Such an inspirational story. I read about him and Kirkee Centre few years ago. The Lungi Clad air warrior has given me strength to fight my own battles. Its good to know about this book. His story appears in magazines occasionally.
>> ఇదిలా వుండగా ఒక పక్క ఇంగ్లీషు ముంచుకొస్తూ వుంటే, తెలుగు చదివితే మంచి ఉద్యోగాలు రావనే అభిప్రాయం బలపడుతూ …
ఈ అభిప్రాయం ఇప్పటికీ ఇలాగే ఉంది. బాగా పెరిగి ఉండొచ్చు కూడా – సాఫ్ట్ వేర్ ఉద్యోగాల వల్ల. నగరాల్లో చదువుకునే వారికి (విజయవాడ, విశాఖపట్నం, ముఖ్యంగా హైద్రాబాదు వగైరా) తెలుగంటే అతి దారుణమైన చిన్నచూపు. మాకున్న బంధువుల్లో చాలామందికి ఈనాడు పేపర్ చదవడానిక్కూడా తెలుగు రాదు. ఆ విషయం గొప్పగా చెప్పుకోవడం నాకు తెలుసు. దీనికి నాకు తెలిసిన కారణాలు రెండు. మొట్టమొదటిది మన తెలుగు పండితులు చేతులరా – కావాలని – చేసిన దారుణం. పరీక్షల్లో సమాథానాలు ఎంత బాగా రాసినా 50/60 కి మించి మార్కులు వేయకపోవడం. దీనివల్ల బడి పిల్లలకి మార్కులు తక్కువ వచ్చి కావల్సిన వృత్తి విద్యలలో (ఇంజినీరింగ్, వైద్యం, ఫార్మసీ) అనుమతి రాకపోవడం. ఉత్తరోత్తరా దీని మీద గొడవపడి భాషకి సంబంధించిన సబ్జక్ట్ ల మార్కులు ఈ వృత్తి విద్యలలో అనుమతికి వాడకూడదు అనే రూల్ ఒకటి ప్రతిపాదించి తీసుకొచ్చారు. దీనివల్ల అప్పటికే భ్రష్టు పట్టిన తెలుగు మరింత భ్రష్టు పట్టింది. అంటే తెలుగులో 35 వచ్చి పాసయినా, లెక్కలు ఫిజిక్స్, కెమిస్ట్రీలలో 95% వస్తే ఇంజినీరింగ్ లో జేరిపొవచ్చు. ఎంట్రన్స్ పరీక్షలొచ్చాక ఈ సబ్జక్ట్ మార్కులు కూడా అనవసరం అనుకుంటా ఇప్పుడు.
ఇది ఇలా ఉండగానే హిందీ భాషోద్యమం ఒకటి తయారై (స్వాతంత్రం తర్వాత అనుకుంటా) హిందీ తప్పక నేర్చుకోవాల్సిన అగత్యం పట్టించారు. అందులో – కొత్త బాష నేర్చుకోవడానికో, బలవంతంగా ఆ గుళిక మింగించడానికో ఏం రాసినా బాగా మార్కులు వేయమని పెద్దలు పై నుంచి (అథిష్టానం) వారు అక్షింతలు జల్లారని చెప్పుకునేవారు. దానితో బడిలో పిల్లలు హిందీలోకి మారడం మొదలుపెట్టారు ఇంటర్మీడియేట్ స్థాయి నుంచి. దీంట్లో ఒక తిరకాసు వచ్చింది నగరాల్లో. హిందీ ఎలాగా పెట్టారు కనక ఫ్రెంచ్ కూడా పెడితే? అలా ఫ్తెంచ్, సంస్కృతం, మిగతా భాషలు ఒకదాని తర్వాత ఒకటి వచ్చాయి తెలుగుని వెనక్కి నెడుతూ. ఇందులో మరో హాస్యాస్పదమైన విషయం – ఈ తెలుగేతర భాషల్లో అడిగిన ప్రశ్నలకి సమాధానాలు తెలుగులో