well , కృష్ణశాస్త్రి రాసినంత మాత్రాన గొప్పగా ఉండాల్నేంలేదు . ఆ పాట కృష్ణశాస్త్రి రాసినా నీరసంగానే ఉంది. ఆ పాట స్వరం కూడా!!
భిన్నరుచులు ఉంటాయని “శ్రీనివాస్ ” గారికి కనీసం ఒక ఒప్పుదల ఉన్నందుకు సంతోషం.
1. “ఘంటసాలకు చుట్ట కాల్చే అలవాటు” వల్లనే భానుమతి ఆయనతో పాడలేదని నమ్మటం కొంచెం కష్టం. అంతకుముందు వీరిద్దరూ “లైలామజ్ను” (1949), “ప్రేమ” (1951), “చండీరాణి” (1953) సినిమాల్లో కలిసి పాడారు.
2. నాకు తెలిసినంతలో విజయా వాళ్ళు ఘంటసాల “మరే సంస్థకూ పనిచెయ్యకూడదు” అనే షరతు పెట్టలేదు. 1950-54 మధ్యల్లో ఆయన వేరే సంస్థలకు కూడా పనిచేసారు. (ఆ మాటకొస్తే జెమినీ వాళ్ళు ఆ షరతు పెట్టేవారు. అదువల్లే 1942 – 1949 మధ్యల్లో సాలూరి మరెవ్వరికీ పని చేయలేదు.) “మల్లీశ్వరి” (1951, వాహిని 1949 నాటికే విజయా ఆధీన్యంలోకి వచ్చింది!), “పాతాళభైరవి” (1951), “పెళ్ళిచేసిచూడు” (1952), “చంద్రహారం” (1954) సినిమాలకు “planning” ఒకేసారి జరిగింది అని, అన్నింటిలో రామారావు నాయకుడి పాత్రలో నలుగురు దర్శకులకు నాలుగు సినిమాలు ఇవ్వటం జరిగిందని చెప్తారు. (ఆ contract చేతికి వచ్చిన తరువాతే రామారావు కుటుంబాన్ని మద్రాసుకి మార్చడం జరిగిందన్నది తెలిసిన విషయమే..)
3. “అమరసందేశం”లోని పాటలకు కేళ్కర్ గారికి credit ఇవ్వలేదన్నమాట నిజం కాదు. పాటల పుస్తకంలోను, రికార్డులపైన ఇద్దరి పేర్లూ వుంటాయి. (side note: కె. ప్రసాదరావు అప్పటికి కొన్ని సినిమాల్లో పాటలు పాడారు. 1956 తరువాత ఆయన కూడా సంగీతదర్శకత్వం చేసిన దాఖలాలు లేవు. పెండ్యాల ఆర్కెస్ట్రాలో violin వాయిచేవారని విన్నాను.)
శివశంకర్ గారు అనుకున్నది నిజమే:
4. “పక్కయింటి అమ్మాయి” (ఇది correct title!) సినిమాలో పాటలన్నీ రాసింది సాక్షాత్తు “వైతాళికులు” ముద్దుకృష్ణే! “కలయేమో పాట” oldtelugusongs.com లో వినవచ్చు.
చివరిగా “రమ” గారి వ్యాఖ్యకు:
నీరసంగా ఉన్నదనిపించిన సాహిత్యాన్నందించిన పెద్ద మనిషి పేరు దేవులపల్లి వెంకట కృష్ణశాస్త్రి. మలయాళం నుండి డబ్ అయిన ఆ సినిమాకి పాటలన్నీ ఆయనే రాసాడు. ఇంక నీరసంగా ఉన్న సంగీతాన్ని వినిపించిన పెద్ద మనిషి పేరు పి.ఎస్. దివాకర్. ఆ పాట ఇక్కడ వినిపించడానికి కారణాలు చాలా వున్నాయి. అంత తేలిగ్గా దొరకని పాట కావడం, జిక్కి-రాజాలు పాడిన మొట్టమొదటి పాటల్లో ఒకటి కావడం, తెలుగులో వచ్చిన తొలి డబ్బింగ్‌సినిమాల్లో ఒకటి కావడం, …ఇలా.
