లక్ష్మన్న గారూ,
హాయిగా పాడుకునే సినిమా పాటని హాయి హాయిగా పాడుకోనీకుండా చేసీసేరండీ. స్నానిస్తూ, మనసు హాయిగా వున్నప్పుడూ, హాయిగా పాడుకునే వాడిని ఈ పాటని. ఇప్పుడు మీరు “నోట్సు” రాసి ప్రాణం మీదకి తెచ్చేరు.
అందుకే వ్యాకరణం అంటే మాలాటివాళ్ళకి చాలామందికి భయం. అందులోనూ మాతృభాషావ్యాకరణం అంటే మరీనూ. ఎందుకంటే “ఇంగ్లీషు” అయితే వ్యాకరణం రాకపోతే ఆ భాష రాదని “పెద్దలు” తిడితే వ్యాకరణం నేర్చుకుని ఆ యొక్క భాష నేర్చుకుంటాం. మరి తెనుగో??? అలాగే సినిమా పాట కదా?
“హాయి హాయిగా ఆమని సాగె” అని పాడ్డంలో వున్న హాయి “సాస సమగమా ధానిధ సాస” అని పాడ్డంలో ఇబ్బందిగా వుంటోంది. శిక్షణ, సాధన లేని మా(రోయల్ వి)లాటి వాళ్ళం దూరంగా పారిపోవాఁ? ఆ యొక్క “శిక్ష” మరియూ “సాధింపులూ” పడకపోవడం మా తప్పే.
సావిత్రీ ఘంటసాల గారు రాసిన “మా మామయ్య ఘంటసాల” అనే పుస్తకంలో ఈ పాట గురించి:”……. ఈ పాట వరస కుదరక రఫీ గారు మొదట కొంచెం ఇబ్బంది పడ్డారు. తెలుగులో మావయ్య పాడిన పాటవిని లతా గారు ఎంతో మెచ్చుకున్నారు. హిందీ రిహార్సల్స్ జరుగుతున్నపుడు మావయ్య వేరే రికార్డింగ్ కోసం అక్కడికి వెళ్ళేరు. ఈయనని లతాగారు చూసి “”ఒక్కసారి ఈ పాటని నాతో పాడండి” అన్నారు. ఆయన పాడనన్నారు….”” ఏవో కుంటి సాకులు చెప్పి ఘంటసాల తప్పించుకున్నారు.””రఫీ గారు పాడటానికి వచ్చినపుడు నేను పాడకూడదు. అది సభ్యత కాదు. అలా పాడి ఆయనని కించపరచలేను. నేను వెళ్ళను.”” అలాగే వెళ్ళలేదు.”
హిందీ పాటే ఎందుకో హాయిగా వుంటుంది. ఎందుకో తెలీదు. తెలుగు వాళ్ళకున్న తెగులు వల్లనేమో? తెలుగు కన్నా ఇంగ్లీషు, హిందీ మరియూ సంస్కృతం చాలా బావుంటాయి. తెలుగు “తల్లి” కాబట్టి బావుంటుంది. కానీ, ఇంగ్లీషూ, హిందీ “గుడ్”, “బెటర్” లు పంచుకుంటే “సంస్కృతం” మాత్రం “బెష్టు”. ఇది మా(మళ్ళీ రోయల్ వి) లాటి వాళ్ళ తెలుగా. క్షమించాలి తెగులా???
విధేయుడు
రాబడి రాపిడి బడి తీరుబడి లేని పాఠకుడు.
సోహినీ రాగంలో వున్న సాగర సంగమం పాట “వేదం – అణువణువున నాదం”. ఐతే ఈ పాట నాకు పాడడం ద్వారానో, వినడం ద్వారానొ తెలియలేదు. కీ బోర్డ్ మీద పలికిన స్వరాలను గమనించి తెలుసుకున్నాను. రెండు పాటలు ఒకే రాగంలో వున్నాయన్న విషయం వాటిని కీ బోర్డ్ మీద గమనిస్తే తప్ప తెలుసుకోలేని స్థితి. కాబట్టి మాలాంటి ప్రారంభకులకు నేనడిగిన సహకారం అవసరం. ఆపైన మీ దయ మా ప్రాప్తం.
నమస్కారం లక్ష్మన్న గారూ!
హాయి హాయిగా పాటలు విని ఆనందిచడమే గాని, రాగాల గురించి ఏమీ తెలీదు.
తెలిసిన వాళ్ళ నోటివెంట ఏమైనా వినాలనే ఆశ ఉంది.
మీ వ్యాసము చదివి ఎంతో ఆనందము కలిగింది. ధన్యవాదములు.
ఇక మీరు సంధించిన ప్రశ్న- సాగర సంగమము లో వేదం అణువణువన నాదం అనే పాటలో చరణం చివర హంసానందీ రాగాలే అని వస్తుంది.
