పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16485

  1. గాన సూర్యకాంతి: బాలమురళి గురించి rama bharadwaj అభిప్రాయం:

    11/08/2011 11:47 pm

    మొదటి వేంకటమఖి నాయక రాజుల కాలం లోని వాడు కాగా ముద్దు వేంకటమఖి మరాఠా రాజుల కాలం వాడు. చరిత్ర వీరికి సంబంధించినది ఇంకా మొన్నటి కాలమే గనక ఎంతోకొంత స్పష్టం గానే ఉంది. పైగా మనకన్నా తమిళదేశస్థులు ఈ విషయంలో శ్రధ్ధ చూపించారు. పరిశ్రమ చేయగలిగిన వారికి సంగతులు తెలుస్తాయి.

    ఇంక సంగీత లక్షణ గ్రంధాలు అన్నీ సంస్కృతంలో ఉన్నాయి. సంగీతం + సంస్కృతం రెండూ బాగా తెలిసిన వారు వీటిని గురించి మాట్లాడగలిగిన వాళ్ళు. చర్ల గణపతిశాస్త్రి గారిలాంటి వాళ్ళు సంగీత రత్నాకరం వంటి గ్రంధాలని తెలుగు చేసారనుకుంటాను. ఎవరన్నా ఇటువంటి పనులు చేయడం లో శ్రధ్ధ చూపించగలగాలి. మన వాళ్ళు పైపై విషయాలు మాట్లాడేసి బతికేయడానికి అందులోంచి అరకొరగా విషయాలని వివరించడానికి అలవాటు పడిపోయి ఉన్నవాళ్ళు మరి:)

    మిగతా ఇతర శాస్త్రాలకి ఎలా అయితే లక్షణ గ్రంధాలున్నాయో, వాటి అనువాదాలున్నాయో సంగీతానికి సైతం ఉన్నాయి. ముందు తరాలు కృషి చేసి పెట్టాయి. మనం వాటిని నిలబెట్టుకోవడం లేదు.

    సంకీర్తనా లక్షణం సంస్కృతంలో అన్నమయ్య రాసినట్టూ దానిని పెద తిరుమలయ్య వ్యాఖ్యానం రాసినట్టూ దానిని అనుసరించి సంకీర్తనా లక్షణాన్ని తాను తెలుగు చేసినట్టూ అన్నమయ్య పెద్ద మనవడైన చిన తిరుమలయ్య చెప్పాడు. అందులో ఆనాటి సంగీత లక్షణ గ్రంధాల ప్రస్తావనలున్నాయి. ఈ పుస్తకం ఒకప్పుడు టిటిడి అచ్చువేసింది. ఇవాళ ఆ ప్రతులు సైతం లేవు. వాళ్ళు మళ్ళీ దీనిని కూడా తిరిగి ప్రచురించలేదు. టిటిడి కి మరి డబ్బులకి కొరత. పనిచేసేవాళ్ళకి కొరత. విశ్వవిద్యాలయాలు తెలుగున పనిచాతకాని వాళ్ళతోనీ ముందుచూపు లేని వాళ్ళ తోనీ కదా నడుస్తున్నాయి. అంచేత వాటినించీ మనం ఏదీ ఆశించడానికి వీలేలేదు.

    రమ.

  2. గాన సూర్యకాంతి: బాలమురళి గురించి బ్రహ్మానందం అభిప్రాయం:

    11/08/2011 7:51 pm

    రమ గారూ,
    మీరు ప్రస్తావించిన వేంకటమఖి మనవడు గురించి తెలుసు. కానీ ఆయనే లక్షణ గీతాలు రాసిన వ్యక్తి కాదేమోనని నా అభిప్రాయం. నేను వేంకటమఖి పూర్వీకులు తెలుగువారేనని చదివాను. నా పుస్తకాలు వెతికి వెలికి తీయాలి. ఎక్కడ వుందో? ఇది కూడా నేను సంపాదించిన చాలా పాత పుస్తకాల్లో ఉంది. ఎవరు ఈయన్ని తెలుగు వాడేనని రాసారో వెతికి చెబుతాను. దానికి కాస్త వ్యవధి కావాలి.

