పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16485

  1. గాన సూర్యకాంతి: బాలమురళి గురించి సాయి బ్రహ్మానందం అభిప్రాయం:

    11/06/2011 12:49 am

    కొండంత కృషి చేసిన తెలుగువారు ప్రస్తుతం శాస్త్రీయ సంగీతంపై పట్టుకోల్పోతున్నారన్న బాధే, నేను వ్యక్తపరిచిన నిరాశా, నిస్పృహాలకి కారణం రమగారూ! సాహిత్యంలో పసవుంటే దాని కాళ్ళమీద అదే నిలబడుతుంది. ఎవరి భుజాల ఆసరా అవసరం లేదు. కాదనను. అన్నమయ్యని మినహాయిస్తే, మిగతా వాగ్గేయకారులు ఎంతో కొంత భావ సౌందర్యం సంగీతంలో చూపించారనే నా భావన. అవి అత్యంత రమణీయాలు కాకపోయినా పాడుకుంటూ భావాన్ని అస్వాదించడానికి ఆస్కారం ఉన్నాయి. కేవలం వచనం ఒక్కటే ఇరికించ లేదు. బాలమురళిగారి రచనలు చూసాకా నాకలా అనిపించలేదు. అదే రాసాను. ముందు కాలాన్ని నిర్వచించలేమని తెలుసు. త్యాగరాజు తర్వాత అంత ప్రతిభగల మరో తెలుగు విద్వాంసుడు పుట్టడానికి వందేళ్ళ పైనే పట్టింది. రాను రానూ సంగీతం పట్ల తెలుగువారికి శ్రద్ధ తగ్గుతోంది. మరలా పుడితే మంచిదే! నా నిస్పృహా కాలం ఎంత సాగుతుందో చూద్దాం. అంతవరకూ బాలమురళే మనుకున్న వాగ్గేయకారుడు. ఇది చెప్పడానికి సంకోచించనవసరం లేదు.

    ఇహ అన్నమయ్య సాహిత్య స్థాయి వేరన్నది అందరికీ తెలుసున్నదే! నా పోలిక మిగతా వాగ్గేయకారుల గురించి: వేంకట మఖి తెలుగువాడేనని చెప్పడానికి కొన్ని ఆధారాలున్నాయి. ఆయన రచనలు “చతుర్దండి ప్రకాశిక”, “రాగలక్షణమ్” సంస్కృతంలో రాయవచ్చుగాక. కానీ ఆయన తండ్రి గోవింద దీక్షితులది తిరుపతి సమీపంలో ఉన్న గ్రామం. ఆయన సుమారు 1575 ప్రాంతంలో అచ్యుతప్ప నాయకునికి మంత్రిగా చేసాడు. తరువాత రఘునాధనాయకుడి వద్ద కొంతకాలం చేసాక చనిపోయాడు. తదనంతరం ఆయన కొడుకులెవరూ మంత్రి పదవులు చేపట్టకపోయినా రాజాస్థానంలోనే గడిపారు. వేంకటమఖి 1620 ప్రాంతంలో చత్రుర్దండి ప్రకాశిక రాసాడు. సుమారు ఆ కాలానికే రఘునాధ నాయకుడు రాజయ్యాడు. ఆయన పేరున వేంకటమఖి ఒక వీణ కూడా చేసాడు.

    కానీ మీరు చెప్పిన శరభోజి ఆ కాలంనాటి వాడు కాదు. మరాఠా నాయకులు 1675 ప్రాంతంలో తంజావూరుని పాలించారు. ఇదంతా ఎందుకు చెప్పానంటే, వేంకటమఖి లక్షణ గీతాలు రాసాడు. ఇవి కొన్ని సంస్కృతంలోనూ, తెలుగులోనూ ఉన్నాయి. లక్షణ గీతాలు పిళ్లారి గీతాల తరువాత అప్పట్లో నేర్పేవారు. ఇప్పుడు సరిగమలు వచ్చీ రాగానే, సరాసరి కృతుల్లోకే దూకేస్తున్నారనుకోండి. అది వేరే విషయం. వేంకటమఖి తెలుగువాడని చెప్పడానికింకో ఆధారం కూడా వుంది. ఆయన సంగీతం మీద చేసిన కృషికి వాళ్ళ వంశీకులు ఆయన మీద కొన్ని పాటలు రాసారు. అందులో “ముద్దు వేంకటమఖి” ముద్రతో కొన్ని తెలుగు పాటలు కట్టారు. ముద్దు అన్నది తెలుగు పిలుపే కదా? ఇవన్నీ చూసాక ఆయన తెలుగువాడనే చెప్పవచ్చు? అలాగే నాయకరాజుల కాలంలో తెలుగు, తమిళం రెండూ అధికార భాషలే కూడా!

