పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16454

  1. గ్రీకు పురాణ గాథలు 10 గురించి Lyla Yerneni అభిప్రాయం:

    10/02/2020 11:00 am

    మంచిది శర్మగారు! భీముడితో – కండబలం లో ఐదుగురు, గుండెబలం లో ఐదుగురు, పిక్కబలం లో మరో ఐదుగురు సమానులు!
    వేమూరి చెపుతారు గదా, ఆయన ఉద్దేశించినదేమిటో. ఎక్కడనుండి ఉదహరించారో. ఆ పైన అవసరమొస్తే, ఆ లింకులు, ఉచితంగా వైరస్లు, క్వారంటీన్లు.
    వేమూరి వేంకటేశ్వరరావు గారు చెపితే చాలండీ!

    -Lyla

  2. గ్రీకు పురాణ గాథలు 10 గురించి శర్మ దంతుర్తి అభిప్రాయం:

    10/02/2020 8:03 am

    నమస్కారం లైలా గారు
    ఈ పద్యాలు విరాటపర్వం లోనివి అని తెల్సిపోతున్నాయి. అందువల్ల కింద వెబ్ సైట్ లో చూసాను. పేజీ 402 పద్యం 114 నుండి చూడండి వీలుంటే. ప్రతిపదార్ధంతో సహా అన్నీ ఉన్నాయి. ఇందులో రెండు విషయాలు. మొదటిది రావు గారు చెప్పిన ఆరుగురిలో ఒకరు మరొకర్ని చంపితే వాడే మిగతా ఐదు/నలుగురినీ చంపుతాడు అని ఎక్కడో అన్నారు. అది నిజంగా భారతంలో ఉందా లేదా అనేది తెలియదు. నిజమే అయితే రావు గారు రాసినట్టూ ఆరుగురు కాదు ఐదుగురే అని నేను రాసాను. భీముడే మిగతావాళ్లని చంపాడు కనక.
    https://ebooks.tirumala.org/downloads/maha_bharatham_vol_6_virata_parvam.pdf
    రెండోది మీరు చెప్పిన నలుగురిలో సింహబలుడు కీచకుడు. హలధరుడు అంటే నాగలిని ను పట్టుకున్నవాడు – ఇంకెవరు, బలరాముడే. శల్యుడు ధర్మరాజుకి చుట్టం. మీరు చెప్పిన నలుగురికీ రావుగారు రాసిన ఆరు/ఐదుగురికీ తేదా ఉంది. మీరు చెప్పిన వాళ్ళలో ఒకడు మిగతావాళ్ళనందర్నీ చంపడు. పద్యం చెప్పేది బలంలో సమానత్వం గురించి మాత్రమే. పైన ఇచ్చిన పుస్తకంలో ఒక సంస్కృత శ్లోకం కూడా చెప్పారు, అసలు ఐదోవాడే లేడు అంటారు అందులో. యుద్ధంలో శల్యుడు ధర్మరాజుచేతిలో పోతాడు, భీముడి చేతిలో కాదు. వీళ్ళలో ఆఖరిదాకా బతికినవాడు బలరాముడు. చివరగా స్వర్గారోహణంలో భీముడు. బలమే లెక్కపెడితే భీముడి కన్నా ధృతరాష్ట్రుడు బలమైనవాడే – కనీసం సమాన బలం గలవాడు కనకే యుద్ధం అయ్యాక కౌగలించుకుని చంపుదామని ఊహిస్తాడు. కృష్ణుడు అక్కడ ఉండగా అవన్నీ ఎలా కుదుర్తాయి?

    ఈ గుంపులో ఒకరు మరొకర్ని చంపితే వాడే మిగతా నలుగుర్నీ చంపుతాడు అనే ఊహ పట్టుకుని నేను వ్యాఖ్య పెట్టాను, బల సమానత్వం గురించి కాదు. పైన ఇచ్చిన లింకు (ebooks.tirumala.org) ఇంకా అనేకానేక పుస్తకాలు ఉచితంగా చదువుకోవచ్చు. ప్రయత్నించండి.

