పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16485

  1. అప్పర్ క్రస్ట్ గురించి murthy అభిప్రాయం:

    09/08/2011 3:10 am

    పూర్తి పేరు శ్యామల్ గోపాల్ అయి ఉంటుంది.

  2. శ్రీ సోది సుబ్బయ్య గారి సొంత గోడు గురించి బులుసు సుబ్రహ్మణ్యం అభిప్రాయం:

    09/08/2011 1:17 am

    దమయంతి గార్కి, – నమస్కారం. ధన్యవాదాలు నా కధ మీకు నచ్చినందుకు. నా ఇతర హాస్య రచనలు నా బ్లాగు “నవ్వితే నవ్వండి” లో ఉన్నాయి. మీకు వీలైనప్పుడు చూడవల్సిందిగా కోరుచున్నాను.

    ఫణిబాబు గార్కి, – భలేవారే. మీరు ధైర్యంగా వచ్చేయ్యండి. మీరు వచ్చేముందు టేబల్ రిపైర్ లకు పంపిచేస్తాను. మన మ్యానర్స్ మనం ఫాలో అయిపోవచ్చు. … దహా.

    చిలమకూరు విజయ మోహన్ గార్కి, – ఆ, వినిపించాయండి మీ నవ్వులు . ధన్యవాదాలు.

    మురళీధర్ గార్కి, – మొత్తం అంతా కలిపి ఒక పొ.ప.న. అనుకొంటాను. ధన్యవాదాలు.

    చాతకం గార్కి, – మాష్టారూ మనకి ఆ మానర్స్ వంటబట్టవు. కాఫీ సాసర్లో పోసుకొని రెండు వీధులు వినిపించేటట్టు తాగడమే అలవాటు. మీ చివరి వాక్యం అర్ధం కాలేదు. మీ వ్యాఖ్యలకి ధన్యవాదాలు.

  3. కినిమా మాసపత్రిక: భానుమతిపై వ్యాసం గురించి రాజేంద్ర కుమార్ దేవరపల్లి అభిప్రాయం:

    09/07/2011 3:01 pm

    ఈమాటకు ఇలా పీడీయఫ్ ఫార్మాట్ లో కూడా పాతవ్యాసాలు పంపవచ్చా? చెప్పగలరు.

    [యూనికోడ్‌లోకి మార్చడం కుదరని వ్యాసాలు మాత్రమే పి.డి.ఎఫ్. గా ప్రచురిస్తున్నాము. ప్రత్యేకించి బొమ్మలు ఉన్న వ్యాసాలు. వీలైనంత వరకూ వ్యాసాలు యూనికోడ్‌లో పంపించగలరు. – సం.]

  4. పలుకుబడి: సంఖ్యా పదాలు – 2 గురించి nagamurali అభిప్రాయం:

    09/07/2011 11:17 am

    ‘ఆరు’ కి మీరు చెప్పిన ‘నిండిన’ అన్న అర్థం తీసుకుంటే – ఆరుస్తావా, తీరుస్తావా – నాకొచ్చిన లోటుని (కష్టాన్ని) నింపుతావా (పూడుస్తావా), లేక తొలగిస్తావా అని అర్థం చేసుకోవచ్చా?

    ఆరింద – నిండైనది, బాగా పరిణితిని కనబర్చేది, అనుభవజ్ఞురాలు అనుకోవచ్చా? (అన్నట్టు ఆరింద స్త్రీలింగమేనా, ఈ పదాన్ని మగవాళ్ళకి కూడా వాడుతుంటారా?)

  5. కోనసీమ కథలు: సత్తెవతి గురించి Gowri Kirubanandan అభిప్రాయం:

    09/07/2011 5:53 am

    ఈ మధ్య మంచి కథలు రావడం లేదు అన్న అపోహను తొలగించింది ఈ కథ. మానవ జీవితంలోని వేరువేరు దృక్కోణాలను పాఠకులకు పరిచయం చేసేదే కథ. మనుషులు కంటికి కనిపించే విధంగానే వాళ్ళ మనసు, ప్రవర్తన ఉంటాయనుకోవడం వట్టి భ్రమ.

