నాకు సంగీతం ఎక్కువగా తెలియదు. కాని కర్నాటిక్ సైటులో ముత్తుక్కళో కణ్గళ్ రాగము మధ్యమావతి అని ఉన్నది. ( విన్నానులే ప్రియా ) ఈ సైటులో మధ్యమావతి హిందుస్తానీ సారంగ్ రాగము లాటిది అని ఉన్నది.
విధేయుడు – మోహన
ఆరు అంటే నిండు, ఉపశమించు, వెండ్రుకలు (నూగారులాటి పదాలలో) అని అర్థము. సంఖ్యను సామాన్యముగా ఆఱు అని వాడుతాము. కాని యిప్పుడు బండి ఱ వాడడము లేదు కాబట్టి ఈ సందిగ్ధము, సందేహము కలుగుతుంది. రాణి తెలుగు పదము, రాజ్ఞి సంస్కృతపదము. అందువల్ల తెలుగు సంధితో పట్టపురాణి. సంస్కృతములో పట్టరాజ్ఞి అని అనుకొంటాను. పాదము అంటే ఈ సుభాషితము నాకు జ్ఞాపకానికి వచ్చింది. జ్ఞానసముపార్జన ఎలాగవుతుంది అనేది ఇందులోని అంశము.
ఆరుస్తావా అన్న పదంలో “ఆరు”కి ఉపశమింపజేయు అనే అర్థం వస్తుందనుకుంటాను. “పాతిక” పాద నుండి వచ్చుండాలి. పద్యంలో పాదం నాలుగోవంతు కదా! తమాషా ఏవిటంటే తమిళంలో పాది అంటే సగం అని అర్థం!
>>‘పాలాభిషేకం’, ‘పడుచాహారం’ అన్న సమాసాల్ని సీనీకవులు వాడితే అవి దుష్టసమాసాలని విమర్శించిన వారున్నారు కదా
మగధీరుడు, మగధీరని ఎవ్వరూ విమర్శించిన సాహసం చేసినట్టు లేదు! :-). మొదటి పదం తెలుగు, రెండవది సంస్కృతం ఉన్న సమాసాలు చాలా వరకూ ఆమోదయోగ్యమే అయినట్టున్నాయి. “పాలాభిషేకం”, “పడుచాచారం” వంటి చోట్ల ముఖ్యంగా అభ్యంతరకరమైనది సంస్కృత సంధులని వాడడమే అనుకుంటాను. ఇలాంటి చోట్ల తెలుగు సంధులనే చెయ్యాలి (“మూఁడస్త్రంబులు”లాగ). రాజ్యపుసిరి అన్నచోటకూడా తెలుగుసంధి జరిగింది.
అసందర్భం అనుకోకపోతే మరొక చమత్కారం. “పట్టభద్రుడు”లో ఉన్న “పట్టము” సంస్కృతమైతే మరి “పట్టరాణి” కాకుండా “పట్టపురాణి” ఎందకయ్యింది? మళ్ళా “పట్టమహిషి” ఎలా అయింది?
విన్నానులే ప్రియా అనే పాట విశ్వనాథన్ తమిళంలో చేసిన ముత్తుకళో కణ్‌గళ్ అనేదానికి అనుకరణ. తమిళంలో అది ఎక్కువ బావుంటుంది. ఆ ఒరిజినల్ పాట కానడా బహార్ రాగంమీద చేసినట్టుగా అనిపిస్తుంది. అలకలు తీరిన అన్నది నేను వినలేదు కనక చెప్పలేను. లింక్ ఉంటే పంపండి.
అదేదో సినిమాలో రమణారెడ్డి చేగోడీల్ని ఫోర్కు తో తినే ప్రయత్నం చేస్తాడు. చాలా బావుంది ఈ ప్రహసనం. రోలు వెళ్ళి మద్దెల తో మొరపెట్టుకున్నట్టు – అన్న ముగింపు ఇంకా బావుంది.
