పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16485

  1. మూడు లాంతర్లు – 6 గురించి Subrahmanyam Mula అభిప్రాయం:

    07/06/2011 7:04 am

    కనకప్రసాద్ గారు,

    వ్యాసం ఎప్పటిలాగే బావుంది. వారం క్రితమే నేను త్రిపుర గారిని మొదటి సారి కలవడం వల్ల మీరు చెప్తున్న విషయాలు ఇంకా బాగా అనుభూతి చెందగలిగాను. ఐతే నాదో సందేహం..

    “ఇప్పుడు నేను కధలూ కవిత్వాలూ గట్టా రాస్తే గనక అవి ‘జూటా’ కాకుండా ఉండాలంటే కొంతమటుక్కైనా ఇంగ్లీషులో నడవాలి, అందులోకి అమెరికన్లు, యూరోపియన్లు, ఇంకా ఈ అందరు జాతులవాళ్ళూ, బీదవాళ్ళూ గొప్పవాళ్ళూ, గొప్ప పండితులు, వెర్రోళ్ళు, లేబరు వీళ్ళందరూ దిగాలి”

    దీన్నిబట్టి చూస్తే కాల్పనిక సాహిత్యం, చారిత్రాత్మక నవలలు ఇవన్నీ మొత్తం “జూటా” లేనా? మన ఆత్మకథ ఒక్కటే మనం రాయగలిగిన సత్యమా? వివరించగలరు.

    – సుబ్రహ్మణ్యం.

  2. ఏదైనా ఒక వేడి వస్తువు గురించి kanakaprasAdu అభిప్రాయం:

