ఇక్కడ కొన్ని విషయాలు ఏంటంటే, M. కల్బుర్గిగారు మత విషయాలలో- హిందూ మతం పట్ల – కొంత విశృంఖలంగా, దారుణమైన వ్యాఖ్యలు- ఉదా: శివలింగపైన మూత్ర విసర్జన చేసినా తప్పులేదు (అది కూడా అభిషేకం లాంటిదే అన్నట్లుగా) చేసేవారు.
దురదృష్టం ఏంటంటే చాలామంది ఉదారవాదులు హిందూమతం పట్ల ఎలాంటి వ్యాఖ్యలు చేసినా తప్పులేదు అనుకుంటారు కాని ఇతర మతాలలో వున్న తప్పులను ఎత్తిచూపే ధైర్యం చూపరు. M. కల్బుర్గి లాంటి వారు తమకు వాక్ స్వాతంత్రం వుంది అనుకుని పరిమితులని దాటి అతి తీవ్రమైన, హేయమైన విమర్శలు చేసి సమాజంలో తీవ్ర అశాంతిని కలగచేసారు.
PS: ఇది కల్బుర్గి గారి పైన చేసిన దారుణకాండకు సమర్థింపు కాదని మనవి.
ముస్లిం పాలన మొదలయ్యాక వచ్చిన భక్తి ఉద్యమ ప్రభావంతో దేశ భాషలు వెల్లివిరిసాయి […]
ఇదో పెద్ద బూటకం. శంకరాచార్య, నాయనారులు. ఆళ్వారులు ఇస్లాం దండయాత్రలకు కొన్ని వందల ఏళ్లకు ముందే భక్తి ఉద్యమాన్ని ఆరంభించారు. కాబట్టి, భక్తి ఉద్యమ ప్రభావమే దేశ భాషలు వెల్లివిరిసాయనుకుంటే దానిపై ఇస్లాం ప్రభావం ఏమీ లేదని అర్థం చేసుకోవాలి. (ఈ లెక్కలు ఆధునిక చరిత్రకారుల కాలగణన ప్రకారం. సాంప్రదాయ విశ్వాసాలైతే ఇంకో వేయేళ్ల ముందు మొదలైంది నాయనారులతో భక్తి ఉద్యమం.)
ఇంకా చెప్పాలంటే, భక్తి ఉద్యమానికి ముందున్న మౌఖిక ప్రజా సాహిత్యం ఏదైనా దొరికితేనే కదా మనం పోల్చి చూసుకోవాల్సింది? దొరకలేదు కాబట్టి భక్తి ఉద్యమానికి ముందు ప్రజల భాషలో ఏ ప్రజా సాహిత్యమూ లేదనడం అశాస్త్రీయం.
వేదాలలో ఉపయోగించిన స్థాయి భాష అలా పరిణమించడానికి అంతకు ముందు ఎన్ని వేల లేదా వందల ఏళ్ల పాటు స్థానిక భాషలలో ఎంత సాహిత్యం వచ్చి ఉండాలో కదా. అది కచ్చితంగా లిఖితమే అయి ఉండక్కర్లేదు. మౌఖికమైనా కావచ్చు.
[అచ్చుతప్పులు, భాషాదోషాలు లేకుండా ఉండడానికే ఈమాట ఎల్లప్పుడూ ప్రయత్నిస్తుంది. మాకు కనిపించిన దోషాలు సవరించాము. ఇంకా ఇందులో ఉన్న అచ్చుతప్పులు తెలియజేస్తే మాకు సహాయం చేసినవారవుతారు. — సం.]
డి ఆర్ నాగరాజు గారు తన “ఫ్లేమింగ్ ఫీట్” లో దళిత ఉద్యమాలలో తమ గతం పట్ల ద్వేషం, అసహనాన్ని గుర్తిస్తాడు. అది తప్పు అని కూడా అంటాడు. అలాగే దళిత ఉద్యమాలలో చైతన్యం అంటే గతపు అలవాట్లు, ఉదా: గొడ్డు మాంసం ఉద్యమం లాంటివి, వాటిని ప్రశ్నిస్తాడు.
విషయం ఏమిటంటే భారతీయులలో, అన్ని వర్గాలలో, ప్రాంతాలలో గతం పట్ల అపారమైన ద్వేషం, లేదా అపారమైన ప్రేమ … ఏది ఏమైనా గతంలోకి ఎక్కువగా ప్రయాణం చేయడం, గతంలో తమకు అన్యాయం జరిగింది, ఆ అన్యాయం చేసిన వారిని గుర్తించి శిక్షిస్తేనే తాము ముందుకు వెళతాం అనే భావనతో పాటు, ఇస్లాం, క్రిస్టియానిటి తమకు స్వేచ్ఛను ఇచ్చాయి అన్న భావన కూడా ఉంది. అంటే గతం అంటే తక్కువలో తక్కువగా 2000 ఏళ్లు వెనక్కి వెళ్లాలి అనే భావన కూడా ఉంది.
