పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16479

  1. పలుకుబడి: మానవ బంధుత్వ పదాలు 2 గురించి Chinthu అభిప్రాయం:

    05/05/2012 6:08 pm

    చింతు అంటే date-palm? నిజమా?

  2. పాఠకులకు సూచనలు గురించి Rohiniprasad అభిప్రాయం:

    05/05/2012 10:18 am

    ఇటీవలనే నేను ఒక వెబ్ సైట్‌కు సంబంధించిన డివిడిలను చూడడం తటస్థించింది. చిన్నపిల్లలకు ఇంగ్లీష్ అక్షరాలూ, అంకెలూ అన్నిటినీ సమర్థవంతంగా నేర్పేందుకు ఇవి చాలా బాగా పనికొస్తాయి. ఇటువంటివి తెలుగులో కూడా తయారుచెయ్యగలిగితే ఇంట్లోనే తెలుగువారు చిన్నపిల్లలకు తెలుగు అక్షరాలూ, అంకెలూ, చిన్న పదాలూ నేర్పవచ్చు.

    అమెరికాలోనూ, ఇతర దేశాల్లోనూ సాఫ్ట్‌వేర్ తదితర సాంకేతికరంగాల్ల్లోనూ, తెలుగుభాషాశాస్త్రంలోనూ, సినీ టెక్నాలజీ రంగంలోనూ పనిచేసే నిపుణులు ఇందుకు పూనుకుంటే ఈ పని సాధ్యమేనని నా కనిపించింది.

    డా. వేమూరి వెంకటేశ్వరరావుగారివంటి తీరికలేని ప్రొఫెసర్ తెలుగు నిఘంటువునే రూపొందించగలిగితే ఉత్సాహవంతులైన యువతీయువకులు ఇటువంటిది తప్పక చెయ్యగలరు. వీలుంటే ఈ డివిడిలను చూసి అందుకు ప్రయత్నించడం భావితరాలకు చాలా మంచి చెయ్యగలదు.

  3. బాలమురళీకృష్ణ గురించి Rohiniprasad అభిప్రాయం:

    05/05/2012 4:00 am

    త్యాగరాజుగారికి ధన్యవాదం చెప్పాలి. అది నా గురించి మంచి మాటలు చెప్పినందుకు కాదుగాని, సంగీతాభిమానులెవరూ సంగీతం గురించి రాసిన వ్యాసాలు పెద్దగా చదవరు అనే నా అభిప్రాయం తప్పని రుజువు చేసినందుకు!

  4. చందవరం, ప్రకాశం జిల్లా గురించి ravikiran timmireddy అభిప్రాయం:

    05/04/2012 4:59 pm

    నెల్లూర్లో, పత్తేగాను పేట పీతిరి గుంట సెంటర్ లో
    మా ఇరవయ్యో శతాబ్దపు వాటర్ హోల్, ఉన్నీ టీ బంకు.
    మొట్ట మొదటి ఖాతా అక్కడే, అప్పు తీసుకున్న వేడి టీని చప్పరిస్తూ
    ఖాతాలో రాసిన సిగరెట్టుని ఊదటంలో మజా నేర్చింది అక్కడే
    బతుకు పోరాటంలో అన్నీ మర్చిపోయి పదేళ్ళ తర్వాత పోతే
    ఏవి సారు ఎక్కడకిపొయ్యారు ఎలా వున్నారు అని
    ఆప్యాయంగా పలకరించిన ఉన్నీ ఇప్పుడక్కడ లేడు
    ఆ టీ బంకూ లేదు, ఎందుకు లేడో తెలుసుకునే ఓపిక నాకు లేదు
    కానీ ఉన్నీ, ఆ చిన్న పాక టీ బంకు, ఆ అద్భుతవైన టీ
    మాత్రం ముప్పై ఏళ్ళ తర్వాత కూడా
    నా మనసులో పదిలంగా ఉంది బహుశా
    ఊన్నీ ఖాతా పుస్తకంలో నా అకవుంటు ఇంకా కరంటేనేవో!

    -రవికిరణ్ తిమ్మిరెడ్డి

  5. ఆషాఢస్య ప్రథమ దివసే గురించి jayaprabha అభిప్రాయం:

    05/04/2012 2:53 pm

    బెజ్జాల కృష్ణ మోహన రావు గారూ !

