నిజంగా ఈ శిర్షిక ఈ-తెలుగు సాహిత్య లోకం గురించి ఒక కనువిప్పు. చాల చక్కటి సమాచారం అందించారు. ఇక్కడ ఇచ్చినటువంటి విస్కాన్సిన్ విశ్వవిద్యాలయం నుండి అన్ని ఫైల్స్ నేను సాఫ్టువేరు ద్వారా దిగుమతి చేసుకున్నాను. ఇది మాత్రమే కాక అద్బుతమైన “As we may Think” లింక్ ఇచ్చినందుకుగాను ధన్యవాదములు.
గ్రామాలలో తోలుబొమ్మలాడించే కళాకారులలో గోవిందరావు వంటి గొప్ప కవులుంటారని, కులపెద్దలందరిని పేరు పేరునా ఆశువుగా ద్విపదలో స్తుతించగలిగిన సామర్ధ్యం వుంటుందని తెలుసుకొని ఆశ్చర్యపోయాను. ద్విపదలూ సమయానుకూలంగా వారు చెప్పగలిగే అనేక చాటు పద్యాలు వారి సాహిత్య పరిజ్ఞానాన్ని చాటిచెప్పుతున్నాయి. ముఖ్యంగా రామాయణ యుద్ధకాండలో మాయా సీత వధ సందర్భంలో లక్ష్మణుడు అన్నతో చేసిన ప్రసంగం సంస్కృతమూలంతో పోలిస్తే ఇంకా చాలా అందంగా ద్విపదలో ఇమిడింది. తోలుబొమ్మ కళాకారులనుండి సేకరించినవో లేక రచయిత స్వయంగా రచించినవో ఏమైనా చాలా ప్రశంసార్హములు. అర్హతను గుర్తించి పురస్కారాన్ని అందించి ప్రచురించి మాకందజేసిన ఈ మాట వారికి రచయితకీ ధన్యవాదాలు.
నా వ్యాసాలు మీకు నచ్చినందుకు చాలా సంతోషం; శ్రమకి ఫలితం దక్కినట్లే. మీరు వీటిని కాపీ చేసి పిల్లలకి పంచి పెడతానంటే నాకానందమేగాని ఎలాంటి అభ్యంతరమూ లేదు; ఈమాటకీ ఉండదు. మీ ఉదారతకి కృతజ్ఞతలు. ఈపనిలో నేను చేయూతనివ్వగలను. (మా హైస్కూలు మాస్టార్లకి పంపిస్తానని మాటిచ్చాను కాని, ఇంకా పంపలేదు. పంపాలి.)
వ్యాసాలన్నీ పూర్తయింతర్వాత, సవరించి పుస్తకంగా ప్రచురించే ఆలోచన చేస్తాను.
“యాచిత/సీనియర్ రచయితల్లో చాలామందికి సహనం కన్నా అహం ఎక్కువ. కొద్దిమంది సీనియర్ రచయితలు సంపాదకుల పనిని ససేమిరా సహించరు; హర్షించరు.” అన్న వాక్యాలు, “ప్రచురణకి వచ్చే *రచనలు* గురించి” అనే శీర్షిక పెట్టి, రచనలను గాలికొదిలేసి, రచయితల యొక్క సహనాలు, అహంభావాలు, వారు ఏమి సహిస్తారు, ఏమి హర్షించరు అనే అంశాలను పాయింట్లవారీగా నొక్కి చెప్పడం ఎంచుకున్న శీర్షకకు ఏ విధంగా అవసరం, ఉపయోగం?
____
విధేయుడు
-Srinivas
చాలా చక్కని వ్యాసాలు. ముఖ్యంగా గణితం లాంటి సబ్జక్టుని ఆసక్తితో చదివించేలా చెబుతున్నారు. మరీ ముఖ్యంగా ఈ వ్యాసం లో గణితం పాళ్ళు, చారిత్రక జీవితాంశాలు సరిగ్గ సరిపోయాయి. మీకు అభ్యంతరం లేకపోతే మీ వ్యాసాలన్నిటిని నాకు వీలయినన్ని ప్రింటవుట్లు తీయించి దగ్గర్లోని హైస్కూళ్ళలో, కాలేజీలలో పంచిపెట్టాలని అనుకుంటున్నాను (పుస్తకం వేయించే స్థాయి నాకు లేదు మరి :-()
అయ్యా ముఖ్య సంపాదకుల వారూ..!!
