పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16467

  1. తడిబల్ల – పొడిబల్ల గురించి శర్మ దంతుర్తి అభిప్రాయం:

    11/02/2018 8:50 am

    ఎవరికీ చెందక… ఎందుకిలా నేను?

    ఇటువంటి ప్రశ్నలకి ఈ నెల ఈమాట సంచికలోనే ప్రచురించిన చంద్ర కన్నెగంటి గారి ‘బురద’ కథ సమధానాలు ఇస్తుందేమో?

  2. బురద గురించి శిరీష్ ఆదిత్య అభిప్రాయం:

    11/02/2018 4:42 am

    చంద్ర గారు, అద్భుతం. మీ కథలు లేసర్ బీమ్‌లాగా ఎంతో తేజస్సుతో పొరల్లా పేరుకుపోయిన అహాన్ని చీల్చేసి మనసును తాకుతాయి. హాట్స్-ఆఫ్ సర్.

  3. జీవనసంధ్య గురించి సురేశ్ వెలుగూరి అభిప్రాయం:

    11/02/2018 3:23 am

    మంచి క‌థ‌, మ‌న‌సు పెట్టి రాసిన క‌థ‌. ఈ సుఖదుఃఖాల్ని విస్మరించి, శాశ్వతానంద కారకమైన సత్యాన్ని అనువేచించి … క‌థ ఆత్మంతా ఈ ఒక్క లైన్ లోనే వుంది.

  4. జీవనసంధ్య గురించి ఇంద్రగంటి ప్రసాద్ అభిప్రాయం:

    11/02/2018 2:49 am

    కథా, వాతావరణం, పాత్రలూ బాగా ఇమిడేయి. మధ్యమ పురుషలో చెప్పడం అంత తేలిక కాదు. కొత్తగా ఉంది. అలవాటైన తృతీయ పురుష కథా క్రమానికి.

  5. జీవనసంధ్య గురించి Anil అట్లూరి అభిప్రాయం:

    11/02/2018 1:00 am

    వాసన, అంతా పల్లెటూరి మట్టి వాసన. ఆ కోళ్ళూ, పిల్లులు, కుక్కలు,ఆ నాటకాలు, ఆడే ఆ మనుషులు, ఆ జీవితాలు, ఆ జీవితాల వాసన. హార్మోనియం తెలుసంటే ఏదో అనుకున్నాను కాని ఇంత బాగా దాని గురించి, వాళ్ల గురించి తెలుసనుకోలేదు. జీవనా కి జీవుడా కి తేడా.

    బాగుంది.

    ఈ ఆన్‍లైన్ ప్రపంచంలో, పట్టణాలలో ఉండి, దేహ భాషలు, వాటి రాజకీయాలు, ఒక నైంటీ వేసుకుని, జీడిపప్పు నములుతూ చర్చించే కథల నుంచి, ఆలా వసారాలో నులక మంచంమీద కూర్చుని, ఆ సుగుణమ్మ మొగుడు కథ, 16mm లో చూసినట్టే ఉంది.

  6. జీవనసంధ్య గురించి Vimala అభిప్రాయం:

    11/02/2018 12:30 am

    కథ బాగుంది. ఎవరికన్నా దొరికిందో లేదో ఆ శాశ్వత ఆనందకారకమైన సత్యం. అసలు అట్లాంటి శాశ్వతమైనది ఒకటంటూ ఉందా అని నా సందేహం. అయినా సరే ఎవరికి వాళ్లు వాళ్లదయిన సత్యాన్ని వెతుక్కుంటూ…

  7. తడిబల్ల – పొడిబల్ల గురించి శిరీష్ ఆదిత్య అభిప్రాయం:

    11/02/2018 12:04 am

    “అయ్యో, ఇట్లా అని ముందే ఆలోచనవుంటే ఏ బ్రిస్టలో తెచ్చినా అయిపోయేది, డబ్బులు మిగిలేవి!” –మొదటిసారో రెండోసారో ఈ ఆలోచన రాని వాడు లేడు; ఫలితంగా మరుసటి సారి ఏడు రెగ్యులర్ తో పాటు మూడు బ్రిస్టలో చిన్న గోల్డ్ ఫ్లాకో కొని మురవని వాడూ లేడు.