    మందాక్రాంత వృత్తాన్ని గురించి మీరు రాసిన వ్యాసానికి మీరు పాఠకులనించి స్పందనని ఆశిస్తే నాకని పించిందీ ..మీకు తెలుగు పాఠకుల మీద ఎంతటి నమ్మకం ఉండి ఆశించి ఉంటారో కదా అని. నేను ఈ అభిప్రాయం ఎందుకని రాస్తున్నానంటే … నా అనుభవం మీకు ఏమన్నా ఉపయోగపడవచ్చునేమో అని మాత్రమే!

    ప్రతీ వ్యాసానికీ ప్రతీవారూ పాఠకులు కారు. కాలేరు కూడాను. వారి వారి స్థాయిని అనుసరించి మాత్రమే ఒక రచనని ఆయా పాఠకులు స్వీకరించగలుగుతారు. మీ వ్యాసాన్ని గురించి మీరు చందస్సుని సాధికారంగా తెలిసిన వారిన్నించీ గనక స్పందనని ఆశిస్తే బహుశా …మీ ఆశకి ఫలితం ఉంటుంది. వికాశ్ విన్నకోట నిజాయితీగా తన నిస్సహాయతని తెలియజేశాడు. అందుకు అతడిని అభినందించాలి. ఇంక గొర్తి బ్రహ్మానందం అన్నట్టు… రకరకాల కారణాలకి గానూ వ్యక్తులు “మౌనం” గా ఉంటూంటారు. నేను ఏనాడో చెప్పాను. చదువుకున్న పాఠకులు తెలుగులో వచ్చే మంచి రచనల పట్ల చూపించే ఉదాశీనత వలన … మంచి పుస్తకాలు రాసేవారు క్రమేపీ తెలుగున కనుమరుగౌతారని. మనం నిజంగా అసలు విషయాల మీద చర్చించడాన్ని ఏనాడో మాని వేశాము.

    నేను అన్నమయ్య పదపరిచయం చేస్తూ రెండు పుస్తకాలని ప్రచురిస్తే .. దానిమీద మామూలు పాఠకులు ఎక్కువగానూ “చదువుకున్న” పాఠకులు నిశ్సబ్దంగానూ స్పందించేరు. కొన్ని వేల సంకీర్తనలతో ఒక దశాబ్దం పాటు ఏకదీక్షగా పని చేస్తే..!!

    ఏతావతా నాకు అనుభవం అయ్యిందేమంటే .. తెలుగున ఒక పుస్తకం మీద స్పందన తెలియజేయడానికే శక్తి చాలని వారో లేదా ఆసక్తి చాలని వారో ఉన్నా .. నేను ఏనాడూ నిరాశ పడలేదు. ఎందుకంటే రేప్పొద్దున్న వికాస్ విన్నకోట లాంటి కుర్ర వాళ్ళు తెలుగు పట్ల నిజంగా ఆకర్షితులై .. విషయాలని తెలుసుకుందామని అనుకుంటే వాళ్లకి అక్కరకొచ్చే పుస్తకాలు ఉండాలి.

    అందుకని మీరు రాయవలసి ఉంది. పైగా మీకు చందస్సు అంటే ఉన్న ఇస్టం ..చందస్సుని గురించి మీకు చెప్పవలసిన విషయం బలంగా ఉండటమే ముఖ్యం!! మిగిలినవి కావు. ఆగామి కాలం ఏ రచనలని స్వీకరిస్తుందో.. వేటిని జారవిడుస్తుందో.. తెలిసిన వారేరీ?? ఉన్నారా నిజంగా ??

    అయితే గాఢమైన విషయాలని రాసేవారికి “ప్రోత్సాహం” తప్పకుండా అవసరమే !! కానీ అది కొరవడిన కాలమ్లో ఉంటున్నామన్న స్పృహ రాయడానికి మరింత ప్రేరణనే కలిగించాలని నేననుకుంటాను. మీవ్యాసం మందాక్రాంతం గురించి మరింత బాగా తెలిసిన వారికి చేరాలని మాత్రం ఆశిస్తాను.

