పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16454

  1. మల్లిక్ పాటలు, మరికొన్ని సంప్రదాయ పాటలు గురించి Vijaya అభిప్రాయం:

    11/16/2020 12:20 pm

    తెలుగు పూల తోటలో వెలుగులు విరజిమ్మె ఓ గులాబీ బాలా గుబాళించవే పాట వుంటే పెడతారా ఆదివారం రేడియో వచ్చేది ఉదయం 10 గంటలకి

  2. స్థితం గురించి sudha అభిప్రాయం:

    11/13/2020 7:28 pm

    ధన్యవాదాలు ధీరజ్ గారు

  3. స్థితం గురించి Dheeraj Vemuganti అభిప్రాయం:

    11/12/2020 8:43 pm

    కనీసం అద్దంలో ముఖం కూడా సరిగా చూసుకోను… నిండా నిజాయితీ నిండుకున్న వాక్యం.

  4. దేవగిరి గురించి భాస్కర్ కె అభిప్రాయం:

    11/11/2020 7:04 am

    థాంక్యూ బాలు

  5. దేవగిరి గురించి Balu Vakadani అభిప్రాయం:

    11/09/2020 11:15 pm

    Great narration Bhaskar sir ❤️
    Looking forward more from you on historical based stories.

  6. చంద్రోదయం గురించి ravi prakash అభిప్రాయం:

    11/07/2020 1:35 am

    గొప్పగా ఉంది.

  7. స్థితం గురించి sudha అభిప్రాయం:

    11/06/2020 11:38 pm

    ధన్యవాదాలు సుబ్రమణ్యంగారు మీ విలువైన స్పందనకు, మీరు మంచి పాఠకులు … మీ సూచనను తీసుకుంటున్నాను

  8. దేవగిరి గురించి suryanarayana murthy Akella అభిప్రాయం:

    11/06/2020 1:05 pm

    మీ వివరణ బావుంది, ధన్యవాదాలు

  9. స్థితం గురించి sudha అభిప్రాయం:

    11/05/2020 9:08 am

    Thank you Arun kumar garu ,Ma siddhique garu such valuable inputs on Sthitham

  10. పోర్టికో గురించి ధీరజ్ కశ్యప్ అభిప్రాయం:

    11/05/2020 1:02 am

    అరుణ్ ఆర్ కుమార్ గారు, చదివి మీ అభిప్రాయాలు తెలిపినందుకు ధన్యవాదాలు.

    కథ విషయానికి వస్తే ఇందులో తాతయ్య పాత్ర, ఆయానే పరిస్థితులే కథకి ముఖ్యమైన అంశాలు. మీరు దానిని సరిగ్గానే పట్టుకున్నారు. అయితే, అక్కడున్న ముఖ్యమైన పాత్రే మాట్లాడాలి కానీ రచయిత అయిన నేను మాట్లాడలేను. మెల్లిమెల్లిగా జ్ఞాపక శక్తి కోల్పోతున్న మనిషి ముఖ్య పాత్ర అయితే అతడి తాలూకు మానసిక ప్రయత్నం, అలసట ఇదే పాత్ర తాలూకు నేపధ్యం అవుతుంది తప్ప, రచయిత కథలోకి ప్రవేశించి పూసగుచ్చినట్టుగా అన్ని వివరాలు చెప్పుకుంటూ పోతే ముఖ్య పాత్ర-కథ ఉద్దేశం రెండిటికి నిబద్ధత లేని రచనగా తయారవుతుంది చివరికి.

    ఇలాంటి జానర్లో కథలు తీవ్ర ఉద్వేగానికి లోను చేస్తాయి అని మీరు ఆశిస్తూ కథని చదివారని అర్ధం అవుతుంది.

    ఇక్కడ నాలుగు విషయాలు చెప్పాలనిపిస్తుంది.
    1) ఏదో ఉద్దేశాలు, ఆశించడాలు పెట్టుకొని మాత్రమే ఎందుకు కథలు చదవాలి?
    2) నన్ను అడిగితే ‘కథ’ అనే జానర్ లో వచ్చే రచన ఇది. ఇలాంటి జానర్ అంటే ఏమిటో నాకు అర్ధం కాలేదు సరిగ్గా.
    3) ఇలాంటి జానర్లో ఒక మోస్తారు స్థాయి ఉద్వేగాలయినా ఆశించే మీకు, ఒక డెబ్భై ఏళ్ళ పెద్దాయన తన భార్య తాలూకు పూర్తి జ్ఞాపకాలు తొలిగిపోయి ఖాళి అయిపోవడం అనే ముగింపు భావోద్వేగపరంగా ఎందుకు కదిలించలేదో తెలుసుకోవాలని ఉంది.
    4) నన్ను అడిగితే, ఈ కథ మిమ్మల్ని అంతగా కదిలించకపోవడానికి కారణం కథ తాలూకు టోన్. రచయితగా నేను నా నీడను కూడా పడనీయకూడదు అన్నటుగా చేసిన ప్రయత్నం ఇది. దానికి కారణం – తాతయ్య పాత్ర జ్ఞాపకాలు కోల్పోవడం అనేది చాలా సునాయాసంగా, ఆ పెద్దాయనకే కంట్రోల్ లేకుండా జరిగే వ్యవహారం. ఆ ప్రాసెస్ లో జరిగే దానికి ఈ లోకీ టోన్ మాత్రమే సరైనది. అందుకే తన చుట్టూ ఉన్న సామాన్య విషయాలని కథ చివర్లో కూడా ఇంకా రిజిస్టర్ చేస్తూ వచ్చాను. ఆ సాధారణతత్వం మీకు/పాఠకుడికి ‘ఇది కథ’ అని ఉండే కొన్ని నియమాలను దాటేలా చేసింది.

    మనకి కథ ఇలా ఉండాలి అనే నియమాల్లో ఒకటి – కథ మొదట్లో పాత్రలు, వాళ్ళ జీవితాలు, విషయాలు, అలవాట్లు వగైరా మొదటిసారి పాఠకుడికి అందివ్వడం. దీనినే నేను మొట్టమొదటి సారి పాత్ర చివర్లో ప్రవేశపెట్టాను (పిల్లాడి సెలవలు, కూతురు-అల్లుడు ఉద్యోగాల పరుగులు లాంటివి). ఇలా ప్రవేశపెట్టింది ఆ పైన చెప్పిన సాధారణతత్వం తీసుకురావడానికి. ఆ సాధారణతత్వమే ఈ కథలో తాలూకు లోకీ టోన్ కూడా.

    నా ఉద్దేశాలు మీకు అర్ధం అయ్యాయి అనుకుంటున్నాను.

    మీకు ఎటువంటి ఫీలింగ్ కలగకపోవడం నాకు ప్రశంస లాగ అనిపించింది ఎందుకో 🙂