పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16439

  1. నాకు జీవితాన్ని ఇచ్చిన కవి బైరాగి గురించి శాంతిశ్రీ బెనర్జీ అభిప్రాయం:

    09/25/2025 5:15 am

    బైరాగిని ఇంతవరకు పట్టించుకోని నాలాంటి వారికి మీది అద్భుతమైన పరిచయ వ్యాసం. ఒక విధంగా ఇప్పటికీ ఎంతో ప్రాసంగికత ఉన్న కవిని గుర్తించనందుకు బాధ కలిగించిన వ్యాసం. కొందరికి ‘భగవద్గీత’ పారాయణ గ్రంధం, ‘ఆగమ గీతం’ నా పారాయణ గ్రంధం అని మీరు అనడం బైరాగి ప్రభావం మీ మీద ఎంత ఉందో తెలుపుతుంది. కొంతలో కొంతైనా బైరాగిని చదివి అర్థం చేసుకోవాలన్న ఆసక్తిని కలిగించిన మీకు, బైరాగి ప్రత్యేక సంచిక తెచ్చిన ఈమాట కు అనేకానేక ధన్యవాదాలు, అభినందనలు.

  2. బైరాగి కవితాత్మానుభవం గురించి Pandu Ranga Chary Kasoju అభిప్రాయం:

    09/25/2025 1:22 am

    ఎంత అద్భుతమైన సమీక్ష ఇది! ఒక కవి గురించి, కవితా సృజన గురించి ఇంత గొప్పగా పొగడవచ్చా అనిపిస్తుంది. తెలుగు భాష పట్ల మమకారం మరింత పెరిగింది. బైరాగి గారికి, పద్మజ సూరపరాజు గారికి, ఈ లింక్ ఫేస్బుక్ లో షేర్ చేసి ఇక్కడికి రప్పించిన విజయ జ్యోతి గారికి ధన్యవాదములు!! 🙏

  3. అప్రకటిత యక్షగానం: రామదాసు చరిత్రం గురించి k.s.kumar అభిప్రాయం:

    09/24/2025 10:53 am

    మీరు చాలా శ్రమపడి సేకరించిన ఈ యక్షగానం చాలా బాగుంది. మీకు మా అభినందనలు.

  4. బైరాగి సూతాశ్రమం గురించి Lakshmi అభిప్రాయం:

    09/23/2025 8:05 pm

    ఈ వ్యాసరచయిత రాణి శివశంకర శర్మ బైరాగి పై ఇచ్చిన ఉపన్యాసం ఇది పాఠకులకు ఉపయోగకరమని ఇక్కడ ఇస్తున్నాను.

    https://youtu.be/tGbLF46Z5v4?si=w38O61iTpSyxPQ9e

  5. మోహన రాగ మహా! గురించి venkatasubbarao74@gmail.com అభిప్రాయం:

    09/23/2025 7:03 am

    అప్పుడు అభిసారిక లైంగిక జ్ఞానం, ఇప్పుడు అసలు ఆ అవసరం లేదు బొచ్చెడు పోర్న్; మోహన్ గారు లైంగిక జ్ఞానాన్ని బాగా యెలివేట్ చేసేరేమో అనిపించేసింది అంతే!!

  6. సాలేటి వాన గురించి sumanaspati reddy అభిప్రాయం:

    09/14/2025 7:57 am

    శృంగార కామానుభవాన్ని ఇంత చక్కగా చెప్పిన కవితలు బహు అరుదు, ఏ సాహిత్యంలోనైనా!!!!

  7. నాకు నచ్చిన పద్యం: ప్రవరుని హిమాలయ దర్శనం గురించి రాజు గాలిపెల్లి అభిప్రాయం:

    09/14/2025 6:17 am

    మాకు పదవ తరగతి తెలుగులో ఈ పద్యం నాకు చాలా ఇష్టం. ఇప్పటికీ నాకు నోటికి వస్తుంది. చూడకుండా అప్పజెప్పగలను. 20 సం॥ల తర్వాత మర్చిపోలేదు ఇంకా. కొన్ని తెలుగు పద్యాలు. థామసీ అనే పద్యభాగంలోవి కూడా.

