ఉత్తరరామాయణపు ఉపోద్ఘాతములో ప్రచురణకర్తలు (CV Krishna Depot) అందఱు రామాయణ కర్తలను పేర్కొన్నారు. వారిలో మొల్లను పేర్కొనకపోవడము శోచనీయమే. అంటే ఇరవైయవ శతాబ్దములో కూడ కవయిత్రులపైన చిన్న చూపే!
పోతన వ్రాసిన ఈ పద్యము కూడ మొల్లరామాయణములోనిది వంటిదే.
దీనిని అనుకరించి విజయవిలాసములో చేమకూర వేంకటకవి ఒక సీసపద్యమును వ్రాసినాడు అంటారు.
విధేయుడు – మోహన
ఏడు కవితలు
గురించి తమ్మినేని యదుకుల భూషణ్, అభిప్రాయం:
11/01/2018
2:09 pm
అద్భుతం. ఎన్ని రంగులు ఎన్ని భావాలు ఎన్ని అనుభవాలు; సౌభాగ్యుని ద్వా సుపర్ణా పుస్తకంతో తెలుగులో కేంద్ర సాహిత్య అకాడెమి పురస్కారం వచ్చిన కాలాన్ని నిద్ర పోనివ్వను (నక్క గోపి), మోహనా మోహనా (శివారెడ్డి) లాంటి ప్రముఖుల పుస్తకాలను పోలిస్తే హత విధి అనుకోక తప్పదు; మన ప్రముఖులకు తెలుగులో వాక్య నిర్మాణం చేతకాదు — ఈ అధునిక కవిత్వంలో అగుపించే స్వచ్చత, పారదర్సకత ఎప్పుడు సాధించాలి? గొప్ప కవిత్వాన్ని చదవడం దూర దేశపు అడవుల్లో రైలు ప్రయాణం లాంటిది. ఎన్నో సెలయేర్లు, అందమైన లేళ్ళు, ఎదురెండ, అనుకోని వర్షం అన్నీ ఎదురవుతాయి. గొప్ప అనువాద ప్రయాణాన్ని మొదలు పెట్టి అభయారణ్యంలో విహరిస్తున్న వేదండ ద్వయానికి అభినందనలు.
తాత్పర్యం రాయటానికి, ప్రతిపదార్థం రాయటానికి ఉన్న వ్యత్యాసం అది అనుభవించిన వారికే తెలుస్తుంది ! అందునా రెండు వేల ఏళ్ల పైగా ఉన్న కావ్యానికి తొలిసారిగా ఇలాటి ప్రయత్నానికి పూనుకున్న భాస్కర్ ధైర్యాన్ని, మొదల్లోనో మధ్యలోనో వదిలెయ్యకుండా సాగించి సాధించిన పట్టుదలని మనసా అభినందించి తీరాలి. ఇంత గౌరవం తొలిగా తెలుగుకే దక్కించటం మరో అభినందనీయ విషయం.
భాస్కర్ “ఈమాట” ప్రారంభకుల్లో ఒకరు. శిశువుగా వున్న పత్రికని పాకించి, అడుగులు వేయించి, పరుగులు తీయింఛిన వారిలో ప్రముఖుడు. అప్పట్లోనే భాసుడి “స్వప్న వాసవదత్తం” నాటకాన్ని తేలిక తెలుగులో ఈమాట పాఠకులకు అందించిన వాడు, వాల్మీకి – కాళిదాసుల కవిత్వాల తారతమ్యాల గురించి తన లోతైన అవగాహనని ఈమాట పాఠకులకూ అందించినవాడు. మరో మారు అభినందనలు, తన సాహితీ ప్రతిభని ఇంతటి మహత్తర, బృహత్తర కార్యానికి ఉపయోగించి అనితరసాధ్యమైన గౌరవాన్ని తెలుక్కి సంపాదించి పెట్టినందుకు.
మోహనరావు గారి పరిచయం గురించి కొంచెం: 1. పుస్తక రచయిత పరిచయాన్ని (ఛాయాచిత్రంతో) ముందుగా ఇచ్చివుంటే బాగుండేది. పుస్తక రచయితని వదిలి పరిచయకర్తల గురించిన వివరాలు ఇవ్వటం కొంత అభ్యంతరకరం. 2. ఆదికావ్యం రామాయణాన్ని మర్చిపోయినట్టున్నారు. 3. “పాత” సంస్కృతానికి ప్రతిపదార్థాలు రాయటంలో ఉన్న క్లిష్టతని కూడ స్పృశించి వుంటే ఇంకా బాగుండేది.
