చాలా బాగా రాశారు రెడ్డి గారు👍. 84 ప్రధానమంత్రి హత్య నాటికి నేను ఓ ప్రభుత్వ బ్యాoకు ఉద్యోగంలో చేరాను. ఆ ప్రధానమంత్రే ఎమర్జెన్సీ విధించిన సంవత్సరానికి నేను హైస్కూల్ ముగించుకుని కాలేజీలో చేరాను. మీకన్నా ఓ రెండు దశాబ్దాలా రెండు సంవత్సరాలు ముందే లోకం లోకి అడుగుపెట్టాను. మీ రచన ఆకట్టుకుంది. మీలోని రచయితకు నమస్కారం. మీకు ఆశిస్సులు. ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. 💐
ఈమె నూతన సంవత్సరంలో వినూత్న భావాలను తన హృద్యమైన రచనలతో ఆవిష్కరించాలని ఆకాంక్షిస్తున్నాను. ఈమె రచనలలో ప్రత్యేకతను గమనించండి. ఉపమానాలు ఉపయోగించే తీరు. మనసుకు హత్తుకునేలా ఉండే భావవ్యక్తీకరణ. అమూర్త జ్ఞానము ఒక నైరూప్యకళ.
కవి అనుభూతి అతని మాటలద్వారా ప్రవహిస్తూ, పాఠకుడిని కూడా సాంద్రమైన అనుభూతికి లోనుచెయ్యగలిగిన కావ్యం కవిత్వం అనుకున్నప్పుడు, మూలా సుబ్రహ్మణ్యం గారి “సెలయేటి సవ్వడి” నా అనుభూతి ప్రమాణంలో నిశ్చయంగా మంచి కవిత్వం.
ఏ కారణమూ లేకుండా ఆనందించగలగడమే పసితనం. వెనుకనున్న కారణాల వివేచన లేకుండా ఎదురుగా ఉన్న ప్రకృతిని అనుభూతించడమే పసితనం. వయసుతోపాటు మనం పోగొట్టుకునేదీ అదే. పసితనం మిగిలి ఉన్న వారే ప్రేమని నిండుగా పంచి ఇవ్వగలరు. కవిత్వం ప్రేమని పంచుకోవడంలో ఒక భాగం.
ఈ సంకలనంలో చాలా మంచి కవితలున్నాయి. అందులో ఒక క్షణాన్ని కెమేరాలో బంధించినట్టు చిత్రించిన చాలా చక్కని కవితలున్నాయి.
రెండు మూడు ప్లాట్స్‌ని సింపుల్గా, సహజంగా తగినంత గాఢతతో, తాత్వికతతో అల్లడంలో మీరో ప్రత్యేక శైలిని స్థిరపరుచుకుంటున్నుటున్నారు. చక్కని కథ. అభినందనలు సుధగారు.
త్రివిక్రమ్ గారూ, ఇలాంటి వైజ్ఞానిక విషయాలకు చెందిన వ్యాసాలను కుతూహలాన్ని రేకెత్తిస్తూ, రాగలిగిన సందేహాలనూ, వాటికి సమాధానాలనూ ఒకదాని వెనుక ఒకటి నడిపిస్తూ, ఒక చక్కని కథలా చెప్పడం అంత తేలికైన విషయం కాదు. ప్రారంభంనుండి చివరిదాకా ఏకబిగిన అపరాధపరిశోధన నవలలోలా సాగిన మీ కథనం చాలా బాగుంది. ఈ వ్యాసం ద్వారా నేను చాలా కొత్త విషయాలు తెలుసుకున్నాను. మీకు నా హృదయపూర్వక అభినందనలు, ధన్యవాదాలు.
కన్యామ్ కనకసమ్పన్నామ్ కనకాభరణ భూషితామ్।
దాస్యామి విష్ణవే తుభ్యమ్ బ్రహ్మలోక జిగీషయా॥
ఈరోజుల్లో కూడా స్త్రీని ఈ రకంగా కించపరిచే శ్లోకాన్ని మీ స్క్రిప్ట్ లోకి ఎందుకు రానిచ్చారండి? అర్థం విపులంగా చెబితే పాపం ఆ పెళ్ళికూతురు బిక్కచచ్చిపోదూ?
