్వనాథ కిన్నెరసాని దాని దోవన అది చదువుకుని, అప్పుడో మరోసారో, Edward Greg- Solveig’s song విన్నా. Svetlana – Moldau విన్నా, సుఖం ఉంది. ఆ సంగీత నదీ ప్రవాహాల చలనాలకి హృదయం కరిగి పోతుంది.
చక్కని శబ్దానికి, ఎక్కడిదైతేనేం మంచి శ్రోతగా మారితే చాలదా?
Lyla
నాకు నచ్చిన పద్యం: వసంతునితో వెన్నెలఱేడు పోటీ! గురించి lyla yerneni అభిప్రాయం:
04/15/2017 2:59 pm
“వెన్నెలలో చంద్రకాంతశిల ద్రవిస్తున్నట్లుగా కనబడటం అటువంటి లోకవిరుద్ధమైన కవిసమయం కాదు. ఆనుభవికమైన దృగ్విషయమే.”
చెప్పింది అర్ధమయింది.
ఐనా, నాకైతే ఈ వర్ణన కవి సమయమే అనిపిస్తుంది. చంద్రకాంతికి ఏ రాయీ కరిగి ప్రవహించదు కదా. Crystallographers, geologists ఉన్నారు పాఠకులలో – వారు మనకు ఇందలి నిజానిజాలు చెప్పగలరేమో. ఈ క్రింది పద్యము చాలా అందమైన కవి సమయము కాదా? ఇది ప్రకృతి సహజమా?
వసుచరిత్రము ద్వితీయాశ్వాసము; పద్యము 21
సీ. రేలెల్ల నమృతమరీచి నంటున నంట గరగి నిర్మలపయోఝరుల దొరగి
బలువిడి పెనులోయ బడిన క్రొన్నెలరాల చఱులలో నిరుగడ దఱచు మెఱచు..
అలాగే -కోయిల పంచమ స్వనంలో పాడుతుంది అనటం కవి సమయమే. కోయిల కూత – భారత కోకిల లతా మంగేష్కర్ कुहू कुहू बोले कोयलिया ( కుహూ కుహూ బోలే కోయలియా) అని పాడింది. అది అమృత వర్షమే. అందులో తడిసి తనిసినారెందరో. ఐనా, కు హూ లో – ‘కు’ కింది స్థాయిలో ఉంటే ‘హూ’ దాని కన్నా రెండు మెట్లో ఏమో పై స్థాయిలో పాడతారు లతా, రఫీ. నిజం కోయిల అలా పలకదు. కూహ్ కూహ్ అంటుంది. పశ్చిమ కోకిల ఐతే, ‘కుకూ కుకూ కుకూ’ లో మొదటి హ్రస్వ స్వరం పై మెట్టు, రెండవ దీర్ఘ స్వరం దానికన్నా దిగువన పలికిస్తుంది. ఎంత సేపూ రెండు స్వరాలు వరసొరసనే పలికిస్తుంది. ఈ రెండు స్వరాలే కోయిల పాట. దానికి కవులు దుంపలు తెంపలు చేసుకుని కోకిల మీద, కోకిల అన్న మాటను వాడుతూనూ వందల వందల గీతాలు రాశారు. కొంతమంది అదృష్టం అది. లోకంలో వారికి ప్రచారకులు ఉంటారు. కోకిలకు అంత ప్రతిభ లేకున్నా కాని, చాలా సమర్ధులైన ప్రచారకులు ఉన్నారు.
A segment (from Saint-Saens “The Carnival of Animals”) called ‘The cuckoo in the depths of woods’ is worth listening. It is easily found on the net. For this segment Roger Moore gives a beautiful narration poking fun at cuckoo –
“….
And so without a proper song
He just sings cuckoo all day long
He is not what you would call a star
With such a basic repertoire
And yet that simple two word phrase
Casts such a spell on summer days…”
There is more of these words. I don’t know whose charming words these are. I don’t think it is Ogden Nash’s poetry. The back drop of piano chords in the music recital is soothing. The sounds of cuckoo D & lower B-flat are played on clarinet. The clarinetist is placed somewhere outside the orchestra. The cuckoo sounds surprise and then on are eagerly anticipated both by musicians and listeners alike.
The whole composition of Camille Saint –Saens is marvelous and is an example of self-deprecating humor of a musician/s. The musician did not dare release this light hearted music of his, in his lifetime, for the fear of being considered a frivolous artist by his contemporaries.
