పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16481

  1. ఒక నేను, కొన్ని నువ్వులు గురించి danny అభిప్రాయం:

    02/11/2012 10:55 am

    టైటిల్ బాగుంది [ చాలా ] . కథ బాగుంది { కొంచెం }. రచయిత సుపర్ కానీ నా లాంటి వాళ్ళకి { half mind } అర్ధం అవ్వడానికి కొంచెం టైం పడుతుంది.

  2. సార్థక నామధేయుడు సంగీతరావు గురించి Rohiniprasad అభిప్రాయం:

    02/10/2012 10:53 pm

    సంగీతరావుగారి గురించిన విశేషాలు ఆయన రెండవ కోడలు సుధారాణిగారి బ్లాగ్‌లో చూడవచ్చు. ఆమె సాహిత్యాభిమాని కూడా.

  3. అసామాన్య సంగీతదర్శకుడు సి.ఆర్.సుబ్బరామన్ గురించి Rohiniprasad అభిప్రాయం:

    02/10/2012 7:07 am

    సుసర్లను గురించిన మంచి సమాచారం ఇక్కడ చూడవచ్చు. ఆయనను వ్యక్తిగతంగా కలుసుకుని ముచ్చటించాలని నేననుకున్నానుగాని ఆయనకు మతిమరుపు ఎక్కువయిందనీ, ఆరోగ్యం బాగాలేదనీ తెలిసినవారు చెప్పడంతో ఆ ప్రయత్నం విరమించుకోవలసివచ్చింది.

  4. సారా మానను గురించి జాన్ హైడ్ కనుమూరి అభిప్రాయం:

    02/10/2012 3:42 am

    వ్యాసం పెద్దదే అయినా వేళ్ళనుంచి మోచేతికి జారిపోతుంటే నాక్కుంటూ వెళ్ళిపోయాను.

    జాన్ హైడ్ కనుమూరి

  5. అసామాన్య సంగీతదర్శకుడు సి.ఆర్.సుబ్బరామన్ గురించి Rohiniprasad అభిప్రాయం:

    02/10/2012 12:56 am

    సుబ్బరామన్ తొలిసారిగా అవకాశమిచ్చి లైలామజ్‌నూ సినిమాలో పాటపాడించిన సుసర్ల దక్షిణామూర్తి ఆ తరవాత సంగీతదర్శకుడుగా పేరుపొంది మొన్ననే కాలంచేశారు. మాధవపెద్ది సత్యంతో కలిసి ఆయన పాడిన గీతం మనుచుగా తా ఖుదాతోడై.

  6. ఎందుకు పారేస్తాను నాన్నా! కథారచన గురించి rama bharadwaj అభిప్రాయం:

    02/09/2012 3:53 pm

    జంపాల చౌదరికీ తదితరులకీ ఈ కధ అంత గొప్పగా కనిపించిన కారణమేమో నాకు స్పస్టపడ్లేదు. వారి కారణాలు ఏమైనప్పటికీ.. ఈ కధ ఆ పాత కాలంలోని వారిని అసలు ఏ కారణంగా ఆకట్టుకున్నదీ కూడా నాకు అర్ధం కాలేదు. బహుశా జాలి అన్నది ఒక్కటే కారణమ్ కావొచ్చు. కానీ జాలి అన్నది కధా విషయం వలన కలిగే భావం. కధా వస్తువు ఎలా చెప్పబడిందీ అన్నదే ఎప్పుడైనా ఏ కధకైనా ముఖ్యమైన సంగతి అవుతుంది. ఇక్కడ వచ్చిన అభిప్రాయాలు ఏవీ కధ రాసిన పధ్ధతిని గురించి గానీ.. కధా టెక్నిక్ ని గురించి గానీ ఒక్క మాటా మాట్లాడలేదు.

    తెలుగు కధల మీద విమర్శ లోని లోటుబాట్లని చెబుతుంది ఈ ధోరణి. మెహర్ చెప్పినట్లుగా “చాసో కధలు” కధన”రీతి” లో పేలవంగా ఉంటాయి. అవి నిజంగా మనసుని ఏమంత ఆకట్టుకోవు. కధలోని విషయం మాత్రమే కధ కాదు. కధ అంటే అది రాయబడిన విధానం. కధా రచనలోని ముఖ్యమైన అంశమ్ ఎప్పుడూ “టెక్నిక్కే”! అది లేకపోతే ఒక సంఘటన అన్నది కధా రూపాన్ని ధరించనూలేదు. మెప్పించనూలేదు.

    ఈ కధలో చదివించే గుణమ్ లేదు. అదే ప్రధానమైన లోపమ్. కొట్టొచ్చినట్టు కనిపించే లోపమ్ కూడాను. ఆనాటి వాస్తవ పరిస్తితులు అలాంటివి అని ఎవరికి వారు నిట్టూర్పులు విడుస్తూ మెచ్చుకోవడం కధా విమర్శకి సంబంధించినది కాలేదు. అంత చిన్నవాడి మనసులోని అతలాకుతలమవగలంత సంఘర్షణని రచనా పరంగా ఈ కధ నిజంగా పట్టుకోలేదు. సూటిగా కధని పేనుకుపోవడం కధా రచనలో ఎప్పుడైనా నీరసమే! చాసో కధలు ఎక్కువభాగం ఇలాంటివే! ఆమాటకొస్తే తెలుగు కధ శిల్పపరంగా ఎదగని [తొలినాటి ఎందరో ” సీనియర్ల” ]కధలు ఇవాళ చదివితే అవి కూడా ఇలాగే ఉంటాయి. అలాంటి ఒకానొక నీరసమైన కధ ఇది. అంత గొప్పగా చెప్పుకోదగిన కధాలక్షణాలేవీ ఇందులోలేవు మరి.