    07/06/2011 3:20 am

    ఈ కధతో గుద్దుకున్నట్టు అనిపించింది. కాని మీరన్న కారణాల వల్ల కాదు. వేరే అనుకున్నాను. దానిగురించే మూడు లాంతర్లు – ఆరో భాగం అని రాసింది ఉంది. అది ప్రచురణకు పరిశీలిస్తున్నారు. దాన్లో ఈ గొంతు సంగతే చాల చెప్పుకున్నాను. సుధాకర్ అని ఒకాయనున్నారు. మా ఫ్రెండు. నాలుగేళ్ళుగా ఈ కధలో సంగతుల్తో ఒక వేదనలాగ కొట్టుకుంటున్నాను. దీన్లో మనుషులందరితో, వాళ్ళ జీవితాలకి నా బతుక్కి రాజీ చేసుకోలేక చాల యాతనగా ఉండి, ఈ కష్టం ఎవరికీ చెప్పుకోలేకుండా. అందుకే గిరిగారు ఏదైనా రాయమన్నప్పుడు గొప్ప అవకాశంలాగ వచ్చింది ఇది రాసేస్తే చాల తెరిపిగా అయ్యింది, ఓదార్పులా ఉంటుంది. రాసింది ఇంక దాన్ని మళ్ళీ చదవటం, చర్చించటం ఎంతమాత్రం సాయించదు. ‘అదంతా ఒక పీడకలలా మర్చిపో బాబూ!’ అని గుమ్మడి గారంటారు కదా?! టిబెటన్ మంక్స్ ముగ్గులు వేసి చెరిపెస్తారు. అలాగే ఇది చెరిగిపోవాలి, దీనికి గౌరవం, సంరక్షణ ఒద్దు. ఈ కధకి ఉంటే గనక సుధాకర్ – ఆయనొక్కరే చదువరి అనుకున్నాను. బైటికి పంపించే ముందు ఆయన్నడిగేను. ఎందుకంటే – సుధాకర్ ఒక్కడికే ఈ పిల్లల్తో, ప్రపంచంతో యదార్ధంగా పరిచయం ఉంది; ఒక్క ‘మేడమ్ ‘ తో తప్ప బహుశ. నాకైతే వీళ్ళందరూ తెలుసు, మేడమ్ తో సహా. ఈ భాష మాట్లాడే పిల్లల్తో ఇలా బతికే పిల్లల్తో వాళ్ళ ఊళ్ళలో ఆయన బతికేడు, నాలాగ. అంతే కాదు, ఆయన కూడా వాళ్ళలో ఒక గుంట్నాకొడుగ్గా బతికేడు, నాలాగనే. సుధాకర్ ని ఎన్నిసార్లో గుచ్చి గుచ్చి అడిగేను – దీన్లో ‘జూటా ‘ ఉన్నట్టుందా, అదేంటో చెప్పమని. అన్నిసార్లూ ఆయన ఏమన్నారంటే ‘పిల్లలందరూ ప్రాణం పోసుకున్నారు ‘ ఏ అభ్యంతరం తోచదని. మేడమ్ ఒక్కరితోనే ఆయనకు ఇబ్బంది వచ్చిందని. కొండబాబు భాషతో, గొంతుతో ఇప్పటికీ ఏ మాత్రం ఇబ్బంది తోచదు నాకు. వాడు నాకు ఎంత తెలుసంటే ఆ వయసులో అతనితో అలాంటి వాళ్ళందరితో అబేధం. అంత తెలుసు. సుధాకర్ ఒక్కరే అది అర్ధం – అంటే అనుభవం – చేసుకున్నారు. అబ్బ దీనికి ఒకే ఒక్క రీడర్ ఈయనే అని అనుకున్నాను, అలాగే అవుతుందే అనుకున్నాను. సుధాకర్కు రాయించిన దుఖ్ఖం అర్ధం అయ్యింది. ఆయన కూడ సారగారుగా అవతరించిన ఒకనాటి కొండబాబు. ఆయన చాల నచ్చుకున్నాడు ఈ కధని అలాగ ఇలాగ అని. దీని మొదటి చివరి చదువరి. వాళ్ళ గొంతు, లోకాన్ని కధలు కధలుగా చెప్పి వెక్కిరించే తీరూ ముమ్మాటికీ అలాగే ఉంటావి. అందరికీ కాదు. అవే ఊళ్ళు, అదే భాష, ఆ మనుషులూ అనుభవమ్లో ఉన్నవాళ్ళలో ఏ కొందరికోనేమో. ‘మ్రోగింది ‘ వంటి మాటలే కాదు, అంతకంతే ‘శుద్ధం ‘ అయిన మాటలూ, గ్రామ్యం అయిన మాటలూ వాళ్ళ మాటల్లో ఇబ్బంది లేకుండా కలిసుంటాయి. అవి మన, అంటే సంస్కారుల expectationsను అనుసరించి రావు. స్వయంగా దగ్గిరసా చూస్తే అనుభవమౌతాయి. ఇబ్బంది వేరే. మా ఆవిణ్ణి అడిగేను – రాజాతల్లి! దీంట్లో అబద్ధంగా ఉందా చెప్పమని. అది ‘ఏదో అబద్ధం లాగా ఉందిరా’ అన్నాది. ‘నువ్వు బతుకుతున్న బతుక్కీ ఈ కధలో విషయానికీ ఏదో తేడా ఒచ్చిందీ’ అన్నాది. అది కరక్టుగా పట్టుకున్నాది. మళ్ళీ అంది – ‘నాకైతే నీ జీవితం తెలుసు. అందరికీ తెలీదు కదా!’ అని ఊరుకోబెట్టింది. మూడులాంతర్లు ఆరో భాగంలో ఇదే ఇంకా ఉంటుంది – గొంతు సంగతి. మురళి అని ఉన్నారు. ఇంకో ఫ్రెండు. ఆయన్నడిగేను. ఆయన ఏమన్నారంటే narrative by a man torn between the two worlds …. mildly inauthentic.. అని. ఆ mildly inauthentic.. నేను ఒప్పుకున్న జూటా. అది సత్తెం చేసుకొవాలంటే నేను మళ్ళీ కొండబాబుని అయిపోవాలి. అలాగ కధల్లోనే కాగలను – కనీసం జూటాగానైనా. ఆ ఓదార్పు కోసమే కధ – రచయితకు. ఆ తరవాత వాంతిని ఊడ్చి పారీసినట్టు దాన్ని. మురళీతొ నేను “..it is a lie, but to me a very comforting lie, as all lies are.” అప్పటికి నాకలా బాగుంది. ఇప్పటికీ ఏ ఒక్క ముక్కా మార్చాలనిపించదు. జూటా textలో నిర్మాణంలో లేదు. రచయిత బతుక్కీ కధలోని సంగతికీ సమన్వయంలో ఉన్నాది. అది third person narrativeతో పూడ్చేది కాదు సరి కదా మరింత దూరమౌతుంది. గొంతునే చెరిపెయ్యటం ఒక తోవ. Beckett త్రిపుర అలా చేసేరు. వాళ్ళు ద్రష్టకు, దృశ్యానికీ మధ్య దూరం చెరిపెస్తారు. సుధాకర్ అలా చెరిపేసుకుని కధలోకి ప్రవేశించేడు, ప్రయత్నించి కాదు – ఇదంతా ప్రత్యక్షంగా, నిజంగా అతనికి తెలుసు, ఇదివరకే. అతని గొప్ప కాదు, వేరొకరి తక్కువ కాదు. అలా స్వీకరిస్తున్నారు, తమ అనుభవాల వల్ల అనుకుంటాను. అందరికోసం రాయాలి, అందరికీ ఒప్పుకోలుగా ఇలా అయితే బావుండేది ఇలా అంటే ఆ should నాకు మనస్కరించదు. ఇంతకంటె చెప్పాలని, చర్చించాలని లేదు. ఇది వాదించి ఒప్పించగలిగేది కాదు. మీరు లేవనెత్తిన విషయం చాల ముఖ్యమైనది, ఆసక్తి ఉంటే ఎంతో ఉపయోగంగా ఉండే చర్చ, అదంటే విముఖత, అగౌరవం లేదు. మనం Fiction అనేది సాంతం, అంతేగాక Science అనేది, అంతేగాక దైనందిన జీవితం అంటే Life అనేది ఈ మూడూ కూడా ఏదో ఒక స్థాయిల్లో నిజమే కావు – అంటే ఇవన్నీ కూడా జూటా. ఇలాగని చాల చర్చ ఉన్నాది – వేదాంతంలో కాదు, సైన్స్ లోన! ఇది సందర్భం కాదు, వేదిక కాదు, నా వలన కాదు.