తిరుపతివేంకటకవుల బుద్ధచరితానికి ఆధారం Sir Edwin Arnold వ్రాసిన “The Light of Asia” అనే పుస్తకం. (ఆచార్య బేతవోలు రామబ్రహ్మం గారు ఒక ప్రసంగంలో ఈ విషయాన్ని వివరించి చెప్పారు. యూట్యూబ్ లో చూడచ్చు).
స్వేచ్ఛానువాదకావ్యాలు తెలుగులో మరికొన్ని కూడా ఊన్నాయి. కరుణశ్రీ వ్రాసినది; అద్దంకి కేశవరావుగారి “తథాగతీయము”.
మోహనగారి వ్యాసాన్ని బట్టి చూస్తే ఈ పుస్తకం ప్రతిపదార్థతాత్పర్యాలతో వ్రాసింది. అశ్వఘోషుడి బుద్ధచరితానికి ఇప్పటివరకూ ప్రతిపదార్థతాత్పర్యాలు ఉన్న పుస్తకం నేను ఏ భాషలోనూ చూడలేదు (ఉంటే ఈమాట ముఖంగా తెలపండి). ఇంగ్లీష్, హిందీ భాషల్లో తాత్పర్యాలు మాత్రమే ఉన్నాయి. కాని ప్రతిపదార్ధం లేదు.
విషయాన్ని ఎలా చూడాలి, ఎలా అన్వయించాలి అని చెప్పిన కామెంటరి. In his one of the books either The Age of Capital or The Age of Revolution Eric Howsbourne said the England was backward than Italy, France in education system, scientific knowledge prior to the industrial revolution. England was advanced than other EU countries in the subkect of political economy in his view. Further he observed English people were more mobile than their counter parts.
శ్రీ ఏల్చూరి మురళీధర రావుగారి స్పందన – విధేయుడు – మోహన
The first translation of Asvaghosha’s great work in Telugu was బుద్ధచరిత్రము by the celebrated poet-duo Tirupati Venkata Kavulu in equally grandiloquent manner.
నాకు నచ్చిన పద్యం: హృదయాన్ని తాకే మొల్ల కవిత్వం గురించి మోహన అభిప్రాయం:
11/01/2018 3:20 pm
మంచి వ్యాసము. రచయితకు అభినందనలు.
ఉత్తరరామాయణపు ఉపోద్ఘాతములో ప్రచురణకర్తలు (CV Krishna Depot) అందఱు రామాయణ కర్తలను పేర్కొన్నారు. వారిలో మొల్లను పేర్కొనకపోవడము శోచనీయమే. అంటే ఇరవైయవ శతాబ్దములో కూడ కవయిత్రులపైన చిన్న చూపే!
పోతన వ్రాసిన ఈ పద్యము కూడ మొల్లరామాయణములోనిది వంటిదే.
నీలజీమూత సన్నిభ శరీరమువాఁడు, తామరసాభ నేత్రములవాఁడు
పూర్ణేందుబింబంబుఁ బోలెడి మోమువాఁ, డున్నత దీర్ఘబాహువులవాఁడు
శ్రీవత్సలాంఛనాంచిత మహోరమువాఁడు, కౌస్తుభమణి పదకంబువాఁడు
శ్రీకర పీతకౌశేయ చేలమువాఁడు, మకరకుండలదీప్తి మలయువాఁడు
రాజ యింతంతవాఁ డనరాని వాఁడు, మెఱసి దిక్కుల నెల్లను మెఱయువాఁడు
తెలిసి యేవేళ లందైనఁ దిరుగువాఁడు, పట్ట నేర్చినఁ గాని లోబడనివాఁడు – భాగవతము, 10.1.1587
తాళ్లపాక తిమ్మక్క సుభద్రాకల్యాణ ద్విపద కావ్యములో కూడ ఇట్టి పద్యము ఒకటి ఉన్నది –
తెగవాలు కన్నుల దీర్ఘ బాహువులు, పగడంపు వన్నెగల పాదపద్మములు
….
ఎగుభుజమ్ములవాఁడు మృగరాజ నడుము, నడచిపుచ్చుకొను నెన్నడుము గలవాఁడు
దీనిని అనుకరించి విజయవిలాసములో చేమకూర వేంకటకవి ఒక సీసపద్యమును వ్రాసినాడు అంటారు.
