పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16454

  1. సత్యప్రమాణం గురించి కె.కె. రామయ్య అభిప్రాయం:

    07/29/2020 3:21 am

    “ గతం గతః దాన్ని ఎప్పటికీ మార్చలేవు. ఇప్పుడు నీ చేతిలో ఉన్న జీవితంలో తప్పులు చేయకుండా ధర్మం తెలుసుకోవడం కోసం పాటుపడడమే నీ పని “అన్న తథాగతుడి వాక్కులు … ఎంతటి పాపాత్ముడైనా ( క్రూరాతిక్రూరుడిగా పేరు తెచ్చుకున్న అంగుళీమాలుడైనా ) భగవానుడు చెప్పిన ధర్మపథం ఆచరిస్తే ఆయన అనుగ్రహంతో జీవితంలో అద్భుతాలు చేయగలడని… సత్యప్రమాణం గాధ ద్వారా చెప్పిన శ్రీ దంతుర్తి శర్మ గారికి నెనర్లు.

    గూగులమ్మనడిగి తెలుసుకున్న కొన్ని విషయాలు : గౌతమ బుద్ధుని కాలంలో అంగుళీ మాలుడనే ఒక బందిపోటు దొంగ దారికాచి వచ్చే పోయే బాటసారులను దోపిడీ చేసి హతమార్చేవాడు. అలా తాను దోచిన వ్యక్తుల లెక్కగా, గుర్తుగా వారి బొటన వేళ్లను ఖండించి మెడలో మాలగా వేసుకునేవాడు. అందుకే అతనికి అంగుళీమాలుడనే పేరు వచ్చింది. చిన్నప్పుడు అంగుళిమాలుడు తక్షశిల* విశ్వవిద్యాలయలోని ఓ మేధావంతుడైన విద్యార్ధి. సాటి విధ్యార్ధులు అసూయతో గురువు మనసును విషపూరితం చెయ్యగా ఆ ప్రభావంతో వెయ్యిమందిని చంపి వాళ్ళ బొటనవేళ్లు తెగేసి గురుదక్షిణగా తెమ్మని గురువు అంగుళీమాలుడుని ఆదేశిస్తాడు. క్రూరాతిక్రూరుడిగా పేరు తెచ్చుకున్న అంగుళీమాలుడు బుద్ధుని దర్శన భాగ్యంతో ప్రభావితుడై, హింసాయుత జీవనాన్ని విడనాడి బుద్ధుని శిష్యగణంలో భిక్షువుగా చేరి దురాశ, ద్వేషం, మాయా మోహాల నుండి తన మనస్సును ప్రక్షాళనం చేసుకుని బౌద్ధ లక్ష్యం మైన జ్ఞానోదయం పొందాడు.

    ప్రాచీన భారతదేశం ( క్రీ.పూ. 6వ శతాబ్దం ) లోని అతి పెద్ద ప్రధాన విశ్వవిద్యాలయాలు రెండు. అవి 1) నలందా విశ్వవిద్యాలయం(బీహారు) 2)తక్షశిల విశ్వవిద్యాలయం (పాకిస్తాన్). తక్షశిల పురాతన గాంధార రాజ్యం లోని ప్రధాన నగరం – ప్రస్తుత పాకిస్తాన్ దేశం లోని పంజాబ్ రాష్ట్రం ఇస్లామాబాద్ కు 35 కి.మీ. దూరంలో ఉంది.

  2. స్వీయప్రచురణ గురించి శ్రీపాద గురించి mbkreddy అభిప్రాయం:

    07/29/2020 12:56 am

    ఈ తరం రచయితలకు చక్కని సందేశం.

  3. విశ్వ మహిళా నవల: 1. లేడీ మూరాసాకి గురించి Veloori Krishna Moorthy అభిప్రాయం:

    07/28/2020 8:56 am

    మృణాలినిగారి విశ్వ మహిళా నవల: 1. లేడీ మురాసకి వ్యాసం చాలా బాగున్నది. ఈ నవల వ్రాయడానికి వున్న నేపథ్యం చాలా బాగా వివరించారు. మృణాలినిగారికి ధన్యవాదాలు.

    ఈ సందర్భంలో ఆమె ఉపోద్ఘాతంలో వ్రాస్తూ–క్రీ.శ.11 వ శతాబ్ధంలో నన్నయ మహాభారత రచన చేసే సమయానికి మళయాళీ, హింది, మరాఠీ,గుజరాతీ భాషలలో సాహిత్యం ఇంకా ఊపిరి పోసుకోలేదని అంటారు. ఇది ఎంతవరకూ సత్యమన్నది తెలిసినవారు చెప్పాల్సిన విషయం. అదే ఊపులో వారు మరో మాట అంటారు. తమిళ, కన్నడ, బెంగాలీ సాహిత్యాల్లో భక్తి రచనలు మాత్రమే వెలువడుతున్నాయని! తమిళు, బెంగాలీ భాషల విషయం నాకు తెలియదు. కానీ కన్నడ భాష విషయంలో ఇది సత్యానికి దూరం. విక్రమార్జున విజయ (-పంప భార త ) రచించిన పంప మహాకవి–ఆది కవి అని కూడ అంటారు- జీవిత కాలం (క్రీ.శ. 902-975). అలా చూస్తే ఆంధ్ర మహాభారతం రచనకు పూర్వమే కన్నడంలో మహాభారతానికి సంబంధించిన ఒక మహా కావ్యం వ్రాయబడింది. అలాంటపుడు ఇలాంటి మాటలనడం మృణాలినిగారి వారిలాంటి వారికి తగదనుకొంటా.