    [మూడు లాంతర్ల ఆరోభాగం జులై1 న ప్రచురించాము. కానీ ఒక చిన్న తప్పు వల్ల ఆ వ్యాసం ఈమాటలో కనిపించలేదని తెలిసి తప్పు సరిదిద్దాము. మా అలక్ష్యానికి క్షమాపణలు. – సం.]

  3. నీళ్ళు కాచే పనిపిల్ల గురించి తృష్ణ అభిప్రాయం:

    07/06/2011 1:30 am

    చిన్ననాటి జ్ఞాపకాలని కదిలించిందండి కవిత.. చాలా బాగుంది.

  4. వేటూరి పాట గురించి Rohiniprasad అభిప్రాయం:

    07/05/2011 5:00 pm

    యశస్వి ఎవరి మెచ్చుకోలు గురించి రాశారో నాకు తెలియదు. కె.వి.ఎస్. రామారావుగారెవరో నాకు పరిచయం లేదు. ఎక్కడుంటారో, ఏం చేస్తారో కూడా నాకు తెలియదు. ఒకప్పటి ఈమాట ఎడిటరని మాత్రమే తెలుసు. వేటూరి పాటలు నాకూ పెద్దగా నచ్చవు. తరాలు మారినప్పుడు స్థాయి మారుతుందేమో. ప్రస్తుతం ముఖ్యమైన రచయితగా పేరుపొందిన గుల్జార్‌ది కేవలం సెంటిమెంటాలిటీ మాత్రమేనని మజ్‌రూహ్ అన్నాడట. వరవరరావు కామెంట్ ప్రధానంగా హిందీ కవుల గురించినది. ఇప్టా బొంబాయి సంస్థ.

