పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16454

  1. మరణ మృదంగం గురించి tadepalli subrahmanyam అభిప్రాయం:

    05/08/2020 1:43 am

    Sir,your translation into Telugu is excellent and far beyond imagination(In childhood I tried to follow telugu Soviet bhoomi,but due to terrible and scary translation; could not continue).Now am in a dilemma whether this translation is more versatile and beautiful than that of Tolstoy.congratulations

  2. మధ్య వ్యవధిలో నీడలు గురించి వారణాసి నాగలక్ష్మి అభిప్రాయం:

    05/07/2020 9:54 pm

    ఊహకీ మాటకీ, మాటకీ చేతకీ మధ్య ఎంత అంతరం! చటుక్కున వచ్చిపడ్డ అవాంతరం. ‘మధ్య వ్యవధిలో నీడలు’ భలే శీర్షిక. నేటి ‘థప్పడ్’ సినిమా నేపధ్యంలో, అదే ఇతివృత్తం మీద రెండు దశాబ్దాల క్రితమే ఇంత పదునైన కథ వచ్చిందని ఇప్పుడే తెలిసింది. చంద్ర కన్నెగంటి గారికి అభినందనలు! ముఖపుస్తకంలో ఈ కథని షేర్ చేసిన చంద్రలతకి ధన్యవాదాలు.

  3. మనుషులెందుమూలంగా జీవిస్తారు? గురించి Raghunadhachari.P అభిప్రాయం:

    05/07/2020 7:52 am

    Good evening sir,

    Thanks for giving us the opportunity to read Leo Tolstoy. I can’t understand exactly if i read in english.

    Super narration by you sir.

    Once again thanks for translating Leo Tolstoys supreme thoughts.

  4. పరిపాకం గురించి Raghunadhachari.P అభిప్రాయం:

    05/07/2020 7:29 am

    Dear sir, Good evening!

    Thanks for your reply. And thanks for nice detailed explanation given to the question asked by Desika charu garu.

    యుద్ధం జరగడానికి ముందు వందల ఏనుగులు వేసే మొదటి అడుగుకంటే, వేల గుర్రాలు తీసే మొదటి పరుగుకంటే జ్ఞానం కోసం మానవులు వేసే మొదటి అడుగు అమోఘమైనది.

    Excellent! I am attracted towards Buddha bhagavan by your writings. Need more information from you, so I am asking your contact.

    My mail id raghunathachari.pulukuri@gmail.com.

    I Will feel very happy if you text me sir.

  5. కెహర్వా! గురించి అం అః అభిప్రాయం:

    05/06/2020 6:51 pm

    అన్నా శర్మన్నా

    ఇంత పొడుగాల రాసి బా చెప్పిర్రు మీరు. నే కెహర్వా గూర్సి మాటాడ. ఎందుగాల్నంటే కెహర్వా వొంటి మాట ఈడ సర్పోయె గావట్టి.

    అయితెగాని అది గట్ల పక్కంబెట్టి జూస్తే మీర్మట్కు సంపాదకుల గూర్సి ఎప్పుడు జూసినా మంచి మాటల్ జెప్త ఉంటరు. గద్జూసి మిమ్మల్ని పెర్పంచకంల ఏ సంపాదకుడైన బాగ “లవ్వు”తారనుకుంటరు. గంటె కావులించుకుంటరన్నమాట.

    ఆకాడ్నే మల్ల ఆల్ల మూలకెల్లి ఆల్లు గట్ట సెయ్యబట్టి నా రాతల్ బాగుపడ్డై, కన్నీల్లొస్సినయ్, ఫేసుబుక్కు కర్వెపాకును తన్ని తగలెసిన అనుకుంట ఎన్కటి కాలంల పెరుమాల్ లెక్క సోచ బజాయిస్తుంటరు. మీకు తెల్వదని గాదుగాని సంపాదకులెవ్వలైన గాని ఏద్జూసినా సరే ఆల్ల నోటనుంచి వచ్చేట్ది, అనంగా మొదటి మాట ఏందంటె “ఇది బాగలె” అనె. అట్ల ఆల్లు ఆల్ల “ఇది” నిల్పుకుంటరు. ఆల్లు అట్ల సెయ్యవట్టి పెర్పంచకంల రచయితల్కు గుబేల్ పుట్తది. అది అందర్కి ఎర్కైన ఇసయమె. ఆల్లకి బాగు అనిపించెందాక ఆల్లు ఆ మాటను గాట్టిగ పట్కోని కూకుంటరు. ఆయింత అయినంక వచ్చె రాత ఎట్లుంటదొ మీకందర్కు యెర్కెనె గద.