    కంచి పీఠాధిపతి చంద్రశేఖర సరస్వతి గురించి మీరు చెప్పినది నాకు తెలీదు. ఇహ రామామాత్యుల స్వరమేళకళానిధి ఆధారంగానే వేంకట మఖి “చతుర్దండి ప్రకాశికా” రాసినా, తన మేధస్సు కూడా జోడించి, కావాల్సినవి కొన్ని సంగ్రహించి, మిగతావి కొత్త ప్రతిపాదనలు చేసాడు. కొన్ని చోట్ల అయితే రామామాత్యుణ్ణి చాలా ఘాటుగా విమర్శించాడు. తప్పు పట్టాడు. మీరన్నట్లు ఇవి ఎవరూ తెలుగులో తిరిగి రాయడానికి ప్రయత్నించలేదు. సంగీత శాస్త్రం అంటే ఒక జడ పదార్థమన్న భావనే తెలుగు వారికి బలపడి పోయింది. విడమర్చి చెప్పే వారు లేక పోయారు.

    -బ్రహ్మానందం

  3. ఒక (అ)నాగరిక ఆనందం గురించి ramakrishna అభిప్రాయం:

    11/08/2011 7:06 pm

    నారాయణ గారు,మీ కవిత మొత్తమగా ఏమి చెపుతోంది,ఆధునికమయిన ప్రయాణములొ కూడ ప్రకృతిని చూసేటప్పటికి మనసు పరవశించి గతము వైపు పరుగెడుతోంది (లేదా బాల్యము వైపు). ఇది రెండు వ్యతిరేక దిశల ప్రయాణము. కాబట్టి దానిని స్ఫురించే విధంగా శీర్షిక ఉండాలని అనుకుంటాను.అది పొయిటిక్ గా కూడా ఉండాలని అనుకుంటాను. కనుక నేనైతే ఎండ_ నీడ అని పెడతాను.
    అభినందనలతో
    రామకృష్ణ

  4. పాఠకులకు సూచనలు గురించి subbarao అభిప్రాయం:

    11/08/2011 1:24 pm

    అయ్యా ! నమస్కారము. ఈ రకమైన సాహిత్య సేవ చేయు చున్నందులకు మిమ్ములను అభినందించుచున్నాను. నా రచనలు పద్య రూపములో పంపుదును. మీ అంగీకారము తెలియ జేయ గోర్తాను.

    ఇట్లు,
    సుబ్బారావు పోచిరాజు
    (రిటైర్దు తెలుగు పండితుడు)

    [పై సూచనల ప్రకారంగా మీ రచనలు పంపిస్తే, పరిశీలించి ప్రచురణార్హమైనదీ లేనిదీ మీకు తెలుపగలము – సం.]

  5. జనరంజని: మహానటి సావిత్రి గురించి nagaavrdhan అభిప్రాయం:

    11/08/2011 11:59 am

    I CONVEY MY HEARTFULL THANKS TO YOU FOR GIVING SUCH A RARE PROGRAMME

  6. రెండు కవితలు గురించి బొక్కా ప్రేమ్ కుమార్ అభిప్రాయం:

    11/08/2011 6:47 am

    పాలలో నీరుందని ఎలా తెలుస్తుంది ?
    తోడేసి మజ్జిగ చిలికే దాకా..

    ఏటిలో చిరుచేప ఎలా ఈదుతుంది?
    మొప్పలోని సత్తువ అయ్యేదాకా..

    మండుటెండలో దాహం ఎలా తీరుతుంది..
    చల్లదనం అందించే కోకు దొరికే దాక

    గుండె లోతుల్లొ ఏముందో ఎలా తెలుస్తుంది.
    తలుపుతట్టె ఆత్మీయత లభించే దాక…

    ఈ కవితకు ప్రశంస ఎలాదొరుకుతుంది
    చదివి స్పందించే కవి హృదయం దొరికేదాక…..