  5. జ్ఞాపకాల తోటలో వాన పూల జల్లు! గురించి A. Sivalenka అభిప్రాయం:

    07/05/2011 4:40 pm

    చాలా బాగా రాశారు. మొక్క జొన్న పొత్తులు మాట కూడ చెపితే ఇంకా బాగుండేది.

  6. పదకవితా సార్వభౌముడు: క్షేత్రయ్య గురించి మోహన అభిప్రాయం:

    07/05/2011 4:12 pm

    బాలాంత్రపు రజనీకాంతరావుగారి ఆంధ్ర వాగ్గేయకార చరిత్రము (విశాలంధ్ర పబ్లిషర్స్, 1975) పుస్తకానికి పరిచయ వాక్యాలు వ్రాస్తూ శ్రీ రాళ్లపల్లి అనంతకృష్ణశర్మగారు ఆగస్టు 1, 1958 నాడు క్షేత్రయ్యను గురించి ఇలా అన్నారు –

    “నేటి కర్ణాటక సంగీతపు రాగా లెన్నో స్పష్టరూపం దాల్చినది క్షేత్రయ్య పదాలలోనే” (పుట 210), “అనుపల్లవికి క్షేత్రయ్యే మార్గదర్శి” (పుట 232) ఈ యభిప్రాయాలు క్షోదక్షమంగా కానరావు. క్షేత్రయ్య వాడిన రాగాలు తాళాలు అన్నీ పురందరదాసాది ప్రాచీనుల రచనలలో నున్నవి. ఆ పదాలు పాడినట్టే వీటినీ పాడవచ్చును. నా గురువుగారు శ్రీ బిడారం కృష్ణప్పగారు దేవరనామాలు పాడునట్లే క్షేత్రయ్యాదుల పదాలూ అద్భుతంగా పాడేవారు. భక్తి శృంగారరూప భావ భేదమే తప్ప పాట శైలిలో ఏమీ భేదం మా యనుభవానికి అందులో రాలేదు. పదాలను రాగప్రధానంగా తెగయీడ్చి వాగర్థాల భావమే అవగతం కాకుండా పాడే పద్ధతి ఈవల వీణ ధనమ్మాళ్ ప్రచారంలోకి తెచ్చిందని నా ఊహ. ఆమె త్యాగరాజాదుల కీర్తనలు గూడ ఆ శైలిలోనే పాడేది. అందలి రాగమాధుర్యానికి లోగి ఎందరో గాయకులు – వాగర్థాల దృష్టి లేనివారు – దక్షిణదేశంలో ఆ శైలినే అక్షరశః అభ్యాసం చేసి పాడుచున్నారనేది వేరుమాట. క్షేత్రయ్యే యీ శైలిని తెచ్చి పెట్టినాడనేది న్యాయం కాదేమో. అట్లే అనుపల్లవి పురందరదాసుల కీర్తనలలో ఎన్నిటికో యున్నది. కనకదాస కృతులలో కలదు. ఇంతెందుకు? ఈ క్రింది అన్నమయ్య సంకీర్తనలోనే కలదు:

    శ్రీరాగం –
    “ఇతరులకు నిను నెరుఁగ తరమా
    సతత సత్యవ్రతులు – సంపూర్ణ మోహ విర-
    హితు లెరుంగుదురు నిను – నిందిరారమణా”

    దీనికి తర్వాత నాల్గు పంక్తుల చరణాలు మూడున్నవి. పైమూడు పంక్తులును ఒక పల్లవిగా కలిపికొట్టి పాడేది యెట్లో నా కర్థంకాదు. అట్లే,

    “పరిపూర్ణుఁడవు నీకుఁ బరాకున్నదా, నిన్ను
    మరిగి వుండనిదే – మావల్ల తప్పుగాక,”

    అనే తిరుమలయ్య సంకీర్తనలో రెండవ పంక్తిని అనుపల్లవిలో అమర్చుకొనకపోతే రెంటినీ ఒక రూపంగా భైరవి రాగంలో పాడే రీతి దుర్గ్రహం కనుక దీని బరువంతా క్షేత్రయ్యమీదనే వేయడం నా దృష్టిలో న్యాయం కాదు.

    ….

