పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16439

  1. నాకు జీవితాన్ని ఇచ్చిన కవి బైరాగి గురించి మథు చిత్తర్వు అభిప్రాయం:

    09/06/2025 8:28 am

    ఏదీ తిరిగి రాదు.కానీ ఏదీ చెరిగి పోదు.

    నిజంగానే నేను బైరాగిని పూర్తిగా చదవలేదు. ఈ అద్భుతమైన వ్యాసం చదువుతుంటే ఒళ్ళు జలదరించింది. నాకు కావాలి బైరాగి అనిపించింది. మా తరం అంతా ఈయన కవిత్వం ఎలా మిస్ అయ్యాం. ఇంత గొప్ప పరిచయం ఇంత హృదయంగమమైన విశ్లేషణ ఇన్ని రోజుల తర్వాత అయినా చదవకపోతే జీవితంలో చాలా మిస్ అయి వుండే వాడిని.
    ఈ మాటకు, వీరభద్రుడు గారికి థన్యవాదాలు.

  2. బైరాగితో ప్రయాణం గురించి Gopal Naganaboyina అభిప్రాయం:

    09/06/2025 1:22 am

    The narration was so good that it felt like I was chatting with a friend, a sophisticated one.

    You touched upon many sound concepts that I thought should be broken down to a dozen mini essays. But then it felt like- all of it should be read in one sitting.

    There are some good points that deserve more detailed discussion. To point a few: “ఆదర్శాలు కాలంతో మనలేవు”. Knowledge vs belief, “సత్యం అనేది తాత్కాలికమే”,” సామాజిక న్యాయాల్లో జ్ఞాన మార్గం”, “ఆలోచించే మనుషులకి ఏం చేసినా తప్పేనని అనిపిస్తుంది”.

    Great blog! Thank you.

  3. అంధ తమిస్రాన అఖండ జ్యోతి ఆలూరి బైరాగి గురించి తుమ్మూరి రాంమోదృహన రావు అభిప్రాయం:

    09/05/2025 11:59 pm

    ముందుగా బైరాగి శతజయంతిని పురస్కరించుకొని ప్రత్యేక సంచిక వెలువరించిన ఈ మాట సంపాదకవర్గానికి జేజేలు. ఇక మీరు రాసిన వ్యాసం చదువుతుంటే ఆ మూడు పుస్తకాల సారాంశాన్ని కాచి వడపోసి అందించినట్లుంది. మొదటివాణ్ణి ఎవడు చూడొచ్చాడు అనే ఋగ్వేద అంశాన్ని బైరాగి సంశయాన్ని కవిత్వానికి అనుసంధానించటంలోనే మీ విస్తృత పఠనశీలత తెలియవస్తుంది. చీకటి నీడలు, నూతిలో గొంతుకలు, ఆగమగీతి కావ్యాలలోని కవితాపంక్తులను ఉదహరిస్తూ బైరాగి కవిత్వాన్ని బేరీజు వేసిన తీరు బాగుంది. ఇటీవల వీరభద్రుడి గారి బైరాగి గురించిన ప్రసంగాలు విని ఉండకపోతే మో ఉదహరించిన హేమ్లెట్, అర్జున, రాస్కల్నికోవ్‍ల సమాహారం అన్న మాట అర్థం అవటం అంత సులభం కాదు. యుద్ధసమయంలో శాంతికవి, కల్లోల సమయాల్లో అశాంతి కవి అని చెప్పిన వాక్యం మనసుకు పట్టుకుంటుంది. మంచి సమీక్ష రాసిన మీకు అభినందనలు.

  4. ఆధునిక ఆర్షకవి ఆదిమ బైరాగి గురించి Ramesh అభిప్రాయం:

    09/05/2025 8:50 pm

    ఈ సంచిక గురించి 31వ తేది నుండి ఎదురు చూస్తున్నాను. ఎందుకు ఇంకా upload కాలేదా అని నిరాశ కలిగింది. తరువాత ప్రత్యేక సంచిక వేస్తున్నారు అని చదివి సంతోషం కలిగింది. ఇంకా చదవలేదు, కానీ గొప్పవారు ఈ సంచికలో కనిపిస్తున్నారు , అందరికీ ధన్యవాదాలు.