విధేయుడు – మోహన
ఏడు కవితలు గురించి తమ్మినేని యదుకుల భూషణ్, అభిప్రాయం:
11/01/2018 2:09 pm
అద్భుతం. ఎన్ని రంగులు ఎన్ని భావాలు ఎన్ని అనుభవాలు; సౌభాగ్యుని ద్వా సుపర్ణా పుస్తకంతో తెలుగులో కేంద్ర సాహిత్య అకాడెమి పురస్కారం వచ్చిన కాలాన్ని నిద్ర పోనివ్వను (నక్క గోపి), మోహనా మోహనా (శివారెడ్డి) లాంటి ప్రముఖుల పుస్తకాలను పోలిస్తే హత విధి అనుకోక తప్పదు; మన ప్రముఖులకు తెలుగులో వాక్య నిర్మాణం చేతకాదు — ఈ అధునిక కవిత్వంలో అగుపించే స్వచ్చత, పారదర్సకత ఎప్పుడు సాధించాలి? గొప్ప కవిత్వాన్ని చదవడం దూర దేశపు అడవుల్లో రైలు ప్రయాణం లాంటిది. ఎన్నో సెలయేర్లు, అందమైన లేళ్ళు, ఎదురెండ, అనుకోని వర్షం అన్నీ ఎదురవుతాయి. గొప్ప అనువాద ప్రయాణాన్ని మొదలు పెట్టి అభయారణ్యంలో విహరిస్తున్న వేదండ ద్వయానికి అభినందనలు.
పుస్తక సమీక్ష: బుద్ధ చరితమ్ గురించి K.V.S. Ramarao అభిప్రాయం:
11/01/2018 1:16 pm
తాత్పర్యం రాయటానికి, ప్రతిపదార్థం రాయటానికి ఉన్న వ్యత్యాసం అది అనుభవించిన వారికే తెలుస్తుంది ! అందునా రెండు వేల ఏళ్ల పైగా ఉన్న కావ్యానికి తొలిసారిగా ఇలాటి ప్రయత్నానికి పూనుకున్న భాస్కర్ ధైర్యాన్ని, మొదల్లోనో మధ్యలోనో వదిలెయ్యకుండా సాగించి సాధించిన పట్టుదలని మనసా అభినందించి తీరాలి. ఇంత గౌరవం తొలిగా తెలుగుకే దక్కించటం మరో అభినందనీయ విషయం.
భాస్కర్ “ఈమాట” ప్రారంభకుల్లో ఒకరు. శిశువుగా వున్న పత్రికని పాకించి, అడుగులు వేయించి, పరుగులు తీయింఛిన వారిలో ప్రముఖుడు. అప్పట్లోనే భాసుడి “స్వప్న వాసవదత్తం” నాటకాన్ని తేలిక తెలుగులో ఈమాట పాఠకులకు అందించిన వాడు, వాల్మీకి – కాళిదాసుల కవిత్వాల తారతమ్యాల గురించి తన లోతైన అవగాహనని ఈమాట పాఠకులకూ అందించినవాడు. మరో మారు అభినందనలు, తన సాహితీ ప్రతిభని ఇంతటి మహత్తర, బృహత్తర కార్యానికి ఉపయోగించి అనితరసాధ్యమైన గౌరవాన్ని తెలుక్కి సంపాదించి పెట్టినందుకు.
మోహనరావు గారి పరిచయం గురించి కొంచెం: 1. పుస్తక రచయిత పరిచయాన్ని (ఛాయాచిత్రంతో) ముందుగా ఇచ్చివుంటే బాగుండేది. పుస్తక రచయితని వదిలి పరిచయకర్తల గురించిన వివరాలు ఇవ్వటం కొంత అభ్యంతరకరం. 2. ఆదికావ్యం రామాయణాన్ని మర్చిపోయినట్టున్నారు. 3. “పాత” సంస్కృతానికి ప్రతిపదార్థాలు రాయటంలో ఉన్న క్లిష్టతని కూడ స్పృశించి వుంటే ఇంకా బాగుండేది.
పుస్తక పరిచయం: అడవి నుండి అడవికి గురించి Sai Padma అభిప్రాయం:
11/01/2018 12:40 pm
చాలా బాగా ఈ పుస్తకంలో జయతిని పట్టుకున్నారు.. ఆమె పట్టి ఇచ్చారు అనుకుంటా.. వొక యాత్రా పుస్తకం గురించి మరో యాత్రికుడు రాయటం కూడా చాలా చాలా బాగుంది
అడ్డగాడిద గురించి ఉమా పోచంపల్లి అభిప్రాయం:
11/01/2018 11:56 am
భలే ఉంది దంత వేదాంతం!
