పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16454

  1. ఒకానొక ఊట కోసం గురించి Palagummi Padmavijay అభిప్రాయం:

    05/01/2020 11:24 am

    గుండెలో ఏదో తెలియని బాధ కలిగింది. కవితలో భావవ్యక్తీకరణ అద్భుతంగా ఉన్నది.

  2. ఓడిపోయిన యోధుడు గురించి కె.కె. రామయ్య అభిప్రాయం:

    05/01/2020 10:26 am

    ఊపిరి తీసుకోవటం కూడా మర్చిపోయి… ఉక్కిరిబిక్కిరి చేస్తూ పరవళ్లు తొక్కిన ఓ ప్రవాహం లో… ఉన్మత్తుడిని చేస్తూ చుట్టుకున్న ఓ సౌగంధం లో… కాలిపోతున్న… కరిగిపోతున్న ఓ కలలో కొట్టుకుపోయేలా చేసిన తమిళ సాహితీ యోధుడు అప్పాదురై ముత్తులింగం అన్నకు… అద్భుతంగా కాక మరోలా అనుసృజన చెయ్యటం మర్చిపోయిన అన్నమాచార్య సంకీర్తనల అభిమాని అవినేని భాస్కర్ కి హృదయపూర్వక నమస్సుమాంజలి అని అనలేని… అలసిసొలసి సొక్కి సుషుప్తి స్థితిలోని ఓ నేలక్లాసు ప్రేక్షకుడి దీన నివేదన.

  3. సాయం ఛాయ గురించి కె.కె. రామయ్య అభిప్రాయం:

    05/01/2020 9:53 am

    సాయం సంధ్యలో ఉన్న మావయ్య మీన ఆన… వారు ప్రస్థావించిన ఒన్స్‌ మోరులతో హోరెత్తిన పద్యాలు, జనం విజిళ్లతో జోరెత్తిన పాటలు గురించి కూడా చెప్పు పాలపర్తి ఇంద్రాణి తల్లీ.

    గతం పునాదుల మీదే భవిష్యత్తు భవనాలు వెలుస్తాయని … సంస్కృతాంధ్ర అంగ్ల భాషా సాహిత్యాలు అధ్యయనం చేసి ఆధునిక సమసమాజాన్ని ఆవాహనం చేసిన మహాకవి శ్రీశ్రీని తలుచుకుని కూడా చెప్పు వర్ధమాన తరం కవయిత్రి తల్లీ.

    జండాపై కపి రాజు ముందు సిత వాజి శ్రేణినిం గూర్చి నే
    దండంబున్ గొని దోలు స్యందనము మీదన్ నారి సారించుచున్
    గాండీవమ్ము ధరించి ఫల్గుణుడు మూకం జెండుచున్నప్పుడొ
    క్కండున్ నీ మొర నాలకింపడు కురు క్ష్మానాథ సంధింపగాన్ !!

    ఇచ్చోటనే సత్కవీంద్రుని కమ్మని
    కలము,నిప్పులలోనఁగఱగిఁపోయె !
    యిచ్చోట;నే భూము లేలు రాజన్యుని
    యధికారముద్రిక లంతరించె!
    యిచ్చోట; నే లేఁత యిల్లాలి నల్లపూ
    సలసౌరు,గంగలోఁగలిసిపోయె!
    యిచ్చోట; నెట్టి పేరెన్నికం గనుఁగొన్న
    చిత్రలేఖకుని కుంచియ,నశించె!

    ‘కళ్లెత్తితేసాలు, కనకాబిసేకాలు ఎంకివంటి పిల్ల లేదోయ్‌ లేదోయ్‌’

    యెనక జన్మములోన యెవరిమోనంటీ
    సిగ్గొచ్చి నవ్వింది సిలకనా యెంకి
    ముందు మనకే జల్మముందోలె యంటి
    తెలతెల్లబోయింది పిల్లనా యెంకి
    యెన్నాళ్ళొ మనకోలె యీ సుకములంటి
    కంట నీరెట్టింది జంట నా యెంకి

  4. ఈమాట సంపాదకుల పద్ధతి గురించి Srinivas Banda అభిప్రాయం:

    05/01/2020 9:23 am

    చాలా విషయాలు మునుపటికన్నా స్పష్టమయ్యాయండి. ధన్యవాదాలు.

  5. ఒకానొక ఊట కోసం గురించి Satya అభిప్రాయం:

    05/01/2020 8:55 am

    బాగా రాసారు అండి….

  6. ఒకానొక ఊట కోసం గురించి సాహితి సాచి అభిప్రాయం:

    05/01/2020 8:48 am

    బాగుంది జానీ గారు… ఊపిరొక అపనమ్మకం ఏ క్షణానైనా మట్టిలో తల దాచుకుంటుంది…. ఈ మాట వాస్తవం

  7. ఒకానొక ఊట కోసం గురించి కొండవీటి అంతయ్య అభిప్రాయం:

    05/01/2020 7:53 am

    తెలుగు మాటలను మీకే సొంతమైన రీతిలో, నవ్య భావాలతో ప్రయోగిస్తూ రాసిన మీ కవిత చాలా బాగుంది!

  8. ఒకానొక ఊట కోసం గురించి ఉండవిల్లి.ఎమ్ అభిప్రాయం:

    05/01/2020 7:04 am

    బావుంది. తక్కువ పదాలతో, నిగూఢమైన ఆవేదన లోపలికి చొచ్చుకుపోయింది.

    నీరింకిన బావి, విరిగిన రక్తం రెండూ పర్యాయపదాలే! అద్భుత ప్రయోగం💐👌

  9. ఒకానొక ఊట కోసం గురించి అనిత రొక్కం అభిప్రాయం:

    05/01/2020 7:04 am

    సర్! చాలా చక్కగా అద్భుతమైన పదజాలం వాడి ఒక మనిషి పడే వేదనని చాలా బాగా రాసారు…
    మీరు ఇక్కడ వూట అనే పదాన్ని వాడారు కానీ ఆలోచిస్తే అందులో చాలా లోతైన విషయాలు దాగి వున్నాయి…
    సమాజ శ్రేయస్సు కోరుకునే ఒక వ్యక్తి ఆలోచనలు, ఆవేదన, రక్త పాతాలు, చివరి క్షణం వరకు పోరాడే తత్వాన్ని అద్భుతంగా వివరించారు 👌👌👏👏👍👍👍

  10. ఒకానొక ఊట కోసం గురించి సిరిపురపు శ్రీనివాసు అభిప్రాయం:

    05/01/2020 7:00 am

    నదులు సముద్రాలుగా కదులుతున్న చీకటి
    క్షణాలుగా విస్ఫోటనమైన దేహం
    ఎప్పుడూ గాయాలుగానే ప్రవహిస్తుంటుంది.
    ఊపిరి ఏ సమయంలోనైనా
    మట్టిలో తల దాచుకుంటుంది.

    అద్భుతమైన భావాల సమాహారం మీ కవిత.