చివరిగా “రాజా గొంతు హిందీపాటకి బహుశా మరింత బాగుండేది” అని వారనుకుంటున్నారు. అప్పట్లో జెమినీలో హిందీ విభాగానికి incharge గా వుండి, రాజా గొంతుని ఆడిషన్ చేసిన ఒక ప్రముఖ గాయని అభిప్రాయం వేరు. But, as I earlier said; de gustibus ……
నా వ్యాఖ్యలో స్పష్టంగా లేనిది -. ఒకరచనమీద ఆరచయితకి ప్రత్యేకంగా, ప్రైవేటుగా ఆ రచనని పరిపుష్టం చెయ్యడానికి సంపాదనలు ఇస్తున్న సూచనలు. వాటివల్లే కదా రచయితల అహంకారం ప్రసక్తి వచ్చింది.
ఈ వ్యాసాన్ని చదివి ఆనందించి, వ్యాసకర్త లాగానే నేను కూడా జనుల మూఢ నమ్మకాలపై ఎగతాళి చేసివుండే వాడిని, స్వయంగా నా చేతులతో నేను మా వూళ్ళో దేవాలయంలో వున్న నంది విగ్రహానికి పాలు త్రాగించివుండక పోతే. ఇది స్వయంగా చూస్తే తప్ప నిజం అని నమ్మలేని సత్యం. పాలు కిందకు వొలకలేదు. చెంచాతో మూతిదగ్గర 180 డిగ్రీల కోణంలో వుంచిన పాలు క్రమ క్రమంగా తరిగిపోయినాయి. ఒకటి, రెండు కాదు మా ఇంటి సభ్యులు, పొరుగు వారు పట్టించిన పాలు వొలకకుండా తగ్గిపోయినాయి. (మా ఇంట్లో వినాయక విగ్రహం మటుకు ఈ అద్భుతాన్ని ప్రదర్శించలేదు). ఆ మరునాడు ఈ విచిత్రాన్ని స్వయంగా చూసిన వైజ్ఞానికులు కొందరు ఈ సంఘటనకు శాస్త్ర దృష్ట్యా ఇచ్చిన వివరణలు నాకు సమంజసమనిపించలేదు. ఎందుకంటే ఇది ప్రకృతి సహజమైనదే ఐతే నిరంతరం అవిఛ్ఛిన్నంగా జరుగుతూ ఉండాలి. అసలు ఈ ఘటనయే దృగ్భ్రమ ఐతే వారా వివరణ ఇవ్వాల్సిన అవసరమే లేదు.
ఇటీవల కాలంలో బొంబాయి సముద్రతీరంలో ఒకే ఒక బీచి ప్రాంతంలో నీరు ఒకరోజంతా తీయగా వుంది. దీనికిచ్చిన వివరణలు కూడా సమంజసంగా లేవు. ఇటువంటి ఘటనలు ఇదివరకెన్నడైనా జరిగాయా, ఇకముందు కూడా జరగ గలవా, ఏ ఏ కారణాలవల్ల అలా జరగుతుంది.
మన ఈ మాటలో కూడా కొందరు విజ్ఞాన శాస్త్ర అభినివేశం కలిగిన వారున్నారు. వారీ విషయాలను అభూత కల్పనలని కొట్టి పారవేయకుండా, నిజంగా జరిగివుంటే , ఏ ప్రకృతి ధర్మాల ప్రకారం జరగడానికి అవకాశం వుందో సశాస్త్రీయంగా వివరించగలరని ప్రార్ధన.
ప్రత్యక్ష నిదర్శనం గాని ప్రతీ దాన్ని నమ్మడం అవివేకం. అలాగే వేలాది జనులు ప్రత్యక్షంగా దర్శించినదాన్ని, సత్య నిరూపణకై అణుమాత్రమూ యత్నించక, మూధ విశ్వాసమని అవహేళన చేయడం కూడా అవివేకమే.
గూగుల్ సెర్చ్ లో అప్పుడప్పుడూ రచ్చబండ, తెలుసా దారాలు తగులుతూంటాయి. వాటిని చదువుతూంటే ఆశ్చర్యంగా అనిపించేది. తొంభైలలో తెలుగులో ఇంటర్నెట్టులో ఇంతటి వ్యవహారాలు నడిచాయా అనిపించి, అబ్బురమనిపించేది.
అంతర్జాలంలో తెలుగు అంటే బ్లాగులనే అభిప్రాయమే. వాటికి ముందు మరెంత కృషి జరిగింది, ఎందరు శ్రమించారు వంటి విషయాల పట్ల ఏ మాత్రమూ అవగాహన లేని మాబోటి వారికి మంచి సమాచారం అందించారు.
