పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16485

  1. శర్మిష్ఠ, వేణుకుంజం నాటికల నుంచి పాటలు గురించి RANGAIAH అభిప్రాయం:

    11/24/2011 6:02 pm

    పరుచూరివారికి అభినందనలతో, మీరు అందించిన గాన మాదుర్యము ను పొగడడానికి నాకు భాష సరిపోవటం లేదు. 1960 ప్రాంతం లో వచ్చిన నిలువు దోపిడి లోని పాట “అయ్య లార ఓ అమ్మ లార” అంటూ పాడిన బుర్ర కధ ఎక్కడా దొరకడం లేదు. ఇటువంటి అరుదైన గీతాలు లభింపజేయ గలిగితే ఎంతో సంతోషం.
    కృతజ్ఞతలతో
    పర్వతాల రంగయ్య

  2. అనుభవం గురించి ramaadevi అభిప్రాయం:

    11/24/2011 10:43 am

    నాకు అర్ధం అయ్యింది చంద్రశేఖర్ గారు,
    కానీ రవళి ఇన్ని రోజుల తరవాత ఏమి చేయాలి లేక చేసుండచ్చు? ఇది మరీ ఇత చిన్న కధ రాసేంత చిన్న విషయమా?
    ఆ రోజు నిద్ర పట్టలేదు సరే మరునాడు ఏమి చేసాడు? దానికి ఏలా రియాక్ట్ కావాలి? అతని ఆత్మాభిమానం మాటో? విషయం చాలా గంభీరమైనది లోతయినది. ఇంత చిన్న కధలో ఇమడలేనంత. ఈ నెల చతుర లో కాలువ మల్లయ్య గారి నవల చదివారా?

  3. మూడు వందల రామాయణాలు గురించి ramaadevi అభిప్రాయం:

    11/24/2011 9:59 am

    Yes కుహనా సాంప్రదాయాలు, రాజకీయాలు may be true in case of “Such a long Journey” but not for removing this.
    In Koumudi there is a serial of Glorious India translation. People like me are really in a dilemma whether what we studied or our children studying in books is true or we are really brainwashed or kept away from the truth. There should be more/many discussion/s on such serious issues.
    It is very sad to see the intellectuals neglecting the actual serious issues like fast spreading mental, cultural pollution or social contradictions which are confusing the young minds but engaged in such petty things like an internal decision of an institute in which there is validity.
    it need not be “దుష్ప్రచారం” it can be inappropriateness in the context of syllabus in terms of students mind set to which it was a part of syllabus.

    To give an example of how it can affect : Sudha Murthy gave up her job to look after the family. But she never confined herself to four walls or just her family. During course of time she is even heading Infosys foundation. But personally I know so many educated men citing Sudha Murthy and made their wives confine to the family. Even many Women misunderstood her decision and gave up their career and confined to family. Neither the men nor the women saw to her social involvement and how she made use of her talents. I personally conducted a small quiz on Ramayana once and most people (22 to 45 years) could not answer the simplest questions. I doubt how many know Tara or Angada. Most students have little chance to get to know the basic story since we have nuclear families and the parents are busy making their wards either sent for coaching /tuition or making them watch some nonsensical cartoon or polluting and violent serials like WWF or roadies. Some intellectual parents insist on National geographic channel or such stuff but where is the chance for them to know the basic story? On top of it we get movies like Ravan/Villain where Rama is shown as a bad person. In such a situation is it appropriate to keep a literary work which doesn’t show even an iota of its glory/ What should be expected from the lecturer/professor to discuss in the class?
    I am an ordinary person from middle class. These are my views. Actually it is my agony about the indifference of the capable change makers who allow things to go wrong.
    Ramadevi

  4. మూడు వందల రామాయణాలు గురించి ramaadevi అభిప్రాయం:

