పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16454

  1. నాకు నచ్చిన పద్యం: ఊరుద్యుతి వర్ణన గురించి వీరభద్రం అభిప్రాయం:

    12/14/2018 8:26 am

    నానా సూన వితాన వాసనల – అనే ముక్కు వర్ణన పద్యానికి మాతృక ఒకటి, అగస్త్యుని నలకీర్తికౌముది అనే సంస్కృత గ్రంథంలో ఉన్నది అంటారు. ఇది నిజమేనా?

  2. నాకు నచ్చిన పద్యం: ఎఱ్ఱన ప్రాభాత వర్ణనం గురించి వీరభద్రం అభిప్రాయం:

    12/14/2018 8:20 am

    ఇటువంటి చిన్న సందేహాన్ని కూడా వివరించినందుకు మోహన గారికి నా ప్రణామములు.

    వీరభద్రం

  3. అనేక రామాయణాలు: పునర్నిర్మాణాలు, ప్రతి నిర్మాణాలు – శూర్పణఖ ఉదంతం గురించి vitandavadi అభిప్రాయం:

    12/12/2018 7:49 pm

    As per Rama The Greatest Pharaoh Of Egypt, the Ramayana is a localized version of Ramses II ‘s exploits. It combines his 2 wars ( Nubia and war against 10 kings ), the path Ramses II takes towards Syria from Egypt is localized to India.

    Book link: Rama The Greatest Pharaoh Of Egypt

  4. మంటో కథలు: కాలీ సల్వార్ గురించి RAM NARAYANA BATHULA అభిప్రాయం:

    12/12/2018 6:40 am

    I read the same story few months back some where. Was it published some where and was it translated by the same author?

  5. నడిచొచ్చిన తోవ గురించి Teja అభిప్రాయం:

    12/11/2018 9:28 am

    U could really made me close the box.. it’s so touchy.. wish u would continue ur magic with words… thanku so much for this..

  6. గానుగెద్దు గురించి GIREESH K అభిప్రాయం:

    12/10/2018 10:55 am

    స్పందించిన అందరికీ ధన్యవాదాలు!!!!

  7. గానుగెద్దు గురించి viswam అభిప్రాయం:

    12/10/2018 9:27 am

    చాలా బాగా కథను అక్షరీకరించారు. గానుగెద్దును మానవ స్వభావాలకు ఆపాదించదం చక్కటి పరిష్కారాన్ని సూచించడం కథకు హైలైట్ గా చెప్పవచ్చు.

  8. నడిచొచ్చిన తోవ గురించి కె.కె. రామయ్య అభిప్రాయం:

    12/09/2018 8:42 pm

    ప్రియమైన దాసరి అమరేంద్ర గారూ!

    రేఖాజ్యోతి గారు లాంటి వర్ధమాన కవిహృదయానికి, సందర్భోచితమో కాదో చూసుకోకుండా కామ్రేడ్ శివసాగర్ గళాన్ని వినిపించటం సభా మర్యాదలను అతిక్రమించటం క్రింద వస్తుందేమో కదూ

    ఆకాశంలో సగం నీవు
    అనంతకోటి నక్షత్రాల్లో
    సగం నీవూ సగం నేను
    తూరుపుపవన సంగీతంలో
    రాగం నీవు తానం నేను
    మనిద్దరం కలసి
    ఉద్యమిస్తే ఉప్పెన
    మనిద్దరం కలసి
    విప్లవిస్తే విజయం

    విప్లవపథంలో మనిద్దరం
    ఒకరికొకరం బాస చేసుకునే వేళ
    విప్లవపథానికి మనిద్దరం
    కలిసికట్టుగా బాసచేసిన వేళ
    త్యాగం మన పేరు
    పోరాటం మన ఊరు

    ఆకాశంలో సగం నీవు
    అనంతకోటి నక్షత్రాల్లో
    సగం నీవూ సగం నేను
    విప్లవాకాశంలో.

    – శివసాగర్

  9. ఒకటి నుంచి పదిల దాకా… గురించి Lalitha TS అభిప్రాయం:

    12/09/2018 3:42 pm

    పైన వున్న వ్యాఖ్యల్లో ఒకదాన్ని ఇలా చదువుకోవల్సిందిగా మనవి.

    ఏల్చూరి మురళీధరరావు గారు: మీ ఈ పొగడిక నాకెంతో అమూల్యమయినది – ధన్యవాదాలు!

    ఒక చిన్న వివరణ: పైన వ్యాఖ్యలు రాసిన వారిలో ఉష, చంద్రికలతో నా బ్లాగ్ ద్వారా పరిచయం వుంది. వారిని “మీరు, అండీ” అని మన్నించినా “గారు” అనకపోని స్వతంత్రం వుంది. కానీ ఏల్చూరి మురళీధరరావు గారు పెద్దవారు, మన్నించాల్సిన వారు. ఎలా మరిచానో తెలీదు కానీ “గారు” అననందుకు మన్నించండి.

  10. సిలబస్: 7. బొమ్మలు చెప్పే కథ గురించి Lalitha TS అభిప్రాయం:

    12/09/2018 2:28 pm

    “ఆ పై మీకు ఒపిక ఉంటే, ‘అరే! నిజంగా ఈ కథకు ఇలా బొమ్మ ఊహించడం ఎలా సాధ్యం అయింది?!’ అని నిజాయితీగా అలోచించండి. కనీసం ఒక్క నిముషం! కనీసం ఒక్కరయినా! నాకు భలే సంతోషం వేస్తుంది.”

    మీరీ మాట చెప్పకుండా వుంటే నేను నిజ్జంగా ఆ మాటే మిమ్మల్ని అడిగి వుండేదాన్ని – “పదిమందిలో మాట్లాడుకోవడానికే కాదు ఒంటరిగా ఆలోచించడానికి కూడా ఇబ్బంది పడే ఒక కి ఇంత అందమైన ఊహ ఎలా తట్టిందండి మీకూ?” అని. అప్పుడు అలా మీ అందమైన ఊహని ప్రశంసించే అవకాశం నాకూ, ఆ ప్రశంసని అందుకుని మురిసే వీలు మీకూ వుండేవి. ప్చ్! ఏం చేస్తాం… ఇద్దరి సదవకాశాలూ మీ ఈ మాటతో అర-వకాశాలు అయిపోయాయి.