    ఇక శ్రీమతి మురాసకి రచించిన గెంజి కథనవల విషయానికి వస్తే, నేను 2017 లో ఒక నెల రోజులు నా పెద్ద కుమారుడి వద్ద గడిపా. ఆ సమయంలో దాదర్లో వున్న ఒక ప్రభుత్వ గ్రంథాలయంలో గెంజి కథ తెలుగు అనువాదం ఒక పాత ప్రతిని చదివే అవకాశం లభించింది.

    బొంబాయి నుండి వెనుదిరిగిన వెంటనే ఈ నవల అలాగే ఈ రచయిత్రి గురించి –మురాసకి శికిబు–ఆధునిక ప్రపంచపు మొదటి నవలా రచయిత్రి–అన్న ఒక సుధీర్ఘమైన ఒక వ్యాసం వ్రాశా. ఆ వ్యాసం సాహిత్య ప్రస్థానం డిశంబర్ 2017 సంచికలో ప్రచురింపబడింది. ఇదే వ్యాసాన్ని మిసిమి ఏప్రిల్ 2018 లో కూడ ప్రచురించారు. ఈ నవలను జపాను దేశపు బృహత్కథ అనికూడ పిలువడం అలవాటు. సంతోషించాల్సిన విషయమేమంటే 1962 లోనే సాహిత్య అకాడెమీ వారు తెలుగులోనికి అనువాదం చేపించి ఇంతటి గొప్ప నవలను ప్రచురించారు (1962). దీని ముద్రణ జరిగినది సికింద్రాబాదుకు చెందిన అజంతా పబ్లికేషన్స్ వారు. అనువాదం చేసిన వారు–నండూరి రామకృష్ణమాచార్య(NVR కృష్ణమాచార్య).

    వేలూరి కృష్ణమూర్తి, మైసూరు
    V. Krishna Moorthy, Ananya, #15, 14th Block, SBM Colony, Srirampura, Mysore-570034 Mob: 9448977877

  4. మనకు తెలియని మన త్యాగరాజు – 5 గురించి నళినీ కాంత్ అభిప్రాయం:

    07/27/2020 9:09 pm

    చాలా విస్తారమైన వ్యాస పరంపర. త్యాగరాజ స్వామి గురించి ఆసక్తి ఉన్న ప్రతి ఒక్కరూ తప్పకుండా చదవాల్సిన వ్యాస పరంపర. ఇంతకంటే సరళంగా రాయటం అంటే తేలిక కాదు. మీకు కర్ణాటక సంగీతాభిమాని గా నా నమస్కారం.

    పాత వ్యాఖ్యలలో ఈ వ్యాసం కాపీ కొట్టబడిందని చదివి, అది కూడా ఒక ‘so called’ ప్రముఖ పత్రికలో పడిందని చదివి చాలా చికాకుగా, బాధగా అనిపించింది.

  5. మనకు తెలియని మన త్యాగరాజు -1 గురించి నళినీ కాంత్ అభిప్రాయం:

    07/27/2020 11:42 am

    చక్కని వివరణ తో ఒక నేపధ్యం దృష్టిలో పెట్టుకుని ఆధారాలు ఉన్నంతలో చూపిస్తూ మంచి చర్చ చేస్తూ రాసిన వ్యాస పరంపర ఇది. కృతజ్ఞతలు.

  6. శ్రీనాథుని చాటుపద్యములు గురించి Chandra అభిప్రాయం:

    07/27/2020 3:47 am

    తెలుఁగు సాహిత్యాన్ని అర్థవంతంగా ఆస్వాదించనెంచే మాబోంట్లకు మీసేవ ఎన్నదగినది.

  7. విరాగి గురించి కె.కె. రామయ్య అభిప్రాయం:

    07/25/2020 11:01 pm

    ” చిరుదరహాసం మాటున చింతలను లయం చేసుకొని
    విరాగినై మౌనతాండవం చేస్తూ… ” అన్న కవయిత్రి నల్లపనేని విజయలక్ష్మి గారు…

    మనసులో సంతతము గనులఁ జాఱు విధాన, జగతియే యొక నాట్యసంరంభముఁనుగాగ
    తాండవమాడిన నిర్వాణరూపాయ! నిత్యాయ! గిరిశాయ! దుఃఖితాపన్న శరణ్యుఁడు ఈశ్వరుఁడి దీవెనలు మీకు
    ( ‘సరస్వతీపుత్ర’ పుట్టపర్తి నారాయణాచార్యులు గారి ” శివతాండవము ” కావ్యం నుండి ఉటంకిస్తున్నా )

  8. స్వీయప్రచురణ గురించి శ్రీపాద గురించి Dr. P. Venkatesan అభిప్రాయం:

    07/25/2020 12:35 am

    బాగుంది మంచి సందేశము

  9. విరాగి గురించి Siddu అభిప్రాయం:

    07/24/2020 12:46 pm

    మధురమైన చింతన కవిత్వం

  10. కొన్ని లలితగీతాలు గురించి లక్ష్మి అభిప్రాయం:

    07/24/2020 11:13 am

    ఈమని శంకర శాస్త్రి గారు సంగీత దర్శకత్వం వహించిన ఒక పాటను ఈ మధ్య విన్నాను. “సుమవనిలో రసధునిలా గుండెలో నిండుగా ఉండనీ….” అన్నఅద్భుతమైన కోపెల్ల శివరాం గారి గీతాన్ని ఆలపించింది వేదవతి ప్రభాకర్ మరియు చిత్తరంజన్ గార్లు.