బహుశా ఈ తిరోగమనం అన్ని రంగాలలోనూ ప్రతిఫలిస్తూ వుంది. కమ్యూనిస్టులు కూడా అదే భావజాలం లోకి వెళ్ళిపోయారు.
నిన్న బసవణ్ణ, నేడు కల్బుర్గి గురించి Ramesh kumar అభిప్రాయం:
08/05/2025 2:49 am
మీ వ్యాసం చదివానండి.
ఇక్కడ కొన్ని విషయాలు ఏంటంటే, M. కల్బుర్గిగారు మత విషయాలలో- హిందూ మతం పట్ల – కొంత విశృంఖలంగా, దారుణమైన వ్యాఖ్యలు- ఉదా: శివలింగపైన మూత్ర విసర్జన చేసినా తప్పులేదు (అది కూడా అభిషేకం లాంటిదే అన్నట్లుగా) చేసేవారు.
దురదృష్టం ఏంటంటే చాలామంది ఉదారవాదులు హిందూమతం పట్ల ఎలాంటి వ్యాఖ్యలు చేసినా తప్పులేదు అనుకుంటారు కాని ఇతర మతాలలో వున్న తప్పులను ఎత్తిచూపే ధైర్యం చూపరు. M. కల్బుర్గి లాంటి వారు తమకు వాక్ స్వాతంత్రం వుంది అనుకుని పరిమితులని దాటి అతి తీవ్రమైన, హేయమైన విమర్శలు చేసి సమాజంలో తీవ్ర అశాంతిని కలగచేసారు.
PS: ఇది కల్బుర్గి గారి పైన చేసిన దారుణకాండకు సమర్థింపు కాదని మనవి.
తెలుగు గ్రామాలు – ఒక అవలోకనం గురించి Allam innnareddy అభిప్రాయం:
08/05/2025 2:31 am
Excellent review regarding the glory of our villages.
గెలుపు గురించి Srinivasa Rao Kunapareddy అభిప్రాయం:
08/05/2025 12:49 am
Very nice and heart touching story. Right intention will overcome all obstacles and it will be fulfilled.
A Solemn Vedic Wedding గురించి J K Mohana Rao అభిప్రాయం:
08/04/2025 9:26 am
సప్తపది ఛందములో సప్తపది
*
మొదటి యడుగు నిడుద మిపుడు భూమి యిచ్చు పంటతోడ
ముదముతో భుజించగ తనుపుష్టికై సదా
రెండవ యడు గిడుద మిపుడు రిత్తవోని బలము మనకు
మెండుగాను బ్రదుకునందు నిండగా సదా
మూడవ యడు గిడుద మిపుడు పూర్ణమౌ విభూతు లెల్ల
కూడుకొనగ గృహమునందు కొండగా సదా
నాల్గవ యడు గిడుద మిపుడు నశ్వరమగు భవము శివము
వెల్గ మనకు జీవితాన వృష్టిగా సదా
అయిదవ యడు గిడుద మిప్పు డందముగను ముద్దు లొలుకు
ప్రియ తనూభవుల సుశీల వృత్తికై సదా
ఆఱవ యడు గిడుద మిప్పు డాయువునకు స్వస్థతకును
కారు లిచ్చు దివ్యమైన కాంతికై సదా
ఏడవ యడు గిడుద మిపుడు హృద్యమైన సఖ్యతకయి
వాడని మమకారముకయి వసుధపై సదా
*
(సంస్కృతములో సప్తపది మంత్రము-
ఓం ఇష ఏకపదీ భవ సా మామనువ్రతా భవ
పుత్రాన్ విందావహై బహూన్ తే సంతు జరదష్టయః
ఓం ఊర్జే ద్విపదీ భవ సా మామనువ్రతా భవ
పుత్రాన్ విందావహై బహూన్ తే సంతు జరదష్టయః
ఓం రాయస్పోషాయ త్రిపదీ భవ సా మామనువ్రతా భవ
పుత్రాన్ విందావహై బహూన్ తే సంతు జరదష్టయః
ఓం మార్యాభవ్యాయ చతుష్పదీ భవ సా మామనువ్రతా భవ
పుత్రాన్ విందావహై బహూన్ తే సంతు జరదష్టయః
ఓం ప్రజాభ్యః పంచపదీ భవ సా మామనువ్రతా భవ
పుత్రాన్ విందావహై బహూన్ తే సంతు జరదష్టయః
ఓం ఋతుభ్యః షట్పదీ భవ సా మామనువ్రతా భవ
పుత్రాన్ విందావహై బహూన్ తే సంతు జరదష్టయః
ఓం సఖా సప్తపదీ భవ సా మామనువ్రతా భవ
పుత్రాన్ విందావహై బహూన్ తే సంతు జరదష్టయః)
*
మీకు నచ్చితే వివాహ సమయములో సప్తపదిలో వ్రాసిన సప్తపదిని ఉపయోగించండి.
