పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16485

  1. ఏదైనా ఒక వేడి వస్తువు గురించి yasasvi అభిప్రాయం:

    07/04/2011 1:43 pm

    చత్రిబాబు యాసా గొసా ఇన్పిస్తనాయనుకొనేవు ప్రసాదు బాబో !! ఏం నాభం నేదు. చత్రిబాబు మాటలో బలమ్ ఉంది. మరి నీ మాట ? ఒగ్గెయ్ ఆ వూసు. బాలా అని సెప్పాల్నేంటీ?? ఆ కుమార్ బావు అన్నట్టే .. మరీ విసుగొచ్చేసినాది. సదివించొద్దా? నాసేవు సరే..గానీ. ఏటినాభం?
    యశస్వి.

  2. వేటూరి పాట గురించి Rohiniprasad అభిప్రాయం:

    07/04/2011 12:23 pm

    నా కామెంట్‌లో కొన్ని టైపింగ్ తప్పులు వచ్చినందుకు క్షమించాలి.

    వేటూరి రాసిన ఆరేసుకోబోయి పారేసుకున్నాను
    కోకెత్తుకెళ్ళింది కొండగాలి
    అనే పల్లవి సీసపద్యపాదమని నా బొంబాయి మిత్రుడొకాయన గుర్తించాడు!

  3. భావతరంగాల సింధువు: భైరవి గురించి Rohiniprasad అభిప్రాయం:

    07/04/2011 10:21 am

    స్వరూప్‌గారూ,
    మీరు ఉదహరించినవి వేరువేరు లింకులు. మరొకసారి గమనించండి.

  4. అర్థంకాని కవిత్వం గురించి N.VIJAYARAMULU అభిప్రాయం:

    07/04/2011 10:12 am

    వ్యాసం బాగుంది.విశ్లేషణ అంత లోతుగా లేదనిపిస్తుంది.ఆధునిక కవిత్వంలొ ఉన్న అస్తిత్వవాదాల మూలాలకు వెళ్లగల్గితే బాగుండేది.

  5. అర్థంకాని కవిత్వం గురించి Subrahmanyam Mula అభిప్రాయం:

    07/04/2011 7:29 am

    చాలా చక్కని వ్యాసం కామేశ్వర రావు గారూ! మంచి విశ్లేషణ.

  6. జ్ఞాపకాల తోటలో వాన పూల జల్లు! గురించి Subrahmanyam Mula అభిప్రాయం:

    07/04/2011 7:25 am

    చాలా బావుంది.

  7. నీళ్ళు కాచే పనిపిల్ల గురించి Subrahmanyam Mula అభిప్రాయం:

    07/04/2011 5:34 am

    అద్భుతం!!

  8. ఏదైనా ఒక వేడి వస్తువు గురించి Subrahmanyam Mula అభిప్రాయం:

    07/04/2011 5:32 am

    మీ వ్యాసాల్లో మాటి మాటికీ ప్రస్తావించే “కపటంలేని కాల్పనిక ధార”కి గొప్ప ఉదాహరణగా నిలుస్తుందీ కథ! కళ్ళ ముందు మిరుమిట్లుగొలుపుతూ ఆవిష్కృతమయ్యే ప్రపంచాన్ని అక్షరాల్లోకి పట్టడమెలాగో తెలీక , అందుకు తగ్గ భాషనీ, పదచిత్రాల్నీ సమకూర్చుకోలేక చతికిలపడ్డ సందర్భాలెన్నో! “ఊహ కందే సంగీతంలో పాట కందేది శతసహశ్రాంసం ఉండదు” అన్నారు “కానుక” కథలో ముళ్ళపూడి వారు. మీ ఊహకందే జీవితం మీ కథల్లో దాదాపు ఉన్నదున్నట్టుగా ఆవిష్కరించగలుతున్నందుకు మీరు ధన్యులు. అందుకే మీ కథలు, కవితలు అంటే నాకు మాటల్లో చెప్పలేనంత ఇష్టం, గౌరవం. తప్పక రాస్తూ ఉండండి.

  9. ఏదైనా ఒక వేడి వస్తువు గురించి kumar అభిప్రాయం:

    07/04/2011 5:15 am

    ఈ కథ ఎంత బాగుండనీ.. భాష పంటికింద నాపరాయి. కథనం లో నిజాయితే పేర ఇంత అతిశయానికి పోవడం ఎందుకో అర్థం కాదు.

  10. జ్ఞాపకాల తోటలో వాన పూల జల్లు! గురించి ఆర్.దమయంతి అభిప్రాయం:

    07/04/2011 2:43 am

    యశస్వి గారూ,నమస్తే!
    జయప్రభ గారి వాన ముచ్చట గురించి మీరిక్కడ ప్ర స్తావించడం చాలా మురిపెంగా వుంది. అందరూ చదివి ఆనందించే విధంగా రాసి పంపిన మీకునూ నా అభినందనలు!
    కృతజ్ణతలతో –
    ఆర్.దమయంతి.