లైలాగారి కథలో ‘లైలా’ కాలేజీ కలికానికైనా కనపడలేదు. అక్కడి (ఆనాటి) లెక్చరర్లు కొందరు లైలాగారి కథా దేశ కాలాల (అప్పటినక్కల రోడ్డు) డాక్టరమ్మల భర్తలుగా తెలుసును.
[కథ ఇంత బాగుండటానికి ఇది కథ కాకపోవటమే కారణమేమో! దుర్గమ్మ గుడిగుమ్మం ముందు నుంచుని పైకి చూస్తూ ‘అమ్మలగన్న అమ్మ’ పద్యం చదువుకుంటూ లోపలికి వెళ్ళి అమ్మను చూడటంలో ఉన్న ఆనందానుభవం ఎటువంటిదంటే ‘జర్నల్ అఫ్ అప్లయిడ్ ఫిజిక్స్’లో పడిన ఒక పేపర్ను -వాసుదేవ- ఆ తల్లికి అంకితం చేసిన విషయం ఆ పేపర్ చివర్లో కనపడుతుంది].
నాకు తెలిసినవి రెండే ఊళ్ళు, ఆ రెండిటి (ఆనాటి) విద్యా సంస్కారాలను కళ్ళకు కట్టించారు మీరు –
డాక్టర్ ఎర్నేని మీకు ధన్యవాదాలు… నమస్కారాలతో- తఃతః
Great to see this being published by eemaata! I am more than glad to see my grandfather’s handwritten manuscript by the side of each page.We grew up seeing him reading and writing for more than 16hours a day even at an age of 90+.
Congratulations to my uncle Dr.Ramachandra for pursuing relentlessly to get the unpublished manuscripts into print form.
Also great work by the publishers, your commitment is commendable,it’s very difficult to understand DVSivarao garu’s handwriting.
Thanks very much,
Syamala.
1) చీకటిని హత్తుకోనంతసేపూ దీపం ఒంటరిదే.
2) మనిషి ఒంటరిగా ఏదైనా చేయగలడు కానీ కౌగిలించుకోడానికి కనీసం ఇంకొక్కరైనా కావాలి. ఒంటరిగా మనం ఎప్పటికీ సగమే కదా అనిపిస్తుంది.
ఈ రెండు వాక్యాలూ కలిపి ఆలోచిస్తే కొత్త అర్థాలు స్ఫురిస్తున్నాయి.
ఆలోచింపజేయడం, హృదయాన్ని తాకడం రెండూ చేయగలుగుతోంది కథ.
డా. లైలా యెర్నేని గారూ… మీ డివెర్టిమెంటో కధలో తలమునకలయ్యాను … వాట్ ఏన్ ఎక్స్‌పిరియన్స్! అని అనాలని ఉంది. యీ కధ మళ్లీ మళ్లీ చదవాలి. అడవి బాపిరాజు గారి “శైలబాల” కధ ఉదయిని పత్రిక 01-10-1935 సంచిక లో ప్రచురితం అయినట్లు కారా మాస్టారు గారి కధానిలయం చెపుతోంది. ఆ కధా చదవాలని ఉంది.
మీ డివెర్టిమెంటో కధని చదవమని పున్నాగపూల రచయిత్రి జలంధరమ్మ ( జలంధర చంద్రమోహన్ ) గారికి పంపిస్తున్నా. వారి మేనత్త తెన్నేటి హేమలత గారిది బెజవాడే కదా.
డివెర్టిమెంటో గురించి గూగులమ్మ నడిగి తెలుసుకున్న వివరాలు : Divertimento is a light and entertaining musical composition, typically one in the form of a suite for chamber orchestra, often scored for a mixed ensemble and having no fixed form. Mozart composed a few early in his career.
ఆంధ్రా న్యూరోసర్జన్ పితామహ అని పేరు గాంచిన డా. బాలపరమేశ్వరరావు గారికి 1995 సంవత్సరంలో నేను కూడా చూపించుకున్నాను వారి హైద్రాబాదు హాస్పిటల్ లో ( Scooter accident resulting in wedge compressed lower vertebra touching the spinal chord ). ” నేను వైద్యం మాత్రమే చేస్తాను, ఆరోగ్యం ఆ భగవంతుడే ఇస్తాడు ” అనే కొటేషన్ వారి కాబిన్ లో చూసాను.
మా చిన్నప్పుడు అమ్మ వంటింట్లో చల్లకవ్వం తిప్పి చల్ల చెయ్యటం, వెన్న తియ్యటం చూసిన వాడిని.
