పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16463

  1. జాషువా – పిరదౌసి గురించి JVVSN Murthy అభిప్రాయం:

    09/27/2019 9:31 pm

    మానస గారూ, జాషువా కవితా వైశిష్ట్యాన్ని చాలా చక్కగా ఆవిష్కరించారు. మీకు హృదయపూర్వక అభినందనలు.

  2. మనిషి బహిరంతర్లోకాల సంఘర్షణకు కథారూపం డా. వి. చంద్రశేఖరరావు కథలు గురించి M.k.kumar అభిప్రాయం:

    09/27/2019 1:50 pm

    విశ్లేషణ బాగుంది.

  3. పిఠాపురంలో నా మొదటి మజిలీ గురించి తంగెళ్ళపల్లి ప్రశాంత్ అభిప్రాయం:

    09/27/2019 1:47 pm

    పరుచూరి శ్రీనివాస్ గారు, ఎన్నో రోజుల సందేహం తీర్చినందుకు ధన్యవాదములు. రేవా రాణితో కలిసి తాను ఏదో పిట్ట మాంసం, కొంత వైన్ పుచ్చుకున్నానని గురజాడవారు ఎక్కడో రాసారు (పాఠకులు మన్నించాలి అది గురజాడ వారు చెప్పిందే )… ఈ రేవా మధ్యప్రదేశ్ లోని రేవా నా కదా అని, ఉద్యోగ ధర్మంగా నేను ఆ ప్రాంతానికి వెళ్లినా కూడా తెలుసుకోలేకపోయాను. మీ నుంచి తెలుసుకోగలిగాను. వీర వెంకట సత్య…గా తెలుగు నాట పేర్లలో స్థిరపడిపోయిన సత్య దేవుని ప్రాభవం, పిఠాపురంకి గుజరాత్ కి ఉన్న సంబంధం మీ వల్ల కలిగిన కొత్త జ్ఞానం… ధన్యులం.

  4. వేటూరి పాట గురించి Ebs శర్మ అభిప్రాయం:

    09/26/2019 7:24 am

    రచయిత వేటూరిని పొగడకూడదని కంకణం కట్టుకున్నారు అనిపిస్తుంది.

  5. బొమ్మల కొలువు గురించి Bindu అభిప్రాయం:

    09/26/2019 2:09 am

    ఛాలా వివరంగా రాశారు. ఎందుకు, ఎలా పెడతారు, ఎలా కొలువు పెట్టడం ఒక ఆచారంగా మారింది, తెలియజేసినందుకు ధన్యవాదాలు.

  6. మనిషి బహిరంతర్లోకాల సంఘర్షణకు కథారూపం డా. వి. చంద్రశేఖరరావు కథలు గురించి Amarendra అభిప్రాయం:

    09/23/2019 7:04 pm

    అరుదైన రచయిత… కాలాతీతమైన కథలు… చక్కని వ్యాసం.

  7. మనిషి బహిరంతర్లోకాల సంఘర్షణకు కథారూపం డా. వి. చంద్రశేఖరరావు కథలు గురించి ఎ. కె. ప్రభాకర్ అభిప్రాయం:

    09/23/2019 5:51 pm

    డా. చంద్రశేఖరరావు సాహిత్యంపై రాయాల్సిన అనివార్య బాధ్యతను గుర్తు చేసినందుకు థేంక్యూ నవీన్ !

  8. అపుడు రాయి గురించి తుమ్మూరి రాంమోహన్ రావు అభిప్రాయం:

    09/19/2019 4:52 pm

    నానృషిః కురుతే కావ్యం అనే మాటను జేకే పరంగా బాగా చెప్పారు
    చీకటి పిల్లిని తరిమి విరాగి వై👌

  9. ఇంద్రగంటి శ్రీకాంతశర్మ: లలిత గీతాలు గురించి సాహితి అభిప్రాయం:

    09/14/2019 7:13 pm

    లక్ష్మన్న గారు,
    పసందైన ఈ పాటలో పొదిగిన పదాలని సునిశితంగా గమనించి అన్వయించారు.
    Nice observation and explanation!
    Thank you.

  10. ఇంద్రగంటి శ్రీకాంతశర్మ: లలిత గీతాలు గురించి విష్ణుభొట్ల లక్ష్మన్న అభిప్రాయం:

    09/14/2019 11:22 am

    సాహితి గారు:

    ఈ క్రింది మాటలు మీతో పంచుకోవాలని ముందే అనుకున్నా కాని మర్చిపోయా!

    “స్వరాలైన జ్ఞాపకాలు”:

    పాట సాహిత్యంలో ఉన్న పై పదాలు, మీకు అన్వయిస్తాయి! మీకు తెలియకుండానే మీ జ్ఞాపకాలు స్వరాలైనాయి! మీరు ఆ విషయాన్ని సంగీతపరంగా వ్యక్త పరచలేకపోయారు అంతే.

    అభినందనలతో,

    విష్ణుభొట్ల లక్ష్మన్న