    పేరు లేని పరిచయం ఎంతో బాగుంది. జనజీవన స్రవంతిలో ఇలా జరిగే ఎన్నో అకస్మాత్ సంఘటలని నేనూ-నాలాంటి వాళ్ళు ఇట్టే మరిచిపోతాము. కానీ మీరు వాటిని గమనించి చిన్న చిన్న నాజూకు బ్రష్-స్ట్రోక్స్ తో బ్రతుకు అనే చిత్రంలో అమరుస్తారు. హాట్స్-ఆఫ్.

    శుక్రవారం ఎండింగ్ హైలైట్. మొత్తం అయిదు సంఘటనలు కలిపి ఒక కథ ఎలానో, వాటి మధ్య బంధుత్వం ఏంటో అర్థం కాలేదు కానీ అన్నింట్లో రాజిరెడ్డిత్వం మాత్రం ఉట్టిపడుతోంది. ఎంతగానంటే నా తలలో ఆఖ్యానం మీ గొంతులో వినబడుతోంది.

  8. నాకు నచ్చిన పద్యం: హృదయాన్ని తాకే మొల్ల కవిత్వం గురించి Sreenivas Paruchuri అభిప్రాయం:

    11/01/2018 7:51 pm

    పద్య పరిచయం బాగుంది. ఇతర కవుల పద్యాలతో పోలికలు నాకయితే అధికంగా ఏమీ అనిపించలేదు. నిజానికి నేను కొత్త విషయాలు నేర్చుకున్నాను.

    మోహనరావుగారు, “విజయవిలాసము”లో నిజంగానే తిమ్మక్క పద్యానికి చాలా దగ్గరగా ఉండే పద్యం ఉంది:
    ఎగుభుజములవాడు మృగరాజ మధ్యంబు పుదికి పుచ్చుకొను నెన్నడుమువాడు నెఱివెండ్రుకులవాడు …

    నా కెలా తెలుసంటే ఆ పద్యాన్ని “బభ్రువాహన” (1964) అన్న సినిమాలో వాడుకున్నారు (సుశీల పాడుతుంది). అదే సినిమాలో మరో చేమకూర వేంకటకవి పద్యాన్ని (కోమలి ఈ గతిన్ మది దిగుల్ పడి పల్కెదవేల? …) , పిల్లలమఱ్ఱి పినవీరభద్రుని పద్యాన్ని (దుర్జయ రాజమండల విధుంతుదమూర్తి …) కూడా వాడుకున్నారు.

    శ్రీనివాస్

  9. పిలుపు గురించి Gowri Kirubanandan అభిప్రాయం:

    11/01/2018 7:19 pm

    అనువాద కధగా అనిపించలేదు. మూల రచయిత ఆత్మను పట్టుకుంటే తప్ప ఇంత లోతైన కధను అనువాదం చెయ్యడం సాధ్యం కాదు.
    అవినేని భాస్కర్ గారికి అభినందనలు.

  10. పుస్తక సమీక్ష: బుద్ధ చరితమ్ గురించి Sreenivas Paruchuri అభిప్రాయం:

    11/01/2018 6:58 pm

    Thank you Mohanarao gaaru for informing and also introducing the latest book from Bhaskar gaaru!

    Re: Muralidhararao gaaru’s personal note to you … The verse (1.45) cited needs to be taken with great caution. Instead I would like to draw your attention to Chellapilla’s verse in his autobiography “జాతకచర్య” (1934) which goes like (quoting from my memory):
    అతడింగ్లీషు భాషలో నర్నాల్డు
    కవి రచించిన బుద్ధుని కతను దెల్గు
    జేసి ….

    In fact, Prof. Velcheru Narayanarao discusses in detail exactly this subject of the source work for “buddha charitramu” of Tirupati Venkata Kavulu in his paper: “Buddhism in Modern Andhra: Literary Representations from Telugu”, JHS, Vol1, No. 1-2, 2008.
    https://academic.oup.com/jhs/article-abstract/1/1-2/93/2188643

    Regards,
    Sreenivas