పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16454

  1. శ్రీమాన్ కొండ్రాజు బలాదూర్ చరిత్ర: వరాహపర్వం గురించి Anil అట్లూరి అభిప్రాయం:

    02/01/2020 11:18 pm

    మొత్తానికి దరిద్రం పట్టుకున్నట్టు, ఆ శని దేవత దివాన్ని పట్టుకున్నదన్నమాట! భలే చమత్కారం, వర్మ గారు! చి న

  2. ఏ విలువలకీ శప్తభూమి? గురించి Anil అట్లూరి అభిప్రాయం:

    02/01/2020 9:35 pm

    వెలువడిన వెంటనే ఈ నవలని చదివాను. చదివించింది.

    ఎందుకని ఈ నవలని దళిత బహుజన నవల అంటున్నారో అర్ధం కాదు. ఒక historical fiction నవలగా ఎందుకని చదువుకోకూడదు?

    కొన్ని మార్పులు చేర్పులతో చక్కటి పీరియడ్ సినిమా చేసుకోవచ్చు ఈ నవలని.

  3. శ్రీహర్షమహాకవి గ్రంథగ్రంథులు గురించి తః తః అభిప్రాయం:

    02/01/2020 5:37 pm

    చాలా ఆసక్తికరమైన వ్యాసం భాస్కర్. పాఠకులలో శ్రీ హర్ష కావ్యాన్ని శ్రద్ధగా చదవాలి అనే ఆలోచనను రేకెత్తించే రచన. శ్రీనాథుడు (కూడా) తెనిగించలెక పోయిన మూల గ్రంథులను తెనుగు చేయటానికి ప్రయత్నించిన శేషేంద్రను శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతుల వద్దకు శ్రీ శేషయ్య (నీలంరాజు) తీసుకు వెళ్ళినట్టు చాలా సంవత్సరాలక్రితం చదివినట్టుగా గుర్తుకు వస్తోంది.

    నమస్కారాలతో
    తః తః

  4. ఏకాంతద్వీపం గురించి Sitha Challa అభిప్రాయం:

    02/01/2020 5:04 pm

    Most sorrowful moments are portrayed very delicately. For anyone who watched a loved one helplessly, this can bring those memories back. Thanks to the writer. It’s a painful but powerful poetry.

  5. సుగ్రీవ విజయము: రజని యక్షగానం గురించి దేశికాచారి అభిప్రాయం:

    02/01/2020 3:33 pm

    శ్రీశ్రీనివాసుగారికి – ఈయక్షగానమును ఇట్లు పాఠకుల కందజేసినందులకు మీకు కృతజ్ఞతలు. విని ఆనందించినాను. ఇటాలియను ఆపెరాలను తెలుగులో ఆధునికయక్షగానాలుగా , అంటే సూత్రధారుడు లేకుండా, వచనం దాదాపుగా లేకుండా,పద్యమాత్రాఛందోబద్ధమైన సంభాషణాత్మకమైన కావ్యాలుగా, పునర్నిర్మిస్తున్న నాకు ఇది వినే అవకాశం కలిగించిన మీకును, ఈమాట సంపాకులకును ధన్యవాదములు.

  6. ఏ విలువలకీ శప్తభూమి? గురించి దేశరాజు అభిప్రాయం:

    02/01/2020 1:48 pm

    కొన్ని ప్రశ్నలు ఆలోచించాల్సినవే. అయితే చరిత్రకీ ఆశయాలకీ తేడా ఉంటుందని మీరు గుర్తించలేదేమో అనిపిస్తోంది.

  7. ఆత్మావై పుత్రనామాసి గురించి శర్మ దంతుర్తి అభిప్రాయం:

    01/27/2020 9:20 am

    బాబా గారు
    మీరు కామెంట్ పెట్టేటప్పుడు అక్కడే ఉన్నమొదటి కామెంట్ చూసారా? ఇంతటి మార్మికం లేని, విషయ ప్రకటన లా ఉండే అధ్వాన్నపు కవిత మీకు కళ్ళమ్మట నీళ్ళు తెప్పించింది అంటే సంతోషమే. ధన్యవాదాలు

  8. భారం గురించి ns murty అభిప్రాయం:

    01/27/2020 5:51 am

    కథ, అనువాదమూ రెండూ చాలా బాగున్నాయి. హృదయపూర్వక అభినందనలు భాస్కర్ గారూ.

  9. ఆత్మావై పుత్రనామాసి గురించి బొల్లోజు బాబా అభిప్రాయం:

    01/25/2020 2:32 pm

    ఆత్మావై పుత్రనామాసి.” అనే వాక్యార్ధం కోసం గూగిల్ చేస్తే ఇక్కడకు వచ్చాను.

    చాలా గొప్ప పద్యం. కళ్ళనీళ్ళు తిరిగాయి. చాలా జ్ఞాపకాలు ముప్పిరిగొన్నాయి. థాంక్యూ సర్.

  10. చిత్రలేఖ గురించి somayajula sai prasad అభిప్రాయం:

    01/21/2020 4:28 pm

    సంపాదకులకు అభ్యర్ధన,

    దేశికాచార్యుల వారి చిత్రలేఖ అను రచన శీర్షిక మాత్రమే ఉన్నది. రచన కనిపించడం లేదు. దయచేసి రచన అంతర్జాలములో ఉంచగలరు.

    ధన్యవాదములు,
    సాయి

    [ఇప్పుడే సరిదిద్దినాము. దోషాన్ని చూపినందుకు కృతజ్ఞతలు. — సం. ]