    ఇట్లే క్షేత్రయ్య వాడిన ‘మోవనాడు’ అనే పలుకుబడిలో ‘మువ్వనాడు’ అనే యెవ్వరూ కనివిని యెరుగని కొత్త నాడుగాని … నా చూపు కందని విషయాలు. మోవన్ ఆడు = నామీద తప్పు మోచునట్లుగా ఆడుము అని మోవనాడు కర్థం.

    నా తానా వ్యాసములో 53వ పుటలో త్రిపుట తాళానికి ఏడు అక్షరాలు అని ఉండాలి. తప్పు దొర్లినందుకు క్షంతవ్యుడను.

    విధేయుడు – మోహన

  7. వేటూరి పాట గురించి yasasvi అభిప్రాయం:

    07/05/2011 3:27 pm

    “ఈమాట” పత్రిక తీరుని క్రమంగా గమనిస్తే ఒక గ్రూపు ఒకరినొకరు ఓ! మెచ్చుకోవడం కనిపిస్తుంది. అందులో చాలాసార్లు నిజమూ అర్ధమూ ఉండకపోయినా !! ఇది చాలా స్పస్టంగా పత్రిక చదివే వారికి తెలుస్తూనే ఉంటుంది. [ అంటే ఎవరిని ఎవరు మెచ్చుకుంటూంటారు. ఎవరిని విమర్శిస్తే ఎవరు వెనకేసుకొస్తూంటారు ఇత్యాదులు]
    వేటూరి బతికి ఉన్నప్పుడు ఈ వ్యాసం రాసి ఉంటే పాపం ఆయన కూసింతైనా సంతోషించి ఉండేవాడేమో? ఆయన ఈ మధ్యనే కదా పోయిందీ!!

    వరవరరావు మాట బడాయి కాకపోతే– సముద్రాల సీనియరూ ..మల్లాది..ఏ “ఇప్టా” నించి వచ్చారేం?? సరే మనకి ఊరికే పొగడటం ఒక అలవాటు గా మారిపోయేకా విశ్లేషణ ని ఏం ఆశిస్తాం గానీ వేటూరి ఈ వ్యాసకర్త పొగిడినంత గొప్ప కవి ఏమీ కాడు. చాలా చెత్త పాటలూ చాలా బోరు పాటలూ ఎన్నో రాసేడాయన. ” మధుర మధురతరమీనాక్షీ” ఏం పాటా అసలూ?

    యశస్వి.

  8. రీ యూనియన్ గురించి lyla yerneni అభిప్రాయం:

    07/05/2011 11:56 am

    పక్క బల్ల వద్దే వారిద్దరూ వచ్చి కూర్చున్నారు.
    ఆవిడ జర్మన్ ఉరవడి మాటలు
    అతడి ఇండియన్ అడపాదడపా మాటలు
    నే వెంటనే వాళ్ళని గుర్తించాను
    ఉంది మా జీవితాల్లో ఒక ఘట్టంలో
    కొద్దిపాటి ఓవర్లాప్
    ఉన్నాయి ఒక ట్రాన్సాక్షన్లో అందరం కలిసి సంతకాలు చేసిన కాగితాలు
    సో వాట్!
    నేనా సాయంత్రం నా చేతిలో పుస్తకం
    చదువుకుంటూ నిశ్శబ్దంగా పేజీల్లో ఎవరివో తెలియని జీవితాల్లోకి
    పయనించటమే సేఫ్ అనిపించింది
    గతించిన పదేళ్ళ నా జీవితం గురించి
    వాళ్ళు నన్ను క్రాస్ ఎక్సామిన్ చెయ్యటమూ
    నే ముద్దాయిలా దొంగ సమాధానాలివ్వటమూ
    నా పిల్లా పీచూ గురించి అక్కర్లేని డిపోసిషన్లూ
    గుర్తురాని వారి సంతానం గురించి ఇంక్వైరీ
    అందరి రోగాలూ రొష్టులూ మీద సింపథెటిక్ సమ్మరీ
    పనికట్టుకుని నేనిప్పుడు వాళ్ళను పలకరించకపోతేనేం
    బల్లకీ బల్లకీ మధ్య ఆర్టిఫిషియల్ పామ్ స్
    అంతమాత్రం ప్రొటెక్షన్ ఇవ్వవూ
    ఫక్ ఇట్
    ఐ డోంట్ ఫీల్ లైక్ ఫేస్ బుక్
    హూ ఈస్ గోయింగ్ టు ప్రెషర్ మీ
    జూకర్‌బర్గ్ ఈస్ నాట్ గోయింగ్ టు ప్రెషర్ మీ
    సోషల్ నెట్ వర్క్ మై ఫుట్
    ఐదు నిమిషాల్లో నే స్థిమితపడ్డా
    ఐ ఆమ్ నో లాంగర్ వర్రీడ్
    ఐ గాట్ వెరీ కంఫర్టబుల్
    వైన్ టుక్ ఓవర్
    దేరీస్ నో ఏంబుష్ , నో రీహాష్,
    దేరీస్ నో గాడ్ డామ్ రీయూనియన్.