    శ్రీ ఆదిభట్ల విద్యాసాగరూ! మీరు గమనించారో లేదో.. కధకుడు చాసో తనకధలోనే ..కొడుకు ఇల్లుకదలక పోవడాన్ని గురించి చెబుతూ.. ‘మొగుడుచచ్చిన ఆడదానిలా’ కృష్ణుడు ఇంట్లోనే ఉంటున్నాడని అన్నాడు. బహుశా లైలా వాడిన “ముండమోపి” దాని ఆధారంగా వచ్చిన భావ ప్రకటన కావొచ్చు.

    రమ.

  7. నాకు నచ్చిన పద్యం: అర్జునుడి ఎత్తిపొడుపు గురించి Satya అభిప్రాయం:

    02/09/2012 12:13 pm

    చాల చక్కని విశ్లేషణ! అర్జునుడి వినయంతో కూడిన పరాక్రమం స్పష్టం అయిన సన్నివేశం. అయితే సినిమాలో పూర్తి గా చూపించబడనిది ఏమిటంటే, కర్ణుడు యుద్ధం నుండి అర్జునుడి ధాటికి భయపడి చేతకాని వాడికి మల్లే రారాజుని విడిచి పారిపోతాడు. స్నేహం కోసం ప్రాణం ఇస్తాను అన్న పెద్దమనిషి చివరకి చేసిన నిర్వాకం ఇదే. కర్ణుడి స్వభావం పరిశీలిస్తే, అతను చాల సందర్భాలలో నిజానిజాలని పరిశీలించకుండా రాజుని శత్రుత్వం వైపే ప్రేరేపిస్తాడు. కారణం అతనిలో ఉన్న మత్సరమే! కర్ణుని పరాక్రమం, శౌర్యం గుర్తెరిగే భీష్ముడు అతనిని మహా రధుడిగా నిర్ణయించడు. ఇదే విషయం కర్ణుడు అంపశయ్య మీద ఉన్న భీష్ముడి దగ్గర అంగీకరిస్తాడు కూడా. కాగా, ఖాండవ దహనంలో అర్జునుడికి ప్రాప్తం అయిన శత్రువుల ద్వారా కర్ణుడికి పరోక్షంగా కొంత బలం ఏర్పడింది. ఇదే కారణంగా అతనితో యుద్ధం కొంత కష్టతరం అయ్యింది.

  8. వేణునాదం ఆగింది! గురించి TahaTaha అభిప్రాయం:

    02/09/2012 5:19 am

    గొల్ల పిల్లనగ్రొవి మళ్ళీ తెలుగు వాళ్ళకు దొరికేనా!

  9. వేణునాదం ఆగింది! గురించి Sujatha అభిప్రాయం:

    02/09/2012 12:25 am

    విజయ రాఘవ రావు గారి గురించి మరి కొన్ని విశేషాలు, అరుదైన ఫొటోలు నా బ్లాగు లో చూడండి

    http://narasaraopet-bloggers.blogspot.in/2012/01/blog-post.html
    http://narasaraopet-bloggers.blogspot.in/2012/02/2.html

  10. ఎందుకు పారేస్తాను నాన్నా! కథారచన గురించి vidyasagar sriadibhatla అభిప్రాయం:

    02/08/2012 2:38 am

    లైలా గారి అభిప్రాయం చదివాను. ముండమోపి చదువు అని ఎందుకనవలసి వచ్చిందో వివరించాలి. నిరక్షరాస్యత ప్రధాన సమస్యగా ఉన్నకలంలొ చదువు గురించి, చదువు విలువను గురించి రచయత వ్రాయాలనుకోవడం ఒక అభ్యుదయకరమైన ఆలోచన అవుతుంది. బోధనా రుసుము చెల్లించలేక పసివాళ్లు చదువుకోలేకపోవడం అనేది బాల్యానికి శాపం అని రచయత గుర్తించారు. తన కంటిఎదురుగా కనిపిస్తున్న ఒక వాస్తవాన్ని మనముందుంచే ప్రయత్నం చేసారు.
    మనం ఆనాటికి వలస పాలనలో ఉన్నాం. ఆ పాలకులు విద్యని కల్పించడం ఒక సామాజిక బాధ్యతగా గుర్తించని స్థితి ఉన్నది. రచయత ఈకోణంలొ పరిష్కారాన్ని ఆలోచిస్తే ఇంకా బాగుండేది. నిజానికి ఈపాటి చదువుకూడ అగ్రవర్ణాలవారికే అందుబాటులో ఉండేదనేది ఒక వాస్తవం.
    సామాజిక సమస్యకి వ్యక్తిగత స్థాయిలో పరిష్కారం వెదకడం ఒక్కటే లోపం కావచ్చు.
    vidyasagar sriadibhatla