పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16469

  1. నాకు నచ్చిన పద్యం: పౌలస్త్యుని అంతరంగం గురించి తః తః అభిప్రాయం:

    02/02/2018 10:07 am

    శ్రీ బృందావన రావు గారూ!

    మీకు ఆనేకానేక నమస్కారాలు! ఢన్యవాదాలు! కాటూరిని ఏనుగు మీద కూచోబెట్టి తీసుకువచ్చి ‘ఈ మాట’కు పరిచయం చేశారు!

    ‘చూడుము నెచ్చెలీ విభుని చూచితివేగద’, ‘చంద్రహాసము నా చేయి జారలేదు’, ‘లేదు పతంగ వాహనము లేవు కరంబుల పాంచజన్య కౌమోదకులున్ ,సుదర్సనము బూనడు రావణు గెల్వ వచ్చె” వంటి పద్యాల్తో పౌలస్త్య హృదయం చదువరిని పరవశింపజేస్తుంది. ‘పౌలస్త్య హృదయము’ పై గాంధీ అహింసా సిద్ధాంత ప్రభావం ఉంది అన్నాడు సినారె! ఎలా అన్నాడొ గానీ! ‘పౌలస్త్య హృదయము’, ‘గుడిగంటలు’ పక్కనే ఉన్న వారి ‘మా ఊరు’ ను పేర్కొన లేదేమండీ? ‘మా ఊరు’ లోని, ‘అంతట ఇంద్ర కీలగిరి’ని కూడా మీ నోటి మాటలతో పరిచయం చెయ్యరూ!

    మరొకపరి నమస్కారాలతో
    తః తః

  2. నీళ్ళ బయ్యం గురించి మురళీ మోహన్ డింగరి అభిప్రాయం:

    02/02/2018 9:45 am

    మాధవ్ చాలా బాగా కుదిరిందోయ్

  3. బట్టలు ఆరేయడంలోని లింగస్పృహ గురించి poorva paaThakuDu అభిప్రాయం:

    02/02/2018 5:22 am

    పరిణామక్రమంలో ఇలాంటి ఆలోచన రావడమే మొదటి అడుగు. మన పిల్లల జనరేషన్ వరకు ఈ స్పృహ కాస్త తగ్గి రెండో అడుగు పడొచ్చు. సంపన్న దేశాల్లో చూస్తున్నదే . మనసులోపల తచ్చట్లాడే ఇలాంటి ఇన్సెకురిటీస్నీ కుహక పద్ధతిలో కడిగేసే మీ మ్యూజింగ్స్ బాగున్నాయి.

  4. గణపతి: అంతు చిక్కని వింత దేవుడు-4 గురించి Rao అభిప్రాయం:

    02/01/2018 11:51 pm

    Your promised concluding part did not appear in the January or February issues. When is it going to be published?

  5. సమకాలీన తెలుగు సాహిత్య విమర్శ గురించి తః తః అభిప్రాయం:

    02/01/2018 3:17 pm

    శ్రీ శాయి A touching acknowledgement Thank you very much .
    నమస్కారాలతో
    తః తః

  6. నాకు నచ్చిన పద్యం: రెండు అందమైన పద్యశిల్పాలు గురించి గుండు మధుసూదన్/GUNDU MADHUSUDHAN అభిప్రాయం:

    01/31/2018 7:39 am

    ద్రోణునిఁ గూర్చి పౌరులు సంభాషించుకొనుచున్న సందర్భము గురించి సమస్యగా శ్రీ కంది శంకరయ్య గారు నిర్వహిస్తున్న శంకరాభరణం లోని ఒకనాడు ఇచ్చారు. పరిశీలించగలరు. ఆనాడు నేను కూడా ఈ సమస్యకు పూరణ చేశాను. అలాగే శ్రీ ఏల్చూరివారి పూరణమును శ్రీ కంది శంకరయ్య గారితో పాటుగా నేను కూడా మెచ్చుకొని అభినందించాను.

    నా పూరణ:

    (ద్రోణునిఁ గూర్చి పౌరులు సంభాషించుకొనుచున్న సందర్భము)

    ద్రోణుఁ డొక్కఁడు పాండవ తుష్టిఁ బెంచు,
    సభ్యతనుఁ గని, వెలుఁ గొందు సరణి నేర్పు!
    ద్రోణుఁ డొక్కఁడు దుష్ట చతుష్టయమున
    వక్రతలఁ గని, నడతల సరణి మార్చు!

