గుండె గోడల మీద వ్రేలాడే చిత్ర పటాలు ఈ చిన్ని కథలు!
****
అంతులేని శాఖోప శాఖలుగా భూమిన పరచుకున్న పేరు తెలీని ఓ మహా వృక్షం లాంటిది – ఈ సమాజము, ఈ జన సమూహమూ! విభిన్న మానవ మనుగడలను, జీవన వైవిధ్యాలను, విచిత్ర మనస్తత్వ విధానాలను గురించి తెలుసుకోవాలని ఉవ్విళ్ళూరుతూ వుంటాం. ఐతే, ఈ అంశాలని రచయిత – ఏ దృక్కోణం నుంచి పరిశీలించి, పరిశోధించి, చెబుతున్నాడా.. అనేదే రచనలో ఆసక్తిని రేకెత్తించే అసలైన విషయం అవుతుంది. నిజమైన పాఠకుని ఉత్సకత, తపన కూడా ఇదే. సరిగ్గా ఇలాంటి సందర్భాలలోనే ఆ రచయిత సామాజిక శాస్త్రవేత్త గా మారిపోతాడు( మారాలి కూడా). ‘రచయిత కి సామాజిక బాధ్యత వుంటుంది.’ అనే ఒక నైతిక శాసనానికి బహుశా ఇదే పునాది అనుకుంటా!
ఈ కథలు చదువుతున్నప్పుడు జాగ్రత్తగా పరిశీలిస్తే ఒక గొంతు వినిపిస్తూ వుంటుంది. పూర్తిగా చదివాక అదొక మనిషిదని గుర్తిస్తాం.
మనం మనుషులం. సందేహాల చిచ్చులం. లేకపొతే – మనకింత జ్ఞాన, విజ్ఞాన శా స్త్ర భాండాగారాలు లభించి వుండేవి కావు. ఒక్కోసారి డౌటేస్తూ వుంటుంది. వాచీ సరిగ్గానే తిరుగుతోందా, లేదాని! అప్పుడప్పుడు ఓ గొప్ప చిక్కు ప్రశ్నెదురౌతూ వుంటుంది. అసలీ జీవితం నిజమా? అబద్ధమా? అని. నవ్వుతూ మాట్లాడుతున్న మన ఎదుటి వాడి మనసులో ఏముందో తెల్సుకోవాలనే కుతూహలం కలుగుతూ వుంటుంది. కానీ, ఎలా తెలుసుకోడం ఈ నిజాల్నీ? తెల్సుకోవాలనే జిజ్ఞాస, తెలియరాక నిరాశా కలుగుతూ వుంటాయి. ఐతే, మనిషికి ఈ తపనంతా ఎందుకంటే – ఒక నిజం తెలుసుకోడం కోసం. నిర్ధారించుకోడం కోసం. అంతే. అదెలాంటి విషయమైనా సరే మనకి సందిగ్ధాలుండకూడదు. సందేహాలకి శాస్త్రీయ పరమైన నిరూపణ వుండాలని కోరుకుంటాం.
మనిషి తన నీడని చూసి తాను మొదట భయపడి పోయాడుట. ఆ తర్వాత కొన్ని క్షణాలకి.. ఆలోచనలో పడిపోయాడట. ఏమనంటే – తనకు కనిపించని ఈ నల్ల మనిషి తన వెనక మాత్రమే వస్తున్నాడా లేక అందరి వెంటా వస్తాడా అని. ఆ తక్షణమే తన తోటి వాళ్ళని తన పక్కనే నిలబెట్టుకుని, అందరి నీడల్ని పరిశీలించి ‘నీడ సహజమైన గుణమనీ, అది మనిషినుంచి విడ దీయ లేనిది’ అనీ కనుగొని తేలిక పడ్డాడట.