కానీ, ఇంగ్లీషులో కానీ రాసేయవచ్చు. నూటికి దాదాపు 90, 95 వేస్తారు. దీంట్లో సులభం అది. ఎంకరేజ్ మెంట్ అనండి మరోటనండి, ఈ ఎక్కువ మార్కులు ఇవ్వడం వల్ల ఈ భాషలని తీసుకోవడం (ఆప్షనల్ గా) అలవాటు అయింది పిల్లలకి. ఈ భాషలు ఇలా నేర్చుకోవడం/సమాథానాలు తెలుగు ఇంగ్లీషుల్లో రాయడం వల్ల వీళ్ళకి తెలుగూ రాదు, ఆ కొత్త భాషా రాదు. పదో తరగతి దాకా తెలుగు తప్పకుండా నేర్చుకోవాలి అని రూల్ పెట్టారు కనక ఆ చేదు కాకరకాయ తిని తీరాలి. ఒకసారి ఆ స్థాయి దాటగానే విశృంఖలంగా మన ఇష్టం – తెలుగు పండితులు ప్రతీ కుర్రాడూ నన్నయ లాగా తెలుగు రాస్తే గానీ నూటికి 90 పైన వేయరు కనక తెలుగు ఎవరికీ అఖ్ఖర్లేదు. అలా తెలుగు నేర్చుకునే వాళ్లు తగ్గడం మొదలుపెట్టగానే తెలుగు పండితులు అదృశ్యం అవడం మొదలైంది. ఎవరు చేసిన ఖర్మ వారనుభవించక ఎప్పుడైనా తప్పదన్నా అనే మాట నిజం చేస్తూ.
ఈ రెండు కారణాలవల్లా, తెలుగంటే “అతి” దారుణమైన చిన్నచూపు మొదలైంది. ఈ మధ్యన ఒక నెలవారీ పత్రిక – మా రచయితలు – అని అందులో రాసే రచయిత/త్రుల వివరాలు ప్రకటించారు. అందులో 35/40 లోపు ఉన్న రచయితలు ఎవరూ లేరు. అంటే ఎవరో పాతకాలం లో నేర్చుకున్న తెలుగువాళ్లు కథలు రాసి ఏదో చేస్తున్నారు తెలుగుకి. కొత్తగా నేర్చుకుని రాసేవాళ్లెవరూ రావటం లేదు. దీనికి ప్రక్యక్ష దృష్టాంతం ఏమిటంటే – ఇప్పటికీ యండమూరి వీరేంద్రనాథ్, మల్లాది వెంకట కృష్ణమూర్తి వంటి రచయితలే రాస్తున్నారు. కొత్తగా వచ్చే రచయితలు – ఎక్కడ ఎలా కాపీ చేసి పేస్ట్ చేద్దామా అనే కంగారులోనే ఉన్నట్టు కనబడుతుంది. దీన్నే ఈమాట సంపాదకీయంలో మాథవ్ గారు ఈ మధ్యన చెప్పినట్టు గుర్తు. నా మటుకు నేను చూసినంతలో ఇక్కడ ఈమాటలో నేను రాసిన కథలు ఒకటి రెండు మరో చోట కాపీ చేయబడ్డయి (బ్లాగులో). ఇదేమిటి అని అడిగితే – ఏది ఏమిటి అనే వింత సమాధానం ఇచ్చారు పెద్దమనిషి. ఇది మనకి వదలని మనం పని కట్టుకుని అంటించుకున్న దౌర్భాగ్యం. ఈ మథ్యన నేను దేశం వెళ్లి వచ్చాక కనిపించిన విషయం – ఈ తెలుగు నాశనం అవడం అనేది – ఇష్టానుసారం డబ్బులున్నాయి కదా అని ఏది పడితే అది తిని అతి సారవ్యాధి స్వంతంగా అంటించుకుని మన పళ్ళతో మనం తవ్వుకుంటున్న మన సమాథి. దీనిమీద ఒక ఆంగ్ల దినపత్రిక ఒక వ్యాసం రాసారు – ఈ వ్యాధి చాపకింద నీరులా ఎలా ప్రబులుతోందో. కనీసం ఆ వ్యాసం చదవడానిక్కూడా నేను ఉన్న ఇంట్లో – ఇంటికి న్యూస్ పేపర్ తెప్పించుకునే – ఎవరికీ తీరిక లేదు.
