పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16467

  1. ఒక మరిచిపోలేని వాక్యం గురించి Amarendra Dasari అభిప్రాయం:

    11/02/2018 7:38 pm

    ఒకే ఒక్క వాక్యం, బాలుడి నోట ఖగోళంలా…

  2. జీవనసంధ్య గురించి మీనాక్షి వేదుల అభిప్రాయం:

    11/02/2018 12:54 pm

    Hats off to స్వాతి కుమారి. ఎలా రాస్తారు ఇంత అద్భుతముగా. తాజ్‌మహల్ ఎంత పనికిమాలినది అక్షరం ముక్కరాని ముసలోడి మనసు ముందు.

  3. జీవనసంధ్య గురించి Sai Padma అభిప్రాయం:

    11/02/2018 12:09 pm

    చాలా గొప్పగా రాసేరు స్వాతీ. మీ రచనల్లో ఎంచదగ్గ వచనం. హాయిగా నులక మంచపు వాసనలో ఆ కంతల్లోంచి నాటకాన్ని చూస్తున్నట్టు ఉంది.

  4. జీవనసంధ్య గురించి యం.ప్రగతి అభిప్రాయం:

    11/02/2018 12:08 pm

    కథనం, శిల్పం రెండూ కొత్తగా బాగున్నాయి.

  5. ఒక మరిచిపోలేని వాక్యం గురించి ప్రసాద్ చరసాల అభిప్రాయం:

    11/02/2018 11:58 am

    ఇంగ్లండు సమాజం నడిచిన దారులన్నీ ఒక్క వాక్యం వెంబడి భలే స్పృజించారు.
    నాగమురళి గారన్నట్టు నాకూనూ మాయమైన పరికిణీల్లోని అమ్మాయిలు.. మన సమాజ సంఘర్షణ, మార్పు చదువుతున్నంత సేపూ కళ్ళలో కదిలాయి.

  6. గాయకులుగా సంగీత దర్శకులు గురించి Bhaskar Kompella అభిప్రాయం:

    11/02/2018 10:20 am

    శ్రీనివాస్ గారూ
    అరుదైన పాటలు అందించినందుకు అభివందనాలు

    సుబ్బురామన్ బాణీ కట్టి పాడి వినిపిస్తే ఘంటసాలకి పాడడం ఎంత సులువయ్యేదో కళ్ళకు కట్టినట్టు కనుపించింది సుబ్బురామన్ పాడడం వింటూంటే. నాకు సంగీతం తెలియదు. ఇద్దరి గాత్రాల భావప్రకటన, వాటిలో సామీప్యం వల్ల నాకలా అనిపించిందేమో…

    భాస్కర్

  7. జీవనసంధ్య గురించి ప్రసాద్ చరసాల అభిప్రాయం:

    11/02/2018 10:17 am

    ఎవరు ఎందుకు దేనికోసం వెతుక్కుంటారో? ఏది ఎవరిలో ఎందుకు ఆనందాన్ని నింపుతుందో? ఒకరి శాశ్వతానంద కారకం మరొకరికీ అవుతుందా?

    “నువ్వడిగిన ఆ నాలుగు మాటలు వినటానికే ఈ జీవుడు ఇంకా నిలిచిపోయింది.” ఆ జీవుడేనా ఈ కథకుడు?

    సుగుణమ్మకీ, అతనికీ మధ్య బంధాన్ని కొద్ది మాటలతోనే బలంగా చిత్రించారు.

  8. జీవనసంధ్య గురించి raghava అభిప్రాయం:

    11/02/2018 9:49 am

    బాగుంది. ద్వితీయ పురుష లో చెప్పడం వెనుక ఏదైనా ప్రత్యేకమైన పర్పస్ ఉందా?

  9. పుస్తక పరిచయం: అడవి నుండి అడవికి గురించి మణి వడ్లమాని అభిప్రాయం:

    11/02/2018 9:20 am

    దేవుల పల్లి వారి ‘ఆకులో ఆకునై పాటలా, పుస్తకం చదువుతున్నప్పుడు, పూర్తీ అయ్యాక కూడా ఆ అడవిపూల సుగంధం ఇంకా చుట్టూ ముట్టే ఉంది. నిజానికి ఆత్మ అక్కడే ఉన్నట్లుగా. అక్కడ నుంచి బయటకు రాలేనట్టుగా. అక్కడే ఆగిపోవాలని అనిపించింది. అనుభవించి రాసిన జయతికి, సమీక్ష చేసిన మీకు కూడా ధన్యవాదాలు.

  10. రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మ రేడియో ప్రసంగం గురించి మణి వడ్లమాని అభిప్రాయం:

    11/02/2018 9:11 am

    సైంధవి రాగం పేరు యెంత అందంగా ఉందొ శ్రీ అనంతశర్మగారి ప్రసంగం కూడా అంత బావుంది. ధన్యవాదాలు శ్రీనివాస్ గారు.