బ్ర్హమల్ని తొలగించుకుని, వాస్తవాల్ని నిర్ధారించుకున్నాక, కలిగే స్థిమితం పేరే శాంతి! దీని వల్ల మనకేం తెలుస్తుందంటే – తను కలసి జీవిస్తున్న జాతి వారిలో ఏక గుణ లక్షణాలు, స్వభావాలూ (అవి సహజమైనవైనా సరె, అసహజమైనవైనా సరే ) వుండాలని – మనిషి వాంఛిస్తాడు. ఇప్పటికీ ఈ మనిషి వాంఛ తీరడం లేదు.
పట్ట పగలే – కాగడాలు పట్టుకు తిరుగుతున్న ఓ ప్రఖ్యాత తత్వవేత్తని ‘నీకిదేం పిచ్చయ్యా?’ అని అడిగితే చెప్పాడట. ‘ఎక్కడైనా మనిషి కనిపిస్తాడేమో వెతుకుతున్నానని. ఆయన మాటల్లో – ఎంత గొప్ప అర్థం ద్యోతకమౌతుందో కదూ!?
ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే.. మాధవ్ గారి కాల్వినో అనువాద కథలు చదువుతున్నప్పుడు – గుప్ఫున గుర్తొచ్చాయి నాకివన్నీ!
చిన్న చిన్న కథలెప్పుడూ పెద్ద పెద్ద సత్యాలే చెబుతాయి. ఇవీ అలాంటివే. మనకు అర్థమైనా, కాకున్నా – మన జీవితాలకున్న అర్థాలు కేవలం రెండు. రెండే రెండు. కథ కైనా అంతే. “The ultimate meaning to which all stories refer has two faces: 1. the continuity of life, 2. the inevitability of death.” అని అంటాడు ఈ రచయిత. ఎంత బాగా చెప్పాడూ!, అనిపించింది నాకు – చదవగానే!
నాకీ కథలు బాగా నచ్చడానికి మరో కారణం. ఇవి అనువాద కథల్లా లేకపోవడం! కథల్లొ పూర్తిగా తెలుగు వాతావరణం నెలకొని వుండటం వల్ల.. మంచి తెలుగు కథలు చదువుతున్నఅనుభూతి కలిగింది. ‘ఇవి అనువాదాలు’ అని చెపితే తప్ప తెలీనంత సహజంగా వున్నాయి. ముఖ్యంగా చదివింపచేసే చక్కని శైలి వల్ల ఆసక్తి కరంగా వున్నాయి. కథలు చదవడమంటే నాకు చాలా ఇష్టం. మంచి కథలు – బాల్యం నాటి జ్ఞాపకాల్లా.. గుండె గోడల మీద ఫ్రేములు కట్టిన చిత్రాలై కూర్చుంటాయి. నిజానికి షార్ట్ స్టోరీస్ రాయడం కష్టం. చదవడం తేలిక. కాని, మర్చిపోవడం మాత్రం అంత సులభం కాదు.
మాధవ్ గారూ! మీరు పరిచయం చేయడం వల్ల నేనీ రచయిత గురించి మరింతగా చదివి తెలుసుకోగలిగాను. ఈ సందర్భంగా మీకూ, ఈ మాటవారికి నా అభినందనలు తెలియ చేసుకుంటున్నాను. మరిన్ని కాల్వినో రచనలతో బాటు, మరెందరో మంచి రచయితలని మాకు పరిచయం చేయగలరని ఆశిస్తూ…
శుభాభినందనలతో-
ఆర్.దమయంతి.
లైలా గారూ – మీరు తెలిసి అడుగుతున్నారొ తెలియక అడుగుతున్నారో అర్దంకావడం లేదు .మీప్రశ్న చూస్తె మీరు చిన్నవాళ్ళేమో అనిపిస్తొంది. ఇంతకుముందు మీరు రాసిన వాక్యాలు చూస్తె వెటకారం దట్టించి వదులు తున్న సిసింద్రీల్లా ఉన్నాయి. మీరు తెలియకే అడుగుతున్నారనుకొని ఈ రెండుమాటలు రాస్తున్నాను.