    ఈ కథ నాకు ఎంతగా నచ్చిందంటే, తమిళ పాఠకులకు ఈ కథను పరిచయం చేయాలనిపించేటంతగా.

  6. కోనసీమ కథలు: సత్తెవతి గురించి ఆర్.దమయంతి అభిప్రాయం:

    09/06/2011 11:53 pm

    మోహన గారూ, నమస్తే!
    అచ్చు తప్పుల గురించి ‘ఎవరూ అడగని నా సలహాలు” అని మీరన్నారే కానీ, నిజానికి మీరు చెప్పినవన్నీ అందరికీ పనికొచ్చే ఉపయోగకరాలు అని భావిస్తున్నా.

    కొన్ని మాటలు *రాసే (ట) ప్పుడు కలిగే సందేహాలకు అంతూ పొంతూ వుండదు. మరి కొన్నింటికి సరైన అర్థాలు పుస్తకాల్లో కూడా లభించవు. పదాలు కలిపి *రాసే(ట)ప్పుడైతే.. పుట్టలు పుట్టల *డౌట్సేస్తాయి (?). ఉదాహరణకి..రెండూళ్ళూ (రెండు ఊళ్ళు అని రాస్తే బావుంటుందేమో అని రెండో ఆలోచన ..), ఇతన్ని నమ్మొచ్చేమో!? అని *రాసా(శా)క.. (‘నమ్మ వచ్చేమో’, అని రాస్తే? *బా(గ)లేదు.. ‘నమ్మొచ్చా, ఏమో!’ అని రాద్దామా? నచ్చట్లేదు… పోనీ, ‘నమ్మొచ్చు అనుకుంటా’ అని రాద్దామా! ఇలా మనసులో తర్జన భర్జనలు జరుగుతూ వుంటాయి. *సతాయించేస్తాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఎన్ని సార్లు తిరిగి చదువుకున్నా ఆ *కన్ ఫ్యూజన్ అలాగే వుంటుంది. అందుకే రెడీ మేడ్ ఆన్సర్ మిషన్ లా ‘ఒక తెలుగు మాస్టారి కాలమ్’ *ఇక్కడుంటే (ఇక్కడ వుంటే ) బావుణ్ణు, వెంటనే అడిగి *తెల్సుకోడానికి వీలుంటుంది కదాని! *అనుకుంటూం(వుం)టాను, ఇదే విషయాన్ని సురేష్ గారి కాలమ్ లో కూడా నే నోసారి ప్రస్తావించడం జరిగింది.

    నేను కూడా కధని ఇలాగే రాసేదాన్ని ఒకప్పుడు! ఒక ఎడిటర్ గారు, ‘మీకిది రా(వ్రా)యడం కూడా రాదా’ అని చూసినప్పుడు మాత్రం బాధేసిపోయింది. ‘శబ్దాలు ఒకటే అయినా, స్పెల్లింగ్స్ వేరు. కధని కథ అనే *రాయాలని (వ్రాయాలి అని)మందలించారు. నేననేదేమిటంటే – ఇలా.. ‘స్పోకెన్ – రిటెన్ తెలుగుని’ చక్కగా విమర్శిస్తూ, విశదీకరిస్తూ అందరికీ అర్థమయ్యే భాషలో పాఠ్యాంశాలుగా బోధనలు *జరగాల్సిన ( జరగ వలసిన) అవసరం ఎంతైనా వుందని అభిప్రాయ పడుతున్నా.

    ***

    సాయి గారూ ! మీ కథ బావుంది. ఆ బద్ధక జీవి జీవిత విధానం చాలా మంది స్వప్నం.
    అభివందనాలతో
    ఆర్.దమయంతి.