జపానుదేశరచయిత్రి మురాసాకీ ఉదంతమును తెల్పినందులకు ధన్యవాదములు. కానీ ఈవ్యాసం ఆదిలోనే ఉన్న ఈక్రింది వాక్యాన్ని చూస్తూనే అది నాకు చర్చనీయంగా అనిపించింది:
“నవలలకూ, స్త్రీలకూ అవినాభావ సంబంధం ఉందని సంస్కృత భాష సాక్షిగా మనవాళ్లు చెబుతూంటారు. (సంస్కృతంలో నవలా అంటే స్త్రీ)”
ఆఁడుది అనే అర్థం గల నవల (రూపాంతరం నవలా) శబ్దం సంస్కృతంగా గాక దేశ్యంగానే నాకు గుర్తు. కాని ఇది సంస్కృతశబ్దమని ప్రప్రథమంగా ఇక్కడే వినడంచేత, నా అనుమాన నివృత్తికై వావిళ్లనిఘంటువును, ఆంధ్రవాచస్పత్యమును, విక్రాల శేషాచార్యులవారి సంస్కృతాంధ్రపదార్ణవమును పరిశీలించినాను. వీటన్నిటిలో నవల, నవలాపదములు ఆఁడుది అనేఅర్థంలో శుద్ధదేశ్యపదములుగానే పేర్కొనబడినవి. ఎందుకో సూర్యరాయాంధ్రనిఘంటువులో ఈపదం లేనే లేదు, కాని వావిళ్లనిఘంటువులో దీనికి రామాభ్యుదయంనుండి ప్రయోగంకూడ ఈయబడింది. వసుచరిత్రాది ఇతరగ్రంథాలలోనూ ఇది దేశ్యంగానే ప్రయోగింపబడింది. మఱి మీరీశబ్దం సంస్కృత మనుటకు గల ఆధారం తెలిపితే ఆవిషయం తెలుసుకొని నాపదజ్ఞానపరిధిని విస్తరించుకొంటాను.
మెలుకువ అంటే..
కళ్ళ ముందు కనబడేదేదొ కాదు
అలాగని నిన్ను
స్పందించేలా చేసే ఆమె
అంత కన్నా కాదు…
కప్పు కున్నా విప్పు కున్నా
బ్రతుకు తాలూకు భాద్యత
కర్తవ్యంగా గుర్తెరగక పోతే..
బ్రతుకంతా తెల్లారని కాళ రాత్రే.. మిత్రమా…
డివెర్టిమెంటో గురించి తఃతః అభిప్రాయం:
07/11/2020 8:39 am

భారత స్వాతంత్ర్య సమరములు: 1757-1857 గురించి Syamala Digavalli అభిప్రాయం:
07/09/2020 10:35 am
Great to see this being published by eemaata! I am more than glad to see my grandfather’s handwritten manuscript by the side of each page.We grew up seeing him reading and writing for more than 16hours a day even at an age of 90+.
Congratulations to my uncle Dr.Ramachandra for pursuing relentlessly to get the unpublished manuscripts into print form.
Also great work by the publishers, your commitment is commendable,it’s very difficult to understand DVSivarao garu’s handwriting.
Thanks very much,
Syamala.
కొన్ని నవ్వులూ కొన్ని ఏడ్పులూ గురించి Amarendra Dasari అభిప్రాయం:
07/08/2020 8:03 pm
అతి చక్కని అనుసృజన.
ఊర్మిళాదేవి నిద్ర: ఒక ఆలోచన గురించి వీరభద్రం అభిప్రాయం:
07/08/2020 12:15 pm
ఒక తప్పు పట్టేసాను. సమష్టి అని కదా వుండాలి.అచ్చుతప్పు వల్ల అన్నిచోట్లా సమిష్టి అని పడింది.
[తెలుగులో సమష్టి అన్న తత్సమం స్వర సమీకరణం (vowel harmony) వల్ల సమిష్టి అవుతుంది. సమిష్టి అని వాడితే దోషం కాదు. — సం. ]
మరింత దగ్గరికి గురించి Kalyani SJ అభిప్రాయం:
07/07/2020 11:24 am
1) చీకటిని హత్తుకోనంతసేపూ దీపం ఒంటరిదే.
2) మనిషి ఒంటరిగా ఏదైనా చేయగలడు కానీ కౌగిలించుకోడానికి కనీసం ఇంకొక్కరైనా కావాలి. ఒంటరిగా మనం ఎప్పటికీ సగమే కదా అనిపిస్తుంది.
ఈ రెండు వాక్యాలూ కలిపి ఆలోచిస్తే కొత్త అర్థాలు స్ఫురిస్తున్నాయి.
ఆలోచింపజేయడం, హృదయాన్ని తాకడం రెండూ చేయగలుగుతోంది కథ.