1.అపుడే పుట్టిన బిడ్డ ఏడిస్తె ఆనందం కలుగుతుందా బాధ కలుగుతుందా? బిడ్డ ఏడుస్తుంటే ఆనందించటమేమిటి అంటామా? (కథ అపుడే పుట్టిన బిడ్డ కాదుకదా అంటారేమో,నేను ఏడ్పుల గురించి రాస్తున్నాను.)
2.మనము బాధలో ఉన్నపుడు సానుభూతి తెలుపుతూ మిత్రులు బాధపడితే మనకు ఊరట లభిస్తుంది కద, దానిని ఒకరు ఏడిస్తే ఆనందించటం అనము గదా.
అలాగే ఒక బాధాకరమైన సంఘటన చూసినప్పుడు, విన్నప్పుడు,లేదా చదివినప్పుడు ఎదుటి వ్యక్తిలొ బాధ కలగడం మానవ సహజం. నిజానికి సాహిత్య ప్రయోజనము కూడా అదే. ఒక రచన చదివిన పాఠకుడు ఆ రచనలొ ప్రతిపాదించిన రసానుభూతికి లోనయితే ఆరచన గొప్పది అని అర్ధం.
అంత పాండిత్యం ఉండీ నేనీ లోకానికి అందివ్వ లేక పోతున్నానే..
వీరు నన్ను పూర్తిగా వినియోగించుకోలేక పోతున్నారే ..
అనే బాధ నిరాశ అయ్యలో ప్రగాఢంగా కనిపించేది..
రా.. రా ..
నీకు అరవిందుని ఊర్వశి చెప్తాను..
రా రా .. నీకు మిల్టన్ చెప్తాను ,.
అని తన చుట్టూ ఉన్న వారిని ప్రేమగా పిలిచే వారు..
ఈ కథ చదివాను. నాకేమీ అవలేదు. అసలు చాసో యే కథకూ నాకు యెప్పుడూ యే అనుభూతీ కలగలేదు. హెమింగ్వే తరహా యే ఆత్మాలేని చప్పిడి కథల పరంపరని గుడ్డెద్దు చేలో పడ్డట్టు పుణికిపుచ్చుకున్న చాలామంది రచయితల్లో చాసో ఒకడు. కథ చెప్పడంలో మనకో సజాతీయ లక్షణం వుంది. కథని మృష్టాన్నభోజనంలా సిద్ధం చేయడం… శ్రీపాద, విశ్వనాథ వాళ్లకు ఆ కిటుకులు తెలుసు. చాసోలాంటి చవిటిపర్ర కథకులు అనువాదసులభులు, పాశ్చాత్య విమర్శనా చట్రాల్లో ఒద్దికగా ఒదిగిపోయేవారు. శ్రీపాద లాంటి వాళ్ళు కాదు. వాళ్లని చదివి ఆస్వాదించేందుకు మన ఆత్మల్లో సజాతీయతత్త్వం యే అణువో మిగిలివుండాలి. అదీ తేడా!
నన్ను ఎవరో చదివారు గురించి Vijaya Bhanu Kote అభిప్రాయం:
02/07/2012 1:47 am
చాలా బావుంది…. లోతైన భావన… హృద్యమైన పదాలు….
నన్ను ఎవరో చదివారు గురించి Praveena అభిప్రాయం:
02/05/2012 2:57 am
లోతైన బావన. చాలా బాగుంది.
కాల్వీనో కథల నుంచి – 1 గురించి ఆర్.దమయంతి అభిప్రాయం:
02/05/2012 12:51 am

ఒక్క క్షణం గురించి reddi aditya అభిప్రాయం:
02/04/2012 9:54 pm
సినివాలి గారు – ఏదో కాదు, ఈ పోయమ్ లో తల తోక రెండూ మిస్సయినాయి.