మీకూ..మీ స హ..లేదా ఉప సంపాదకులకు మరో సులువు చెప్పాలని అన్పించింది. మీరెటూ సున్నిత మనస్కులు అయివుండరు గనక, కాస్త నిశ్చింత గానే చెబుతున్నాను. అదేమంటే..అసలు ఇన్ని సూచనలిస్తూ.. కత్తిరిస్తూ..ఇలాంటి అవస్థలన్ని పడేకన్నా..ఆ కధలూ..కవితలూ..వ్యాసాలూ..వాక్యాలూ..మీరే రాసేసుకుంటే పోలా??
మీకు ఇతరుల రచనల్ని సంస్కరింఛే శ్రమ తప్పుతుంది. పాఠకులకి మీ శత..స హస్ర నిషేధాల బరువూ తప్పుతుంది. పెద్ద రచయితలు మీకు రాయరు. ఔత్సాహికులని మీరు రాయనిచ్చేలా లేరు. చూడబోతే..మీరు కవులకెల్ల కవి లాగానూ..విమర్శకులకెల్ల… విమర్శకులుగానూ..పాఠకులని మించిన పాఠకుని గానూ కన్పిస్తున్నందున..మీ పత్రికని మీ సూచనల మేరకు మీరే బాగా నడుపుకోగలరు.
1993లో తానా సభలకువచ్చి అమెరికా అంతా తిరిగిన బృందంలో రాజాగారబ్బాయి చంద్రశేఖర్, ఘంటసాలగారబ్బాయి విజయకుమార్ ఇద్దరూ ఉన్నారు. ఇద్దరికీ వారి తండ్రుల గొంతులు వచ్చాయి గానీ, తండ్రులకున్న శిక్షణ, క్రమశిక్షణ, సంగీతాన్ని అంతగా ఆరాధించే తత్వం పిల్లల్లో ఎక్కడా ఉన్నట్లనిపించలేదు. లేకపోతే వీళ్ళిద్దరూ కూడా మంచి గాయకులై ఉండేవారు.
ఛందొబధ్ధవయిన కవిత్వం రాస్తున్నవాళ్ళు అనుభూతికి, భావానికి రెండో పీట వేసి ఛందస్సుకి పెద్దపీట వెయ్యడం వల్లే వాళ్ళ కవిత్వంలో ఛందస్సు తప్ప కవిత్వం వుండకుండాపోతోంది. ఈ పీటల గురించి నా విమర్శ కొంచెం రసజ్ఞ పాఠకులముందుంచి నా దృక్పధం సరి ఐనదో కాదో తెలుసుకోవాలని అనుకుంటున్నాను.
సాహిత్యానికి అందాన్ని కూర్చేవి మొదటిది శబ్దం రెండవది భావం. శబ్దం చెవిని పడుతూనే శృతిపేయంగానో కర్ణ కఠోరంగానో ఆకర్షణ వికర్షణలను ఆ కవిత్వంపై కలుగజేస్తుంది.
నవల చాలా బాగుంది. బాగా నచ్చింది. వస్తువే గాక విధానం కూడా ఆకట్టుకుంది. కాలచక్రం వేగంగా ఎవరితోనూసంబంధం లేకుండా తిరుగుతుంది. తనతో పాటు అనేక సంస్కృతులనీ సంప్రదాయాలనీ మార్పులకు గురిచేస్తూ పోతుంది. కాలానుసారంగా మారగలిగినన్నాళ్ళూ ఎవ్వరికీ ఏ బాధా వుండదు. కానీ ఎప్పుడైతే ఇదే నిజమైన సర్వజనులూ ఆదరించి ఆచరించాల్సిన సంస్కృతి సంప్రదాయం అని ఎక్కడ మనం ఆగిపోతామో, అక్కడనుండే కష్టాలు ప్రారంభం అవుతాయి. ఎన్ని రామసేనలు వచ్చినా అనివార్యమైన కాలం తెచ్చే మార్పులను ఆపడం సాధ్యం కాదు. కాలానుగుణంగా మారి తీరాలి.
ఈమాట పూర్వాపరాలు – నా జ్ఞాపకాలు II గురించి Rajesh Devabhaktuni అభిప్రాయం:
05/07/2009 4:13 am
నిజంగా ఈ శిర్షిక ఈ-తెలుగు సాహిత్య లోకం గురించి ఒక కనువిప్పు. చాల చక్కటి సమాచారం అందించారు. ఇక్కడ ఇచ్చినటువంటి విస్కాన్సిన్ విశ్వవిద్యాలయం నుండి అన్ని ఫైల్స్ నేను సాఫ్టువేరు ద్వారా దిగుమతి చేసుకున్నాను. ఇది మాత్రమే కాక అద్బుతమైన “As we may Think” లింక్ ఇచ్చినందుకుగాను ధన్యవాదములు.