    ఈ పూరణను సవిమర్శముగా, కవి హృదయంగమముగా వ్యాఖ్యానించిన మాన్యులు శ్రీ భైరవభట్ల కామేశ్వర రావు గారిని మనసారా అభినందిస్తున్నాను.

  7. గురువు/పాఠం గురించి Desu Chandra Naga Srinivasa Rao అభిప్రాయం:

    01/31/2018 7:31 am

    కథనం విభిన్నం. అభినందనలు!

  8. సమకాలీన తెలుగు సాహిత్య విమర్శ గురించి VSTSayee అభిప్రాయం:

    01/29/2018 11:53 am

    తః తః గారు on 01/29/2018 7:50 am said:

    ఏకా దండయ్య పంతులు గారు … జాషువా రచన ప్రచురణ లకు చేసిన సహాయం …

    “నివసింప నిల్లు కవితా
    వ్యవసాయంబునకు రెండుయకరాల్‌ పొలమున్‌
    కవిచక్రవర్తి కిడు వా
    రెవరున్నా రాంధ్రభూమి నేకాయే కా!”
    — నక్షత్రమాల (జాషువ – ఖండకావ్యము 6 : కృతిభర్త – శ్రీ ఏకా ఆంజనేయులు)

    నమస్తే,
    శాయి.

  9. సమకాలీన తెలుగు సాహిత్య విమర్శ గురించి తః తః అభిప్రాయం:

    01/29/2018 7:50 am

    లైలాఎర్నేని : “ఈ మాట’ దేవళంలో ఊరికే గబ్బిలం లా ఎగరటం లేదని పాఠకులు తప్పక గ్రహిస్తారు.” జాషువా కవితల గురించి, జీవితం గురించి ప్రస్తావిస్తూ మీరు ‘గబ్బిలం ‘ ప్రసక్తి తేవటం నవ్వు తో కూడిన సంతోషం కలగజేసింది.

    విశ్వకళా పరిషత్ లో ఒక సారి జరిగిన జాషువా సంస్మరణ సభ లొ నేనూ, కళాప్రపూర్ణ శ్రీ కొండవీటి వెంకట కవి గారూ పక్క పక్కన కూచున్న శ్రోతలు గా మాట్లాడుకుంటున్నాం. వేదిక మీద వక్తలు ఒకరి వెంట ఒకరుగా అగ్రవర్ణులు జాషువా ని కష్టాలపాలు చేసినట్టు చెప్పుకుంటూ పోతుంటే కవి గారికి చాలా కోపం వచ్చింది. నాతో ఏకా దండయ్య పంతులు గారు జాషువాని తన కారులో కూచోబెట్టుకుని తీసుకు వెళుతూ జాషువా రచన ప్రచురణ లకు చేసిన సహాయం గురించి సూక్షం గా చెప్పి, ఇంక పట్ట లేక వేదిక మీదికి వెళ్ళి వెళ్ళడించారు.

    నమస్కారాలతో
    తః తః

  10. సమకాలీన తెలుగు సాహిత్య విమర్శ గురించి VSTSayee అభిప్రాయం:

    01/28/2018 9:02 am

    Lyla gAru on January 26, 2018 at 4:40 pm said:

    శాయి గారు కాని చదువుతుంటే, ‘భారతి’ పత్రికలో కర్ణుడి మీద జాషువా గారు రాసిన వ్యాసం దొరుకుతుందా? ఆ వ్యాసం నాకు చదవాలని ఉంది.

    కర్ణుడిమీద జాషువగారి వ్యాసాలేమీ లేవు. ‘భారతవీరుఁడు’ అని రెండు ఖండకావ్యములు, ‘శల్యసారథ్యము’ అని ఒక ఖండకావ్యము ‘భారతి’లో ప్రచురించారు. అవి ఇక్కడ చదువుకొనవచ్చును. పుస్తకములుగా సంకలనముచేసినపుడు వీటికి కొలదిమార్పులు జరిగాయి.

    నమస్తే,
    శాయి.