నేను ఈ వ్యాసం చదివినంత సేపూ కడుపుబ్బేలా నవ్వుకున్నానే తప్ప పెత్తనపు వృశ్చికం నన్ను కుడుతోందని అనుకోలేదు. అలా అనుకున్నా కన్నంలో దొంగలాగా ఉండి పోయాను.
గిరిగారు ఎవరో తెలియదు గానీ మహాత్ముల్లా సెలవిచ్చారు. ఇది జోకు అని కనుక ప్రకటించకుండా ఛలోక్తులు విసిరితే నాలాంటి వారికి బోధపడదు సరికదా అనవసరంగా రక్తపోటుకు గురయ్యే ప్రమాదం ఉంది.
అసలు తెలుగు వారికి ఛలోక్తులెందుకు చెప్పండి? ఎవరైనా హాస్యాస్పదంగా ఎందుకు రాయాలి? ఇంకెప్పుడైనా రాస్తారా ఇలాంటి పొరబాటు ఉత్తరాన్ని?
మీ ఊళ్ళో వినాయకుడి గుడి ఉంటే కారు ఆపి దిగి, గుంజీళ్ళు తీసి, చెంపల మీద లెంపకాయలేసుకుని ఇంకెప్పుడూ ఇలా రాయనని నా లా ఒట్టుపెట్టుకోండి. ఆ తర్వాత మీ కర్తరీ ప్రయోగాన్ని మాని వచ్చింది వచ్చినట్లు అందరు సంపాదకుల్లాగా సర్వం జగన్నాథం అని చేతులెత్తి దణ్ణం పెట్టుకుని అచ్చెయ్యండి.
రచయితల సంగతి నా లాంటి నోటిదురుసు వెధవలకి అభిప్రాయ వేదిక పై అప్పగించి మీరు తప్పుకోండి. అప్పుడు చూడండి ఊచ కోత, కాదు దవ్వకోత, కాదు దూట కోత. ఏదో ఒక కోత లేండి.
మీరేదో మంచి చేద్దామని చర్చావేదికలూ గట్రా ప్రారంభించినట్లున్నారు. ఆ పప్పులేం ఇక్కడ ఉడకవు. కత్తులు దుయ్యాలి, పదిమందిని (ముఖ్యంగా మిమ్మల్నీ, మీ ఉప సంపాదకుల్నీ, మీ పత్రికనూ) దుయ్యబట్టాలి. ఖబడ్దార్!
ఇకపోతే మీరిచ్చిన సలహాలను మీరే పాటించి రచయితల్ని మాత్రమే కాక ఉచితమైన అభిప్రాయాలను తెలియజేసే నాలాంటి అభిప్రాయోత్తములను కూడా దువ్వితే మేము విజృంభించమని,మీపై ధ్వజమెత్తమని హామీ ఇస్తున్నాను.
నేను మీరిచ్చిన “పాఠకులకు సూచనలు” చదువలేదు. నామమాత్రంగా దాని పక్కన గల పెట్టెలో ప్రమాదవశాత్తు ముద్రవేయుట జరిగిందని సవినయంగా తెలియజేసుకుంటున్నాను.
ఈ ఒక్కసారి మాత్రము మీ విశాల హృదయమతో ఈ సందేశాన్ని అనుమతిస్తారని భావిస్తూ
“స్వర్గద్వారం తెరిచారు” సాహిత్యం , tune , రెండూ నీరసంగానే ఉన్నాయి. పాట లక్షణాలు అందులో ఏకోశానా లేవు. ఎవరు రాసారో దాన్ని??
“ఆకాశగంగయుడె”..బాగుంది. “పులకించని మది పులకించు” అన్నిటా హాయిగా ఉండే మంచి పాట…melody అంటే అదీ!!.”సదసత్కళా”..లోని “సరిగమలు” కాక ఆ పద్యంలో ఇంకేమైనా రచనాపరమైన విశిష్టతలున్నాయా? తెలిసిన వారు చెప్పండి. శ్రీశ్రీ..ఆరుద్రలు ఆ పద్యంకోసం అంతగా పోటీపడింది దేనికో తెలుసుకుందామని….
నాకుమాత్రం..”విప్రనారాయణ” లోని రాజా గొంతు మనసుకి సుఖంగా అన్పిస్తుంది. ..ఆయన’50లలో పాడినవాటితో పోలిస్తే తర్వాతివే ఎక్కువ బాగున్నాయి వింటానికి!! వాటిల్లోని ఆయన స్వర మాధుర్యం ఇచ్చే అనుభవం పరమానందమైంది. అలాగే.. రాజా గొంతు హిందీపాటకి బ హుశా మరింత బాగుండేది. ఆయన హిందీలో ఎక్కువ పాడక పోవటం..హిందీ సిన్మాకి ఒక లోటే!!
