పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16454

  1. తెరుచుకోవు గురించి Ramu GSV అభిప్రాయం:

    12/08/2020 9:08 am

    Very Good.

  2. కిక్ గురించి Srinivas Bandaa అభిప్రాయం:

    12/08/2020 6:26 am

    కథ నిడివి కొంచెం పెరిగింది నిజమే. కథలో instant justice విధానం సరి కాదన్న సందేశం సరైందే. ఐతే, ‘దిశ’ కేసులోనూ, కథలోనూ జరిగిన సంఘటనల్లో ‘తీవ్రత’ వేర్వేరు పరిమాణాల్లో ఉందనిపించింది.

  3. కెరీర్ ఓరియెంటెడ్ మాన్ గురించి Tadepalli subrahmanyam అభిప్రాయం:

    12/08/2020 1:52 am

    చదవటానికి బాగానే వున్నా ప్రాక్టీకల్గా చాలా ఇబ్బందులు ఉంటాయి. ఆడవాళ్లు వుద్యోగం చేయడం సంపాయించడం కుట్రలో భాగమేనని ఎప్పటికి తెలుసుకుంటారోగదా(సరుకులు అమ్ముడుపోవాలనంటే కొంతమంది దగ్గరైనా పైసల్ ఉండాలిగదా మరి).స్త్రీ మూర్తికి ఆనందం ఇచ్చేది అన్నీటికన్నా పారాడే పాపాయి అని విన్నట్టు గుర్తు .అందుకే కొన్ని పశ్చిమ దేశాల్లో స్త్రీ వుద్యోగం ఎంకరేజ్ చేయరు .మరి సో-కాల్డ్ ఫెమినిస్టులు ఏమంటారో.మగవారి చేతిలో పిల్లలు వికసించడం చాలా అరుదు కారణం స్త్రీ పురుష మనస్తత్వాలతో జన్యుపరమైన తేడా.

  4. ‘జ్ఞాపిక’ గురించి Tadepalli subrahmanyam అభిప్రాయం:

    12/08/2020 1:19 am

    చక్కనైన తెలుగు కమ్మదనమంతా కుమ్మరించారు. చల్లటి గోదావరి ప్రాంతంలో దొరికే ఆర్టోస్ డ్రింక్ తాగినట్టుంది.బాగు! బాగు!

  5. తెరుచుకోవు గురించి పార్థసారధి పోడూరు అభిప్రాయం:

    12/08/2020 12:51 am

    తేట నైన తెలుగులో, చక్కని ,చిక్కని పదజాలం తో, లోతైన భావవ్యక్తీకరణ అద్బుతం.. అసామాన్యం..

  6. తెరుచుకోవు గురించి దివాకర్ అభిప్రాయం:

    12/07/2020 11:58 pm

    ఈమె చాలా చక్కగా తనదైన శైలిలో ప్రకృతిని మనకు కళ్లకు కట్టినట్టు వర్ణిస్తూ కవితల రాసారు. అందరూ తప్పక చదవండి.
    హృద్యంగా కవిత రాయడం ఈమె ప్రత్యేకత..

  7. స్త్రీ పర్వంలో గాంధారి గురించి SRK అభిప్రాయం:

    12/07/2020 10:26 am

    Dear Veluri garu

    “ఈ వ్యాసం నేను ఒక వారం క్రితం చదివి ఉండవలసింది, నా అవీ యివీ ముచ్చట్లు: భారతంలో పురుషార్థాలు (మొదటి భాగం ఈమాట డిసెంబరు 2020లో వేశారు, రెండవది జనవరిలో వస్తుంది) ప్రచురించేముందు.

    మీ వ్యాసం మౌలికము, అరుదైనది, అవసరమైనది. చాలా ముఖ్య విషయాలు మీ వ్యాసంలో స్పృశించారు.

    గాంథారి విషయంలో విశ్వనాథ వ్యాఖ్య ఏమిటి? నేను విన్నట్టు లేదు.

    సాదరంగా, మూర్తి.

  8. ఆమె నవ్వు గురించి sudha అభిప్రాయం:

    12/06/2020 11:14 pm

    Thank you Bhaskar garu, Srinivas garu, Pragathi garu, Amarendra garu, Vamsi krishna garu.

  9. అవీ ఇవీ ముచ్చట్లు: భారతమూ పురుషార్థాలూ గురించి విరావి అభిప్రాయం:

    12/06/2020 3:39 pm

    అయ్యా రాధాకృష్ణమూర్తి గారూ!

    అబ్బ పోదురూ! మీరుమరీనూ!!

    చిల్లిగారెలు ఒకవేపునుంచి తింటే రుచిగాను, మరొకవేపునుంచితింటే అరుచిగానూ ఉంటాయా? గారెల రుచి గారెలదే కాదూ!

    అయితే, అల్లప్పచ్చడి అద్దుకొని తినేటప్పుడు ఒకరుచి, కొబ్బరి పచ్చడితో తినేప్పుడు మరొక రుచీ ఉండటం అసహజంకాదు. అది ఆ పచ్చళ్ళరుచి. గారెల రుచి గారెలదే!

    కొందరు తెలుగువాళ్ళు చారులో నానినగారెలంటే పడిచస్తారు; మరికొందరు దక్షినాదివాళ్ళు సాంబారులో ముంచుకోకండా గారెలు ముట్టుకోరు.

    ఉత్తరాది వాళ్ళకి చిల్లిగారెలుంటాయనికూడా తెలీదు.

    అందుకే కాబోలు, జిహ్వకో రుచి అంటారు.

    మిగితా ముచ్చట్లకోసం వేచి చూస్తూ,

    విరావి.

  10. గల్ఫ్ గీతం: 6. దుబాయ్ గాలిబ్ గురించి Amarendra Dasari అభిప్రాయం:

    12/05/2020 9:38 pm

    ధన్యవాదాలు సుధ గారూ