పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16454

  1. కెరీర్ ఓరియెంటెడ్ మాన్ గురించి Manasa అభిప్రాయం:

    09/24/2020 1:30 pm

    Very well written. I really appreciate you for the most needed effort. Keep tearing them! Keep showing the real us!

  2. ℞: మారేజ్ గురించి Paresh అభిప్రాయం:

    09/23/2020 10:04 am

    నాకు కథ నచ్చింది. డాక్టర్ ప్రెస్క్రిప్షన్ లో మేరేజ్ అని వ్రాయడాన్ని విమర్శిస్తున్నారు గానీ అది కథ లోని ఒక టెక్నిక్ కి సంబంధించినట్టుగా గుర్తించట్లేదు. ఆమెకున్నది రోగమూ కాదు, దానికి పెళ్లి మందు కాదు. Narration బాగుంది.

  3. గల్ఫ్ గీతం: 1. దుబాయ్ గురించి Amarendra Dasari అభిప్రాయం:

    09/23/2020 8:37 am

    శ్రీదేవి గారు, thank you for your interest. కానీ సింగపూర్ గురించి ఇప్పటిదాకా రాయలేదండీ.

  4. కెరీర్ ఓరియెంటెడ్ మాన్ గురించి Aparna అభిప్రాయం:

    09/22/2020 8:14 pm

    లవ్లి. ఈ రోల్ exchange జరిగినప్పుడు empathy కన్నా cheapness ఎక్కువ బయటపడేది ఇంతకాలం. ఆడాళ్ళ insecurities గురించి ఎవడన్న ఏమన్నా వాగితే ఈ కథ చదవమంటాను.

  5. కెరీర్ ఓరియెంటెడ్ మాన్ గురించి ప్రసాద్ చరసాల అభిప్రాయం:

    09/22/2020 4:38 pm

    “జంబలకిడిపంబ” అని అనుకుంటాను ఏదో సినిమా వున్నట్టు గుర్తు. ఇంకా అనేక మల్లిక్ కార్టూన్లు, జబర్దస్తీ లాంటి పిచ్చి షోలు.. ఇవన్నీ కూడా కామెడీ చెయ్యడానికే గానీ ఇలా మగవాన్ని స్త్రీ సీటులో కూచోబెట్టి సీరియస్ గా అర్థం చేయించే ప్రయత్నం జరగనేలేదు.

  6. గల్ఫ్ గీతం: 1. దుబాయ్ గురించి శ్రీదేవి అభిప్రాయం:

    09/22/2020 10:13 am

    Singapore గురించి రచనలు మాకు షేర్ చెయ్యండి ప్లీజ్.

  7. కెరీర్ ఓరియెంటెడ్ మాన్ గురించి శిరీష్ ఆదిత్య అభిప్రాయం:

    09/22/2020 5:13 am

    మస్త్ ఉన్నది కథ. Blunt as fuck, effective as hell. ఇలా చూపెడితే కానీ నాలాంటోళ్ళకి అర్థం కాదు ఎంత నార్మలైజ్ అయిపోయిందో డిస్క్రిమినేషన్ అని. పొలిటికల్ మెసేజ్ ఉండె కథల పట్ల నాకు బయాస్ ఉండేది, ఇప్పుడిప్పుడె మార్చుకునే ప్రయత్నాలు మొదలెట్టా. ఈ కథ ఆ మార్పుకి దోహద పడుతుంది. మొదలెట్టగానే జంబలకడిపంబ ప్రిమైస్ అని కనిపెట్టినప్పుడు చివర్లొ ఇంత ఇంపాక్ట్ ఉంటుందనుకోలేదు. అత్తగారు మామగారిని “ఉండరా..” అన్నప్పుడైతే ఫ్లిప్ అయ్యాను. మళ్ళీ చదవాల్సొచ్చింది, ఓ 50-55 వయసావిడ మొగుణ్ణి రా అన్నందుకు. అదే మొగ పాత్ర పెళ్ళాన్ని “ఏవే.. ఒసేయ్..” అనుంటే సహజమే కదా అనిపించేది. వామ్మో, పేరుకి ఫెమినిస్ట్నె కానీ నా చూపు ఎంత స్క్యూడ్. Thanks for this. పైనున్న రాఘవేంద్ర గారి కమెంట్ హైలైట్.

  8. భారత స్వాతంత్ర్య సమరములు: 1757-1857 గురించి Sudha అభిప్రాయం:

    09/20/2020 9:20 pm

    ఈ సంచికలో ఉపయుక్తమైన ఏకైక వ్యాసం.

    ధన్యవాదాలు.
    సుధ.

  9. సాహితీ చమత్‌’కారాలు”: కవివృషభులు గురించి వీరభద్రం అభిప్రాయం:

    09/17/2020 12:26 pm

    కోనసీమలో నడిమింటి సర్వమంగళేశ్వర శాస్త్రి అనే మహాకవి, పండితుడు ఉండేవాడు.

    నడిమింటి సర్వమంగళేశ్వర శాస్త్రి గారిది పార్వతీపురం/బొబ్బిలి ప్రాంతం కదా!

  10. చంద్ర ఆడియో కథలు గురించి ఆర్ శ్రీనివాసులు అభిప్రాయం:

    09/16/2020 12:04 am

    అందరికీ నమస్కారం అండి చాలా అరుదైన పాటలు విన్నాను ధన్యవాదములు అండి.నేను నా చిన్నతనంలో ఈ క్రింది పాట వినేవాడిని.

    ఏది హిందూ ఏది ముస్లిం ఏది క్రైస్తవం.
    ఎల్ల మతముల సారం ఒక్కటే.

    అనే పాట మీవద్ద ఉన్నట్లయితే దయచేసి వినిపించగలరు.

    ఆర్ శ్రీనివాసులు, బుచ్చిరెడ్డిపాలెం, నెల్లూరు జిల్లా