    లైలా

  9. ఏదైనా ఒక వేడి వస్తువు గురించి మెహెర్ అభిప్రాయం:

    07/05/2011 8:48 am

    నిజంగా యిదొక జూటా గొంతుతో రాసిన కథ అనిపించింది. ఆ కొండబాబు అసలు గొంతేమిటో మీకు తెలీదని, మీకందుబాటులో వున్న నకిలీ గొంతేదో వాడి మీద రుద్ది నెట్టుకొచ్చారనీ చాలా చోట్ల తెలిసిపోతోంది. మొదటి పేరాలో “మ్రోగింది కల్యానవీనా”లో “మ” కింద “ర” వత్తుతో మొదలైంది అంతా (రోబో సినిమా ఆడే రోజుల్లోని స్లమ్ కుర్రోడు, మ్రోగింది కల్యాణ వీణా పాట విని గుర్తుంచుకోవడం ప్రక్కనబెడితే). యిక అక్కణ్ణించి లెక్కే లేదు. When you are applying to everyday reality for the validation of your fictional world, every single detail counts. So you should KNOW what you say, and maintin the consistency. Imagine Huckleberry Finn, and imagine him talking in fine similies like this: “బచ్చానాకొళ్ళు ఒక్కొక్కలే పుస్తకాలు ఇస్తిరాకుల్లాగ ముందరేస్సుకోని బోయనాలకి బంతిస్తళ్ళు కూకున్నట్టు కూకుంటే నీను…”, “అద్దాల గేలాం నూతులెల్లి తాబేల్లకి పైకినాగుతున్నట్టుగ”… I can see your authorial baggage of literary conventions trespassing through your picaresque narrator’s tone to pollute it. రొబో ఆడుతున్న థియేటర్కి వెళ్ళినపుడు కొండబాబు సాహితీ సంప్రదాయాలన్నీ పాటిస్తూ వర్ణనల్ని కథనంలో ఇముడుస్తున్నట్టు కూడా తెలిసిపోతోంది. రాని గొంతుతో శ్రమ వదిలేసి, థర్డ్ పెర్సన్‌లో రాసి వుంటే యింకాస్త మెరుగ్గావుండేదనిపిస్తుంది.

  10. వేటూరి పాట గురించి nagamurali అభిప్రాయం:

    07/05/2011 8:23 am

    చాలా సమగ్రమైన విశ్లేషణ. వేటూరి పాటల్లో ఎబ్బెట్టుగా ఉండే పదాల కూర్పునీ, దుష్టసమాసాల్నీ నేనెప్పుడూ ఆస్వాదించలేకపోయాను. ముఖ్యంగా అద్భుతమైన ఇళయరాజా బాణీల్లో ఈ సాహిత్యం పంటికింద రాళ్ళలాగానే అనిపించేది. (ఉదా: కైలాసాన కార్తీకాన శివరూపం, ప్రమిదేలేని ప్రమథాలోక హిమదీపం మొదలైన ప్రయోగాలు,). మీ వ్యాసం నాకు మంచి రిలీఫ్ ని ఇచ్చింది.