తోలుబొమ్మలాట – 12వ భాగం గురించి M.S.Prasad అభిప్రాయం:
05/06/2009 11:12 pm
గ్రామాలలో తోలుబొమ్మలాడించే కళాకారులలో గోవిందరావు వంటి గొప్ప కవులుంటారని, కులపెద్దలందరిని పేరు పేరునా ఆశువుగా ద్విపదలో స్తుతించగలిగిన సామర్ధ్యం వుంటుందని తెలుసుకొని ఆశ్చర్యపోయాను. ద్విపదలూ సమయానుకూలంగా వారు చెప్పగలిగే అనేక చాటు పద్యాలు వారి సాహిత్య పరిజ్ఞానాన్ని చాటిచెప్పుతున్నాయి. ముఖ్యంగా రామాయణ యుద్ధకాండలో మాయా సీత వధ సందర్భంలో లక్ష్మణుడు అన్నతో చేసిన ప్రసంగం సంస్కృతమూలంతో పోలిస్తే ఇంకా చాలా అందంగా ద్విపదలో ఇమిడింది. తోలుబొమ్మ కళాకారులనుండి సేకరించినవో లేక రచయిత స్వయంగా రచించినవో ఏమైనా చాలా ప్రశంసార్హములు. అర్హతను గుర్తించి పురస్కారాన్ని అందించి ప్రచురించి మాకందజేసిన ఈ మాట వారికి రచయితకీ ధన్యవాదాలు.
భవదీయుడు.
కంప్యూటింగ్ పూర్వాపరాలు, సాధ్యాసాధ్యాలు – 8: దిగ్భ్రమ కలిగించే గూడెల్ మేధోక్రీడ గురించి కొడవళ్ళ హనుమంతరావు అభిప్రాయం:
05/06/2009 8:40 pm
ప్రసాదం గారికి,
నా వ్యాసాలు మీకు నచ్చినందుకు చాలా సంతోషం; శ్రమకి ఫలితం దక్కినట్లే. మీరు వీటిని కాపీ చేసి పిల్లలకి పంచి పెడతానంటే నాకానందమేగాని ఎలాంటి అభ్యంతరమూ లేదు; ఈమాటకీ ఉండదు. మీ ఉదారతకి కృతజ్ఞతలు. ఈపనిలో నేను చేయూతనివ్వగలను. (మా హైస్కూలు మాస్టార్లకి పంపిస్తానని మాటిచ్చాను కాని, ఇంకా పంపలేదు. పంపాలి.)
వ్యాసాలన్నీ పూర్తయింతర్వాత, సవరించి పుస్తకంగా ప్రచురించే ఆలోచన చేస్తాను.
కొడవళ్ళ హనుమంతరావు
ప్రచురణకి వచ్చే రచనల గురించి గురించి Srinivas Nagulapalli అభిప్రాయం:
05/06/2009 8:00 am
“యాచిత/సీనియర్ రచయితల్లో చాలామందికి సహనం కన్నా అహం ఎక్కువ. కొద్దిమంది సీనియర్ రచయితలు సంపాదకుల పనిని ససేమిరా సహించరు; హర్షించరు.” అన్న వాక్యాలు, “ప్రచురణకి వచ్చే *రచనలు* గురించి” అనే శీర్షిక పెట్టి, రచనలను గాలికొదిలేసి, రచయితల యొక్క సహనాలు, అహంభావాలు, వారు ఏమి సహిస్తారు, ఏమి హర్షించరు అనే అంశాలను పాయింట్లవారీగా నొక్కి చెప్పడం ఎంచుకున్న శీర్షకకు ఏ విధంగా అవసరం, ఉపయోగం?
____
విధేయుడు
-Srinivas
కంప్యూటింగ్ పూర్వాపరాలు, సాధ్యాసాధ్యాలు – 8: దిగ్భ్రమ కలిగించే గూడెల్ మేధోక్రీడ గురించి ప్రసాదం అభిప్రాయం:
05/06/2009 5:38 am
చాలా చక్కని వ్యాసాలు. ముఖ్యంగా గణితం లాంటి సబ్జక్టుని ఆసక్తితో చదివించేలా చెబుతున్నారు. మరీ ముఖ్యంగా ఈ వ్యాసం లో గణితం పాళ్ళు, చారిత్రక జీవితాంశాలు సరిగ్గ సరిపోయాయి. మీకు అభ్యంతరం లేకపోతే మీ వ్యాసాలన్నిటిని నాకు వీలయినన్ని ప్రింటవుట్లు తీయించి దగ్గర్లోని హైస్కూళ్ళలో, కాలేజీలలో పంచిపెట్టాలని అనుకుంటున్నాను (పుస్తకం వేయించే స్థాయి నాకు లేదు మరి :-()
మీతోపాటే వేమురివారి రసాయన శాస్త్ర పాఠాలు కూడా (http://www.lolakam.blogspot.com)
ప్రసాదం
ప్రచురణకి వచ్చే రచనల గురించి గురించి rama bharadwaj అభిప్రాయం:
05/05/2009 10:21 am
అయ్యా ముఖ్య సంపాదకుల వారూ..!!