దమయంతి గారు, నేను కళాశాలలో చదివేటప్పుడు, మా అధ్యాపకులు శ్రీ మొర్రం చంద్రశేఖరరెడ్డిగారు చెప్పేవారు – మీకు సందేహముగా ఉన్నప్పుడు, సంధి సరియో కాదో తెలియనప్పుడు, పదాలను విరిచి సంధి లేక వ్రాయడమే ఉత్తమము. విధేయుడు – మోహన
శ్రీయుతులు హర్షిత కామత్, మృణాళిని, కాత్యాయనీ విద్మహే, గొల్లపూడి మారుతీరావు, విన్నకోట రవిశంకర్, వాసిరెడ్డి నవీన్, జంపాల చౌదరి, చంద్ర కన్నెగంటి, శ్రీపతి, గౌరి కృపానందన్, ఆకెళ్ల సూర్యనారాయణ, శేఖర్ కమ్ముల తానా ప్రసంగములను వీడియో ద్వారా అందజేసిన శ్రీ బ్రహ్మానందం గొర్తిగారికి మనమంతా కృతజ్ఞులము. తానా ప్రత్యేక సంచికతో వీటిని కూడ జత చేసిన ఈమాట సంపాదకులకు మనము ఎంతో ఋణపడి ఉన్నాము. ఒక రెండు వీడియోలలో పునరుక్తి ఉంది (మధ్యలో మళ్లీ మొదటినుండి ఆరంభమవుతుంది). విధేయుడు – మోహన
రాగలహరి: ఆభేరి గురించి మోహన అభిప్రాయం:
09/10/2011 11:05 am
నాకు సంగీతం ఎక్కువగా తెలియదు. కాని కర్నాటిక్ సైటులో ముత్తుక్కళో కణ్గళ్ రాగము మధ్యమావతి అని ఉన్నది. ( విన్నానులే ప్రియా ) ఈ సైటులో మధ్యమావతి హిందుస్తానీ సారంగ్ రాగము లాటిది అని ఉన్నది.
విధేయుడు – మోహన
పలుకుబడి: సంఖ్యా పదాలు – 2 గురించి మోహన అభిప్రాయం:
09/10/2011 10:46 am
ఆరు అంటే నిండు, ఉపశమించు, వెండ్రుకలు (నూగారులాటి పదాలలో) అని అర్థము. సంఖ్యను సామాన్యముగా ఆఱు అని వాడుతాము. కాని యిప్పుడు బండి ఱ వాడడము లేదు కాబట్టి ఈ సందిగ్ధము, సందేహము కలుగుతుంది. రాణి తెలుగు పదము, రాజ్ఞి సంస్కృతపదము. అందువల్ల తెలుగు సంధితో పట్టపురాణి. సంస్కృతములో పట్టరాజ్ఞి అని అనుకొంటాను. పాదము అంటే ఈ సుభాషితము నాకు జ్ఞాపకానికి వచ్చింది. జ్ఞానసముపార్జన ఎలాగవుతుంది అనేది ఇందులోని అంశము.
ఆచార్యాత్ పాదమాదత్తే
పాదం శిష్యః స్వమేధయా
పాదం సబ్రహ్మచారిభ్యః
పాదం కాలక్రమేణచ
గురువువద్ద ఒక నాల్గవ వంతు, (teaching)
స్వయంకృషివలన నాల్గవ వంతు, (effort)
సహచరులతో నాల్గవ వంతు, (discussion)
మిగిలినది కాలక్రమేణ (experience)
విధేయుడు – మోహన
పలుకుబడి: సంఖ్యా పదాలు – 2 గురించి కామేశ్వరరావు అభిప్రాయం:
09/10/2011 9:14 am
ఆరుస్తావా అన్న పదంలో “ఆరు”కి ఉపశమింపజేయు అనే అర్థం వస్తుందనుకుంటాను. “పాతిక” పాద నుండి వచ్చుండాలి. పద్యంలో పాదం నాలుగోవంతు కదా! తమాషా ఏవిటంటే తమిళంలో పాది అంటే సగం అని అర్థం!
>>‘పాలాభిషేకం’, ‘పడుచాహారం’ అన్న సమాసాల్ని సీనీకవులు వాడితే అవి దుష్టసమాసాలని విమర్శించిన వారున్నారు కదా
మగధీరుడు, మగధీరని ఎవ్వరూ విమర్శించిన సాహసం చేసినట్టు లేదు! :-). మొదటి పదం తెలుగు, రెండవది సంస్కృతం ఉన్న సమాసాలు చాలా వరకూ ఆమోదయోగ్యమే అయినట్టున్నాయి. “పాలాభిషేకం”, “పడుచాచారం” వంటి చోట్ల ముఖ్యంగా అభ్యంతరకరమైనది సంస్కృత సంధులని వాడడమే అనుకుంటాను. ఇలాంటి చోట్ల తెలుగు సంధులనే చెయ్యాలి (“మూఁడస్త్రంబులు”లాగ). రాజ్యపుసిరి అన్నచోటకూడా తెలుగుసంధి జరిగింది.