ఆ పాట హంసానంది రాగమేనా?
విజ్ఞుల మధ్య చొరవ చేసి వచ్చినందుకు మన్నించాలి.
ఒక్క మాట, వ్యాసం ఉద్దేశానికి సంబంధించింది కాబట్టి ప్రస్తావించడం.
“ఒక కవి పెద్ద కవో, చిన్న కవో నిర్ణయించడానికి సాహిత్య విమర్శ పరిభాషలో ఏర్పడిన లాంఛనాల కోవలోకే వస్తాయి- స్వతంత్ర రచన, ప్రభావం, అనుకరణ, అనువాదం, కాపీ, ఫోర్జరీ- ఇలాంటి మాటలన్నీ” అని అన్నారు. విమర్శలు కవిత గొప్పదో చిన్నదో అనే కాని, రాసింది పెద్ద కవో, చిన్న కవో అని కాదనుకుంటాను. అవార్డులు, పురస్కారాలు ఫలానా కవితకు, కథకు, నవలకు ఇస్తున్నామనే చెప్పుకుంటాం, ప్రకటించుకుంటాం కదా, వ్యక్తికి ఇచ్చినప్పటికినీ.
“‘ప్రభావం’ అంటే కవిత్వానికి సంబంధించినంత వరకూ ఉపయోగపడే అర్థం” అన్నది కవిత్వానికే కాక జీవితానికి కూడా వర్తించే మంచి మాట.
===========
విధేయుడు
-Srinivas
కధ అని అన దగ్గ ఒక్క లక్షణమూ లేని దీన్నీ “కధ” పేరుతో అచ్చు వేయటం చూస్తే ముఖ్య సంపాదకుల రచన అయినందువల్లనేమో అన్నింటినీ పక్కకు పెట్టి ప్రచురించిన ట్టు గా తెలిసిపోతోంది. ఈమాట వాళ్ళు చెబుతున్న స్థాయి ..ప్రమాణం లాంటివి ముఖ్య సంపాదకుల్కి మాత్రం వర్తించదా? సొంత పత్రిక అన్న ధైర్యమా? పాఠకులు వెర్రివాళ్ళన్న ఎగతాళా?? ఆశ్చర్యం!! మేం ఇద్దరు ముగ్గురు అభిప్రాయాల్ని తీసుకున్నాకానే..రివ్యూ చేయించాకానే ఒక రచనని అచ్చు వేస్తాం అని ఈమాట “స్థాయి”ని గురించి చెప్పిన వారికి మరి..ఈ రచనని కధ గా ఒప్పుకున్న ఆ రివ్యూ చేసిన వారు అయినా చెప్పాలి.. ఇందులో ఏముందో?!ఎలా దీన్ని ప్రచురించారో? ఎదరివాళ్ళ రచనలకి ఒక విధానమూ..వారి రచనలకి మరో విధానమూ పాటిస్తారని తెలిపేలా ఉందిది.
I am truly impressed with your talent. You did your research in Solid State Electronics and doing a job in the USA which is connected to your research field. But, how come you have gathered enormous information regarding music? May be this what you were talking about “interest”.
I know nothing about music. I am only an appreciator when people like you play flute and sing nice songs.
Nice write up about the immortal song. Keep up the good work. We look forward to reading many more essays on other songs and the related stories.
This is a rerun I believe, but it is a new one for me. This essay stole my heart .
Narayana Rao takes couple of well liked Telugu poems as examples and explains the phenomenon of ‘ intertextuality ‘ in Poetry/Literature in a calm, composed, unhurried prose. This Telugu essay teaches. It clarifies. There is control, and coherence. The essayist really explains, what he sets out to explain. And in that fulfilment of his promise – the evenness of his tone, the lack of anxiety to dominate or be dominated, this essayist becomes very attractive and exciting.
ఈ వ్యాసం నేను చాలా సార్లు చదవాలి. ఇంగ్లీషులో నా దగ్గరున్న లిటెరరీ థియరీ పుస్తకాలు మళ్ళీ చదివి, ఈ విషయమ్మీద ప్రశ్నలుంటే అప్పుడు అడుగుతాను.
ఇలాంటి కథల కన్నా పొడుపు కథలు బెటరు. వచన కవిత్వం పేరుతో, కథల పేరుతో గాలి రాయడం పెద్ద ఫేషనైపోయింది, “హింట్లు చూసి కథ రాయుము”, “బొమ్మ చూసి కథ రాయుము” టైపులో సగం కక్కిన భోజనం లాంటి కవితలూ, కథలూ పత్రికల్లో చెలామణీ చెయ్యడం చూస్తే పాఠకుల్ని ఎంత వెర్రోళ్ళనుకుంటారో కదా ఈ రచైతలు అనిపిస్తుంది.