మాధుర్యానికి మరో పేరు: ఏ. ఎం. రాజా గురించి rama bharadwaj అభిప్రాయం:
05/12/2009 10:28 am

రమ.
మాధుర్యానికి మరో పేరు: ఏ. ఎం. రాజా గురించి Sreenivas Paruchuri అభిప్రాయం:
05/12/2009 9:12 am
ఇప్పటివరకు వచ్చిన కామెంట్లకు కొంత వివరణ.
రోహిణీప్రసాద్ గారన్నట్లు:

— శ్రీనివాస్
ప్రచురణకి వచ్చే రచనల గురించి గురించి Srinivas Nagulapalli అభిప్రాయం:
05/12/2009 6:13 am
“సంపాదనలు” ఇవ్వడం లేదు, శ్రమించే సంపాదకులకు, రచయితలకు:-)
అచ్చు తప్పని తెలిసినా చెప్పడం మన్నించాలి. రచనలగురించి ప్రసక్తి కదా. తీసుకొస్తేనే ప్రసక్తి, తీసుకురాకపోతే విరక్తి. ఏమో!.
____
విధేయుడు
_Srinivas
ప్రచురణకి వచ్చే రచనల గురించి గురించి malathi nidadavolu అభిప్రాయం:
05/12/2009 2:30 am
నా వ్యాఖ్యలో స్పష్టంగా లేనిది -. ఒకరచనమీద ఆరచయితకి ప్రత్యేకంగా, ప్రైవేటుగా ఆ రచనని పరిపుష్టం చెయ్యడానికి సంపాదనలు ఇస్తున్న సూచనలు. వాటివల్లే కదా రచయితల అహంకారం ప్రసక్తి వచ్చింది.
పాలు తాగిన వినాయకుడు గురించి M.S.Prasad అభిప్రాయం:
05/12/2009 2:19 am
ఈ వ్యాసాన్ని చదివి ఆనందించి, వ్యాసకర్త లాగానే నేను కూడా జనుల మూఢ నమ్మకాలపై ఎగతాళి చేసివుండే వాడిని, స్వయంగా నా చేతులతో నేను మా వూళ్ళో దేవాలయంలో వున్న నంది విగ్రహానికి పాలు త్రాగించివుండక పోతే. ఇది స్వయంగా చూస్తే తప్ప నిజం అని నమ్మలేని సత్యం. పాలు కిందకు వొలకలేదు. చెంచాతో మూతిదగ్గర 180 డిగ్రీల కోణంలో వుంచిన పాలు క్రమ క్రమంగా తరిగిపోయినాయి. ఒకటి, రెండు కాదు మా ఇంటి సభ్యులు, పొరుగు వారు పట్టించిన పాలు వొలకకుండా తగ్గిపోయినాయి. (మా ఇంట్లో వినాయక విగ్రహం మటుకు ఈ అద్భుతాన్ని ప్రదర్శించలేదు). ఆ మరునాడు ఈ విచిత్రాన్ని స్వయంగా చూసిన వైజ్ఞానికులు కొందరు ఈ సంఘటనకు శాస్త్ర దృష్ట్యా ఇచ్చిన వివరణలు నాకు సమంజసమనిపించలేదు. ఎందుకంటే ఇది ప్రకృతి సహజమైనదే ఐతే నిరంతరం అవిఛ్ఛిన్నంగా జరుగుతూ ఉండాలి. అసలు ఈ ఘటనయే దృగ్భ్రమ ఐతే వారా వివరణ ఇవ్వాల్సిన అవసరమే లేదు.
ఇటీవల కాలంలో బొంబాయి సముద్రతీరంలో ఒకే ఒక బీచి ప్రాంతంలో నీరు ఒకరోజంతా తీయగా వుంది. దీనికిచ్చిన వివరణలు కూడా సమంజసంగా లేవు. ఇటువంటి ఘటనలు ఇదివరకెన్నడైనా జరిగాయా, ఇకముందు కూడా జరగ గలవా, ఏ ఏ కారణాలవల్ల అలా జరగుతుంది.
మన ఈ మాటలో కూడా కొందరు విజ్ఞాన శాస్త్ర అభినివేశం కలిగిన వారున్నారు. వారీ విషయాలను అభూత కల్పనలని కొట్టి పారవేయకుండా, నిజంగా జరిగివుంటే , ఏ ప్రకృతి ధర్మాల ప్రకారం జరగడానికి అవకాశం వుందో సశాస్త్రీయంగా వివరించగలరని ప్రార్ధన.