అసందర్భం అనుకోకపోతే మరొక చమత్కారం. “పట్టభద్రుడు”లో ఉన్న “పట్టము” సంస్కృతమైతే మరి “పట్టరాణి” కాకుండా “పట్టపురాణి” ఎందకయ్యింది? మళ్ళా “పట్టమహిషి” ఎలా అయింది?
రాగలహరి: ఆభేరి గురించి Rohiniprasad అభిప్రాయం:
09/10/2011 6:03 am
విన్నానులే ప్రియా అనే పాట విశ్వనాథన్ తమిళంలో చేసిన ముత్తుకళో కణ్‌గళ్ అనేదానికి అనుకరణ. తమిళంలో అది ఎక్కువ బావుంటుంది. ఆ ఒరిజినల్ పాట కానడా బహార్ రాగంమీద చేసినట్టుగా అనిపిస్తుంది. అలకలు తీరిన అన్నది నేను వినలేదు కనక చెప్పలేను. లింక్ ఉంటే పంపండి.
గుర్రం జాషువా పాపాయి పద్యాలు గురించి ratnababu అభిప్రాయం:
09/10/2011 1:40 am
గుర్రం జాషువా గారు అద్భుత మహోన్నత మహిమాన్వితుడు. ఆయనను చూచి ఈ తరం కవులు నేర్చుకొనవలసినది చాలా వున్నది.
శ్రీ సోది సుబ్బయ్య గారి సొంత గోడు గురించి sujata అభిప్రాయం:
09/09/2011 11:39 pm
అదేదో సినిమాలో రమణారెడ్డి చేగోడీల్ని ఫోర్కు తో తినే ప్రయత్నం చేస్తాడు. చాలా బావుంది ఈ ప్రహసనం. రోలు వెళ్ళి మద్దెల తో మొరపెట్టుకున్నట్టు – అన్న ముగింపు ఇంకా బావుంది.
రాగలహరి: ఆభేరి గురించి chada sastry అభిప్రాయం:
09/08/2011 8:21 pm
మిత్రులందరికి,
శుభాభివందనలు. ఈ రోజే మొదటి సారిగా కలుస్తున్నా. విన్నానులె ప్రియా కనుగొన్నానులె ప్రియా ( బందిపొటు దొంగలు అక్కినేని, జమున ) మరియు అలకలు తీరిన కన్నులు ఏవని ప్రియా (మా నాన్న నిర్డోషి క్రిష్ణ ) ఈ పాటలు ఏ రాగంలొ కంపొస్ చేసారొ దయచేసి చెప్పగలరా ?
కోనసీమ కథలు: సత్తెవతి గురించి మోహన అభిప్రాయం:
09/08/2011 11:18 am
దమయంతి గారు, నేను కళాశాలలో చదివేటప్పుడు, మా అధ్యాపకులు శ్రీ మొర్రం చంద్రశేఖరరెడ్డిగారు చెప్పేవారు – మీకు సందేహముగా ఉన్నప్పుడు, సంధి సరియో కాదో తెలియనప్పుడు, పదాలను విరిచి సంధి లేక వ్రాయడమే ఉత్తమము. విధేయుడు – మోహన
తానా 2011 ప్రసంగాలు: సాంప్రదాయ సాహిత్యం గురించి మోహన అభిప్రాయం:
09/08/2011 9:47 am
శ్రీయుతులు హర్షిత కామత్, మృణాళిని, కాత్యాయనీ విద్మహే, గొల్లపూడి మారుతీరావు, విన్నకోట రవిశంకర్, వాసిరెడ్డి నవీన్, జంపాల చౌదరి, చంద్ర కన్నెగంటి, శ్రీపతి, గౌరి కృపానందన్, ఆకెళ్ల సూర్యనారాయణ, శేఖర్ కమ్ముల తానా ప్రసంగములను వీడియో ద్వారా అందజేసిన శ్రీ బ్రహ్మానందం గొర్తిగారికి మనమంతా కృతజ్ఞులము. తానా ప్రత్యేక సంచికతో వీటిని కూడ జత చేసిన ఈమాట సంపాదకులకు మనము ఎంతో ఋణపడి ఉన్నాము. ఒక రెండు వీడియోలలో పునరుక్తి ఉంది (మధ్యలో మళ్లీ మొదటినుండి ఆరంభమవుతుంది). విధేయుడు – మోహన
కోనసీమ కథలు: సత్తెవతి గురించి murthy అభిప్రాయం:
09/08/2011 3:36 am
కథ బావుంది. సహజంగా తప్పులు చూసే నాకు కనబళ్ళేదు, కోడి గుడ్డుకు లాగే ఈకల్ని పట్టించుకోనక్కర్లేదు.