పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16485

  1. తిక్కన భారతంలో పలుకులపొందు గురించి rama bharadwaj అభిప్రాయం:

    11/22/2011 2:04 pm

    మంచి వ్యాసం! మనకి “దీపకళిక” అనడమ్ తెలుసు. కానీ తిక్కన “ఘర్మాంబుకళిక” అని వాడటం అపురూపమే!! పొడవు కొండ అని ఉండటం బహుశా అచ్చుతప్పు కావొచ్చు. అది పొడుపుకొండ ఏమో? “పొడుపుకొండమీద పొడుచుటమొదలుగా పరువుపెట్టి ఇనుడు పశ్చిమాద్రి… అన్న పద్యం లోనూ ఈ ప్రయోగం ఉంది. “ఆవులనేయి” లాగే ఆ అర్ధంలో లక్ష్మణ వజ్జల ఇంట ఒకరూకకి దొరికే భోజనాన్ని గురించి రాస్తూ, క్రీడాభిరామ కర్త “ఆలనేయి” అని వాడాడు.

    భాషా శాస్త్ర పండితులు రాయవలసిన వ్యాసాలు ఇలాంటివి చాలా బాకీ ఉన్నాయి. తెలుగు వాడకానికి సంబంధించి అన్నమయ్య సంకీర్తనల భాష మీద కూడా ఈ తరహా వ్యాసాలు చాలా రావాల్సిఉంది. క్లుప్తత కలిగిన వాక్యాలూ ..స్పష్టమైన వాక్యాలూ ఉన్న ఈ వ్యాసం చదవడానికి బాగుంది కూడా!

    అమూర్త మైన ఊహలు చేసిన ఆధునిక కవులూ ఉన్నారు. కానీ సంఖ్యలో బహుతక్కువే! వాల్మీకి చేసినపోలికలు చాలా గొప్పవి.

    ఇంక బాగులేని దానిని చెప్పడం కోసమ్ వారు చేసిన విమర్శ ఆ పోలికలూ కొంచెం కటువైనవే అయినా ఆలోచించవలసినవే! మగవారు గనక వారు నిస్సందేహంగా చెత్త రాసిన కవులని పోలికలతో చెండాడారు. ప్రాచీన కాలంలో ఒక్క కవులే ఎక్కువ ఉండటం అసలు కవిత్వమే రాయని స్త్రీలు ఉండగా అందునా చెత్త కవిత్వం అన్నదానికి మరివీలే లేదుగనక కాబోలు కుకవులని విటులతో పోల్చిన ఉదాహరణలున్నాయి. కానీ కవయిత్రులని వాళ్ళు వదిలేసేరు. మరి ఇవాళ ఈ ప్రజాస్వామిక యుగంలో .. కవిత్వం పేర చెత్త రాసే వారిని సంబోధించడానికి ఏ కొత్త పోలికలు చేయాలో ..అదీ కాక “కు విమర్శక” వర్గం కూడా పుష్కళంగా ఉన్న ఇవాళ ఒక తీరూ తెన్నూ లేకుండా మెచ్చుకుంటూ … ఓహోహో !! అనే బాకాసుర విమర్శకవర్గాన్ని ఏ రకమైన సంబోధనతో సంభావించాలో మనకి ఈ కాలపు భాష చెప్పడంలేదు. దూర్జటి “చదువులునేర్వని పండితాధములు” అని అన్నాడు. గనక ప్రస్తుతానికి దానితో సరిపెట్టుకోవాలి.

    రమ.

  2. చాటు పద్యాల్లో శ్రీనాథుడు గురించి achyuth kumar అభిప్రాయం:

    11/18/2011 4:58 am

    రావు సింగమ భూపాలుడు వెలమ కులము. గొప్ప వెలమ కులము.

  3. కొనసాగింపు గురించి Seetha Kumari Botcha అభిప్రాయం:

    11/17/2011 8:54 am

    చదువుతుంటే అలా కళ్ళ ముందు కనిపించింది దృశ్యం….మంచి కవిత ఇచ్చినందుకు ధన్యవాదాలు….

  4. మల్లె అంటు గురించి Seetha Kumari Botcha అభిప్రాయం:

    11/17/2011 3:48 am

    ఎంత చక్కని కవిత….

  5. పాస్‌పోర్ట్ గురించి sravy అభిప్రాయం:

    11/17/2011 3:19 am

    baagundi katha.

  6. ప్రజాపతి గురించి Dr. Estari Mamidala అభిప్రాయం:

    11/16/2011 5:29 pm

    మీ కథనం బాగుంది. కాని భావని అభిప్రాయం బాగాలేదు. హిందూ సామ్రాజ్యవాద ధోరణి అని అనడం సరి కాదు. బౌద్ధాన్ని హిందూ ధర్మం లాక్కున్న విషయం తప్పు. బుద్ధుడు అంటే శ్రీమహావిష్ణువే కదా. వీరందరు హిందూ దేవతలే ఐనప్పుడు బౌద్ధం వేరు హిందూ ధర్మం వేరు ఎలాఅవుతుంది అని భావని గారు గ్రహించాలి.

  7. రెండు కవితలు గురించి uma అభిప్రాయం:

    11/16/2011 2:37 pm

    ప్రశంస లో ప్రశ్న: చదివారు, అని తెలియటం కొరకా? నచ్చిందా లేదా అని తెలుసుకోడానికా? కొంత నచ్చింది!

  8. దృశ్య సంస్కృతి: సినిమా పోస్టర్లు గురించి Srinivas Nagulapalli అభిప్రాయం:

    11/16/2011 12:06 pm

    ఎప్పుడూ చూసే పోస్టర్ల వెనుక ఎప్పడూ చదవని విషయాలు అందించినందుకు కృతజ్ఞతలు.

    ఎందుకో అవసరాల రామకృష్ణారావుగారి మాట గుర్తొచ్చింది. ఇప్పుడు ఉందో లేదో కాని కొన్ని యేండ్ల క్రితం వరకు సినిమా పోస్టర్ల మీద “నేడే చూడండి” అని కనిపించేది. నేడే చూడండి, ఎందుకంటే రేపు ఉండదేమో అన్నారట వారు!
    పోస్టర్లు ఇంకొక విషయం కూడా చెప్తాయేమో అనిపిస్తుంది- వేసే వారివే గాక చూసే వారి అభిరుచులను.
    — ——–
    విధేయుడు
    _శ్రీనివాస్

  9. సత్యానికి దూరంగా గురించి బి.అజయ్ ప్రసాద్ అభిప్రాయం:

    11/16/2011 8:08 am

    ‘సత్యానికి చేరువగా’ అనే పేరుతో ఆంధ్రజ్యోతిలో వచ్చిన మీ కథ కూడా చాలా బాగుంది.

  10. ఈమాట కొత్త వేషం గురించి subbarao అభిప్రాయం:

    11/15/2011 7:22 pm

    ఈకొత్త వేషము బాగున్నది.అయితే ప్రతి రచయితని నిరుత్సాహ పరచకుండగా వారి వారి రచనలను ప్రచురించి ప్రోత్సహిస్తే ఇంకా బాగుంటుంది. ఆలోచించగోర్తాను.
    ఇట్లు,
    తమ మిత్రుదు,
    సుబ్బారావు పోచిరాజు