  7. గాన సూర్యకాంతి: బాలమురళి గురించి rama bharadwaj అభిప్రాయం:

    11/07/2011 12:39 pm

    బ్రహ్మానందమ్ గారూ!! మీరు భావించిన “ముద్దు వేంకటమఖి” చతుర్దండి ప్రకాశికాకర్త అయిన వేంకటమఖికి [ఈయన అసలు పేరు వేంకట దీక్షితులు] మనవడో లేక మునిమనవడో అవుతాడు. ఈ ముద్దు వేంకటమఖి కూడా సంగీతంలో చాలా కృషి చేసినవాడే!! సంగీత త్రిమూర్తులలో ఒకరైన ముత్తుస్వామి దీక్షితులి తండ్రి రామస్వామి దీక్షితులికి సంగీతం నేర్పినది ఈ “ముద్దు వేంకటమఖి” గారే!! ఈయన గారి ద్వారానే రామస్వామి దీక్షితారు గారు చతుర్దండిప్రకాశికని గ్రహించి తన కుమారునికీ అతడి సమకాలీకులైన త్యాగరాజాదులకీ మేళకర్త పధ్ధతిని అందించడమూ జరిగింది. మీరు ఇద్దరు వేంకటమఖిల మధ్య ఉన్న తేడాని గ్రహించలేదు.

    ఇకపోతే గోవిందదీక్షితులు వేంకటమఖి గారి తండ్రి. ఈయన అచ్యుతప్పనాయకునికి మంత్రిగా తంజావూరు నాయక రాజుల మన్నన గౌరవాలని పొందిన వారు. సంగీతంలో “సంగీతసుధ” అన్న గ్రంధాన్ని సంస్కృతంలో రచన చేసినవారు. గోవిందదీక్షితులవారికి [దాదాపుగా కృష్ణదేవరాయలకి అప్పాజీకీ ఉన్న బంధం లాంటిదే] అచ్యుతప్పనాయకునికీ రఘునాధనాయకునికీ మధ్యనున్న అనుబంధం కూడా!! తంజావూరు నాయక రాజులు గోవిందదీక్షితుల వారిని గౌరవంగా ” అయ్యా!” అని పిలిచేవారు. గోవిందదీక్షితులు తంజవూరు నాయక రాజ్యానికి ముఖ్య ప్రధాని. సరిగ్గా వేంకటమఖి, అలాగే ఆయన అన్నగారైన యజ్ఞ నారాయణ దీక్షితులు, ఇద్దరూ తమ తండ్రిగారి లాగే విజయరాఘవ నాయకుని కొలువులో ముఖ్య భూమికని పోషించినవారు.

    అయితే మీరు ఏ కారణంగా వీరిని తెలుగు వారిగా భావించారో నాకు తెలియదు గానీ వీరిని కన్నడ స్మార్త బ్రాహ్మణులుగా ఇతరులు పేర్కొనడం జరిగింది. ఇందుకు గోవిందదీక్షితులవారి దౌహిత్రుల తరుపువారు శాసనస్థ ఆధారాలు సైతమ్ చూపించడం, కంచి పీఠాధిపతి చంద్రశేఖర సరస్వతి సైతమ్ తమ తల్లి తరుపువారు గోవిందదీక్షితులికి కుమార్తె తరుపు వంశంవారని చెప్పుకోవడం మరొక ఉదాహరణ. వీరెవ్వరూ తెలుగు వారు కారు.

    ఇంక భాషల విషయం వస్తే… నాయక రాజులు తెలుగు వారు. వారి కాలంలో తెలుగు రాజభాష. తెలుగున అత్యధిక సంఖ్యాకులు రచనలు చేసిన వారు మనకి కనిపిస్తారు. తెలుగున కీర్తనలు రాయడం అంటారా? స్వాతి తిరుణాల్ నించి పాపనాశనమ్ శివం గారి నించి మైసూర్ వాసుదేవాచార్ ల దాకా తెలుగున కీర్తనలు రాసినవారే! తెలుగు సంగీత రచనకి అనువైన భాషగా వారంతా గుర్తించిన వారు. తెలుగువారే కాక బయటి వారు సైతమ్ తెలుగున కీర్తనలు రాయడమ్ ఇందుకు ఉదాహరణే! అదీకాక ఆనాడూ విజయ నగర రాజ్యం నించి మిగిలిన రాజ్యాల దాకా ప్రజలలో చాలా మందికి అన్ని దక్షిణాది భాషలూ వచ్చేవి. కన్నడం వారికి తెలుగు, తెలుగు వారికి మిగిలిన భాషలూను. భాషలలో సంయమనం ఆదాన ప్రదానాలూ విరివిగా జరిగిన కాలమ్ అది.