    11/24/2011 9:20 am

    గౌరవనీయులైన అందరికీ
    నమస్కారము
    సురేష్ గారు మీరు రాసిన కారణాలు – ముఖ్యంగా 5వది నిజమే కదా, ఎందుకు దానికి ఇంత వ్యాఖ్యలు?
    మళ్ళీ ఇందులోని వారే (అంత వివాదాస్పదం కావాల్సిన విషయం ఏముందో అర్థం కాలేదు అన్న వారి లాటి వారు ఎడిటోరియల్ లో “కుహనా సాంప్రదాయాన్ని కొనసాగించింది” లాంటి అభిప్రాయాలని వెల్లడించిన వారే) చాలా మంది “ద్రౌపది” కి సాహిత్య అకాడమీ అవార్డు ఇవ్వడం గురించి బాధ పడతారు.
    అసలు రామాయణమే కాదు హిందు మతధర్మ ఆచారాలలో చాలా ప్రాంతీయపరమైన భేదాలు కన్పడతాయి. సూర్యమానం చంద్రమానం కానీ సుర్యమానం ప్రకారం నడిచే అందరికీ వొకే సారి వొకే నెలలు రావు. జ్యోతిర్లింగ క్షేత్రాలు చాలా వరకు వొకటే (కొన్ని క్షేత్రాల గురించి వివాదం వుంది) కాని వాటిలో పాటించే పూజా పద్ధతులు వొకటి కాదు. ఉత్తరంలో వొకటి అయితే దక్షిణంలో ఇంకొకటి. వేదాలు ఉత్తర భారతీయులకీ దక్షిణ భారతీయులకీ వొకటే అయినప్పుడు వొకటే పద్దతి వుండాలి కదా!
    ఈమాట చదువరులందరూ కనీసం 90 శాతం అంగీకరించేది హిందూ ధర్మఔన్నత్యాన్నిఅనుకుంటే దాని గురించి వదిలేసి, ప్రతిసారి ఇలా ప్రతిసారి “కుహనా సాంప్రదాయాలు, రాజకీయాలు” అంటూ వాటికి లేని ప్రాముఖ్యత కలిగేలా ఇలాంటి చర్చలే తప్ప నిజంగా ఏమీ చెయ్యట్లేదు. వొక సినిమా చూస్తేనే హీరో లాగా తామూ చెయ్యాలని, నాయిక అంటే పాటలకే పరిమితం అనేలా చేసే దర్శక నిర్మాతలని, హీరోలని, అవి చూపించే ప్రభావాలని వదిలేసి ఎక్కడో ఢిల్లీ యూనివర్సిటీ లో జరిగిన వొక చిన్న సంఘటనకి ఇంత చర్చ అవసరమా? ఈ రోజు, సర్దార్ పటేల్ స్టాట్యూల కంటే గాంధీ కాలనీల కంటే రాజీవ్ గాంధీ స్టాట్యూలు నగర్లూ కాలనీలూ ఎక్కువ. ఎందుకంటే అలా కాకుండా చెయ్యగలిగిన చాలామంది ఇలాంటి చర్చలలో లేక తమ పనులలో బిజీ గా వున్నారు. తెలుగు అకాడెమీ నాటక పోటీలలో సీత కి రావణాసురుడి మీద ఇష్టం తో నే వెళ్లింది అన్న నాటకం చూపిస్తే నేను మా పిల్లలకి సీతారాముల గొప్ప దనం ఏ విధంగా చెప్పగలనూ? అసలు రామాయణం గొప్పదనం తెలియని చాలామంది ఆ వయసు పిల్లలు ఈ వ్యాసం చదివి రామాయణం గొప్ప సాంస్కృతిక ప్రతీక అని ఎలా అభిప్రాయ పడగలరు?
    మీరు మీ మానసిక పరిపక్వతతో కాక ప్రస్తుతపు విద్యార్థి మనస్తత్వాన్ని దృష్టి లో పెట్టుకుంటే ఈ నిర్ణయం వెనుక సమంజసత్వం అర్ధం అవుతుందేమో!

  5. శర్మిష్ఠ, వేణుకుంజం నాటికల నుంచి పాటలు గురించి Siddineni Bhavanarayana అభిప్రాయం:

    11/24/2011 1:06 am

    ప్రియమైన శ్రీనివాస్ గారూ,
    It really would be an understatement that you deserve our gratitude on more than two counts. your meticulous probing into the origins of this genre and the time consuming, hard effort that must have gone into collecting these scattered, invaluable pieces of audio. But for your retrieval, these invaluable fragments would have been lost to oblivion. The happy fusion of chaste taste, rare perseverance, methodical erudition and unassuming deportment has so far been unprecdented in the realm of historicity of the recorded music of the Telugu speaking people. Please accept my humble thanks.

    yours lovingly,
    Siddineni Bhava Narayana.

  6. దృశ్య సంస్కృతి: సినిమా పోస్టర్లు గురించి Siddineni Bhavanarayana అభిప్రాయం:

    11/23/2011 10:28 pm

    ఫ్రియమైన శ్రీనివాస్ గారూ,

    i might be excused typing in Englsh. You sprang a pleasant surprise offering an authentic, well researched, albeit introductory essay. We know this is an alien field to you. We are accustomed to associate your name with vintage audio collection.

    I heartfully appreciate your thorough going approach to this branch of commercial enterprise.
    I am not qualified to offer a piece of advice. Yet I venture I would be more pleased if you had cut down, or even avoided using the passive voice. Looking forward to seeing more of such authentic material.