సాఫ్ట్ వేర్లు డెవలప్ చేసేటప్పుడు User Friendly Interfaces కోసం చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఉపయోగించేవాడికి అర్థం కాకపోతే ఎంత గొప్ప సాఫ్ట్ వేర్ అయినా చెత్తకిందే లెక్క. ఒక్క ఈ అతితెలివి రచయితలే End Users ని లోకువ సరుకుగా లెక్కగడతారు. అందుకే సాహిత్యం అంతరించిపోయే రోజు ఎంతో దూరంలో లేదు. అతి తెలివిగా రాసే కథలూ, కవితలూ రాసినవాళ్ళే చదూకుని మిగతా జనాభా అంతా వెర్రోళ్లనుకుని తృప్తి పడుతూ బతుకుతారు.
హాయిహాయిగా ఆమని సాగే గురించి baabjeelu అభిప్రాయం:
07/12/2009 12:22 am

హాయిహాయిగా ఆమని సాగే గురించి M.S.Prasad అభిప్రాయం:
07/11/2009 10:25 am
సోహినీ రాగంలో వున్న సాగర సంగమం పాట “వేదం – అణువణువున నాదం”. ఐతే ఈ పాట నాకు పాడడం ద్వారానో, వినడం ద్వారానొ తెలియలేదు. కీ బోర్డ్ మీద పలికిన స్వరాలను గమనించి తెలుసుకున్నాను. రెండు పాటలు ఒకే రాగంలో వున్నాయన్న విషయం వాటిని కీ బోర్డ్ మీద గమనిస్తే తప్ప తెలుసుకోలేని స్థితి. కాబట్టి మాలాంటి ప్రారంభకులకు నేనడిగిన సహకారం అవసరం. ఆపైన మీ దయ మా ప్రాప్తం.
భవదీయుడు
హాయిహాయిగా ఆమని సాగే గురించి మందాకిని అభిప్రాయం:
07/11/2009 1:11 am
నమస్కారం లక్ష్మన్న గారూ!
హాయి హాయిగా పాటలు విని ఆనందిచడమే గాని, రాగాల గురించి ఏమీ తెలీదు.
తెలిసిన వాళ్ళ నోటివెంట ఏమైనా వినాలనే ఆశ ఉంది.
మీ వ్యాసము చదివి ఎంతో ఆనందము కలిగింది. ధన్యవాదములు.
ఇక మీరు సంధించిన ప్రశ్న- సాగర సంగమము లో వేదం అణువణువన నాదం అనే పాటలో చరణం చివర హంసానందీ రాగాలే అని వస్తుంది.
ఆ పాట హంసానంది రాగమేనా?
విజ్ఞుల మధ్య చొరవ చేసి వచ్చినందుకు మన్నించాలి.
కవిత్వంలో ‘ప్రభావం’ అంటే ఏమిటి? గురించి Srinivas Nagulapalli అభిప్రాయం:
07/09/2009 12:24 pm
మంచి వ్యాసం, ఏన్నో విషయాలను తెలియజేసారు.
ఒక్క మాట, వ్యాసం ఉద్దేశానికి సంబంధించింది కాబట్టి ప్రస్తావించడం.
“ఒక కవి పెద్ద కవో, చిన్న కవో నిర్ణయించడానికి సాహిత్య విమర్శ పరిభాషలో ఏర్పడిన లాంఛనాల కోవలోకే వస్తాయి- స్వతంత్ర రచన, ప్రభావం, అనుకరణ, అనువాదం, కాపీ, ఫోర్జరీ- ఇలాంటి మాటలన్నీ” అని అన్నారు. విమర్శలు కవిత గొప్పదో చిన్నదో అనే కాని, రాసింది పెద్ద కవో, చిన్న కవో అని కాదనుకుంటాను. అవార్డులు, పురస్కారాలు ఫలానా కవితకు, కథకు, నవలకు ఇస్తున్నామనే చెప్పుకుంటాం, ప్రకటించుకుంటాం కదా, వ్యక్తికి ఇచ్చినప్పటికినీ.
“‘ప్రభావం’ అంటే కవిత్వానికి సంబంధించినంత వరకూ ఉపయోగపడే అర్థం” అన్నది కవిత్వానికే కాక జీవితానికి కూడా వర్తించే మంచి మాట.
