పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16485

  1. మెలిక ముగ్గులు గురించి chantal jumel అభిప్రాయం:

    12/29/2011 8:21 am

    Dear mr Rao,

    I happen to read your poetry about dots and lines and I really love it
    As you can see through my link, I have been researching on kolam for many years; I am currently writing another book and speaking about lines and dots I would appreciate if you would give permission ton include your poetry. I will of course mention your name and web-site. Is there an english version to it?
    My regards
    Chantal Jumel

  2. శతకందసౌరభము గురించి TahaTaha అభిప్రాయం:

    12/27/2011 11:28 pm

    మోహన గారూ నమస్కారాలు
    మీకందాలు (అన్నీ పిడకలవటం కష్టం గానీ) బావున్నాయి. గిరాం మూర్తి గారి తల్లి అంటే సీతాపతి గారి బామ్మగారు చాలా అలవోకగా, “తాతా తొంగున్నావా ఈతాకుల పాకలోన ఇనుడుదయించెన్”, “కాంతామణి కన్నులోన కాకర పూసెన్,” అంటూ కంద పాదాలు చెపుతూ ఉండేవారని సీతాపతి గారి వ్యాసమొకటి చదివినది జ్ఞాపకం వచ్చింది . ఈమధ్య కాలంలో చదివిన వాటిల్లో నాకు నచ్చిన కందం ఆచార్య పొన్నపల్లి కృష్ణయ్య (ఆంధ్ర విశ్వకళాపరిషత్తు లో గణిత శాస్త్రాచార్యులు 1958-1992) గారిది:

    “పెళ్ళాం ఊరెళ్తే పొరు
    గిళ్ళల్లో పుల్ల కూర కెగబడతావా?
    ఛెళ్ళున చెంప పగలడం
    పళ్ళన్నీ ఊడి కిందపడడం ఖాయం”

    (బూరెలు లడ్డూలు, పద్య సంకలనం, చినుకు ప్రచురణలు, విజయవాడ, సెప్టెంబరు 2008, వెల అమూల్యం) .

    ఇన్ని కందాలు చదివాక ఒకందం చెప్పాలని తఃతః

    కందాల సొబగు తెలియను
    నందీశ్వరు డైన గాని నారదు డైనన్
    బృందారక విభు డైనను
    ముందాతడు నేర్వ వలయు ముద్దుగ తెలుగున్
    (పిడకైందా ? పేడ ముద్దేనా)

    అన్నట్టు మీ’ శ్రీ పాఠక’ ప్రయోగం బావుంది.

  3. కనువిప్పు గురించి KSH అభిప్రాయం:

    12/26/2011 5:53 am

    చాలా బాగుంది మీ కథ. నిజంగానే ఈ తరం గుర్తించవలసిన విషయం.

  4. మధ్యాహ్నం మాణిక్యం గురించి yssubramanyam అభిప్రాయం:

    12/26/2011 2:07 am

    చాలా బాగున్నది. హృదయపూర్వక నమస్కారములు.

  5. శర్మిష్ఠ, వేణుకుంజం నాటికల నుంచి పాటలు గురించి Rangaiah అభిప్రాయం:

    12/25/2011 6:14 am

    పరుచూరి శ్రీనివాస్ గారికి,
    చాల సంతోషం. నేను మెయిల్ రెక్వెస్ట్ పంపాను. ఒక చిన్న మనవి. ఈ పాట ను నేను ఏడవ తరగతి చదువుతున్నపుడు గూడూరు జిల్లాపరిషత్ మల్టీ పర్పస్ స్కూల్ 1967 లో పాడి అద్యాపకులను మురిపించాను. ఆ పాట వింటుంటే ఆ నాటి జ్ఞాపకాలు నెమరు వేసుకుంటాను.
    కృతజ్ఞలతో
    పర్వతాల రంగయ్య

  6. ఈమాట నవంబర్ 2011 సంచికకు స్వాగతం! గురించి హెచ్చార్కె అభిప్రాయం:

