పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16469

  1. మాట్లాడుకుంటాం సరే గురించి కె.కె. రామయ్య అభిప్రాయం:

    02/05/2018 8:32 pm

    ” ఎన్ని – – – – – కుక్కినా
    ఒక మనిషికి సరిపడా స్థలం మిగిలిపోవడాన్ని
    ఎవరికీ తెలీనీకుండా తెరలుకట్టి దాచేయొచ్చు ”

    ఎవరికీ తెలీనీకుండా ఆ తిరిపాన్ని గుండెలో దాచెయ్యటం
    ఆ పర్వతరాజ తనయ వల్ల కాలేదు
    యీ నా త్రిపురాంతకేశ్వరుడి తనయకి వల్ల కాదు.

    సీ.
    హిమశైల శిఖరోన్నత మహా వృషభవాహ
    నాధిరోహణుఁడు, విశ్వాధినేత,
    నిరతార్ధగాత్ర సన్నిహిత పర్వతరాజ
    పుత్రీ ద్వితీయానుభూతిరతుఁడు,
    కైలాస పర్వతాగ్రనివాస పరితోషి,
    వరవీరగణవార పరివృతుండు,
    సర్వభూతవ్రాత సర్వవిద్యాజాత
    నిర్ణేత, మహిత కృక్కర్ణభూషుఁ,
    తే.గీ.
    డిష్టసఖుఁడు కుబేరున, కిందుధరుఁడు,
    గగనకేశుఁ, డతిస్వచ్ఛ కాంతితనుఁడు,
    ఈశ్వరుండు, మహానటుం డెల్లవేళ
    సర్వసౌఖ్యంబు లిడి మమ్ము సాఁకుఁగాక!

    ( అజ్ఞాతకవి – శ్రీ వేటూరి ప్రభాకర శాస్త్రి గారి ‘చాటుపద్య మణిమంజరి’ నుండి )

  2. నీళ్ళ బయ్యం గురించి venu ancha అభిప్రాయం:

    02/04/2018 7:13 am

    Intresting thought sir. While reading this, felt like a thriller for some time. These days I am reading your writings. I never realised that you have this much hidden talent. You have a different person inside who is very much fond of culture and writing. Great going… Hope to see a full novel/book publishing from you.

    All the best!!

    Venu Ancha

  3. శ్రీశ్రీ పదబంధ ప్రహేళిక – 14 గురించి Krishna Rao Maddipati అభిప్రాయం:

    02/03/2018 7:56 pm

    పూర్తి చేశాను

  4. ఒకటి నుంచి పదిల దాకా… గురించి S. Narayanaswamy అభిప్రాయం:

    02/03/2018 7:39 pm

    ఎంత బావుందో.

  5. అమృత షెర్-గిల్: ఆకృతి చిత్రాలలో ఆత్మాన్వేషణ గురించి మంగు శివరామ ప్రసాద్ అభిప్రాయం:

    02/03/2018 12:47 pm

    “అమృత షెర్-గిల్: ఆకృతి చిత్రాలలో ఆత్మాన్వేషణ” అనే వ్యాసం భైరవభట్ల కామేశ్వరరావు గారి రచన అనువాదంలా కాక మూల రచనలా భాసిస్తూ కళాకారిణి కళా నైపుణ్యాన్ని మరియు విలక్షణమైన వ్యక్తిత్వాన్ని మనోహరంగా ఆవిష్కరిస్తోంది. 19వ శతాబ్దంలో పాశ్చాత్య ప్రాచ్య కళలకు ఒక చైతన్య వెలుగు వారథిగా షెర్ గిల్ ను ఈ వ్యాసంద్వారా దర్శింపజేయడంలో రచయిత కృతకృత్యులైనారని నిస్సందేహంగా చెప్పవచ్చు. ఇటువంటి చక్కటి వ్యాసాన్ని అందించిన భైరవభట్ల కామేశ్వరరావు గారికి, దీన్ని ప్రచురించిన ఈమాట అంతర్జాల పత్రికకు ధన్యవాదాలు.

  6. శ్రీశ్రీ పదబంధ ప్రహేళిక – 14 గురించి టి. చంద్రశేఖర రెడ్డి అభిప్రాయం:

    02/03/2018 8:44 am

    10 నిలువుకు ఆధారం ఇవ్వలేదు. ఇవ్వమని మనవి.

    టి. చంద్రశేఖర రెడ్డి
    [ఇప్పుడు జత చేసాం. ఎత్తిచూపినందుకు కృతజ్ఞతలు — సం. ]

  7. పది రోజులు గురించి Gowri Kirubanandan అభిప్రాయం:

    02/02/2018 9:32 pm

    ” మనుషుల్లోనూ కొందరిలో ఇలాంటి ఆజ్ఞలు వాళ్ళ జీన్స్‌లో రాయబడి ఉన్నాయేమో” ఈ వాక్యం మనసు లోపలి పొరలను కదిలించి వేస్తుంది. “చాతీ విరుచుకుని” అన్న పద ప్రయోగం మగవాళ్ళకు మాత్రమే అన్వయిస్తుందని నాకు అనిపించింది. కధ, కధనం, అనువాదం మూడూ మంచి కధగా నిలబెట్టాయి.

  8. నిర్నిమిత్తం గురించి లక్ష్మీదేవి అభిప్రాయం:

    02/02/2018 9:10 pm

    చాలా బాగుంది.

  9. లోలోపలగా… గురించి లక్ష్మీదేవి అభిప్రాయం:

    02/02/2018 9:07 pm

    చెప్పాల్సినవి ఇంకా ఉన్నప్పుడే, ఉన్నాయనిపిస్తున్నప్పుడే. ఔను.
    బాగుంది.

  10. నాకు నచ్చిన పద్యం: పౌలస్త్యుని అంతరంగం గురించి VSTSayee అభిప్రాయం:

    02/02/2018 1:33 pm

    కాటూరి వేంకటేశ్వరరావుగారి పౌలస్త్య హృదయము, గుడిగంటలు ‘ఆంధ్రభారతి’లో చదువుకొనవచ్చును.

    నమస్తే,
    వాడపల్లి శేషతల్పశాయి.