(Dear Readers! By now you noticed I have not digressed one bit, but am only elaborating on relevant themes. i.e., the oppression of artists by fellow contemporary artists. And కవి సమయములు. Mine is never an erratic, all over the place writing. It is always under control delivery. Some contemporaries just can’t stand my scientific approaches and would rather read gossip as theses. )
Anyways, another favorite is Robert Schumann’s ‘Cuckoo in hiding.’ In this piano piece, he uses a combination of notes and chords in the left and right hands to produce the cuckoo sounds. Even though considered as a beginners’ piece, by the teachers, perhaps adults are more charmed by this composition than kids. I love it. Sure there is a G (పంచమము) somewhere in the cuckoo sounds, but that is not the only note he used.
Surprise. Surprise. I am hearing an anxiety inducing grating, two note sound now, in the airport as our boarding passes are being scanned. Cuckoo. Cuckoo. Got to go board the plane.
So Long. Happy Easter!
Lyla
వేయిపడగలు – గాన్ విత్ ద విండ్: 2. సారథి, సచివుడు, సఖుడు… రెట్ బట్లర్! గురించి మంజరి lakshmi అభిప్రాయం:
04/15/2017 6:11 am
యుద్ధం ఉన్న వ్యవస్థలో రెడ్ బట్లర్ లాంటి వాళ్ళు అనుభవం ద్వారా పాత కొత్త విలువలను కలగలిపి చూసుకునే అవకాశం ఎలా వచ్చింది ధర్మారావు ఆ భౌతిక పరిస్థితులు లేక మారకుండా అదే అకర్మణ్య స్థితిలో ఉండిపోవటం బాగా పోల్చి చూపించారు. బాగుంది.
నాకు నచ్చిన పద్యం: వసంతునితో వెన్నెలఱేడు పోటీ! గురించి తః తః అభిప్రాయం:
04/14/2017 9:20 pm
మీ వివరణకు ధన్యవాదాలు మురళీధరరావుగారూ! అన్నట్టు వేకట కవి తన సమకాలికులైనవారికి సమకాలికుడే గదా! మీరు ఉటంకించిన విశ్వనాథ పద్యపాదం – బాల్య యౌవన దశా పరిణాహ సంధిత్రపాముగ్ధ నేత్ర శోభాపయోధి – లోదేనా! తరువాతి చరణాలు నాకు గుర్తు రావటం లేదు
“అతని దృష్టికి జానకి ఆగలేదు
అతని ముష్టికి శివధనుస్సాగలేదు…..”
నమస్కారాలతో
తః తః
విశ్వనాథ రెండు నవలికలు: తొలిపలుకు గురించి Bhaskar Kompella అభిప్రాయం:
04/14/2017 10:24 am
సురేష్ గారు,
నాకు నారాయణరావుగారి పరిశోధనల గురించి తెలియదు. నేనెప్పుడూ చదవలేదు. ఆయన ప్రతిభావ్యుత్పత్తుల మీద అనుమానం కాని, ఆయనకి వి.స. మీద అభిప్రాయాలేమిటన్నది కాని ఇక్కడ చర్చనీయాంశం కాదు. ‘ఆంగ్ల పాఠకుడికి ఏమి అందుతోంది ఇది చదివితే’ అన్నదే నేను చూస్తున్నది.
కాని, రెండు నవలల అనువాదం ముందు, రచయితని పరిచయం చేస్తూ, ఆయన వ్రాసినది కొంత అటూ ఇటూ పోయింది.