    యాధాలాపమైన రచనలకి… అలాగే ఏ సాహితీ బలం చాలని రచనలకీ పనిగట్టుకుని అతిగా “ఒహోఓహోలూ” నిజంగా సాహితీ విలువ కలిగిన రచనల విషయమ్లో మాత్రం నిశ్సబ్దాలూ … ఉదాశీనతలూ… ఏ కాలమ్లోనూ ఏ జాతీ గర్వపడదగిన విషయాలు కానేరవని మాత్రం చెప్పగలను.

    జయప్రభ.

  6. ఆషాఢస్య ప్రథమ దివసే గురించి మోహన అభిప్రాయం:

    05/04/2012 1:59 pm

    బ్రహ్మానందంగారికి, వికాస్ గారికి, మీ అభిప్రాయలకు కృతజ్ఞతాపూర్వక వందనాలు.

    వికాస్ గారు – మీరు ముందుంచిన విషయాలు చాల ముఖ్యమైనవి. నా అనుభవమువల్ల నేను నేర్చుకొన్న కొన్ని పాఠాలను మీముందు, అలాగే మిగిలినవారి ముందు ఉంచడానికి ప్రయత్నిస్తాను. (1) ప్రతిరోజు ఒక గంట లేక గంటన్నర ఏదో ఒక సాహితీ పుస్తకాన్ని చదివితే ఎంతో ఉపయోగకారిగా ఉంటుంది. ఒక గంట చాల తక్కువ సమయములా తోచవచ్చును. కాని 20, 30, 40 యేళ్ల కాలములో ఇది తక్కువ కాదు. ఎన్నో కొత్త పుస్తకాలు చదవడానికి వీలవుతుంది, ఎంతో నేర్చుకోడానికి వీలుపడుతుంది. ఇలా చేస్తే ఒంటరిదనము కూడ మరచిపోవచ్చును. (2) చదివేటప్పుడు అర్థము కాని పదాలు కనబడినప్పుడు, నిఘంటువును సంప్రదించి అర్థాలు తెలిసికోవాలి. సుమారు ఒక వేయి పుటలకన్న తక్కువగా ఉండే నిఘంటువు చాలు ఈ కార్యానికి. మిగిలినవాటికి ఆంధ్రభారతివారి నిఘంటువు సైటును చూడవచ్చును. మొట్టమొదట పదాలకు అర్థాలు వెదకడములోనే సమయమవుతుందని బాధపడవచ్చును. కాని కొన్నాళ్లకు చాలా పదాలకు అర్థాలు తెలియడమువల్ల ఇలా వెదకడము తగ్గుతుంది. (3) పాత కవిత్వమయినా, కొత్త కవిత్వమయినా దేనినయినా చదవడానికి ఎన్నుకోవచ్చును. శ్రీశ్రీ కవితలలోని కొన్ని పదాలకు నిఘంటువు తప్పని సరి ఇప్పటికీ. కావ్యాలకన్నా, అందులోని కొన్ని భాగాలను పఠనీయాంశాలుగా ఎన్నుకోవచ్చును, ఉదా. నన్నయ దుష్యంతుని కథ, తిక్కన ఉత్తరగోగ్రహణము, శ్రీనాథుని హంసదూతము, పోతన రుక్మిణీ కల్యాణము, శ్రీరామచరిత్ర,, పాపరాజు కుశలవుల రామాయణ గానము, మున్నగునవి. (4) అంతర్జాలములో ఎన్నో పుస్తకాలు ఉచితముగా లభ్యము. టీకాతాత్పర్యాలతో చాల పుస్తకాలు ఉన్నాయి. వాటిని సులభముగా ఇక్కడినుండి, ఇక్కడినుండి దిగుమతి చేసికొనవచ్చును. ఇవి కొన్ని సలహాలు మత్రమే. మిగిలినవి ఆసక్తిపైన ఆధారపడినవి.

    విధేయుడు – మోహన

  7. ఆషాఢస్య ప్రథమ దివసే గురించి chavakiran అభిప్రాయం:

    05/04/2012 12:14 pm

    వికాస్ గారు,
    తెలుగు పుస్తకాలు చదవదానికి ఇండియా రాక కోసం ఆగక్కరలేదు. చక్కగా కినిగెలో చదువుకోవచ్చు. Visit kinige.com for more details!