    ఇహ మన తెలుగు వారి గౌరవాలూ, పురస్కారాల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. అర్హులకి దండేయడం మనకి చేతకాని పని.

    -సాయి బ్రహ్మానందం

  2. ప్రేమికుల దినం గురించి TADEPALLI అభిప్రాయం:

    11/05/2011 11:29 pm

    చాలా బాగున్నది.
    పద ప్రయోగము బావున్నది.

  3. ఒక (అ)నాగరిక ఆనందం గురించి nArAyaNa అభిప్రాయం:

    11/05/2011 5:36 pm

    అందరికీ ధన్యవాదాలు.

    రామకృష్ణ గారు, మీకు వేరే శీర్షిక స్ఫురిస్తే చెప్పండి.

    నారాయణ.

  4. కినిమా మాసపత్రిక: హాస్యనటుల అనుభవాలు గురించి Rohiniprasad అభిప్రాయం:

    11/05/2011 10:52 am

    ఇది బహుశా పరుచూరి శ్రీనివాస్ మాత్రమే చెప్పగలిగిన విషయం. పూనా ఫిల్మ్ ఇన్స్‌స్టిట్యూట్ film archivesలో కూడా ప్రయత్నించవచ్చు.

  5. ప్రజాపతి గురించి Bhavani అభిప్రాయం:

    11/05/2011 4:21 am

    కథనం చాలా బాగుంది. ఐతే తనమీద విప్లవించిన బౌద్ధాన్ని కూడా తన ధృతరాష్ట్రకౌగిలి లోనికి లాక్కున్న హిందూసామ్రాజ్యవాద ధోరణిని కూడా బహుశా తెలియకుండానే రచయిత ప్రదర్శించారు.

  6. గాన సూర్యకాంతి: బాలమురళి గురించి rama bharadwaj అభిప్రాయం:

    11/05/2011 1:50 am

    “ఆఖరి తెలుగు సంగీత వాగ్గేయకారుడేమో కూడానూ” లాంటి నిస్పృహని ప్రకటించడం చాలా తప్పు బ్రహ్మానందమ్ గారూ! ఆగామి కాలాన్ని మనం నిర్వచించలేము ఎప్పుడూ!! మన కళ్ళముందు కనిపించేదే స్థిరమూ శాశ్వతమూ ఎప్పుడూ కావు. బాల మురళికి ఉన్న పేరు కారణంగా ఆయన రచనలు [వాటిల్లో సాహిత్యం ఏమీ లేక పోయినా] అచ్చుపడడం జరిగింది. ఇందుకూ ఆయన తెలుగువాడు అయినందువల్ల అన్నది కారణం కానఖ్ఖరలేదు. సాహిత్యం అమోఘమైనది అయితే అదే నిలబడుతుంది. లేనప్పుడూ ఆయన శిష్య గణం వరకే అది పరిమితమైపోతుంది. దానికేం? అంత మాత్రాన ఆయన ప్రతిభకి కొరతా లేదు. ప్రతీ వాళ్ళకీ కొన్ని “లౌల్యాలు” ఉంటాయి. అందులో “కవి” ని అన్పించుకోవాలనే లౌల్యం ఉన్న వాళ్లని మనం ఎందరినో చూస్తూంటాం!! చిన్నాచితకా వాళ్ళే దీనికోసం తాపత్రయపడి ప్రయత్నాలు చేసుకుంటూండగా మరి సంగీతంలో గొప్ప మేధావి అయిన బాలమురళి ఒక్క “సూర్యకాంతి” వైపు అయినా వెళ్ళడా??:)

