పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16439

  1. గెలుపు గురించి Sugunakar అభిప్రాయం:

    08/01/2025 2:02 pm

    కథ చాలా బాగుంది. రచయితకు అభినందనలు!

  2. గెలుపు గురించి Dsn Murthy అభిప్రాయం:

    08/01/2025 12:27 pm

    చక్కని కథ.

  3. ‘తెల్ల ఏనుగు’ అనువాద నవల గురించి రచయిత జయమోహన్‌తో సంభాషణ గురించి జగన్నాధం శ్రీకంఠం అభిప్రాయం:

    08/01/2025 11:13 am

    చాలా గొప్ప సమాచారం అందించారు రచయిత !

  4. జూన్ 2025 గురించి Rao Vemuri అభిప్రాయం:

    07/27/2025 8:30 pm

    “తెలుగులో కూడా ఛందోబద్ధంగా అర్థవంతమైన పద్యాలను సృష్టించే యంత్రాలు ఈపాటికే ఉండిఉండాలి. లేకపోతే, మరోఆరు నెలలలోనో సంవత్సరంలోనో తెలుగు ఛందస్సు కూడా యంత్రబద్ధం అయిపోతుంది.” – ఇది జరగాలంటే తెలుగులో ఉన్న వచన, పద్య సంపదలు అంతర్జాలం ద్వారా విస్తృతంగా Chat GPT వంటి యంత్రాలకి అందుబాటులోకి రావాలి. అనగా అంతర్జాల మాధ్యమాలలో తెలుగు వాడుక పెరగాలి.

  5. జూన్ 2025 గురించి భవానీ శంకరం అభిప్రాయం:

    07/27/2025 1:58 am

    చివరి వాక్యం ఆశకు మొదటి మెట్టు

  6. పంచేంద్రియాలు: 4 రుచి గురించి జయదేవ్ మెట్టుపల్లి అభిప్రాయం:

    07/20/2025 12:25 am

    మీ వ్యాసం చాలా బాగుంది.రుచులకు కొత్త కొత్త తెలుగు పదాలు పరిచయం చేశారు. మంచి పరిశోధనా వ్యాసం. “అన్న” గారిలా మాంసాహారం తినడం మంచిదికాదన్నారు?

  7. శతజయంతులు: కంటకాలు, కిరీటాలు గురించి Dhanikonda Ravi Prasad అభిప్రాయం:

    07/15/2025 1:14 am

    వ్యాసం గొప్పగా ఉంది. పోతనని ఇష్టపడని ఆంధ్రుడు, కవిత్రయాన్ని ఇష్టపడని తెలంగాణావాడు ఉండరు. ఇక వేమనని ఇష్టపడని తెలుగువాడే ఉండడు. ఇక ఉత్సవాల విషయానికి వస్తే ప్రాంతీయద్వేషాలే ఒకరి జయంతి జరపటానికి, మరొకరి జయంతి జరపకపోవటానికి కారణమైతే గర్హించాలి. అది లేనప్పుడు నిర్వహణా సమస్యలుగానే భావించాలి. ఇక ఆరుద్ర, దాశరథుల పోలిక వస్తే ఆరుద్ర కవి, దాశరథి కవి మాత్రమే కాక ఉద్యమకారుడు కనుక ఆయన స్థానం కొంత ఎక్కువదే.

    ఇక తెలంగాణా ఉద్యమం సంగతి వచ్చింది కనుక – (1) తెలంగాణాను ప్రేమించటం (2) ప్రత్యేక తెలంగాణా ఉద్యమాన్ని సమర్థించటం, (3) ప్రత్యేక తెలంగాణా కోరే పార్టీ ఒకదాన్ని సమర్థించటం మూడూ వేరు వేరు విషయాలు. ఒక వ్యక్తి ఆంధ్రావాడో, తెలంగాణావాడో ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాన్ని వ్యతిరేకించినంత మాత్రాన వాడికి తెలంగాణా ద్రోహి అని పేరు పెట్టటం తప్పు. అలాగే దాశరథి తెలంగాణా ఉద్యమాన్ని వ్యతిరేకించినా అతన్ని తెలంగాణా శత్రువుగా భావించటం తప్పు.

  8. తెలుగు భాష ఎవరిది? గురించి అవధానం రఘు కుమార్ అభిప్రాయం:

    07/13/2025 1:53 am

    వలస వాదపు అనుభవాలలో సామీప్యత ఉండడం వేరు, ఒకటే అవ్వడం వేరు అని నా అభిప్రాయం. ఆఫ్రికా, ఆసియా, అందులోనూ ఇండియా, … అన్నీ వలసవాద అనుభవంలో నలిగిపోయినా అక్కడి ప్రాంతీయ పరిస్థితుల నుండి అక్కడి మేధావులు భిన్నంగా స్పందించారు.

    వలసవాదాన్ని భారత జాతీయ వాదం రాజకీయ కోణం నుండి ప్రధానంగా, సుదీర్ఘ తాత్విక ఆధిక్యత కల ఒక సమూహంగా అధిక శాతం ఇండియన్ మేధావులు చూస్తే, కొందరు అది తరతరాల బానిసత్వం నుండి విముక్తి మార్గంగా కొందరు చూశారు.

