పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16454

  1. పుస్తక పరిచయం: అడవి నుండి అడవికి గురించి Sai Padma అభిప్రాయం:

    11/01/2018 12:40 pm

    చాలా బాగా ఈ పుస్తకంలో జయతిని పట్టుకున్నారు.. ఆమె పట్టి ఇచ్చారు అనుకుంటా.. వొక యాత్రా పుస్తకం గురించి మరో యాత్రికుడు రాయటం కూడా చాలా చాలా బాగుంది

  2. అడ్డగాడిద గురించి ఉమా పోచంపల్లి అభిప్రాయం:

    11/01/2018 11:56 am

    భలే ఉంది దంత వేదాంతం!

  3. పుస్తక సమీక్ష: బుద్ధ చరితమ్ గురించి BK అభిప్రాయం:

    11/01/2018 11:03 am

    మురళీధర రావు గారూ,

    తిరుపతివేంకటకవుల బుద్ధచరితానికి ఆధారం Sir Edwin Arnold వ్రాసిన “The Light of Asia” అనే పుస్తకం. (ఆచార్య బేతవోలు రామబ్రహ్మం గారు ఒక ప్రసంగంలో ఈ విషయాన్ని వివరించి చెప్పారు. యూట్యూబ్ లో చూడచ్చు).

    స్వేచ్ఛానువాదకావ్యాలు తెలుగులో మరికొన్ని కూడా ఊన్నాయి. కరుణశ్రీ వ్రాసినది; అద్దంకి కేశవరావుగారి “తథాగతీయము”.

    మోహనగారి వ్యాసాన్ని బట్టి చూస్తే ఈ పుస్తకం ప్రతిపదార్థతాత్పర్యాలతో వ్రాసింది. అశ్వఘోషుడి బుద్ధచరితానికి ఇప్పటివరకూ ప్రతిపదార్థతాత్పర్యాలు ఉన్న పుస్తకం నేను ఏ భాషలోనూ చూడలేదు (ఉంటే ఈమాట ముఖంగా తెలపండి). ఇంగ్లీష్, హిందీ భాషల్లో తాత్పర్యాలు మాత్రమే ఉన్నాయి. కాని ప్రతిపదార్ధం లేదు.

  4. ఒక మరిచిపోలేని వాక్యం గురించి B. Rama Naidu అభిప్రాయం:

    11/01/2018 10:18 am

    విషయాన్ని ఎలా చూడాలి, ఎలా అన్వయించాలి అని చెప్పిన కామెంటరి. In his one of the books either The Age of Capital or The Age of Revolution Eric Howsbourne said the England was backward than Italy, France in education system, scientific knowledge prior to the industrial revolution. England was advanced than other EU countries in the subkect of political economy in his view. Further he observed English people were more mobile than their counter parts.

  5. పుస్తక సమీక్ష: బుద్ధ చరితమ్ గురించి మోహన అభిప్రాయం:

    11/01/2018 9:49 am

    శ్రీ ఏల్చూరి మురళీధర రావుగారి స్పందన – విధేయుడు – మోహన

    The first translation of Asvaghosha’s great work in Telugu was బుద్ధచరిత్రము by the celebrated poet-duo Tirupati Venkata Kavulu in equally grandiloquent manner.

    ఇద్ధతేజుఁ డైన బుద్ధదేవు చరిత్ర
    నశ్వఘోషముఖుల ననుసరించి
    యస్మదంకితముగ నాంధ్రకావ్య మొనర్పుఁ
    డనుచు వీడ్యమిచ్చె నాదరమున. (1-45)

  6. పుస్తక పరిచయం: అడవి నుండి అడవికి గురించి Amarendra Dasari అభిప్రాయం:

    11/01/2018 8:10 am

    సంతోషం సింహాచలంగారూ… మీరూ ప్రకృతి పిపాసులు అన్నమాట… చాలా బావుంది.