  8. బైరాగి కవితాత్మానుభవం గురించి సత్యవతి అభిప్రాయం:

    09/14/2025 2:04 am

    చాలా బాగా రాశారు.మళ్ళీ మళ్లీ చదవాలనిపించేలాగా🌺

  9. బైరాగి గీతాలకు గానరూపం: అనునయము గురించి సురేశ్ కొలిచాల అభిప్రాయం:

    09/13/2025 6:48 am

    ఈ పద్యాలు మళ్ళా మళ్ళా విన్నాను. ఈ పద్యాలు చదువుతున్నప్పుడు గాయిక కంఠంలో ఒక అలౌకిక మాధురి వినబడుతున్నది. సిరాజ్ నగరపు గులాబీ తోటల పరిమళాల గాలుల్ని ఆ గానం మోసుకు వస్తున్నట్లుంది.

    మీ మాటలు చాలా సంతోషాన్నిచ్చాయి. పద్యాలు, మిగిలిన గీతాలు మీకు నచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. గానంలోని మాధుర్యాన్ని ప్రత్యేకంగా ప్రశంసిస్తూ మీరు చేసిన స్పందనకు అనేక ధన్యవాదాలు. మేము ఈ ప్రత్యేక సంచిక తయారు చేయడానికి వ్యాసాల విషయంలో ఎంత కృషి చేశామో, ప్రశాంతి చోప్రా గారు ఈ పది గీతాలకు స్వరకల్పన కూర్చి, అద్భుతమైన గాత్రంతో ప్రాణ ప్రతిష్ఠ చేసి, వాటిని వీడియోలుగా తయారుచేసి అందించడంలో అంతకంటే ఎక్కువగా కృషి చేశారు. అటువంటి గాయని ఈమాటకు లభించడం మా అదృష్టం.

    ఈ గీతాల ఎంపిక విషయంలో మాకు కొన్ని శీర్షికలను సూచించిన మీకు కూడా కృతజ్ఞతలు.

  10. బైరాగి గీతాలకు గానరూపం: అనునయము గురించి సురేశ్ కొలిచాల అభిప్రాయం:

    09/12/2025 2:33 pm

    భలే. ఆంగ్ల మూలానికి చాలా దగ్గరిగా అద్భుతంగా ఛందస్సులో పద్యాలుగా ప్రకటించగలిగాడు, బైరాగి. ఆయన ఛందస్సులో రాసిన ఇతర పద్యాలేమైనా ఉన్నాయేమో చూడాలి.

    దీనికి హాఫిజ్ రాసిన మూల పారశీక గీతం కూడా నాకు దొరికింది. అది ఆంగ్లంలో కంటే నడకలో, అర్థాల్లో కొంత భిన్నంగా ఉంది. ప్రతి పంక్తి చివర గజల్ పద్ధతిలో కాఫియాగా (అంత్యప్రాసగా) బర్‌ఖీజమ్ “లేచి వత్తును” అని వినిపిస్తుంది.

    మొజ్‌దె-యె వస్ల్-ఎ తొ కూ కజ్ సర్-ఎ జాన్ బర్‌ఖీజమ్
    టాయెర్-ఎ ఖొద్సమ్ ఒ అజ్ దామ్-ఎ జహాన్ బర్‌ఖీజమ్

    బె వలా-యె తొ కె గర్ బందె-యె ఖ్వీషమ్ ఖ్వానీ
    అజ్ సర్-ఎ ఖ్వాజెగీ-యె కౌన్ ఒ మకాన్ బర్‌ఖీజమ్

    యా రబ్ అజ్ అబ్ర్-ఎ హెదాయత్ బెరెస్సాన్ బారానీ
    పీష్తర్ జాన్ కె చొ గర్దీ జె మియాన్ బర్‌ఖీజమ్

    బర్ సర్-ఎ తొర్బత్-ఎ మన్ బా మెయ్ ఒ మొత్రెబ్ బెన్‌షిన్
    తా బె బూయత్ జె లహద్ రఖ్స్-కొనాన్ బర్‌ఖీజమ్

    ఖీజ్ ఒ బాలా బెనమా ఎయ్ బొత్-ఎ షిరీన్ హరకాత్
    కజ్ సర్-ఎ జాన్ ఒ జహాన్ దస్త్-ఫెషాన్ బర్‌ఖీజమ్

    గర్చే పీరమ్ తొ షబీ తంగ్ దర్ ఆఘుషమ్ కష్
    తా సహర్‌గహ్ జె కెనార్-ఎ తొ జవాన్ బర్‌ఖీజమ్

    రూజ్-ఎ మర్గమ్ నఫసీ మొహ్లత్-ఎ దీదార్ బెదెహ్
    తా చొ హాఫెజ్ జె సర్-ఎ జాన్ ఒ జహాన్ బర్‌ఖీజమ్

    ఆయన సమాధిపై కూడా ఈ గీతంలోని పంక్తులలో మొదటి రెండు పాదాలు రాసి ఉంటాయట.