    Warm regards

    S B N

  7. ఎందుకు పారేస్తాను నాన్నా: కథ నచ్చిన కారణం గురించి as అభిప్రాయం:

    11/23/2011 9:17 pm

    I felt like reading my own story for a while. Not exactly the same but close resemblance. One side type chesina papers ni white side mottam right side vachchettu note books kuttevaaru maa father. adi choosi maa class teacher naaku books plus some more guides iccharu sri Chaganti Ramakrishna garu.

    ippudu ante first grade pillalaki kooda velaki velu kavalsi vastondi… appatlo moodu roopayalu leka excursion manesaa nenu ani naa kooturuiki chepte r u kidding dad?? u mean 3 rupees.. not even 10 cents… antundi…

    a very good heart touching story. Thanks for posting

  8. ప్రజాపతి గురించి as అభిప్రాయం:

    11/23/2011 8:54 pm

    somehow telugu typing is not working on my machine.
    కధనం బాగుంది. కాని అసలు బుద్ధుడు విష్ణుమూర్తి అవతారమే కాదే!!!

  9. సాయము శాయరా డింభకా! గురించి SaSi rEkha అభిప్రాయం:

    11/23/2011 5:52 pm

    నారాయణ స్వామి గారూ,
    మీ కథా శైలి ప్రావీణ్యత ఈ కథలో కొట్టొచ్చినట్ట్లు కనపడుతోంది. కథా వస్తువుకు అనుకూలమైన మంచి హాస్యం మేళవించారు. పాత్రల చిత్రీకరణా, సంభాషణ శైలీ, మనస్తత్వ విశ్లేషణా చదువరులని ఆకట్టుకునేలా ఉన్నాయి.

    అయితే, స్నేహ బాంధవ్యాల చిత్రీహకరణ మాత్రం కొంత కృత్రిమంగా అనిపించిది. ప్రవాస భారతీయులలో ఒకరికొకరు సహాయం చేసుకోవడం సర్వ సాధారణంగా చూస్తూ ఉంటాము. అది కొంత వరకూ అవసరం వల్లనే అయినా కొత్త స్నేహాలు రూపు దిద్దుకోవడం, స్నేహాలు ఆత్మీయతగా మారటం, దగ్గర కుటుంబాల్లాగా కలిసి పోవడం చాలా చోట్ల కనిపిస్తుంది. నాకు తెలిసినంత వరకు తెలుగు వాళ్ళు తెలుగు వాళ్ళతో కలిసినంతగా పరదేశీయులతో కలవడం సాధ్యం అయిన దాఖలాలు చాలా తక్కువ.

    నా అనుభవంలో ఎంత ప్రాణ స్నేహితుడైనా, అడిగిన సహాయాన్ని చెయ్యలేక చేతులెత్తేయ వలసిన సందర్భాలు ఎప్పుడో ఒకప్పుడు రాక మానవు. మీ కథలో సతీష్ పాపం శనివారం మధ్యాహ్నం మాత్రం కుదరదనన్నాడు. శని వారం ఉదయం కానీ ఆదివారం కానీ రాగలనని ఆఫర్ చేశాడు. ఆ ఒక్క ఉదాహరణని పట్టుకుని ‘అక్కరకు రాని చుట్టం’ గా తీర్మానించెయ్యటం ఎంత వరకు సమంజసం? అలాంటి కంక్లూషన్ కి రావాలంటే ప్యాటర్న్ అవసరం; ఒక్క సందర్భం సరిపోదు. ఆలోచించడి. పాపం ఆ పూర్ సతీష్ స్థానంలో రేపు మీరే ఉండొచ్చ్హు. మనసులో ఆత్మీయత ఉన్నా, నోరు తెరిచి అడిగిన స్నేహితుడికి సహాయం చేయ గలిగే పరిస్థితిలో ఆ ఒక్క సారీ ఉండలేక పోవచ్చ్హు. ఆ ఒక్క కారణం చేత తప్పుడు నిర్థారణకొచ్చెయ్యటం సబబు కాదని నా అభిప్రాయం.

  10. ప్రజాపతి గురించి Meduri Kishore అభిప్రాయం:

    11/23/2011 1:34 pm

    గౌతమ బుద్ధుని జీవిత చరిత్రను సమగ్రం గా చిత్రీకరిచారు రచయిత.
    ‘రోహిణీ యశోదలు’ అనేది ముద్రారాక్షసమనుకుంటా. ‘దేవకీ యశోదలు’ అని రాస్తే సరి పొయేదేమో.