పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16454

  1. ప్రాచీన తెలుగు కొలమానం గురించి దాసరి వెంకట రమణ అభిప్రాయం:

    02/14/2019 12:10 am

    పడికి ఎనిమిది చెటాకులు. పడి, అరపడి,పావ్ పడి, చెటాకి

  2. వీరశైవులు గురించి Phaneendra Kumar అభిప్రాయం:

    02/13/2019 11:05 am

    అమూల్యమైన మరియు అద్భుతమైన వ్యాసం. రచయితకు అభినందనలు

    భవదీయుడు

    ఫణీంద్ర

  3. కొన్ని దూరాలంతే! గురించి m.k.kumar అభిప్రాయం:

    02/13/2019 12:55 am

    1. మొదటి రొండు చరణాలకి క్రమం వుంది. మిగిలిన వాటికి లేవు.
    2. గుండెలో వెలితొకటి
    ముల్లులా తొలుస్తూనే వుంటుంది
    నిస్సహాయంగా శూన్యమేదో
    దారికాచి పరిహసిస్తూనే వుంటుంది.

    ఇందులొ 3, 4 లైన్లు 1, 2 లైన్లకు సంబందం లేదు. వేటికవే విడిగా వున్నాయు.

    3. గుండెలో వెలితొకటి ముల్లులా తొలుస్తూనే వుంటుంది. బాగానె వుంది. ఆ తర్వాత వెలితిని ఎలా పూడ్చాలేమో చెప్పాలి కదా.

    4. కొన్ని దురాలను పూడ్చలేమనే నెగటివ్ దృక్పథం బాగా లేదు.

    5. దూరాలను పూడ్చడానికే కవి ప్రయత్నించాలి కదా.

    6. భావం లోతుగా వుంది. భాష సరలంగా వుంది.

    7. పోయెమ్ కి మద్యలో లింక్ తెగింది.

  4. నేనొక చిత్రమైన చిక్కుముడి 4: ఈ వ్యాస రచయిత నేను కాదు గురించి Sumalatha అభిప్రాయం:

    02/13/2019 12:05 am

    Vidyaadharii అనే పుస్తకం నుండి విశ్లేషణ ఇలాగే వుంటుంది.

  5. నేనొక చిత్రమైన చిక్కుముడి 4: ఈ వ్యాస రచయిత నేను కాదు గురించి Sumalatha అభిప్రాయం:

    02/12/2019 1:59 pm

    నేను న్యాయశాస్త్రం సంస్కృత తరగతిలో కొన్ని రోజులు చదువుకున్నాను, అదే ఇక్కడ చక్కగా తెలుగులో చెప్తున్నారు. బాగున్నది.

  6. అమానుషి గురించి M.k.kumar అభిప్రాయం:

    02/11/2019 2:31 pm

    1 కవిత్వం బాగుంది.
    2 కంటిపాప దొన్నెల్లొ అని రావాలి.
    3. 2 stanzas గందరగోళంగా వున్నాయు
    4. చివరి 2 స్టాంజాలు బాగున్నాయి
    5. కవిత్వంలో కంటిన్యూటీ దెబ్బ తింది
    6. వేటికవే విడివిడిగా వున్నయ్
    7. పొయెట్రీలొ లొతు వుంది కాని గతి సరిగా లీదు
    8. ఆమనుషి అయున కాలం వెర్రివెంగళప్ప ఎలా అవుతుంది.
    9. వెర్ర్రివెంగల్లప్ప పద ప్రయూగం కవితను నీరుగార్చింది.

  7. రాగలహరి: హిందోళం గురించి కృష్ణ అభిప్రాయం:

    02/11/2019 1:04 am

    మీరు 2001లో వ్రాసేనాటికి cell ఫోన్లు అందరి చేతుల్లో లేవు. ఇప్పుడు అందరి చేతుల్లో మొబైళ్లున్నాయి. ఎవరి అభిరుచికి తగ్గవి వారు నిక్షేపంగా చూసుకుంటున్నారు. కనుక మీరు 2001లో పెట్టినవి ఇప్పుడు ప్రాచుర్యం చెంది ఫలిస్తున్నాయి. మళ్ళీ ఆ పాత పోస్టులు మళ్ళీ కొత్తగా పెట్టితే సూపర్ హిట్ అవుతాయి చూడండి…

  8. ముక్కలయిన వాస్తవం: సిగిౙ్మండ్ క్రిజ్‍జనావ్‍స్కీ గురించి B.kiran kumari అభిప్రాయం:

    02/09/2019 5:11 am

    రచయితను,ఆయన రచనలను పరిచయం చేసినందుకు అనేక కృతజ్ఞతలు!

  9. ఒక తెలుగు పుస్తకం కావాలి గురించి పూర్ణకుమార దాసు అభిప్రాయం:

    02/06/2019 6:02 am

    ఇది నేర్చుకుంటే వచ్చేది తప్ప సహజ పాండిత్యం మాత్రం కాదు

    – ఇదీ నిజమైన నిజం. ఏదైన నేర్చుకోవాలంటె కొంత కష్ట పడాలి. అదాటుగా ఏదో పుస్తకం చదివేసి నేర్చేసుకోవడం అనేది అపోహ.

    పుస్తకాలు చాలానే వున్నాయి. చదివేదెవరు? భాషా స్వరూప తత్వాలు చాలా వేగంగా మారుతున్నాయి కూడా. తెలుగు లిపిని పూర్తిగా (ఫుల్ల్ potential) వాడుకోవడం అవసరం. సినిమాలు చాలా వరకు ఉపయోగపడతాయి, పడుతున్నాయి. కె.బాలచందర్ తీసిన “అబద్ధం” లోని, “ళ ళ ళ” దృశ్య గీతం (పాట) వింటే తెలుస్తుంది. ప్రతీ వాఙ్మయం లోనూ సినీమాలు చోటు చేసుకున్నాయి, మరొక అంగమై.

    మరో విషయం: ఇలా భాషా సంబంధ విశేషజ్ఞులు, ఒహ చోట చేరే ఆస్కారం ఎమైనా వుందా? లేదనిపిస్తుంది నాకు. ముఖాముఖి కలుసుకొని మాట్లడ్డం అవసరం. మన పాండిత్యాలు, పీహెచ్డీ లు ప్రక్కన బెట్టి, చదవగలిగిన వాడు, వ్రాయగలిగిన వాడు అలాంటి ఇంకొందరూ చేరితే ఎంతో కొంత సాధ్యం ఏమో. ప్రతీది అంతర్జాలం లోనే పరిష్కరిద్దాం అనేది ప్రతిసారి సాధ్యపడదేమో! ఓ సారి కలిశాక మళ్ళా నెట్లో దూరొచ్చు.

    ఈ పరిధుల్లో వేలూరి వేంకటేశ్వర రావు అడిగింది సాధ్యపడొచ్చు.

  10. దిల్లీ నుంచి హరిద్వార్ వరకు… గురించి Vidyanath అభిప్రాయం:

    02/05/2019 11:56 pm

    It shouldn’t be called a story. It happens in most of the families. This incident I feel is an eye opener for everyone especially those from India and on top during a trip to holy place like Haridwar . There is so much to learn and follow from the story. My sincere thanks go to the author. Regards Vidyanath