  3. ఎవరైనా అడిగితే… గురించి Indraprasad అభిప్రాయం:

    10/02/2020 6:27 am

    మీ కవితలు చదువుతూ ఉంటాను face book లో. నెనర్లు మీకు నచ్చినందుకు.

  4. Pages with Mani గురించి భాస్కర్ కె అభిప్రాయం:

    10/02/2020 4:53 am

    ఈ మధ్య కాలంలో చదివిన ఓ మంచికథ, స్త్రీ యొక్క అంతరంగాన్ని, ఆలోచనల్ని చక్కగా ప్రతిబింబించారు కథలో. మానవ స్వభావాల మానసిక విశ్లేషణ అను, మణి, భరణి పాత్రలతో పాటుగా మలిచిన విధానం బావుంది. అభినందనలు సుధగారు.

  5. Pages with Mani గురించి Swathi kumari అభిప్రాయం:

    10/02/2020 4:29 am

    బాగుంది సుధా!

  6. ఎవరైనా అడిగితే… గురించి Geeta Vellanki అభిప్రాయం:

    10/02/2020 2:11 am

    ఇంతకీ, ప్రేమ
    దాపరికాలు, అంతరాలు
    దాటిన అలౌకిక చర్యేనా?
    మనం మనల్ని మరిచే
    కాలంలోనే ఉన్నామా? …. Good lines!

    Though I write poetry mostly contains Love, I agree with you Sir! There is less love in Society. Only some people have those lovable feelings… But, unfortunately those also not provide unearthly feel!

  7. గ్రీకు పురాణ గాథలు 10 గురించి Lyla Yerneni అభిప్రాయం:

    10/01/2020 7:43 pm

    “హిందూ పురాణాలలో భీముడితో తులతూగగల బలశాలులు మరో అయిదుగురు ఉన్నారు: బకాసురుడు, హిడింబాసురుడు, జరాసంధుడు, కీచకుడు, దుర్యోధనుడు.”
    “భీముడితో సమాన బలం గలవారు మరో నలుగురు అని చదివినట్టు గుర్తు. ఐదోవాడు భీముడే. బకాసురుడు అతి మామూలు తిండిపోతు తప్ప భీముడికున్నంత పెద్ద బలం గలవాడు కాదు.”

    పై రెండూ తప్పు.

    సరైన సమాధానం ఈ కింది పద్యాలలో ఉంది.

    1. సింహబలుడు భీమసేనుండు శల్యుండు హలధరుడు సమానబలము వారలొండొరులను గెలుచు నుత్సాహమును గల యుద్ధతులును బాహుయుధ్థపరులు.
    2. ఈ నలువుర భుజశక్తులతో నెనయగ జాలునట్టి దోర్బలమెందుం గానము గావున వీరల లోనన యొండొరుల కని గెలుపు సమకూరున్.
    3. తక్కిన వారలాతనికి దవ్వుల చోటుల వారు వాయుజుం డొక్కడ యింక సింహబలు నుద్ధతి మాన్చిన మాన్చువాడతండక్కడ నిల్చె గావలయు నాసతి ద్రౌపది గాగ నోపు వేఱొక్కరు డాజి గీచకుల నోర్వగ జాలమి మీరెఱుంగరే!”

    ఈ మూడు పద్యాలలో ఉన్న విషయం పాఠకులలో చాలామంది చెప్పగలిగినా, ఇవి ఏ జాతి పద్యాలో చప్పున చెప్పగలిగిన వారు జెజ్జాల కృష్ణమోహనరావు గారు. వీరు మౌనంగా గూగుల్ గ్రూప్స్లో – తెలుగు ఛందస్సు – లో పద్యాలు రాసుకుంటున్నారు. నేనూ మౌనంగా చదువుకుంటున్నాను.