    12/25/2011 2:58 am

    ‘ఈమాట’తో ఒక రాత్రి
    భల్లే. నెట్గేర్‍ రూటర్ను సంధించి, మోడెమ్ సమస్యను దాటేసి, ఇపుడెంచక్కా ‘ఈమాట’ చదివేస్తున్నా. పత్రిక చాల రిచ్ గా వుంది. నవంబర్ సంచికలో సంపాదక వ్యాఖ్యలో ఇచ్చిన దారాలు పట్టుకుని వెళ్లి, ఎకె రామానుజన్ వి రెండు మంచి వ్యాసాలు చదివేశా. నిజ్జంగా చదువుకున్న మనిషి, తన చదువు లోంచి మాట్లాడితే ఎట్టా వుంటుందో తెలిసొచ్చింది. ‘Is There an Indian Way of Thinking?’ (భారతీయ చింతన అంటూ ఒకటి వున్నదా?) ను ఇంగ్లిష్ లో, ‘మూడొందల రామాయణాలు’ (Three Hundred Ramayanas: Five Examples and Three Thoughts on Translation) ను కొలిచాల సురేష్ గారి తెలుగులో చదువుతూ నిన్న నా రాత్రిని వెలిగించుకున్నా.
    మొదటి వ్యాసంలో కాంటెక్స్ట్ సెన్సిటివ్, కాంటెక్స్ట్ ఫ్రీ (సందర్భ గ్రాహ్యం, సందర్భ స్వతంత్రం) అనే భావనలను వివరించి, భారతీయ చింతన ఎక్కువగా ‘సందర్భ గ్రాహ్యం’ అంటారు రామానుజన్. (అంటే ఒక విషయాన్ని ఒక సందర్భంతో ముడిపెట్టి మాత్రమే చూడడం. అన్ని కాలాలకు అన్ని స్థలాలకు పనికొచ్చే సాధాణీకరణాలకు ప్రాధాన్యం ఇవ్వకపోవడం.) ఆయన చెప్పినట్లు ఈ వైఖరులు ప్రాంతీయమా (పశ్చిమం, ప్రాచ్యం), కాలీయమా (మునుపు, నేడు)? నాలో మొలకెత్తిన ప్రశ్నను తడుముతూ నిద్దరోయా. ఆధునిక (అర్బనైజ్డ్) భారతీయుల సంగతి వేరనుకోండీ అన్నట్లు మాట్లా‍డుతారాయన. కాని ఇదే కదా మన వర్తమానం. ‘పట్టణం’ ప్రవేశించని ప్రదేశం ఎక్కడుందిప్పుడు, (కవులు కథకుల మూర్ఖ స్వప్నాలు మినహా). పశ్చిమం మన కంటె ముందు యంత్ర విప్లవాన్ని ఆవిష్కరించడానికి కారణాలేమిటి? వాళ్లు మన కంటె తెలివైన వాళ్లు కావడం వల్ల మాత్రం కాదు. మరి? కేవలం మానస వీధులలో వెదికితే కారణాలు దొరుకుతాయా? అలాగని, కేవలం విపణి వీధులలో వెదికితే దొరుకుతాయా? రెండూ ముఖ్యమే. మానస సంచారానికి మంచి సందర్భం రామానుజన్ మరో వ్యాసం: ‘మూడొందల రామాయణాలు’
    రామాయణాలు… మనల్ని ఏం చేశాయి. భారత కథ చాల డైనమిక్ గా వుంటుంది. వింటున్నా చదువుతున్నా కళ్ల ముందు బతుకు కదులుతుంటుంది. భారతం చలనానికి, మార్పులకు మానసిక ప్రేరణ ఇస్తుంది. రామాయణం మనుషులను ప్రేక్షకుల్ని చేస్తుంది. ధర్మాన్ని నాటకీకరిస్తుంది. ధర్మం అంటే వున్న వ్యవస్థను కాపాడేది. ఉన్న వ్యవస్థను కాపాడడం ద్వారా అది మనల్ని కాపాడుతుందని తరతరాల నమ్మకం. మరో మాటలో ఇది యథాతథ వాది. హెయిరార్కియల్ గా ఒకరి మాటకు ఒకరు తలొంచడం సారాంశం. అలా వ్యవస్థను ఉన్నదున్నట్టు కాపాడుకుంటే నీ జీవితం ఏ ఒడిదుడుకులు లేకుండా సాగిపోతుందని ఆశ పెడుతుంది. ఎంచక్కా మొగుడు మొగుడుగా, రాజు రాజుగా, చాకలాయన చాకలాయనగా, శూద్రుడు శూద్రుడుగా, సేవకుడు సేవకుడుగా వుండొచ్చు. అలా వుండడమే ధర్మం. వీళ్లలో ఎవరికైనా అది ఇష్టం లేకపోతే, ఆ ‘అయిష్టం’ తప్పు అని వాల్యూ జడ్జ్మెంటు ముందే తయారైపోయి వుంది. ఆ ‘అయిష్టం’ తప్పు కాదు అనే విలువకు విలువ లేకుండా చేయడం వినా రామాయణం ఇంకేంచేస్తుంది? దీని గురించి అసలేమీ మాట్లాడని ‘రామాయణాల’ చర్చ వల్ల ప్రయోజనం ఏమిటి? వ్యవస్థ యథాతథంగా వుండడం ఎవరికి అనుకూలమో వారిని అలా వుంచుదాం. మిగిలిన వారికి రామాయణం స్థిరీకరించే ధర్మం వల్ల ప్రయోజనం ఏమటి? రామాయణం ఆదర్శీకరించే జీవన వైఖరిని వదిలించుకోనంత వరకు మన గురించి ఎలా ఆలోచించగలుగుతాం? ముందున్న ఆల్టర్నేటివ్స్ అన్నిటినీ చూసి, మన ఇష్టాన్ని మనం ఎన్నుకుని ఎలా అమలు చేయగలుగుతాం? మనలోని పలువురి ఇష్టాలలో ఏది ఎక్కువ న్యాయబద్ధమో, ఏది ఎక్కువ మందికి ఉపయోగకరమో ఎలా తెలుసుకోగలుగుతాం? ఉన్న చోట వుండడాన్ని ఆదర్శీకరించేది ఏదయినా అది (తప్పని సరిగా) మంచిది ఎందుకవుతుంది?
    రామానుజన్ గారి వ్యాసాలు ఇలాంటి ప్రశ్నలను తాముగా లేవనెత్తవు. ఆయన వ్యాసాల్ని మన వర్తమానం లోంచి మనం చదువుతాం. ఆయన తన విమర్శనాత్మకతో మొదలెట్టిన చింతనకు మనం మన విమర్శనాత్మకతను కలుపుకుని చదువుకుంటాం. గ్రంథంలో ఏమి చెప్పారనేదానితో పాటు, చెప్పాల్సి వుండి చెప్పనిది కూడా పఠనంలో భాగమవుతుంది. థాంక్ గాడ్, దీన్ని ఎవరూ నిషేధించలేరు.