డివెర్టిమెంటో గురించి కె.కె. రామయ్య అభిప్రాయం:
07/05/2020 12:18 am
డా. లైలా యెర్నేని గారూ… మీ డివెర్టిమెంటో కధలో తలమునకలయ్యాను … వాట్ ఏన్ ఎక్స్‌పిరియన్స్! అని అనాలని ఉంది. యీ కధ మళ్లీ మళ్లీ చదవాలి. అడవి బాపిరాజు గారి “శైలబాల” కధ ఉదయిని పత్రిక 01-10-1935 సంచిక లో ప్రచురితం అయినట్లు కారా మాస్టారు గారి కధానిలయం చెపుతోంది. ఆ కధా చదవాలని ఉంది.
మీ డివెర్టిమెంటో కధని చదవమని పున్నాగపూల రచయిత్రి జలంధరమ్మ ( జలంధర చంద్రమోహన్ ) గారికి పంపిస్తున్నా. వారి మేనత్త తెన్నేటి హేమలత గారిది బెజవాడే కదా.
డివెర్టిమెంటో గురించి గూగులమ్మ నడిగి తెలుసుకున్న వివరాలు : Divertimento is a light and entertaining musical composition, typically one in the form of a suite for chamber orchestra, often scored for a mixed ensemble and having no fixed form. Mozart composed a few early in his career.
ఆంధ్రా న్యూరోసర్జన్ పితామహ అని పేరు గాంచిన డా. బాలపరమేశ్వరరావు గారికి 1995 సంవత్సరంలో నేను కూడా చూపించుకున్నాను వారి హైద్రాబాదు హాస్పిటల్ లో ( Scooter accident resulting in wedge compressed lower vertebra touching the spinal chord ). ” నేను వైద్యం మాత్రమే చేస్తాను, ఆరోగ్యం ఆ భగవంతుడే ఇస్తాడు ” అనే కొటేషన్ వారి కాబిన్ లో చూసాను.
మా చిన్నప్పుడు అమ్మ వంటింట్లో చల్లకవ్వం తిప్పి చల్ల చెయ్యటం, వెన్న తియ్యటం చూసిన వాడిని.
విజయం గురించి Srinivas Bandaa అభిప్రాయం:
07/04/2020 11:53 pm
ధన్యవాదాలు నారాయణస్వామిగారూ!
విశ్వ మహిళా నవల: 1. లేడీ మూరాసాకి గురించి desikachary అభిప్రాయం:
07/04/2020 10:53 pm
జపానుదేశరచయిత్రి మురాసాకీ ఉదంతమును తెల్పినందులకు ధన్యవాదములు. కానీ ఈవ్యాసం ఆదిలోనే ఉన్న ఈక్రింది వాక్యాన్ని చూస్తూనే అది నాకు చర్చనీయంగా అనిపించింది:
“నవలలకూ, స్త్రీలకూ అవినాభావ సంబంధం ఉందని సంస్కృత భాష సాక్షిగా మనవాళ్లు చెబుతూంటారు. (సంస్కృతంలో నవలా అంటే స్త్రీ)”
ఆఁడుది అనే అర్థం గల నవల (రూపాంతరం నవలా) శబ్దం సంస్కృతంగా గాక దేశ్యంగానే నాకు గుర్తు. కాని ఇది సంస్కృతశబ్దమని ప్రప్రథమంగా ఇక్కడే వినడంచేత, నా అనుమాన నివృత్తికై వావిళ్లనిఘంటువును, ఆంధ్రవాచస్పత్యమును, విక్రాల శేషాచార్యులవారి సంస్కృతాంధ్రపదార్ణవమును పరిశీలించినాను. వీటన్నిటిలో నవల, నవలాపదములు ఆఁడుది అనేఅర్థంలో శుద్ధదేశ్యపదములుగానే పేర్కొనబడినవి. ఎందుకో సూర్యరాయాంధ్రనిఘంటువులో ఈపదం లేనే లేదు, కాని వావిళ్లనిఘంటువులో దీనికి రామాభ్యుదయంనుండి ప్రయోగంకూడ ఈయబడింది. వసుచరిత్రాది ఇతరగ్రంథాలలోనూ ఇది దేశ్యంగానే ప్రయోగింపబడింది. మఱి మీరీశబ్దం సంస్కృత మనుటకు గల ఆధారం తెలిపితే ఆవిషయం తెలుసుకొని నాపదజ్ఞానపరిధిని విస్తరించుకొంటాను.
రాత్రి గురించి కాశి రాజు అభిప్రాయం:
07/04/2020 9:13 pm
Srinivas గారూ థాంక్ యూ
రాత్రి గురించి srinivas sathiraju అభిప్రాయం:
07/04/2020 8:34 pm