ప్రత్యక్ష నిదర్శనం గాని ప్రతీ దాన్ని నమ్మడం అవివేకం. అలాగే వేలాది జనులు ప్రత్యక్షంగా దర్శించినదాన్ని, సత్య నిరూపణకై అణుమాత్రమూ యత్నించక, మూధ విశ్వాసమని అవహేళన చేయడం కూడా అవివేకమే.
ఈమాట పూర్వాపరాలు – నా జ్ఞాపకాలు II గురించి bollojubaba అభిప్రాయం:
05/11/2009 10:48 pm
గూగుల్ సెర్చ్ లో అప్పుడప్పుడూ రచ్చబండ, తెలుసా దారాలు తగులుతూంటాయి. వాటిని చదువుతూంటే ఆశ్చర్యంగా అనిపించేది. తొంభైలలో తెలుగులో ఇంటర్నెట్టులో ఇంతటి వ్యవహారాలు నడిచాయా అనిపించి, అబ్బురమనిపించేది.
అంతర్జాలంలో తెలుగు అంటే బ్లాగులనే అభిప్రాయమే. వాటికి ముందు మరెంత కృషి జరిగింది, ఎందరు శ్రమించారు వంటి విషయాల పట్ల ఏ మాత్రమూ అవగాహన లేని మాబోటి వారికి మంచి సమాచారం అందించారు.
శ్రీనివాస్ గారన్నట్లు శిఖర శిలలు కనిపించినంతగా పునాది రాళ్ళు కనపడవు కదా!
ధన్యవాదములు
బొల్లోజు బాబా
ప్రచురణకి వచ్చే రచనల గురించి గురించి పామర్తి సత్యనారాయణ అభిప్రాయం:
05/11/2009 1:33 pm
వేలూరి గారికీ పాఠకోత్తములకీ నమస్కారములు.
నేను ఈ వ్యాసం చదివినంత సేపూ కడుపుబ్బేలా నవ్వుకున్నానే తప్ప పెత్తనపు వృశ్చికం నన్ను కుడుతోందని అనుకోలేదు. అలా అనుకున్నా కన్నంలో దొంగలాగా ఉండి పోయాను.
గిరిగారు ఎవరో తెలియదు గానీ మహాత్ముల్లా సెలవిచ్చారు. ఇది జోకు అని కనుక ప్రకటించకుండా ఛలోక్తులు విసిరితే నాలాంటి వారికి బోధపడదు సరికదా అనవసరంగా రక్తపోటుకు గురయ్యే ప్రమాదం ఉంది.
అసలు తెలుగు వారికి ఛలోక్తులెందుకు చెప్పండి? ఎవరైనా హాస్యాస్పదంగా ఎందుకు రాయాలి? ఇంకెప్పుడైనా రాస్తారా ఇలాంటి పొరబాటు ఉత్తరాన్ని?
మీ ఊళ్ళో వినాయకుడి గుడి ఉంటే కారు ఆపి దిగి, గుంజీళ్ళు తీసి, చెంపల మీద లెంపకాయలేసుకుని ఇంకెప్పుడూ ఇలా రాయనని నా లా ఒట్టుపెట్టుకోండి. ఆ తర్వాత మీ కర్తరీ ప్రయోగాన్ని మాని వచ్చింది వచ్చినట్లు అందరు సంపాదకుల్లాగా సర్వం జగన్నాథం అని చేతులెత్తి దణ్ణం పెట్టుకుని అచ్చెయ్యండి.
రచయితల సంగతి నా లాంటి నోటిదురుసు వెధవలకి అభిప్రాయ వేదిక పై అప్పగించి మీరు తప్పుకోండి. అప్పుడు చూడండి ఊచ కోత, కాదు దవ్వకోత, కాదు దూట కోత. ఏదో ఒక కోత లేండి.
మీరేదో మంచి చేద్దామని చర్చావేదికలూ గట్రా ప్రారంభించినట్లున్నారు. ఆ పప్పులేం ఇక్కడ ఉడకవు. కత్తులు దుయ్యాలి, పదిమందిని (ముఖ్యంగా మిమ్మల్నీ, మీ ఉప సంపాదకుల్నీ, మీ పత్రికనూ) దుయ్యబట్టాలి. ఖబడ్దార్!