” మిత్రుల దగ్గర నీ ‘ప్రోగ్రెసివ్’ బడాయిలు, ఫేస్‌బుక్‌లో నీ ‘ఫెమినిజం’ నురగలు, డిబేట్లలో నీ ‘విప్లవాల’ మురుగు మాటలు గుర్తొస్తాయి. కలకి-నిజానికి, కల్పనకి-యథార్థానికి మధ్య ఉండే అడ్డుగోడ చిన్నగా నెర్రెలిస్తుంది. మరణం నీ జీవితంలోకి వచ్చింది ”
జీవితం లోని తొలి మరణం, మలి మరణం, మలుపు మలుపుల వద్దా మరణాల తలపోతల్ని …. భావాంతరంగ కల్లోలాల మూలాన్వేషణా చైతన్య స్రవంతిని… గురించి ఏవి చెప్పాలన్నా నాకు కష్టమే, మేటి చైతన్యా !
కానీ కర్నూలు వేణయ్యకు ( కాశీ భట్ల వేణుగోపాల్ గారికి ) చూపిస్తే ఇలాంటి దావాలనాలు తనకిష్టం అని చెపుతాడు.
ప్రాణంతో చెలగాటం గురించి Raghu అభిప్రాయం:
10/03/2019 4:04 am
Super story..
ప్రాణంతో చెలగాటం గురించి Amarendra అభిప్రాయం:
10/02/2019 11:30 pm
అరుదైన కథ… చాలా చక్కని అనువాదం.
చిన్నయ సూరి – గిడుగు రామమూర్తి 3 గురించి Amarendra Dasari అభిప్రాయం:
10/02/2019 8:30 pm
బావుంది. మూడు భాగాలూ కలిపి పుస్తకంగా వేస్తే చాలా బావుంటుంది.
స్టకాటో గురించి Amarendra అభిప్రాయం:
10/01/2019 7:19 pm
పరస్పర సంబంధం లేనట్టు కనిపిస్తూనే ఒకదాని తర్వాత మరొకటిగా అమరిపోయిన ఆలోచనా పరంపర!A difficult job, very well handled…
భరోసా గురించి కనకమహాలక్ష్మి అభిప్రాయం:
10/01/2019 10:12 am
చాలా చక్కగా, చదివితే మనసుకు ఆహ్లాదంగా వుంది సార్.
బార్న్ టు ఫ్లయ్ గురించి Sujata అభిప్రాయం:
10/01/2019 10:07 am
Such an inspirational story. I read about him and Kirkee Centre few years ago. The Lungi Clad air warrior has given me strength to fight my own battles. Its good to know about this book. His story appears in magazines occasionally.
భరోసా గురించి msk krishna jyothi అభిప్రాయం:
10/01/2019 10:05 am
భలే ఉంది కవిత! నాకెంతో నచ్చింది
మంటో కథలు: సియా హాషియే 3 గురించి Ravi అభిప్రాయం:
10/01/2019 9:49 am
ఠండాగోష్త్ కథను అందివగలరు… థాంక్స్ for your efforts.