  7. ఎగిరే కొబ్బరి చెట్టు గురించి తఃతః అభిప్రాయం:

    12/22/2011 8:22 am

    మూలా గారూ నమస్కారాలు.

    మీ కవితలో ఒక ఆనందం ఉంది. నేను పెద్ద కవినీ కాను, గొప్ప విమర్శకుణ్ణీ కాను కానీ ఒక విషయం. మీ కవితలొ ‘యెగిరే కొబ్బరి చెట్టు’ యెగిరి మీ గుండెల్లొకి రాలేదు నడుస్తూ వచ్చింది. వచ్చి లోతుగా పాతుకుపోయింది. (అంటే మీ కవితలొ కొబ్బరి చెట్టు అసలు ఎగరనే లేదు.) కవిత్వాన్ని ఇలా చూడవచ్చో లేదో నాకు తెలీదు.

    “He is no God who merely satisfies the intellect” అన్నారు గాంధీ. నేను దాన్ని కాస్త తిరగేసి “it is no poetry which merely touches the heart” అని కూడా చదువుకుంటూ ఉంటాను.

    నొప్పిస్తే క్షమించండి.
    ఉంటాను

  8. ఎగిరే కొబ్బరి చెట్టు గురించి Gangi Setty అభిప్రాయం:

    12/21/2011 11:33 am

    కిరణ్ గారూ! కవిత చాలా బాగుందండీ. అప్పుడప్పుడు అనిపిస్తుంటూంది. ఇక తెలుగు సాహిత్యానికి పాతర వేయాల్సిందేనా అని. మీ కవిత చూశాక అనిపించింది. ఈ తెలుగు గడ్డపై తెలుగు కు ప్ర్రాణం పోసే మీలాంటి వారు ఉన్నారని.
    నమస్కారం

  9. జనరంజని: మహానటి సావిత్రి గురించి Rama Prasad అభిప్రాయం:

    12/19/2011 11:21 pm

    Sreenivas garu,
    I am very greatful to you for giving us this treat. I vaguely remember to have listened to this program in 1979.
    One more thing is that after decades, I got to hear the full version of ‘vaddura kannayya’. Any source avaiable now a days is taken from the movie track, in which this part is cut and seems to have been lost forever. All these days I had been longing to hear the full song and what an unexpected place to finally get it!!! I will now try to add this bit to the song that I have.

    Thanks a lot once again.

  10. ఎగిరే కొబ్బరి చెట్టు గురించి ravikiran timmireddy అభిప్రాయం:

    12/19/2011 10:59 am

    బాబా గారికి,
    నేల బారు కవిత్వానికి, నేల మీద నిలబడి వ్రాసే కవిత్వానికి చాలా బేధమ్ వున్నది కదా. కవి తను ఏవి వ్రాయాలనుకుంటే అది వ్రాసే హక్కు వారికి వుంది. అలానే పాఠకుడు నాకిది ఇష్టమ్ అని చెప్పే హక్కు కూడా వుంది. బాగుండు అని అన్నానే గాని, ఇలానే వుండాలని చెప్పలేదు కదా బాబా గారు.