===========
విధేయుడు
-Srinivas
పడమట సంధ్యారాగం గురించి yasasvi అభిప్రాయం:
07/09/2009 10:41 am
కధ అని అన దగ్గ ఒక్క లక్షణమూ లేని దీన్నీ “కధ” పేరుతో అచ్చు వేయటం చూస్తే ముఖ్య సంపాదకుల రచన అయినందువల్లనేమో అన్నింటినీ పక్కకు పెట్టి ప్రచురించిన ట్టు గా తెలిసిపోతోంది. ఈమాట వాళ్ళు చెబుతున్న స్థాయి ..ప్రమాణం లాంటివి ముఖ్య సంపాదకుల్కి మాత్రం వర్తించదా? సొంత పత్రిక అన్న ధైర్యమా? పాఠకులు వెర్రివాళ్ళన్న ఎగతాళా?? ఆశ్చర్యం!! మేం ఇద్దరు ముగ్గురు అభిప్రాయాల్ని తీసుకున్నాకానే..రివ్యూ చేయించాకానే ఒక రచనని అచ్చు వేస్తాం అని ఈమాట “స్థాయి”ని గురించి చెప్పిన వారికి మరి..ఈ రచనని కధ గా ఒప్పుకున్న ఆ రివ్యూ చేసిన వారు అయినా చెప్పాలి.. ఇందులో ఏముందో?!ఎలా దీన్ని ప్రచురించారో? ఎదరివాళ్ళ రచనలకి ఒక విధానమూ..వారి రచనలకి మరో విధానమూ పాటిస్తారని తెలిపేలా ఉందిది.
యశస్వి.
పెట్టె బయట గురించి Koti Bonthu అభిప్రాయం:
07/09/2009 6:59 am
Beautiful story, narration, good ending. Great job. Keep it up.
హాయిహాయిగా ఆమని సాగే గురించి Kuruganti S. Ram అభిప్రాయం:
07/09/2009 1:39 am
Sri. Lakshmanna garu,
I am truly impressed with your talent. You did your research in Solid State Electronics and doing a job in the USA which is connected to your research field. But, how come you have gathered enormous information regarding music? May be this what you were talking about “interest”.
I know nothing about music. I am only an appreciator when people like you play flute and sing nice songs.
Nice write up about the immortal song. Keep up the good work. We look forward to reading many more essays on other songs and the related stories.
కవిత్వంలో ‘ప్రభావం’ అంటే ఏమిటి? గురించి lyla yerneni అభిప్రాయం:
07/08/2009 9:46 pm
ముఖ్య సంపాదకులకు:
ఈ వ్యాసము సంజీవిని. ప్రచురించిన మీకు నమస్సులు.
This is a rerun I believe, but it is a new one for me. This essay stole my heart .
Narayana Rao takes couple of well liked Telugu poems as examples and explains the phenomenon of ‘ intertextuality ‘ in Poetry/Literature in a calm, composed, unhurried prose. This Telugu essay teaches. It clarifies. There is control, and coherence. The essayist really explains, what he sets out to explain. And in that fulfilment of his promise – the evenness of his tone, the lack of anxiety to dominate or be dominated, this essayist becomes very attractive and exciting.
ఈ వ్యాసం నేను చాలా సార్లు చదవాలి. ఇంగ్లీషులో నా దగ్గరున్న లిటెరరీ థియరీ పుస్తకాలు మళ్ళీ చదివి, ఈ విషయమ్మీద ప్రశ్నలుంటే అప్పుడు అడుగుతాను.
లైలా
పడమట సంధ్యారాగం గురించి Kiran అభిప్రాయం:
07/08/2009 8:55 am
ఇలాంటి కథల కన్నా పొడుపు కథలు బెటరు. వచన కవిత్వం పేరుతో, కథల పేరుతో గాలి రాయడం పెద్ద ఫేషనైపోయింది, “హింట్లు చూసి కథ రాయుము”, “బొమ్మ చూసి కథ రాయుము” టైపులో సగం కక్కిన భోజనం లాంటి కవితలూ, కథలూ పత్రికల్లో చెలామణీ చెయ్యడం చూస్తే పాఠకుల్ని ఎంత వెర్రోళ్ళనుకుంటారో కదా ఈ రచైతలు అనిపిస్తుంది.
సాఫ్ట్ వేర్లు డెవలప్ చేసేటప్పుడు User Friendly Interfaces కోసం చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఉపయోగించేవాడికి అర్థం కాకపోతే ఎంత గొప్ప సాఫ్ట్ వేర్ అయినా చెత్తకిందే లెక్క. ఒక్క ఈ అతితెలివి రచయితలే End Users ని లోకువ సరుకుగా లెక్కగడతారు. అందుకే సాహిత్యం అంతరించిపోయే రోజు ఎంతో దూరంలో లేదు. అతి తెలివిగా రాసే కథలూ, కవితలూ రాసినవాళ్ళే చదూకుని మిగతా జనాభా అంతా వెర్రోళ్లనుకుని తృప్తి పడుతూ బతుకుతారు.
ఫాదర్స్ డే గురించి thanumantababu అభిప్రాయం:
07/08/2009 7:57 am
చాలా బాగుంది క్రిష్ణ మోహన్ గారు. మీరు పాఠ కు లను ఆలోచి0పచేసే విధంగా వ్రాసారు.