  7. ఒక మరిచిపోలేని వాక్యం గురించి nagamurali అభిప్రాయం:

    11/01/2018 8:05 am

    చాలా సామాన్యంగా కనపడే ఒకే ఒక్క వాక్యం ఎంత చరిత్రని కళ్ళకి కట్టించింది!!

    నేనొకసారి యాదృచ్ఛికంగా ఎవరితోనో అన్న మాటని నాకు మళ్ళీ గుర్తు చేసింది.

    చిన్నప్పుడు మా ఊళ్ళో ఉదయాన్నే, పరికిణీ ఓణీలు వేసుకుని, పువ్వులు పెట్టుకుని, ఆడపిల్లలు గుంపులు గుంపులుగా సైకిళ్ళమీద టైప్ ఇన్ స్టిట్యూట్లకి వెడుతూ కనిపించేవారు, ఇప్పుడు ఆ దృశ్యమే మాయమైపోయింది – అని.

    ఇరవై, ముప్ఫై ఏళ్ళ క్రితం మనసులో ముద్రించుకున్న కొన్ని చిత్రాల్ని తవ్వి తీస్తే, ఎంత మార్పు, ఎంత చరిత్ర కనిపిస్తుంది!!

  8. పుస్తక పరిచయం: అడవి నుండి అడవికి గురించి Kotnana Simhachalam Naidu అభిప్రాయం:

    11/01/2018 7:25 am

    ఈ సమీక్ష చదివాక అభినందనలు ఎవరికి చెప్పాలి అని సందేహం కలిగింది… అడవి పూలు పూస్తే గాలి పుప్పొడి మోసుకొచ్చినట్టు మీరు జయతి గారి అన్వేషణకు అర్థం చెప్పే ప్రయత్నం చేసారు….నిజానికి తన మనసుకు నచ్చినట్టు అడవులు, పల్లెలు, వాగులు, వంకలు తిరిగి ఒక స్వేచ్ఛా విహంగంలా ఎక్కడ నచ్చితే అక్కడ వాలి తనకు అనిపించినవి తనను అలరించినవి కూర్చి పెట్టినట్టుంది ఈ అడవి నుండి అడవికి లో……పుస్తకం త్వరగా చదవాలని ఊరించినట్టుగా ఉంది… పరవా లేదు…అమృతం రావటానికి చాల సమయం పడుతుంది….అప్పుడే జయతి మనసులో మాట ఆమె అన్వేషణకు అర్థం మనకు తెలుస్తాయి.

    నిజానికి ఈ పుస్తకం నా మనసుకు చాల దగ్గరగ ఉంది….అర్థ రాత్రి పన్నెండు గంటల వరకు నాగావళి ఏటి మధ్యలో వెన్నెల్లో ఇసుక దిబ్బల మీద కూర్చుని తెల్ల వారక పొతే బాగుంటుంది అనుకునే వాడిని…

    కొండ రాళ్ల పక్కన వేప చెట్టు నీడలో కూర్చుని పిలవటానికి ఎవరు రాక పొతే బాగుణ్ణు అనుకునే వాడిని…

    ఇలా ఎన్నో….అనుభూతులు….అనుభవాలు…ఎందరి ప్రయాణాలకో ఆనవాళ్లు ….

  9. రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మ రేడియో ప్రసంగం గురించి Dr. Y. Kameswari అభిప్రాయం:

    11/01/2018 3:36 am

    ఎంత మంచి ప్రసంగం వినిపించారు. ఆ అన్నమాచార్య పదం ఎన్నడూ విన్నది కాదు. ధన్యవాదాలు . మిగిలిన ప్రసంగాలకోసం ఎదురుచూస్తాను.

  10. గడినుడి – 25 గురించి Amarendra Dasari అభిప్రాయం:

    11/01/2018 2:15 am

    భలే!! ఈ ప్రయోగం దా నికదే సరి.