  7. శ్రీ సోది సుబ్బయ్య గారి సొంత గోడు గురించి చాతకం అభిప్రాయం:

    09/06/2011 10:40 pm

    బాగుందండి. మొత్తానికి గారెల్ని చెంచాతో తినటం నేర్చుకోబోతున్నారన్నమాట. అదేదో నక్క, కొంగ కధ లో లాగా మీఇంటికొస్తే మాకూ అలాంటి టిఫినీ పెడతారేమో ! మేమూ కూడా మా ఇంటికొస్తే కాఫీ లో స్ట్రా వేసి తాగమంటాములేండి. సుబ్బయ్య గారికి పట్టాభిరాం ఐడియా ఇవ్వండి. శ్రీలక్ష్మి లాగా ఆ సంగీతం పిచ్చి వదులుతుంది. కాస్త డబ్బు మాత్రం పట్టాభిరాం గారికి అడిగినంత మొత్తం తక్కువ కాకుండా ఇవ్వమని చెప్పండి. 😉 మీరు డుంగుడుడుంగు చెంబు వారా? వ్రాత శైలి చూసి లోటా వారనుకున్నానే?

  8. మాతృత్వానికి మరో ముడి: కథ నచ్చిన కారణం గురించి kavitha అభిప్రాయం:

    09/06/2011 10:29 pm

    గౌరి గారు, మీ కథలు అనువాదాలు కొన్ని విపుల మాస పత్రిక లొ చదివాను.
    ఇది అన్నిటి లోకి మర్చిపోలేనిది! అనువాదం కాకపోయినప్పటికీ…..

    పైన మోహన గారు చెప్పినట్టు బిడ్డలను వదలి వేయటము అన్ని చోట్లా ఉన్నదే, కాని ఆడపిల్ల అనే కారణం తో వదలి వేయటము కేవలము మన సంస్కృతి లోనే!!

  9. పలుకుబడి: సంఖ్యా పదాలు – 2 గురించి మోహన అభిప్రాయం:

    09/06/2011 8:36 pm

    1) కేతన తరువాత సుమారు ఏడు శతాబ్దాలు గడిచాయి, మధ్యకాలములో వచ్చిన ఎందరో కవులు ఎన్నో సమాసాలను ప్రయోగించి ఉంటారు గదా? మూడు నేత్రములు, మూడు మూర్తులు సరియైన సమాసము, కాని మున్నేత్రుడు కాదు, ఎందుకంటే నేత్రుడు మహద్వాచకము, నేత్రము అమహద్వాచకము. కొన్ని సమాసములు వైరి సమాసములవలె కనబడవచ్చును, కాని అవి అలాటివి కాదు. ఉదాహరణకు లక్ష్మిమగడులో లక్ష్మి సంస్కృతపదము, మగడు తెలుగు పదము, రాజ్యపు సిరి లాటిదే ఇది కూడ. సంబంధ షష్ఠీవిభక్తి ఉన్నప్పుడు ఇలాటివి చెల్లుతాయి. అదే విధముగా ఆ కాంత అక్కాంత, నాదు శిరము నాశిరము సరియైనవే. వేయిపద్మాలు కూడ సరియైనదే. ఇట్టివి కోరాడ మహాదేవశాస్త్రి Historical Grammar of Telugu, గణపవరపు వేంకటపతికవి ఆంధ్రకౌముదిలో చర్చించబడినవి.

    2) నన్నయగానీ, తిక్కనగానీ దీర్ఘముపైన అరసున్నను నిండుసున్నగా ఉపయోగించలేదు. ఎందుకంటే అలాటి ప్రయోగము వారి కాలములో, అప్పుడు వారుండిన ప్రాంతములో లేదు. కాని నన్నెచోడునికి అవి సుపరిచితములు, అందుకే వాడాడు అలా. మదరాసులో ఆండవాళ్లు అని వాడుతారు, కాని ఆంధ్రదేశములో అలా వాడరు. అందువల్ల చెన్నై తెలుగు మాండలికములో వ్రాస్తే కూంతురు, ఆండవాళ్లు సహజముగా ఉంటుంది. కాని ఆంధ్ర మాండలీకాలలో అవి ఎబ్బెట్టుగా ఉంటుంది.

    విధేయుడు – మోహన

  10. శ్రీ సోది సుబ్బయ్య గారి సొంత గోడు గురించి NNMuralidhar అభిప్రాయం:

    09/06/2011 4:46 pm

    రెండు చి.న.లు నాలుగు ద.హాలు. అరడజను అ.హా.లు