    పద్యంలోనే మనకు సమాధానాలిచ్చి, ఆ పైన తీరుబడిగా, ఆ పై సన్నివేశం చక్కని సంగీత రూపకం కూడా రాయగలవారు –తిరుమల కృష్ణదేశికాచార్యులు గారు. ఈమాట పత్రికలో వీరి రచన లన్నీ చదివాను. నాకు చాలా బాగుంటాయి. వీరు ‘వీనస్ అండ్ అడోనిస్’ గాని, ‘హామ్లెట్’ గాని, తెలుగు సంగీత రూపకం గా రచిస్తారేమో అని నేనాశపడుతున్నాను.

    ఈ పై పద్యాలు ఏ గ్రంథం లోనివో, కథాసందర్భమేమిటో, పద్యాలలోని భాష, వ్యాకరణ, అలంకారాది విశేషాలు, తప్పొప్పులు, ఇతర కవి పరిచయాలు, మరెన్నో కావ్యవిశేషాలు పద్యంగా, వచనంగా చెప్పుతూ, చదువు నేర్పిస్తూ రంజింపచేయగలిగిన వారు -ఏల్చూరి మురళీధరరావు గారు. వీరు ఎప్పుడెప్పుడు ఈ పత్రికలో రాస్తారా, వారేమేమి చదువుతున్నదీ చెపుతారా, అని నేనెదురు చూస్తూ ఉంటాను.

    నమస్కారాలతో,
    -Lyla

  8. గ్రీకు పురాణ గాథలు 10 గురించి శర్మ దంతుర్తి అభిప్రాయం:

    10/01/2020 12:49 pm

    >> హిందూ పురాణాలలో భీముడితో తులతూగగల బలశాలులు మరో అయిదుగురు ఉన్నారు: బకాసురుడు, హిడింబాసురుడు, జరాసంధుడు, కీచకుడు, దుర్యోధనుడు.

    భీముడితో సమాన బలం గలవారు మరో నలుగురు అని చదివినట్టు గుర్తు. ఐదోవాడు భీముడే. బకాసురుడు అతి మామూలు తిండిపోతు తప్ప భీముడికున్నంత పెద్ద బలం గలవాడు కాదు.

    ఆబోతుల వంటి కధ మహాభాగవతంలో ఉంది. కృష్ణుని అష్టభార్యలలో నీలా(ళా)దేవి ఒకరు. ఆవిడ తండ్రి (కృష్ణుడి మేనమామే అనుకుంటా) దగ్గిర ఉండే ఆబోతులు కర్మవశాన పుట్టిన రాక్షసులు. వాటిని చంపిన వాళ్ళకి పిల్లనిస్తాను అని అంటాడు. ఒకదానిమీదకి ఒకదాన్ని తోసి, వాటిని చంపాక నీళాదేవిని వరిస్తాడు నల్లపిల్లాడు. నీ మేనత్తకూతురు నీదే అయింది ఏలుకో అని మరో కొన్ని వేల ఆవులిస్తాను తీసుకో అంటాడు కాబోయే మామ. ఓరినాయనా, నాకే కట్టుకుపోయేటన్ని ఆవులున్నాయి, ఈ కృష్ణుడు పుట్టాక మరింత వృద్ధి చెందాయి, ఎక్కడ పెట్టుకోమంటావు ఇవన్నీ; వద్దులే నీ దగ్గిరే ఉంచుకో అంటాడు వియ్యంకుడు. 🙂

  9. తెలుగు, ఇతర ద్రావిడ భాషలు: వాటి ప్రాచీనత గురించి kumar poreddy అభిప్రాయం:

    09/29/2020 12:08 pm

    Well explained.

  10. మనం అపార్థం చేసుకున్న ప్రతిభావంతుడు కావలి రామస్వామి గురించి కె.కె. రామయ్య అభిప్రాయం:

    09/29/2020 2:13 am

    దక్కన్ కవుల జీవిత చిత్రాలు ~ కావలి వెంకట రామస్వామి

    పుస్తకం ఎమెస్కో బుక్స్, విజయవాడ మరియు నవోదయ బుక్ హౌస్, కాచిగూడా వారి వద్ద లభ్యం:

    https://www.telugubooks.in/collections/telugubooks-new-releases/products/dakkan-kavula-jeeevita-chitralu