పుస్తక సమీక్ష: బుద్ధ చరితమ్ గురించి BK అభిప్రాయం:
11/01/2018 11:03 am
మురళీధర రావు గారూ,
తిరుపతివేంకటకవుల బుద్ధచరితానికి ఆధారం Sir Edwin Arnold వ్రాసిన “The Light of Asia” అనే పుస్తకం. (ఆచార్య బేతవోలు రామబ్రహ్మం గారు ఒక ప్రసంగంలో ఈ విషయాన్ని వివరించి చెప్పారు. యూట్యూబ్ లో చూడచ్చు).
స్వేచ్ఛానువాదకావ్యాలు తెలుగులో మరికొన్ని కూడా ఊన్నాయి. కరుణశ్రీ వ్రాసినది; అద్దంకి కేశవరావుగారి “తథాగతీయము”.
మోహనగారి వ్యాసాన్ని బట్టి చూస్తే ఈ పుస్తకం ప్రతిపదార్థతాత్పర్యాలతో వ్రాసింది. అశ్వఘోషుడి బుద్ధచరితానికి ఇప్పటివరకూ ప్రతిపదార్థతాత్పర్యాలు ఉన్న పుస్తకం నేను ఏ భాషలోనూ చూడలేదు (ఉంటే ఈమాట ముఖంగా తెలపండి). ఇంగ్లీష్, హిందీ భాషల్లో తాత్పర్యాలు మాత్రమే ఉన్నాయి. కాని ప్రతిపదార్ధం లేదు.
ఒక మరిచిపోలేని వాక్యం గురించి B. Rama Naidu అభిప్రాయం:
11/01/2018 10:18 am
విషయాన్ని ఎలా చూడాలి, ఎలా అన్వయించాలి అని చెప్పిన కామెంటరి. In his one of the books either The Age of Capital or The Age of Revolution Eric Howsbourne said the England was backward than Italy, France in education system, scientific knowledge prior to the industrial revolution. England was advanced than other EU countries in the subkect of political economy in his view. Further he observed English people were more mobile than their counter parts.
పుస్తక సమీక్ష: బుద్ధ చరితమ్ గురించి మోహన అభిప్రాయం:
11/01/2018 9:49 am
శ్రీ ఏల్చూరి మురళీధర రావుగారి స్పందన – విధేయుడు – మోహన
The first translation of Asvaghosha’s great work in Telugu was బుద్ధచరిత్రము by the celebrated poet-duo Tirupati Venkata Kavulu in equally grandiloquent manner.
ఇద్ధతేజుఁ డైన బుద్ధదేవు చరిత్ర
నశ్వఘోషముఖుల ననుసరించి
యస్మదంకితముగ నాంధ్రకావ్య మొనర్పుఁ
డనుచు వీడ్యమిచ్చె నాదరమున. (1-45)
పుస్తక పరిచయం: అడవి నుండి అడవికి గురించి Amarendra Dasari అభిప్రాయం:
11/01/2018 8:10 am
సంతోషం సింహాచలంగారూ… మీరూ ప్రకృతి పిపాసులు అన్నమాట… చాలా బావుంది.
ఒక మరిచిపోలేని వాక్యం గురించి nagamurali అభిప్రాయం:
11/01/2018 8:05 am
చాలా సామాన్యంగా కనపడే ఒకే ఒక్క వాక్యం ఎంత చరిత్రని కళ్ళకి కట్టించింది!!
నేనొకసారి యాదృచ్ఛికంగా ఎవరితోనో అన్న మాటని నాకు మళ్ళీ గుర్తు చేసింది.
చిన్నప్పుడు మా ఊళ్ళో ఉదయాన్నే, పరికిణీ ఓణీలు వేసుకుని, పువ్వులు పెట్టుకుని, ఆడపిల్లలు గుంపులు గుంపులుగా సైకిళ్ళమీద టైప్ ఇన్ స్టిట్యూట్లకి వెడుతూ కనిపించేవారు, ఇప్పుడు ఆ దృశ్యమే మాయమైపోయింది – అని.
ఇరవై, ముప్ఫై ఏళ్ళ క్రితం మనసులో ముద్రించుకున్న కొన్ని చిత్రాల్ని తవ్వి తీస్తే, ఎంత మార్పు, ఎంత చరిత్ర కనిపిస్తుంది!!