    ఇంక ఆయన చెప్పిన ఒక మాట ఆయన విషయలోనే కాదు తెలుగునాట చాలమంది విషయంలో పరమ సత్యం. అది ఏ గొప్పవ్యక్తికీ వాళ్ళ జీవితకాలంలో వాళ్ళకి దక్కవలసిన పురస్కారం గానీ ఆదరణ గానీ తెలుగునేల మీద దక్కకపోవడం అన్నది సత్యదూరం కాదు. తెలుగులో తెలిసి తెలిసీ కావాలనే మీడియోకర్ టాలెంట్ ని నెత్తికెత్తుకోవడం చేస్తూంటారు. ఇందులో వాళ్ళవాళ్ళ ప్రయోజనాలుంటాయి. ఇటువంటివి కళాకారులకి వికృతిగా కన్పిస్తాయి. బాలమురళీ చికాకు ఈ విషయలో చాలా నిజం మరి. డబ్బులున్న వాళ్లకి అభిరుచి ఉండదు. అభిరుచి ఉన్నవాళ్ళు రాజకీయాలు కూడా చేయగలిగిన వాళ్ళై ఉండాలి. చాలావరకూ ఈ రెండూ కలిసి ఉండేవే కావు.

    మీరు వాగ్గేయకారులనించి సాహిత్యాన్ని ఆశించకూడదని అంటారు. అని అన్నారు. కానీ అన్నమయ్య సంకీర్తనలు ఈ అభిప్రాయాన్ని తోసిరాజన్నాయి కదా?? తెలుగున గొప్ప సాహిత్యవేత్త ఎవరన్నా ఉంటే అది ముందు అన్నమయ్యే!! వేంకటమఖిని కూడా మీరు తెలుగువాడిని చేసేసేరు. కానీ చతుర్దండి ప్రకాశికని రాసిన వేంకటమఖి కన్నడిగుడు. తళ్ళికోట యుధ్ధానంతరం విజయనగర పట్టణం నేలకూలాకా మిగిలిన ప్రజ వలసలు పోయినప్పుడు సంగీత విద్వాంసులు కొందరు మైసూరు, మరి కొందరు తంజావూరు రాజ్యాలకి వలస వెళ్ళిపోయారు. అలా శరభోజి ఆస్థానం లోకి వెళ్ళిన వాళ్ళలో వేంకటమఖి తండ్రి కూడా ఉన్నాడు.

    రమ.

  7. పలుకుబడి: సంఖ్యాపదాలు – 3 గురించి Raja Piduri అభిప్రాయం:

    11/05/2011 1:38 am

    పదింబదిగ (లేదా) పది పదికి (లేదా) పదివేలకు : ఈ ప్రయోగాలకి “అన్ని విధాల, గట్టిగా, చక్కగా” అన్న అర్థాలిచ్చాడు బ్రౌన్ గారు. అది ఇక్కడ సరిపోతుందా సార్?

  8. కినిమా మాసపత్రిక: భానుమతిపై వ్యాసం గురించి Rohiniprasad అభిప్రాయం:

    11/05/2011 12:11 am

    Raja garu. Your observations are very perceptive.
    చందమామతో బాటుగా కినిమా బాధ్యతలు కూడా చేపట్టినందువల్లనేమో గాని ఈ వ్యాసంలో కొంతభాగం మరెవరో రాసి జత చేసినట్టుగా అనిపించింది. పత్రికకే తప్ప రచయితలకు పేరు రాకూడదనే చక్రపాణి పట్టింపు కారణంగా పూర్తిగా ఒకరే రాయాలనే నియమం పక్కన పెట్టినట్టుగా అనిపిస్తుంది. చందమామలో విచిత్ర కవలలు అనే సీరియల్ రాసిన రాజారావు గురించి కూడా ఎవరికీ తెలియదు.

  9. గాన సూర్యకాంతి: బాలమురళి గురించి srinivasaraov,khammam అభిప్రాయం:

    11/04/2011 3:48 pm

    getting two feelings happy and misery. It is our curse for not exploiting him.

  10. కినిమా మాసపత్రిక: హాస్యనటుల అనుభవాలు గురించి srinivasaraov,khammam అభిప్రాయం:

    11/04/2011 3:34 pm

    Sir,

    My father acted in JEEVANNMUKTI, BALANAGAMMA(GEMINI), BHUKAILAS(1st), and CHANDIKA. Can I get photos or songs of Master ViSWAM. It’s the greatest help for me.Or, any suggestions please?