చిన్నయ సూరి – గిడుగు రామమూర్తి 3 గురించి శర్మ దంతుర్తి అభిప్రాయం:
10/01/2019 8:59 am
>> ఇదిలా వుండగా ఒక పక్క ఇంగ్లీషు ముంచుకొస్తూ వుంటే, తెలుగు చదివితే మంచి ఉద్యోగాలు రావనే అభిప్రాయం బలపడుతూ …
ఈ అభిప్రాయం ఇప్పటికీ ఇలాగే ఉంది. బాగా పెరిగి ఉండొచ్చు కూడా – సాఫ్ట్ వేర్ ఉద్యోగాల వల్ల. నగరాల్లో చదువుకునే వారికి (విజయవాడ, విశాఖపట్నం, ముఖ్యంగా హైద్రాబాదు వగైరా) తెలుగంటే అతి దారుణమైన చిన్నచూపు. మాకున్న బంధువుల్లో చాలామందికి ఈనాడు పేపర్ చదవడానిక్కూడా తెలుగు రాదు. ఆ విషయం గొప్పగా చెప్పుకోవడం నాకు తెలుసు. దీనికి నాకు తెలిసిన కారణాలు రెండు. మొట్టమొదటిది మన తెలుగు పండితులు చేతులరా – కావాలని – చేసిన దారుణం. పరీక్షల్లో సమాథానాలు ఎంత బాగా రాసినా 50/60 కి మించి మార్కులు వేయకపోవడం. దీనివల్ల బడి పిల్లలకి మార్కులు తక్కువ వచ్చి కావల్సిన వృత్తి విద్యలలో (ఇంజినీరింగ్, వైద్యం, ఫార్మసీ) అనుమతి రాకపోవడం. ఉత్తరోత్తరా దీని మీద గొడవపడి భాషకి సంబంధించిన సబ్జక్ట్ ల మార్కులు ఈ వృత్తి విద్యలలో అనుమతికి వాడకూడదు అనే రూల్ ఒకటి ప్రతిపాదించి తీసుకొచ్చారు. దీనివల్ల అప్పటికే భ్రష్టు పట్టిన తెలుగు మరింత భ్రష్టు పట్టింది. అంటే తెలుగులో 35 వచ్చి పాసయినా, లెక్కలు ఫిజిక్స్, కెమిస్ట్రీలలో 95% వస్తే ఇంజినీరింగ్ లో జేరిపొవచ్చు. ఎంట్రన్స్ పరీక్షలొచ్చాక ఈ సబ్జక్ట్ మార్కులు కూడా అనవసరం అనుకుంటా ఇప్పుడు.
ఇది ఇలా ఉండగానే హిందీ భాషోద్యమం ఒకటి తయారై (స్వాతంత్రం తర్వాత అనుకుంటా) హిందీ తప్పక నేర్చుకోవాల్సిన అగత్యం పట్టించారు. అందులో – కొత్త బాష నేర్చుకోవడానికో, బలవంతంగా ఆ గుళిక మింగించడానికో ఏం రాసినా బాగా మార్కులు వేయమని పెద్దలు పై నుంచి (అథిష్టానం) వారు అక్షింతలు జల్లారని చెప్పుకునేవారు. దానితో బడిలో పిల్లలు హిందీలోకి మారడం మొదలుపెట్టారు ఇంటర్మీడియేట్ స్థాయి నుంచి. దీంట్లో ఒక తిరకాసు వచ్చింది నగరాల్లో. హిందీ ఎలాగా పెట్టారు కనక ఫ్రెంచ్ కూడా పెడితే? అలా ఫ్తెంచ్, సంస్కృతం, మిగతా భాషలు ఒకదాని తర్వాత ఒకటి వచ్చాయి తెలుగుని వెనక్కి నెడుతూ. ఇందులో మరో హాస్యాస్పదమైన విషయం – ఈ తెలుగేతర భాషల్లో అడిగిన ప్రశ్నలకి సమాధానాలు తెలుగులో కానీ, ఇంగ్లీషులో కానీ రాసేయవచ్చు. నూటికి దాదాపు 90, 95 వేస్తారు. దీంట్లో సులభం అది. ఎంకరేజ్ మెంట్ అనండి మరోటనండి, ఈ ఎక్కువ మార్కులు ఇవ్వడం వల్ల ఈ భాషలని తీసుకోవడం (ఆప్షనల్ గా) అలవాటు అయింది పిల్లలకి. ఈ భాషలు ఇలా నేర్చుకోవడం/సమాథానాలు తెలుగు ఇంగ్లీషుల్లో రాయడం వల్ల వీళ్ళకి తెలుగూ రాదు, ఆ కొత్త భాషా రాదు. పదో తరగతి దాకా తెలుగు తప్పకుండా నేర్చుకోవాలి అని రూల్ పెట్టారు కనక ఆ చేదు కాకరకాయ తిని తీరాలి. ఒకసారి ఆ స్థాయి దాటగానే విశృంఖలంగా మన ఇష్టం – తెలుగు పండితులు ప్రతీ కుర్రాడూ నన్నయ లాగా తెలుగు రాస్తే గానీ నూటికి 90 పైన వేయరు కనక తెలుగు ఎవరికీ అఖ్ఖర్లేదు. అలా తెలుగు నేర్చుకునే వాళ్లు తగ్గడం మొదలుపెట్టగానే తెలుగు పండితులు అదృశ్యం అవడం మొదలైంది. ఎవరు చేసిన ఖర్మ వారనుభవించక ఎప్పుడైనా తప్పదన్నా అనే మాట నిజం చేస్తూ.
