పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16469

  1. జడ ద్వితీయకు ప్రథమ అనబడు DOM గురించి indraprssad అభిప్రాయం:

    04/01/2018 12:47 pm

    బావుంది వ్యాసం. ఒక వ్యాకరణ సూత్రాన్ని తెలుసుకొన్నాను. దాంతోపాటు మంచి తెలుగు పద్యం కూడా.

  2. అద్దెకిచ్చి చూడు గురించి Krishna Veni అభిప్రాయం:

    04/01/2018 7:30 am

    వెంకట అద్దంకిగారూ, ‘రచన అద్భుతం!’ మీరెప్పుడూ అందించే ప్రశంసకి ధన్యవాదాలు. 🙂

    ఇలాంటి మనస్తత్వం ఉన్న అద్దెకుండేవాళ్ళు మనం చుట్టుపక్కల ఉన్నా అదే చేస్తారేమో!

  3. స్మృతిలో… గురించి Anil అట్లూరి అభిప్రాయం:

    04/01/2018 6:16 am

    రంగారావు గారి “కధ” కోసం ఇచ్చిన, కథానిలయం లంకే, వాకాటి పాండురంగా రావు గారి కధలని చూపిస్తున్నది.

    [పొరపాటు దిద్దాము. పట్టించినందుకు కృతజ్ఞతలు. సం.]

  4. కళావర్ రింగ్ పాడిన పాటలు, చింతామణి నాటకం పద్యాలు గురించి అధ్యాత్మరామం బులుసు అభిప్రాయం:

    04/01/2018 5:20 am

    ధన్యవాదాలు. చరిత్ర, దానితో పాటుగా మంచి ఆడియో క్వాలిటీ ఉన్న పాటలు, పద్యాలు యిచ్చారు.

  5. పూలగుత్తి ఇచ్చిన అమ్మాయి గురించి కె.కె. రామయ్య అభిప్రాయం:

    04/01/2018 4:09 am

    అప్పాదురై ముత్తులింగం గారిని,
    వారి వాణిని తెలుగులో వినిపించే అవినేని భాస్కర్ ని
    వారిరువు అందిన్స్తున్న యీ మరో అద్భుతమైన కధను, ప్రిన్సెస్ సైరా ను
    ( Saira; as a version of Sarah; as girl’s name means “Princess” in Hebrew )
    ‘ నేను ఎప్పటికీ మరిచిపోను ’

  6. జ్వరగీతం గురించి కె.కె. రామయ్య అభిప్రాయం:

    04/01/2018 3:43 am

    రానీ, రానీ,
    వస్తే రానీ!
    కష్టాల్, నష్టాల్,
    కోపాల్, తాపాల్, శాపాల్ రానీ!
    వస్తే రానీ!

    కానీ, కానీ!
    గానం, ధ్యానం!
    హాసం, లాసం!
    కానీ, కానీ!
    కళారవీ! పవీ! కవీ!

    క్షమాకీజియే కవి స్వాతిజీ,
    కళా రవి శ్రీశ్రీ ని ఆసరాగా చేసుకుని స్పందిస్తున్నందుకు.

  7. శ్రీశ్రీ పదబంధ ప్రహేళిక – 16 గురించి Kartik Chandra Pvs అభిప్రాయం:

    04/01/2018 3:14 am

    2నిలువు ఆధారంలో కటారు బదులు ఈవారు అని ఉండాలనిపిస్తున్నది.

    [తప్పును సరిదిద్దినాము. ఎత్తి చూపినందుకు ధన్యవాదాలు. — సం. ]

  8. అద్దెకిచ్చి చూడు గురించి వెంకట అద్దంకి అభిప్రాయం:

    04/01/2018 2:23 am

    రచన అద్భుతం! దూరంగా ఉండి ఇల్లు అద్దెకు ఇవ్వడం నరకంలో కాళ్ళు పెట్టడం అని అద్దంలో చూపించినట్లు చెప్పేరు.

  9. పిల్లర్ నం. 13 గురించి చందు తులసి అభిప్రాయం:

    03/28/2018 7:27 am

    మనం సహాయం… మన సంతృప్తి కోసం చేసుకోవాల్సిందే. కృతజ్ఞత ఆశిస్తే ఆశాభంగం మిగులుతుంది.

  10. బస్సెడు దూరం గురించి మురళి అభిప్రాయం:

    03/28/2018 5:03 am

    మీ కళ(కలం) మా కళ్ళ కాగితం పై రాసిన ప్రకృతి స్రవంతికి నా అభివందనలు.