  8. ఆషాఢస్య ప్రథమ దివసే గురించి vikas,vinnakota అభిప్రాయం:

    05/04/2012 4:38 am

    గౌరవనీయులు జెజ్జాల కృష్ణ మోహన రావు మరియు సంపాదకులకు నామస్కారం

    నేను, అమెరికాకి వచ్చి రెండేళ్ళు అయ్యింది, చిన్నపుడు 10వ తరగతి నుంచి మొదలు పెట్టిన వృత్తి విద్యలొ పట్టా కోసం వేట ఈమధ్యే పూర్తి అయ్యింది. నాకు జెజ్జాల కృష్ణ మోహన రావు గారి వ్యాసాలు చదివినప్పుడు ఒక రకం ఐన depression వస్తుంది. Sir, మీ వ్యాసాలు నాకు అర్ధం కాక పోయినా, తెలుగు భాషలో నా తెలియనితనం అజ్ణానం తేటతెల్లం అవుతోంది. ఈమధ్య ఎందుకో, దూరంగా ఉంటున్నందుకో ఏమో భాష మీద మమకారం, నేర్చుకోవాలన్న తాపత్రయం పెరుగుతోంది, కాని మీరు రాసిన ఋతుపర్ణము, కామవేదం లాంటి కవితలు లేదా మీరు ఎంతో శ్రమకోర్చి, పరిశోధించి రాసే వ్యాసాలు ఐనా సరే, పూర్తిగా కాదు కదా పావు వంతు ఐనా నాకు అర్ధం కావడం లేదు. దయచేసి తప్పుగా అర్ధం చేసుకొకండి. భాష సంస్కృతి అంటూ పెద్ద మాటలు పక్కన పెడితే ఆఖరికి సినిమా పాటలు కూడా కొన్ని సార్లు అర్ధం కాని పరిస్థితిలొ ఉన్న నాలాంటి వాడు తెలుగు నేర్చుకోవాలి అంటే అసలు వీలు పడుతుందా?

    ఈ ఒక్క సందర్భమే కాదు ఎప్పుడన్న పైత్యమో భక్తో ప్రకోపించి ఏ రుద్రమో, శంకర భాష్యాల అనువాదాలో netలో వెతికి పట్టుకున్నా నాలాంటి వాడికి ‘ఒం” ‘నమహ్’ తప్ప ఇంకో ముక్క అర్ధంకావు. వాటికి అర్ధాలు తెలియవు.

    ఈసారి, India వెళ్ళినప్పుడు ఊరగాయలు కాకుండా, ఓ నాలుగు పుస్తకాలు కొనుక్కుంటే చాలు, కాని ఎక్కడ మొదలు పెట్టాలి ఎలా మొదలు పెట్టలి అన్నదే ప్రశ్న? మీ వ్యాసానికి ఏరకంగాను సంబంధం లేక పొయినా దయచేసి నాకు దైవపరమైన పుస్తకాలు, భాష బాగు పడడానికి ఉపయుక్త కారమైనవి ఏమన్న సుచించమని మనవి.

    అలాగే పత్రికా ముఖంగా మరొక్క మనవి, ఈ-మాట గ్రంధాలయంలో కొంచం పురాణ వాఞ్ఙయాలని చేరిస్తే బాగుంటుంది అని నా అభిప్రాయం, నాబోటి వాళ్ళు ఏమన్న అర్ధం కాక పొయినా అనుమానాలు, అర్ధం కాని విషయాల వ్యక్తం పెద్దలు వివరించగలరు అని ఆశ పడుతున్నాను.

    పెద్దలు, నేను ఏదన్నా తప్పుగా మాట్లాడితే అది నా చిన్నతనం అని మన్నించగలరు.

    వికాస్ విన్నకోట

  9. బ్రహ్మ సృష్టి గురించి Aditya Bhagavan Dhulipala అభిప్రాయం:

    05/04/2012 4:08 am

    కలి కామరూపుడు. బావుంది మాస్టారూ! 🙂

  10. అద్దంలో జిన్నా: కథ నచ్చిన కారణం గురించి Saradhi Motamarri అభిప్రాయం:

    05/04/2012 2:49 am

    Tilak’s ‘addaMlo jinnah’ is one of my favorite katha. I didn’t much bother whether it is kavita or essay or katha. But I haven’t come across any comparable artifact. Actually, it is high time to talk about this story to every Telugu person not just India but across the globe. Though he wrote about Jinnah, it looks not different to me from the current genre of politicians who want to break Andhra into pieces for their breakfast.