మీకూ..మీ స హ..లేదా ఉప సంపాదకులకు మరో సులువు చెప్పాలని అన్పించింది. మీరెటూ సున్నిత మనస్కులు అయివుండరు గనక, కాస్త నిశ్చింత గానే చెబుతున్నాను. అదేమంటే..అసలు ఇన్ని సూచనలిస్తూ.. కత్తిరిస్తూ..ఇలాంటి అవస్థలన్ని పడేకన్నా..ఆ కధలూ..కవితలూ..వ్యాసాలూ..వాక్యాలూ..మీరే రాసేసుకుంటే పోలా??
మీకు ఇతరుల రచనల్ని సంస్కరింఛే శ్రమ తప్పుతుంది. పాఠకులకి మీ శత..స హస్ర నిషేధాల బరువూ తప్పుతుంది. పెద్ద రచయితలు మీకు రాయరు. ఔత్సాహికులని మీరు రాయనిచ్చేలా లేరు. చూడబోతే..మీరు కవులకెల్ల కవి లాగానూ..విమర్శకులకెల్ల… విమర్శకులుగానూ..పాఠకులని మించిన పాఠకుని గానూ కన్పిస్తున్నందున..మీ పత్రికని మీ సూచనల మేరకు మీరే బాగా నడుపుకోగలరు.
రమ.
మాధుర్యానికి మరో పేరు: ఏ. ఎం. రాజా గురించి Maddipati Krishna Rao అభిప్రాయం:
05/05/2009 9:59 am
1993లో తానా సభలకువచ్చి అమెరికా అంతా తిరిగిన బృందంలో రాజాగారబ్బాయి చంద్రశేఖర్, ఘంటసాలగారబ్బాయి విజయకుమార్ ఇద్దరూ ఉన్నారు. ఇద్దరికీ వారి తండ్రుల గొంతులు వచ్చాయి గానీ, తండ్రులకున్న శిక్షణ, క్రమశిక్షణ, సంగీతాన్ని అంతగా ఆరాధించే తత్వం పిల్లల్లో ఎక్కడా ఉన్నట్లనిపించలేదు. లేకపోతే వీళ్ళిద్దరూ కూడా మంచి గాయకులై ఉండేవారు.
కృష్ణారావు
వెంటాడుతున్న ఊడుగపూత పరిమళం గురించి tavva obul reddy అభిప్రాయం:
05/05/2009 8:48 am
కళ్ళు చెమ్మగిల్లేలా చేసింది, పతంజలి గారిపై గొరుసు జగదీశ్వర రెడ్డి గారి వ్యాసం.
వాడుక భాషలో తెలుగు కవితావికాసము గురించి M.S.Prasad అభిప్రాయం:
05/05/2009 7:32 am
ఛందొబధ్ధవయిన కవిత్వం రాస్తున్నవాళ్ళు అనుభూతికి, భావానికి రెండో పీట వేసి ఛందస్సుకి పెద్దపీట వెయ్యడం వల్లే వాళ్ళ కవిత్వంలో ఛందస్సు తప్ప కవిత్వం వుండకుండాపోతోంది. ఈ పీటల గురించి నా విమర్శ కొంచెం రసజ్ఞ పాఠకులముందుంచి నా దృక్పధం సరి ఐనదో కాదో తెలుసుకోవాలని అనుకుంటున్నాను.
సాహిత్యానికి అందాన్ని కూర్చేవి మొదటిది శబ్దం రెండవది భావం. శబ్దం చెవిని పడుతూనే శృతిపేయంగానో కర్ణ కఠోరంగానో ఆకర్షణ వికర్షణలను ఆ కవిత్వంపై కలుగజేస్తుంది.
[ఈ కామెంట్ పూర్తిపాఠం చర్చావేదిక లో చదవగలరు – సం]
తోలుబొమ్మలాట – 12వ భాగం గురించి M.S.Prasad అభిప్రాయం:
05/05/2009 3:46 am