ఈ రెండు కారణాలవల్లా, తెలుగంటే “అతి” దారుణమైన చిన్నచూపు మొదలైంది. ఈ మధ్యన ఒక నెలవారీ పత్రిక – మా రచయితలు – అని అందులో రాసే రచయిత/త్రుల వివరాలు ప్రకటించారు. అందులో 35/40 లోపు ఉన్న రచయితలు ఎవరూ లేరు. అంటే ఎవరో పాతకాలం లో నేర్చుకున్న తెలుగువాళ్లు కథలు రాసి ఏదో చేస్తున్నారు తెలుగుకి. కొత్తగా నేర్చుకుని రాసేవాళ్లెవరూ రావటం లేదు. దీనికి ప్రక్యక్ష దృష్టాంతం ఏమిటంటే – ఇప్పటికీ యండమూరి వీరేంద్రనాథ్, మల్లాది వెంకట కృష్ణమూర్తి వంటి రచయితలే రాస్తున్నారు. కొత్తగా వచ్చే రచయితలు – ఎక్కడ ఎలా కాపీ చేసి పేస్ట్ చేద్దామా అనే కంగారులోనే ఉన్నట్టు కనబడుతుంది. దీన్నే ఈమాట సంపాదకీయంలో మాథవ్ గారు ఈ మధ్యన చెప్పినట్టు గుర్తు. నా మటుకు నేను చూసినంతలో ఇక్కడ ఈమాటలో నేను రాసిన కథలు ఒకటి రెండు మరో చోట కాపీ చేయబడ్డయి (బ్లాగులో). ఇదేమిటి అని అడిగితే – ఏది ఏమిటి అనే వింత సమాధానం ఇచ్చారు పెద్దమనిషి. ఇది మనకి వదలని మనం పని కట్టుకుని అంటించుకున్న దౌర్భాగ్యం. ఈ మథ్యన నేను దేశం వెళ్లి వచ్చాక కనిపించిన విషయం – ఈ తెలుగు నాశనం అవడం అనేది – ఇష్టానుసారం డబ్బులున్నాయి కదా అని ఏది పడితే అది తిని అతి సారవ్యాధి స్వంతంగా అంటించుకుని మన పళ్ళతో మనం తవ్వుకుంటున్న మన సమాథి. దీనిమీద ఒక ఆంగ్ల దినపత్రిక ఒక వ్యాసం రాసారు – ఈ వ్యాధి చాపకింద నీరులా ఎలా ప్రబులుతోందో. కనీసం ఆ వ్యాసం చదవడానిక్కూడా నేను ఉన్న ఇంట్లో – ఇంటికి న్యూస్ పేపర్ తెప్పించుకునే – ఎవరికీ తీరిక లేదు.
రెండో మరణం గురించి కె.కె. రామయ్య అభిప్రాయం:
09/30/2019 5:19 pm