    ఇండియన్ మార్క్సిస్టులు వర్గ పోరాట దృష్టి నుండి చూస్తే ఆఫ్రికన్ మార్క్సిస్టులు సాంస్కృతిక దాడి అనే దృష్టితో చూశారు. గూగీ మీద ఫ్రాంజ్ ఫానోన్ ప్రభావం ఉంది. ఫ్రాంజ్ ఫానోన్ లాంటి మార్క్సిస్టులు ఇండియాలో రాలేదు. అందుకే గూగి తనను ఫ్యానోయియన్ మార్క్సిస్టు అని నిర్వచించుకున్నాడు.

  9. పంచేంద్రియాలు: 5 స్పర్శ గురించి Rao Vemuri అభిప్రాయం:

    07/12/2025 8:14 pm

    శర్మ గారూ,

    మీరు లేవదీసిన రెండు ప్రశ్నలకి సాధికారంగా సమాధానాలు ఇవ్వగలిగే ప్రజ్ఞ నాలో లేదు. అయినా నాకు తోచిన సమాధానాలు ఇస్తాను.

    దోమలని అదుపులో పెట్టడం మీద machine learning బాణం ప్రయోగించిన అనుభవం కాసింత ఉంది కాబట్టి ఆ సందర్భంలో సేకరించిన సమాచారపు సారాంశాన్ని ఇక్కడ పొందుపరుస్తున్నాను. దోమలు కొందరిని కరవడానికి (కుట్టడానికి) ఎక్కువ మక్కువ చూపుతాయి. ఈ “అభిమానానికి” అనేక కారణాలు ఉన్నాయి. వాటిలో అగ్రగణ్యమైనవి: జన్యు సంప్రదాయం, శరీరపు రసాయనతత్త్వం, పర్యావరణ కారణాలు.

    జన్యుసాంప్రదాయం: దోమలకి O జాతి రక్తం అంటే ఎక్కువ ఇష్టం. కొందరి శరీరాలలో చయాపచయ ప్రక్రియలు (metabolic activities) ఎక్కువ జోరుగా జరుగుతాయి. ఈ వ్యక్తులు ఎక్కువ కార్బన్ డై ఆక్సయిడ్ (CO2) ని, వేడిని విడుదల చేస్తారు. భారీ శరీరాలు ఉన్నవారూ, గర్భిణీలు కూడా ఎక్కువ కార్బన్ డై ఆక్సయిడ్ ని విడుదల చేస్తారు. దోమలకి ఈ రెండూ ప్రీతికరమైన పదార్థాలు. అంతేకాదు. కొందరి శరీరాలనుండి వెలువడే వాసన (కంపు) దోమలకి ఇష్టం!

    ముదురు రంగు బట్టలు దోమల్ని ఆకర్షిస్తాయి.

    జనమేజయుడు సర్పయాగం చేయబూని విఫలం అయినట్లు మనం “దోమ యాగం” చెయ్యబూనుకోవడం నిరర్ధకం అని నా అభిప్రాయం. మనం చెయ్యగలిగేదల్లా మనం సంచరించే స్థావరాలలో దోమలు నివసించడానికి ప్రతికూలమైన వాతావరణం కల్పించడమే.

    పొతే, మీరు అడిగిన రెండవ ప్రశ్నకి సమాధానం. ఎండలో నిలబడి (పడుక్కుని) చర్మాన్ని కముల్చుకోవడం (కాల్చుకోవడం) అంత అభిలషణీయమైన ప్రక్రియ కాదు. మరీ పాలిపోయినట్లు ఉన్న చర్మం అందంగా ఉండదని, తాత్కాలికమైన ఫలితం కోసం తెల్ల వారు గంటలకొద్దీ ఎండలో పడుకుంటారు. కానీ, ఈ ఆచారం చర్మానికి “ముసలి రూపు” తొందరగా తీసుకు వస్తుంది. పైపెచ్చు కేన్సరు వంటి రోగాలు రాడానికి అవకాశాలు పెరుగుతాయి.

    ఎండలో ఉండే హానికరమైన అత్యూద కిరణాల ధాటి నుండి రక్షణ పొందడానికి కనీసం SPF (Sun Protection Factor) 50 ఉన్న లేపనాలు వాడాలి. ఇవి కూడా వాటి ప్రభావాన్ని నాలుగైదు గంటలు మాత్రమే చూపుతాయి. ఇటువంటి రక్షక లేపనాలు వాడినంత మాత్రాన విటమిన్ డి తయారీకి ఆటంకం రాకూడదు. ఎందుకంటే రోజూ చేతులకి, కాళ్ళకి, ముఖానికి 15 నిమిషాలు సూర్యరశ్మి తగిలితే చాలు మనకి కావలసిన విటమిన్ తయారవుతుంది. అంతకీ అవసరమైతే ఒక మాత్ర వేసుకోవచ్చు.

  10. అన్నపూర్ణ సర్క్యూట్ ట్రెక్ – 1 గురించి Seshagiri Nimmagadda అభిప్రాయం:

    07/12/2025 6:53 am

    Thank you Ramakrishna garu and Srinivas garu for you feed back and kind compliments.
    We are glad you are enjoying reading our article on the treks in the Himalayas.
    Seshagiri