    అయితే మీరన్నట్టూ తెలుగు వారు సంగీత సంప్రదాయానికి ఎనలేని సేవ చేసిన వారు. సంగీతానికి సిధ్ధాంత భూమికని సమకూర్చినవారూ ఎందరో ఉన్నారు విజయనగర కాలం నించీ. రామామాత్యుల వారి “స్వరమేళ కళానిధి” -ఒక రకంగా “చతుర్దండి ప్రకాశిక”కి దారి చూపిన పుస్తకం ఇదే! ఈ పుస్తకం ఆనాడు ఎంతో ప్రచారంలో ఉండేది. అచ్యుతదేవరాయల పేర రామామాత్యులు “అచ్యుతరాజేంద్రమేళ వీణ” ని రూపొందించడానికీ, వేంకటమఖి “రఘునాయకమేళ వీణ” ని రూపొందించడానికీ ఉన్న స్వామ్యాన్ని గమనించండి. అలాగే తొలిగా మేళకర్తల విభజనని మొదలు పెట్టినదీ జన్య జనక రాగాల పధ్ధతిని చేసినదీ రామామాత్యులవారే!!

    మీ అభిప్రాయానికి ఈ విషయంలో విపులమైన వివరణ అవసరమని భావించాను. మీకు ఇంకా వేంకటమఖి విషయంలో సందేహం ఉంటే కన్నడిగులని ఎవరినైనా సంప్రదించి తెలుసుకోవచ్చును.

    మన దురదృష్టమ్ ఏమంటే – కర్నాటక సంగీత సంప్రదాయానికి సంబంధించి ఎన్నో గ్రంధాలూ, ఎందరో విద్వాంసులూ, మధ్య యుగాల నించీ కూడా చాలా కృషి చేసినప్పటికీ ఆయా పుస్తకాలు అచ్చులో విరివిగా దొరకక పోవడమూ చాలామందికి వాటిని గురించిన కనీసమైన సమాచారం కూడా తెలియకపోవడమూను. ఇందుకు శాస్త్రీయ సంగీత రంగం లోని వారు బాధ్యత వహించాలి. కానీ అసలు వారికి ఆ స్పృహ కనిపించదు. మనం ఏమీ చేయలేం.

    రమ.

  8. గాన సూర్యకాంతి: బాలమురళి గురించి Srinivas Vuruputuri అభిప్రాయం:

    11/07/2011 11:04 am

    “త్యాగరాజు కృతుల్లో భక్తి తప్ప ఇంకేవీ ఉండదు. నేను దానికి భిన్నంగా కృతుల్లో కవిత్వం జోడించాను. విప్లవ సందేశాలు జతచేసాను. స్ఫూర్తి సందేశాలు నింపాను,” అంటూ తన రచనలపై ఒక ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారాయన.”

    ఒకసారి రవీంద్ర భారతిలో “…స్వాతంత్ర్యమన్నా…” అని బాలమురళి గారు పాడగా విన్నాను. సాహిత్యమే కాదు, సంగీతమూ పెద్దగా ఆకట్టుకోలేదు.

    భక్తి, శృంగారాలు కాకుండా మిగతా రసాలను పట్టించుకుని కచేరీలలో పాడి ఒప్పించి, మెప్పించిన కర్ణాటక సంగీతకారులున్నారా?

    మరో ప్రశ్న: బాలమురళి ప్రభృతులు సమకాలీన/పూర్వ కవుల రచనలను ప్రచారంలోకి తెచ్చేందుకు ప్రయత్నించలేదా (భక్తి చట్రానికి అవతల)?

    సంగీత జ్ఞానము భక్తి వినా సన్మార్గము కలదా?

  9. అనుభవం గురించి Aditya Bhagavan Dhulipala అభిప్రాయం:

    11/07/2011 7:49 am

    ఇలా అంటున్నా అని ఏమనుకోవద్దు మాస్టారు…మీరేం రాద్దామనుకున్నారో మీకైనా clarity ఉందా?

  10. జనరంజని: మహానటి సావిత్రి గురించి Bhaskara Sarma అభిప్రాయం:

    11/06/2011 2:56 pm

    Sir
    magazine is excellent (beyond doubt).
    I have a request. Can you send me the interview (audio) with Smt.Savitri of November 2008.
    Please…

    Bhaskara Sarma