రెండు విరుద్ధ భావాలు ఒకే గాట కట్టటం ఏమిటీ, పోనీ ఒక్కక్షణమే అనుకుందామంటే
అదీ ఒక్కక్షణమే అటున్నారు.
బహుశా ఏదో రాజకీయ నేపథ్యంతో రాయబోయినారేమో!
ఎందుకు పారేస్తాను నాన్నా! కథారచన గురించి reddi ramakrishna అభిప్రాయం:
02/04/2012 9:21 pm
లైలా గారూ – మీరు తెలిసి అడుగుతున్నారొ తెలియక అడుగుతున్నారో అర్దంకావడం లేదు .మీప్రశ్న చూస్తె మీరు చిన్నవాళ్ళేమో అనిపిస్తొంది. ఇంతకుముందు మీరు రాసిన వాక్యాలు చూస్తె వెటకారం దట్టించి వదులు తున్న సిసింద్రీల్లా ఉన్నాయి. మీరు తెలియకే అడుగుతున్నారనుకొని ఈ రెండుమాటలు రాస్తున్నాను.
1.అపుడే పుట్టిన బిడ్డ ఏడిస్తె ఆనందం కలుగుతుందా బాధ కలుగుతుందా? బిడ్డ ఏడుస్తుంటే ఆనందించటమేమిటి అంటామా? (కథ అపుడే పుట్టిన బిడ్డ కాదుకదా అంటారేమో,నేను ఏడ్పుల గురించి రాస్తున్నాను.)
2.మనము బాధలో ఉన్నపుడు సానుభూతి తెలుపుతూ మిత్రులు బాధపడితే మనకు ఊరట లభిస్తుంది కద, దానిని ఒకరు ఏడిస్తే ఆనందించటం అనము గదా.
అలాగే ఒక బాధాకరమైన సంఘటన చూసినప్పుడు, విన్నప్పుడు,లేదా చదివినప్పుడు ఎదుటి వ్యక్తిలొ బాధ కలగడం మానవ సహజం. నిజానికి సాహిత్య ప్రయోజనము కూడా అదే. ఒక రచన చదివిన పాఠకుడు ఆ రచనలొ ప్రతిపాదించిన రసానుభూతికి లోనయితే ఆరచన గొప్పది అని అర్ధం.
నన్ను ఎవరో చదివారు గురించి Babu Gouraveni అభిప్రాయం:
02/03/2012 11:51 am
చాలా బాగుంది జాన్ గారు….
మన సంస్థలు – మన సంస్కృతి గురించి adviatam అభిప్రాయం:
02/03/2012 6:22 am
niskarshaga unna vastavani chepparu sir..
ప్రేమ కవితలు గురించి pradeep అభిప్రాయం:
02/03/2012 3:10 am
మీ కవిత చాలా బాగున్నాయి. మీ కవితలు చదువుతుంటే నాకు కవితలు రాయాలని అనిపిస్తుంది. very nice
స్నేహితుడు, విమర్శకుడూ గురించి puttaparti anuuradha అభిప్రాయం:
02/03/2012 2:16 am
అంత పాండిత్యం ఉండీ నేనీ లోకానికి అందివ్వ లేక పోతున్నానే..
వీరు నన్ను పూర్తిగా వినియోగించుకోలేక పోతున్నారే ..
అనే బాధ నిరాశ అయ్యలో ప్రగాఢంగా కనిపించేది..
రా.. రా ..
నీకు అరవిందుని ఊర్వశి చెప్తాను..
రా రా .. నీకు మిల్టన్ చెప్తాను ,.
అని తన చుట్టూ ఉన్న వారిని ప్రేమగా పిలిచే వారు..
ఎందుకు పారేస్తాను నాన్నా: కథ నచ్చిన కారణం గురించి మెహెర్ అభిప్రాయం:
02/02/2012 3:08 pm