    పోతె మీరు “డు” అనె పదం పుచ్చుకోని ఎన్ని పైదా బెట్టించొచ్చు అని అడ్గిరి. నే లెక్కెసిన, 3666 పదాలు పైదా అయితయ్…ఔ! తీన్ హజార్ పైననే అయితయ్! కావల్నంటె ఫ్రి డిక్షనరి డాట్ కాం లా సూస్కోండి. ఇంగ ఉంట

    అన్నా, శర్మన్నా, ఇంగ ఉంట!

    అం అః

  6. గడినుడి – 42 గురించి Dr. I.A.P.S. Murthy అభిప్రాయం:

    05/06/2020 8:27 am

    ‘ళ్ళ’ కన్నా ‘ళ్ల’ యే సరైనది. ఎందుకంటే, ‘ల’ తో అంతమయ్యే కొన్ని పదాలలో, ఆఖరి అక్షరానికి ముందున్నది ‘ళ’ గా మారినప్పుడు, చివరి అక్షరమైన ‘ల’ పొల్లుగా మారుతుంది (అని నా అభిప్రాయం).

    ఉదాహరణలు: పెండ్లి = పెళ్లి; ఊరులు = ఊళ్లు; ముల్లులు / ముండ్లు / ముడులు = ముళ్లు, బీడులు = బీళ్లు, కాలులు = కాళ్లు, వెడలి = వెళ్లి, మరలి = మళ్లి

    వీటి వ్యాకరణాన్ని విజ్ఞులే వివరించాలి.

  7. మధ్య వ్యవధిలో నీడలు గురించి Paresh Doshi అభిప్రాయం:

    05/06/2020 2:06 am

    Wonderful story. First person narration came handy to demonstrate his arrogance. Tq

  8. నొట్టు స్వరాలు, కర్ణాటక సంగీతంలో పాశ్చాత్య బాణీలు గురించి tadepallisubrahmanyam అభిప్రాయం:

    05/05/2020 10:37 am

    Very happy to observe the efforts of the author to let every lover of South indian music know the nuances and the biography of the musical trio. A great effort indeed.

  9. కళాపూర్ణోదయం -2: మణికంధరుడి తపోభంగం గురించి M V RAMA RAO అభిప్రాయం:

    05/05/2020 2:44 am

    ఆద్యంతం అద్భుతం, భాష మీద అధికారం & భావం మీద మమకారం ప్రస్ఫుటంగా ఉనాయి . మీరు ఇలాగే జైత్ర యాత్ర చేస్తూ ఉండండి

  10. అసలేం చేశానని?! గురించి దార్ల వెంకటేశ్వరరావు అభిప్రాయం:

    05/04/2020 9:57 pm

    గిరిధరరావుగారూ, నమస్కారం
    ఎంత చక్కని భావుకత. పెర్సానిఫికేషన్ చేయడంలో కవి ప్రతిభావంతుడైతే తప్ప ఇలాంటి చక్కటి భావచిత్రాలు సాధ్యం కాదు. మొక్కను మహావృక్షంగా మలచడం, తర్వాత దాన్ని మనం అందుకోలేకపోవడం…ఆహా…ఎంత బాగుంది. ఇందులోని మొక్క మొక్కే అయితే కవిత్వమేముంది. అదే మనల్ని భావుకతవైపు నడిపిస్తుంది. ఎంతైనా వ్యాఖ్యానం రాయిస్తుంది.
    మరో సారి నమస్కరిస్తూ…దార్ల వెంకటేశ్వరరావు