*
విధేయుడు – మోహన
గెలుపు గురించి Jyoti అభిప్రాయం:
08/04/2025 4:34 am
Heart touching story
తెలుగువారి సాంస్కృతిక విస్మృతి గురించి శ్రీనివాసుడు అభిప్రాయం:
08/03/2025 11:56 pm
ఇదో పెద్ద బూటకం. శంకరాచార్య, నాయనారులు. ఆళ్వారులు ఇస్లాం దండయాత్రలకు కొన్ని వందల ఏళ్లకు ముందే భక్తి ఉద్యమాన్ని ఆరంభించారు. కాబట్టి, భక్తి ఉద్యమ ప్రభావమే దేశ భాషలు వెల్లివిరిసాయనుకుంటే దానిపై ఇస్లాం ప్రభావం ఏమీ లేదని అర్థం చేసుకోవాలి. (ఈ లెక్కలు ఆధునిక చరిత్రకారుల కాలగణన ప్రకారం. సాంప్రదాయ విశ్వాసాలైతే ఇంకో వేయేళ్ల ముందు మొదలైంది నాయనారులతో భక్తి ఉద్యమం.)
ఇంకా చెప్పాలంటే, భక్తి ఉద్యమానికి ముందున్న మౌఖిక ప్రజా సాహిత్యం ఏదైనా దొరికితేనే కదా మనం పోల్చి చూసుకోవాల్సింది? దొరకలేదు కాబట్టి భక్తి ఉద్యమానికి ముందు ప్రజల భాషలో ఏ ప్రజా సాహిత్యమూ లేదనడం అశాస్త్రీయం.
వేదాలలో ఉపయోగించిన స్థాయి భాష అలా పరిణమించడానికి అంతకు ముందు ఎన్ని వేల లేదా వందల ఏళ్ల పాటు స్థానిక భాషలలో ఎంత సాహిత్యం వచ్చి ఉండాలో కదా. అది కచ్చితంగా లిఖితమే అయి ఉండక్కర్లేదు. మౌఖికమైనా కావచ్చు.
గెలుపు గురించి Srinivas Bandaa అభిప్రాయం:
08/03/2025 3:09 am
కథ బాగుంది.
భాషాదోషాలూ అచ్చుతప్పులూ ఈమాటలో కనపడవని నమ్మేవాళ్లం. ఇప్పుడా నమ్మకాన్ని మార్చుకోవలసి వస్తోంది.
[అచ్చుతప్పులు, భాషాదోషాలు లేకుండా ఉండడానికే ఈమాట ఎల్లప్పుడూ ప్రయత్నిస్తుంది. మాకు కనిపించిన దోషాలు సవరించాము. ఇంకా ఇందులో ఉన్న అచ్చుతప్పులు తెలియజేస్తే మాకు సహాయం చేసినవారవుతారు. — సం.]
A Solemn Vedic Wedding గురించి T subrahmanyam అభిప్రాయం:
08/03/2025 12:53 am
ఏమిటో ఈ లాగుడూ పీకుడూ యవ్వారం చూసి మాబోటి సామాన్యులకు చమటలు పడుతున్నాయి చదువుతుంటే. విద్వత్త్తు చూపిస్తున్నాము అనుకుని కంగాళీ వ్యవహారంగా మార్చుతున్నారు.
తెలుగువారి సాంస్కృతిక విస్మృతి గురించి డా. అవధానం రఘు కుమార్ అభిప్రాయం:
08/02/2025 9:19 pm
డి ఆర్ నాగరాజు గారు తన “ఫ్లేమింగ్ ఫీట్” లో దళిత ఉద్యమాలలో తమ గతం పట్ల ద్వేషం, అసహనాన్ని గుర్తిస్తాడు. అది తప్పు అని కూడా అంటాడు. అలాగే దళిత ఉద్యమాలలో చైతన్యం అంటే గతపు అలవాట్లు, ఉదా: గొడ్డు మాంసం ఉద్యమం లాంటివి, వాటిని ప్రశ్నిస్తాడు.
విషయం ఏమిటంటే భారతీయులలో, అన్ని వర్గాలలో, ప్రాంతాలలో గతం పట్ల అపారమైన ద్వేషం, లేదా అపారమైన ప్రేమ … ఏది ఏమైనా గతంలోకి ఎక్కువగా ప్రయాణం చేయడం, గతంలో తమకు అన్యాయం జరిగింది, ఆ అన్యాయం చేసిన వారిని గుర్తించి శిక్షిస్తేనే తాము ముందుకు వెళతాం అనే భావనతో పాటు, ఇస్లాం, క్రిస్టియానిటి తమకు స్వేచ్ఛను ఇచ్చాయి అన్న భావన కూడా ఉంది. అంటే గతం అంటే తక్కువలో తక్కువగా 2000 ఏళ్లు వెనక్కి వెళ్లాలి అనే భావన కూడా ఉంది.
బహుశా ఈ తిరోగమనం అన్ని రంగాలలోనూ ప్రతిఫలిస్తూ వుంది. కమ్యూనిస్టులు కూడా అదే భావజాలం లోకి వెళ్ళిపోయారు.
గెలుపు గురించి Jyotsna అభిప్రాయం:
08/02/2025 12:51 pm
Very nice and heart touching