కవి, రచయిత అయిన వి.స ఏమిటో చెప్పడంకన్న మిగతా విషయాలు ఎక్కువ చెప్పారు. నేనే ఆంగ్లపాఠకుణ్ణయితే “ఈ సోది ఏమిట్రా. అసలీ రచయిత వి.స. ఎవరు? ఏమి రాసారు? కథాశిల్పాన్ని ఎలా పోషించారు? అసలు ఈ నవల ఎందుకు రాయబడింది? ” అన్నదే ఆలోచిస్తాను. నాకు శ్రీశ్రీ ఏమన్నాడు, జరుక్ ఏమన్నాడు అన్నది అవసరంలేదు. అసలు వి.స. యే ఎవరో తెలియదు. మిగిలినవాళ్ళంతా అప్రస్తుతం. ఉదాహరణకి “విష్ణుశర్మ ఇంగ్లీష్ చదువు” తీసుకుంటే – ‘భాషల నిర్మాణంలో ఉన్న తేడాలు, తిక్కనగారి మనస్తత్వం, విష్ణుశర్మ చాకచక్యం, వాళ్ళు రచించిన గ్రంథాల ప్రభావం వాళ్ళ ప్రవర్తన తీరుతెన్నుల మీద ఎలా పడింది? తిక్కన గొప్పతనం’ … ఇలాంటివి ధ్యేయంగా వ్రాసిన నవల. (ఇంకా నాకుతెలియనివి చాలా ఉంటాయి). ఈ విషయాలు వె.నా.రా. ఆంగ్లపాఠకుడికి ముందుగా తెలియజెప్పాలి. అప్పుడే ఆ అనువాదితనవలలో ఒక అర్ధం పరమార్ధం చూస్తాడు పాఠకుడు. ఈ దిశగా వె.నా.రా ఏమీ చేసినట్టనిపించలేదు. మూడువందల పంక్తుల ఉపోద్ఘాతంలో “కట్టే – కొట్టె-తెచ్చె” అని మూడు ముక్కల్లో కథ రాసారు. ఇలాంటి అనువాదం చెయ్యడం రెండు సంస్కృతులకి వారధి కట్టడం. అందువల్ల పాఠకులకి మంచి పరిచయం కావాలి. ఊరికే “బోధకుడికీ విద్యార్థులకీ మధ్యన సంభాషణలు ఉల్లాసంగా నడుస్తాయి. ” అని చెపితే అనువాదం చదివినవాడికి ఉల్లాసం కలుగుతుందా? నాలాంటివాడు అనకాపల్లిలో కూర్చుని “Shakespearean Comedies” చదివినట్టుంటుంది.
ఆంగ్లపాఠకుడికి కావలసిన దినుసులకన్న, తెలుగు పాఠకులకి కావలసిన మసాలా ఎక్కువ కుమ్మారు వె.నా.రా. అని నాకు అనిపించింది. అది ఎంతవరకూ నిజమో ఆంగ్లపాఠకులే చెప్పాలి.
భాస్కర్
విశ్వనాథ రెండు నవలికలు: తొలిపలుకు గురించి Madhav అభిప్రాయం:
04/14/2017 7:36 am
ఇది సంపాదకుల వ్యాసపరిష్కరణ సమయంలో జరిగిన చిన్న పొరపాటు. Digression అన్నపదానికి బ్రౌన్ నిఘంటువు అప్రస్తుత ప్రశంస అనే అర్థాన్నిచ్చింది. బహుశా అందువల్ల అనువాదకురాలు ఆ పదాన్ని వాడివుండచ్చు. ఐతే ప్రశంస అనేది సామాన్యార్థంలో ఆ ఉద్దేశ్యంలో వాడం కాబట్టి మూలార్థం విశదమయేట్టుగా ఆ పదాన్ని మార్చాం. ఇది గమనించి ఎత్తి చూపినందుకు కృతజ్ఞతలు.
-సంపాదకులు.
విశ్వనాథ రెండు నవలికలు: తొలిపలుకు గురించి kalluri bhaskaram అభిప్రాయం:
04/13/2017 10:31 pm
భాస్కర్ గారు వ్యక్తపరచింది చిన్న సందేహం… ‘అప్రస్తుత ప్రశంస’ అన్నది సరైన అనువాదం అవుతుందా అని! మూల పాఠంలో ఉన్న digression అనే మాటకు ‘అప్రస్తుత ప్రశంస’, ‘అప్రస్తుత ప్రసంగం’ రెండూ సరైన పదాలు కావు. అప్రస్తుత మనుకునే ప్రతి విషయంలోనూ ప్రశంస ఉండాలనేమీ లేదు. ఇక ‘అప్రస్తుత ప్రసంగం’ అనే మాట, పైన ఉటంకించిన ఆంగ్ల పాఠంలోని ఉద్దేశిత అర్థం రీత్యానే కాక; మొత్తం వ్యాసం విశ్వనాథపై వ్యక్తపరచిన వైఖరి రీత్యా కూడా రచయిత పట్లా, ఆయన సందర్భం నుంచి పక్కకు వెళ్ళి చెప్పిన విషయాలపట్లా అమర్యాదను సూచిస్తుంది. కనుక digression అనే మాటను ఇక్కడ విషయాంతరంగా అనువదించుకోవడం సమంజసమనిపిస్తోంది.
