పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16454

  1. రాత్రి గురించి srinivas sathiraju అభిప్రాయం:

    07/04/2020 8:25 pm

    రాత్రంటే వయసొచ్చి హార్మోనుల భారంతో అల్లల్లాడడమే అని కవి గారి భావన జాలి కొలిపేలాగ ఉంది.. తీరని కోరికలతో సతమతమయ్యే మధ్య తరగతి కష్ట జీవి బ్రతుకులో ఇంకా కోరికలు రగలుతూ ఉండడం తప్పని సరి సమస్యే కావొచ్చు కాని..జీవితమంటే పగలు రాత్రులే నని ఇద్దరు కలిస్తే వచ్చే మూడో వాళ్ళని, ఆ రాత్రి తాలూకూ భాద్యతలను నెర్పే రోజు కూడా కవి హృదయంలో మెదలాలని ఆశిస్తూ….. ఒక చక్కని పొంగే బీరు లాంటి, కాపు కాచిన విప్పపువ్వు సారాలాంటి కవిత.మాత్రం మత్తెక్కించిందనే చెప్పాలి..

  2. విజయం గురించి S. Narayanaswamy అభిప్రాయం:

    07/03/2020 11:18 am

    Interesting narration style

  3. దిల్ ధడక్‌నే దో! గురించి Amarendra Dasari అభిప్రాయం:

    07/03/2020 12:29 am

    సింకులో ప్లేట్లు వెక్కి వెక్కి కడిగిన పిల్లది మరో పాతికేళ్ళకు ఇంటి నలుగురి పనీ చేస్తూనే ఉంటాది. ‘సహాయం(!)’ చెయ్యాలని తపించే మొగాడు దొరికితే మంచిదే, లేకపోతే ఆ పాప మరి కొంచెం ఎక్కువ నలిగిపోతుంది. పైటను కాదు, ముందు జీర్ణించుకు పోయిన గృహిణీ ధర్మాలను తగలెట్టాలి.

  4. భారత స్వాతంత్ర్య సమరములు: 1757-1857 గురించి Indrani Palaparthy అభిప్రాయం:

    07/02/2020 6:48 pm

    “వంగరాష్ట్రములో ఇంగ్లీషు ప్రభుత్వోద్యోగిగా పనిచేసి గొప్ప నవలలను వ్రాసిన బంకించంద్రచటర్జీగారు సన్యాసుల యుద్ధమునితివృత్తముగా గైకొని ఆనందమఠమను నవలనురచించిరి. అది దేశాభిమానపూరితములైన భావములతో నిండియున్నది. వందేమాతర గీతము అందులోనే వ్రాయబడి చరిత్ర ప్రసిద్ధికెక్కినది.”

    — ఆనంద మఠం తెలుగు అనువాదం చదివాను. సన్యాసుల యుద్ధం నిజంగా జరిగిందని ఈ వ్యాసం ద్వారా తెలిసింది.

    దిగవల్లి వారి వ్యాసాలు ఎంత బాగున్నవో. ఈమాట వారు మంచి పని చేస్తున్నారు.

    ధన్యవాదాలు.
    పాలపర్తి ఇంద్రాణి.

  5. మరింత దగ్గరికి గురించి Krishna అభిప్రాయం:

    07/02/2020 5:09 pm

    “దేవుడికి ఒక వాసన ఉంటే అది కచ్చితంగా ఇలాగే ఉంటుంది.” చాలా బాగుంది ఈ లైన్.

  6. సత్యప్రమాణం గురించి Uma Devi Pochampalli అభిప్రాయం:

    07/02/2020 3:39 pm

    చాలా బావుంది, చక్కటి కథ.

  7. దిల్ ధడక్‌నే దో! గురించి Vijaya Karra అభిప్రాయం:

    07/02/2020 2:21 pm

    చాల జంటల మిశ్రమ అనుభవాలనుండి వచ్చిన కథ 🙂 . థాంక్యూ మల్లీశ్వరి – మీ సూచన గుర్తు పెట్టుకుంటాను.

  8. మరింత దగ్గరికి గురించి Raghu అభిప్రాయం:

    07/02/2020 10:00 am

    ఆందమైన రచన
    అవసరమైన రచన

  9. విజయం గురించి Srinivas Banda అభిప్రాయం:

    07/02/2020 3:37 am

    స్పందించిన అమరేంద్ర, వంశీకృష్ణ గార్లకు ధన్యవాదాలు!

  10. విజయం గురించి Vamsi Krishna అభిప్రాయం:

    07/02/2020 12:53 am

    నాలుగింటికీ ఏమీ కాకుండా, రెండు కర్రలను, రెండు పాములను కథలో ఇమిడ్చి విజయం సాధించారు.