  5. సమాజాన్ని వ్రేలెత్తి చూపిన కవి గురించి T A B PRASAD అభిప్రాయం:

    09/05/2025 2:41 pm

    మిత్రుడు, రచయిత శ్రీ రెంటాల గోపాలకృష్ణ గారి సుపుత్రుడు, మా కొలీగ్ రామచంద్ర గారి ద్వారా పరిచయమైన ‘ఈమాట’ వెబ్ పత్రికను మొదటిసారిగా చూస్తున్నాను. ఇంతకుముందు ఇలాంటి పత్రిక తెలుగులో నడపబడుతున్న విషయం కూడా నాకు తెలియదు.

    శ్రీ రెంటాల గారి జన్మదినం రోజున ఆయన వ్రాసిన ఈ వ్యాసం చదవగలగటం అదృష్టంగా భావిస్తున్నాను. ఇందులో రెంటాలగారు బైరాగిగారి అంతరంగ చిత్రణతో పాటు తన గురించికూడా పరిచయాన్నిచ్చే ప్రయత్నం చేసారు ‘నేను కొంత ఆశావాదిని, భూగోళాన్నే పెకిలించి వేయగలనన్నంత పొగరు, ధీమా నాకు. అంతులేని ఆవేశం నాది ఆరోజుల్లో’ అనే మాటలతో. స్వాతిశయం, అంతులేని ఆత్మవిశ్వాసం, పొగరూ వగరూ ప్రస్ఫుటమయ్యే భాషను ఉపయోగించే సాధికారత ఉన్న రచయితలు తమ శక్తిని గ్రహించినట్లుగానే ఎదుటి కవి, రచయితను, అతని శక్తియుక్తులనూ సులభంగా గుర్తించగలుగుతారు.

    ‘సమాజాన్ని వేలెత్తిచూపిన కవి’గా శ్రీ బైరాగిగారి మనోచిత్రణ, భావాల సంఘర్షణ, నిరంతర అన్వేషిగా గాయపడిన తన ఆత్మ వేదనను విలక్షణమైన కవితలుగా జాలువార్చిన మౌనమునిలా, తన గొంతుకలో బ్రతుకులోని అపశ్రుతులన్నీ ఒక్క శ్రుతిగా పలికించిన ఒక ఉదాత్త దార్శినికునిగా పరిచయం చేసారు. నాలాంటి బైరాగిగారి పరిచయం అంతగాలేని వారికికూడా బైరాగిగారి గూర్చిన మంచి చిత్రణ కలిగించారు.

  6. బైరాగి గీతాలకు గానరూపం: హేజననీ! గురించి కొప్పరపు లక్ష్మీ నరసింహా రావు అభిప్రాయం:

    09/05/2025 12:13 pm

    అద్భుతమైన గీతానికి అత్యద్భుత గానం!

  7. బైరాగితో ప్రయాణం గురించి chinaveerabhadrudu vadrevu అభిప్రాయం:

    09/05/2025 12:12 pm

    చాలా వివరంగా చక్కగా రాశారు. అవును. బైరాగి కాలదోషం పట్టని కవి.

  8. బైరాగితో ప్రయాణం గురించి Srinivasa Nyayapati అభిప్రాయం:

    09/05/2025 10:56 am

    ఇటువంటి వ్యాసం లోగడ నేను చదివి ఎరుగను. Your write-up is intensely personal – nearly confessional – and yet impersonal. నన్నడిగితే, మీ gistతో ఏకీభవిస్తూనే, బైరాగిని కవిత్వం కోసమూ చదవమంటాను, మూడు సంపుటుల్నీని. బైరాగిది సందర్భోచితమైన భాష. ఎలియట్‌నీ రిల్కెనీ ముడిపెట్టగలడు, శ్రీశ్రీనీ తిలక్‌నీ అనుసంధించగలడు. ప్రతి పదబంధమూ ఆపాతమధురం కాదు, అందుకు కారణం, బైరాగి భాష వెనుకా, కవితను చెక్కడం వెనుకా ఎక్కువ పడలేదు. ఈ design అంటే ఏదో విముఖత, ఆయనకు. లోనున్న ముడిసరుకు తన్నుకొస్తున్నప్పుడు అన్ని అలంకారాలూ అణిగి నెమ్మదిస్తాయి, బైరాగి కవితలో.
    -వాసు-

  9. బైరాగి కవితాత్మానుభవం గురించి Srinivasa Nyayapati అభిప్రాయం:

    09/05/2025 9:09 am

    Excellent write-up, Padmaja gArU.
    -Vasu-

  10. ఒంటరి డేగనై, తప్పిపోయిన లేగనై — బైరాగి గురించి రాఘవ అభిప్రాయం:

    09/05/2025 8:58 am

    చాలా బాగుంది..