విశ్వనాథ రెండు నవలికలు: తొలిపలుకు గురించి సురేశ్ కొలిచాల అభిప్రాయం:
04/13/2017 8:08 pm
భాస్కర్ కొంపెల్ల గారు,
భారతదేశంలో ఆధునికత గురించి వెల్చేరు నారాయణరావు గారు చేసిన సిద్ధాంతాల గురించి మీకు అంతగా పరిచయం ఉన్నట్టుగా లేదు. ఆయన పరిశోధనా గ్రంథాల గురించి కె. వి. ఎస్. రామారావు గారు రాసిన ఈ పరిచయవ్యాసం మీకు ఉపయోగపడవచ్చునేమో చూడండి:
వెల్చేరు నారాయణ రావు: కొన్ని పరిశోధనా గ్రంథాల పరిచయం
స్థూలంగా చెప్పాలంటే, బ్రిటిష్ వారి పాలన తరువాత మనకు తెలిసిన మన సంస్కృతి, దానిలో తప్పులు, అంతా బ్రిటీషు వారు నేర్పించిందే. వారి రాక వల్లనే మనం ఆధునికులమైనామనీ, వారు వచ్చి మనల్ని సంస్కరించే ముందు మనమంతా చీకటిలో ఉన్నామనీ వారు చెబితే విని నేర్చుకున్నది. మన సాహిత్యం అశ్లీలమనీ, మనకు చారిత్రక స్పృహ లేదనీ, మన సారస్వతం కేవలం పుక్కిటి పురాణాలనీ వారు నమ్మి మనల్ని నమ్మించారు. మన సాహితీసంపద నుంచి మనల్ని దూరం చేశారు.
అయితే, వెల్చేరు గారి సిద్ధాంతం ప్రకారం, ఆధునికత 19వ శతాబ్దంలో బ్రిటీష్ పాలకులు మనకు ఇచ్చిన వరం కాదు. ఆధునికతా చైతన్యం మనకు ఇంకా ఎంతో ముందే వచ్చింది. వెల్చేరు గారు తన సహపరిశోధకులతో కలిసి, ‘ఆధునికత’కి నిర్దిష్టమైన లక్షణాలు ప్రతిపాదించారు. శ్రీనాథుడు, అన్నమయ్య, పింగళి సూరన, క్షేత్రయ్య, గురజాడ, విశ్వనాథల రచనలలో ఈ ఆధునికత పరిణామ క్రమాన్ని వెలికితీసి మనందరికీ చూపించారు.
ఇంకా ఈ సిద్ధాంతంపై ఆసక్తి ఉన్న పాఠకులు పైన పేర్కొన్న రచయితల గురించి వెల్చేరుగారు రాసిన పుస్తకాలలో ముందుమాటలు, వెనుకమాటలలో ఉన్న విపులమైన విశ్లేషణను పరిశీలించగలరని మనవి.
భవభూతి భాస్కర్ గారు: వెల్చేరు వారు మూలంలో వాడిన పదం digression. దానిని ‘అప్రస్తుత ప్రశంస’గా అనువాదం చెయ్యడం వల్ల మూలంలోని భావానికి భంగం కలిగింది. ఈ కింది పారాగ్రాఫ్‌కు ఆంగ్లమూల పాఠం ఆ దిగువన పొందుపరిచాను, చూడండి:
సురేశ్.
విశ్వనాథ రెండు నవలికలు: తొలిపలుకు గురించి భవభూతి అభిప్రాయం:
04/13/2017 4:54 pm
మూలంలో ఏం ఉందోగాని, అనువాదకురాలు రాసిన “అప్రస్తుత ప్రశంస” అన్నది సరైన అనువాదం కాదేమోనని నా అనుమానం. అది “అప్రస్తుత ప్రసంగం” అయి ఉండాలని నా అనుమానం. మైథిలిగారు వివరించగలరు.
భాస్కర్
విశ్వనాథ రెండు నవలికలు: తొలిపలుకు గురించి k.krishnamoorthy అభిప్రాయం:
04/13/2017 5:40 am
శ్రీ విశ్వనాధ సత్యనారాయణ గారి రామాయణం గురించి తెలియనివెన్నో తెలిపారు. ధన్యవాదములు. కాలానికి ఎదురీది నిలవడం వారికే చెల్లింది.