ఇకపోతే మీరిచ్చిన సలహాలను మీరే పాటించి రచయితల్ని మాత్రమే కాక ఉచితమైన అభిప్రాయాలను తెలియజేసే నాలాంటి అభిప్రాయోత్తములను కూడా దువ్వితే మేము విజృంభించమని,మీపై ధ్వజమెత్తమని హామీ ఇస్తున్నాను.
నేను మీరిచ్చిన “పాఠకులకు సూచనలు” చదువలేదు. నామమాత్రంగా దాని పక్కన గల పెట్టెలో ప్రమాదవశాత్తు ముద్రవేయుట జరిగిందని సవినయంగా తెలియజేసుకుంటున్నాను.
ఈ ఒక్కసారి మాత్రము మీ విశాల హృదయమతో ఈ సందేశాన్ని అనుమతిస్తారని భావిస్తూ
పామర్తి సత్యనారాయణ
మాధుర్యానికి మరో పేరు: ఏ. ఎం. రాజా గురించి rama bharadwaj అభిప్రాయం:
05/11/2009 10:44 am
“స్వర్గద్వారం తెరిచారు” సాహిత్యం , tune , రెండూ నీరసంగానే ఉన్నాయి. పాట లక్షణాలు అందులో ఏకోశానా లేవు. ఎవరు రాసారో దాన్ని??
“ఆకాశగంగయుడె”..బాగుంది. “పులకించని మది పులకించు” అన్నిటా హాయిగా ఉండే మంచి పాట…melody అంటే అదీ!!.”సదసత్కళా”..లోని “సరిగమలు” కాక ఆ పద్యంలో ఇంకేమైనా రచనాపరమైన విశిష్టతలున్నాయా? తెలిసిన వారు చెప్పండి. శ్రీశ్రీ..ఆరుద్రలు ఆ పద్యంకోసం అంతగా పోటీపడింది దేనికో తెలుసుకుందామని….
నాకుమాత్రం..”విప్రనారాయణ” లోని రాజా గొంతు మనసుకి సుఖంగా అన్పిస్తుంది. ..ఆయన’50లలో పాడినవాటితో పోలిస్తే తర్వాతివే ఎక్కువ బాగున్నాయి వింటానికి!! వాటిల్లోని ఆయన స్వర మాధుర్యం ఇచ్చే అనుభవం పరమానందమైంది. అలాగే.. రాజా గొంతు హిందీపాటకి బ హుశా మరింత బాగుండేది. ఆయన హిందీలో ఎక్కువ పాడక పోవటం..హిందీ సిన్మాకి ఒక లోటే!!
రమ.
ప్రచురణకి వచ్చే రచనల గురించి గురించి Veluri Venkateswara Rao అభిప్రాయం:
05/11/2009 10:06 am
పొగిడిన వారికి ఒక నమస్కారం. తెగిడిన వారికి అనేక నమస్కారాలు. ఈ వాద ప్రతివాదాలు చదువుతుంటే, విశ్వనాథ సత్యనారాయణగారు చెప్పిన చాటుపద్యం గుర్తుకొచ్చింది.
తొలినాళుల పద్యార్థము
తెలియనిచో పాఠకునిది తెలియమి. ఈ నా –
ళుల వ్రాసిన కవి దోషము.
కలి గడచినకొలది చిత్రగతులన్ చెలగున్
విధేయుడు, — వేవేరా
ప్రచురణకి వచ్చే రచనల గురించి గురించి Srinivas Nagulapalli అభిప్రాయం:
05/11/2009 6:47 am
రచయితలకు, పాఠకులకు సూచనలు already ఇచ్చారు కదా!
నచ్చనివి, నచ్చినవి ఎన్నైనా ఉండొచ్చు. అసలు అనవసరంగా రచయితల ఇష్టాలు, అహాల ప్రస్తావనతో దారితప్పిన రచనలాగే, దమ్మిడీ ఆదాయం లేకుండా ఎంతో శ్రమ, పరిశ్రమ, సమయంతోనే సాధ్యమయ్యే పత్రికా నిర్వహణను కాదని దుమెత్తిపోయడం కూడా ఎందుకో మనసొప్పడం లేదు.
రాజుగారి క్షీరాభిషేకానికి నావంతు నీరిస్తే లోటేముందంటే నీరే మిగిలినట్లు, సంపాదకులు, పాఠకులు, రచయితలందరూ తలుస్తే, చేయేస్తేనే పత్రికకు
వైవిధ్యం, వైభవం అనిపిస్తుంది.
____________
విధేయుడు
-Srinivas