పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16454

  1. సాహితీ చమత్కారాలు గురించి N Raghu Kumar అభిప్రాయం:

    03/06/2020 5:42 am

    శ్రీనాథుడు కూడా శివుణ్ణి నిందిస్తూ ఒక పద్యం చెప్పాడు కదండీ?

    సిరిగలవానికి జెల్లును
    తరుణులు పదియారువేలు తగ పెండ్లాడన్,
    తిరిపెమునకిద్దరాండ్రా
    పరమేశా! గంగవిడు పార్వతి చాలున్.

    తెలుగు భాషలో ఇంకా ఇలాంటివి చాల వున్నయంటారు.

  2. ఉయ్ టూ గురించి A S Murthy అభిప్రాయం:

    03/04/2020 9:31 am

    నాలుగు పేరాలు చదివేక చప్పగా చాల్లే అనిపించింది

  3. తిరస్కృత గురించి విజయలక్ష్మి అభిప్రాయం:

    03/04/2020 3:38 am

    ధన్యవాదాలు సర్.

  4. సంకేతాలు – చిహ్నాలు గురించి Sujata అభిప్రాయం:

    03/02/2020 11:13 am

    చదివాక గుండె పట్టేసినట్టయింది. సినాప్సిస్ లు చదివి, దీనిలో సింబల్స్, నాజీలు చంపగా చనిపోయిన తోటి వాళ్ళు, రైలులో కరెంటు పోవడం, ముసలాయన నిస్సహాయత, విపరీతమైన అసౌకర్యం కలిగించే పళ్ళు, కష్టాలు.. ఆ ఆఖరి ఫోన్ కాల్ బహుశా వారి అబ్బాయి మరణ వార్త కావచ్చేమో అని చదివేవారికి సహజంగా కలిగే భయం.. జీవితం ఎంత పెద్ద చాలెంజ్ అనిపిస్తుంది. అందరి మీద జాలి, వారి ప్రయాసలకి పోరాటాలకి, అబ్బురం కలిగించే కథ. థాంక్స్ మూర్తి గారు. మంచి కథ.

  5. ఇంగ్లీషు చదువుల చరిత్ర 3 గురించి Indrani Palaparthy అభిప్రాయం:

    03/02/2020 10:21 am

    విలువైన వ్యాసం. ప్రచురించిన ఈమాట వారికి అభినందనలు.

    పాలపర్తి ఇంద్రాణి.

  6. ఆ రేయి నీరెండ! గురించి NS Murty అభిప్రాయం:

    03/02/2020 8:59 am

    Dear Anwar,

    I have seen many people who can write left and right. But I have not seen a very good artist who is also a versatile writer like you. Perhaps you should be called a “Wri-tist”.

    Perhaps you are the only Writist in the country.

    with best wishes and regards

  7. ఉయ్ టూ గురించి nagamurali అభిప్రాయం:

    03/02/2020 4:41 am

    ప్రతీ మగాడు నా మొగతనానికో సవాల్ అనుకోడం నుంచి మొదలైన నేను, వాళ్ళ డీసెన్సీ ఇప్పుడు కాస్త చూడగలగుతున్నాను.

    చాలా గొప్ప కథ. సరిగ్గా అర్థమైతే గుండెల్లోంచి ఎంతో బరువు దించగల కథ. అమెరికాలో సెటిలైన వాడు, మంచి ఇల్లు కట్టుకున్నవాడు, నీకన్న తెలివైనవాడు, నీకన్న అందగాడు – ఇలాంటి వాళ్లందరూ బాధించడం మానేస్తారు, ఈ కథ నిజంగా మనమీద పనిచేస్తే.

  8. ఏ విలువలకీ శప్తభూమి? గురించి బొల్లోజు బాబా అభిప్రాయం:

    02/29/2020 9:36 am

    నవల చదివాను. అప్పట్లో ప్రజలు అలా ఆలోచించారు, అలా జీవించారు అని చెపుతున్నట్లు అనిపించింది.

    తప్ప ఇలా ఆలోచించి ఉండాల్సింది ఇలాంటి చైతన్యంతో జీవించి ఉండాల్సింది అని చెప్పటం రచయిత ఉద్దేశ్యం కాదేమో.

    చాలా ఉదంతాల ప్రస్తావనలు బ్రిటిష్ గెజటీర్లలోను, మతప్రచారకుల డైరీలలోను, మెకంజీ కైఫియత్తులలోను నేటికీ చదువుకొనవచ్చును. వాటన్నిటికీ ఒక నేపథ్యాన్ని, పాత్రలను, సన్నివేశాల్ని కల్పించి అల్లిన బీభత్సరసప్రధాన విషాదాంత నవల ఇది. చాలామట్టుకు నమ్మశక్యంగానే అనిపించాయి.

    ఇంతగొప్ప చారిత్రిక నవలకు దళితబహుజన కలరింగ్ ఇవ్వటం నాకూ నచ్చలేదు. బహుశా మార్కెటింగ్/అవార్డుల కొరకేమో నాకు తెలియదు.

    ఇటీవల చదివిన నవలల్లో గుర్తుంచుకోదగినది. అవార్డుకు అర్హమైనదనీ తలుస్తాను.

    బొల్లోజు బాబా

  9. నవోదయతో నా రుణానుబంధం గురించి బుచ్చిరెడ్డి గంగుల అభిప్రాయం:

    02/28/2020 11:04 pm

    వారి దయవల్లనే చాల పుస్తకాలు తెప్పించుకొని చదివాను.
    గొప్ప వ్యక్తి—

    భార్గవిగారు— మీ నివాళి బాగుంది. నూరుపాళ్ళు నిజం కూడా

    ===================
    బుచ్చిరెడ్డి గంగుల

  10. ఏ విలువలకీ శప్తభూమి? గురించి Amarendra అభిప్రాయం:

    02/22/2020 7:22 pm

    సరిగ్గా అర్థంకాకపోయి ఉండాలి అంటూనే బోలెడు ప్రశ్నలు లేవనెత్తారు కామెంట్ నంబర్ 4వారు. చర్చ జరిగితే బావుణ్ణు…