విందు భోజనం లాంటి వ్యాసం. సైన్సు విషయాలు సామాన్యులకి అర్థమయ్యేలా తెలుగులో వ్రాయడం తేలికైన పని కాదు. మీరు చాలా గొప్పగా వ్రాశారు. హాస్యాన్ని జోడిస్తూ ఎక్కడా బోరు కొట్టకుండా వ్రాశారు. కాన్సెప్టులు అర్థం కావడానికి మంచి ఉపమానాలు ఎన్నుకుని హత్తుకుపోయేవిధంగా చెప్పారు.
మీ వ్యాసం నాకు కొన్ని గొప్ప ఇంగ్లీషు బ్లాగుల్లోని (ఉదా: waitbutwhy.com) సైన్సు వ్యాసాలు చదివినప్పుడు కలిగినంత సంతోషాన్ని కలిగించింది. ఇది తెలుగులో కాబట్టి ఈ ఆనందం అంతకన్నా చాలా ఎక్కువే అని చెప్పాలి.
శ్రీశ్రీ పదబంధ ప్రహేళిక – 51 గురించి manjari lakshmi అభిప్రాయం:
01/03/2021 4:19 am
5, 11 ఆధారాలు ఒకదానికి ఒకటి ఇచ్చారు.
నలభై గురించి బసవరాజు వేణుగోపాల్ అభిప్రాయం:
01/03/2021 2:13 am
చాలా బాగా రాశారు రెడ్డి గారు👍. 84 ప్రధానమంత్రి హత్య నాటికి నేను ఓ ప్రభుత్వ బ్యాoకు ఉద్యోగంలో చేరాను. ఆ ప్రధానమంత్రే ఎమర్జెన్సీ విధించిన సంవత్సరానికి నేను హైస్కూల్ ముగించుకుని కాలేజీలో చేరాను. మీకన్నా ఓ రెండు దశాబ్దాలా రెండు సంవత్సరాలు ముందే లోకం లోకి అడుగుపెట్టాను. మీ రచన ఆకట్టుకుంది. మీలోని రచయితకు నమస్కారం. మీకు ఆశిస్సులు. ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. 💐
అప్పుడిక గురించి దివాకర్ అభిప్రాయం:
01/02/2021 10:21 pm
ఈమె నూతన సంవత్సరంలో వినూత్న భావాలను తన హృద్యమైన రచనలతో ఆవిష్కరించాలని ఆకాంక్షిస్తున్నాను. ఈమె రచనలలో ప్రత్యేకతను గమనించండి. ఉపమానాలు ఉపయోగించే తీరు. మనసుకు హత్తుకునేలా ఉండే భావవ్యక్తీకరణ. అమూర్త జ్ఞానము ఒక నైరూప్యకళ.
A Solemn Vedic Wedding గురించి S RAJESWARA RAO అభిప్రాయం:
01/02/2021 8:58 pm
Respected Shri Desikachary sir. Kindly improve and correct the mistakes for the benefit of all. regards
పుస్తక పరిచయాలు గురించి NS Murty అభిప్రాయం:
01/02/2021 11:23 am
కవి అనుభూతి అతని మాటలద్వారా ప్రవహిస్తూ, పాఠకుడిని కూడా సాంద్రమైన అనుభూతికి లోనుచెయ్యగలిగిన కావ్యం కవిత్వం అనుకున్నప్పుడు, మూలా సుబ్రహ్మణ్యం గారి “సెలయేటి సవ్వడి” నా అనుభూతి ప్రమాణంలో నిశ్చయంగా మంచి కవిత్వం.
ఏ కారణమూ లేకుండా ఆనందించగలగడమే పసితనం. వెనుకనున్న కారణాల వివేచన లేకుండా ఎదురుగా ఉన్న ప్రకృతిని అనుభూతించడమే పసితనం. వయసుతోపాటు మనం పోగొట్టుకునేదీ అదే. పసితనం మిగిలి ఉన్న వారే ప్రేమని నిండుగా పంచి ఇవ్వగలరు. కవిత్వం ప్రేమని పంచుకోవడంలో ఒక భాగం.
ఈ సంకలనంలో చాలా మంచి కవితలున్నాయి. అందులో ఒక క్షణాన్ని కెమేరాలో బంధించినట్టు చిత్రించిన చాలా చక్కని కవితలున్నాయి.
అ దృశ్యం గురించి భాస్కర్ కె అభిప్రాయం:
01/02/2021 10:25 am
రెండు మూడు ప్లాట్స్‌ని సింపుల్గా, సహజంగా తగినంత గాఢతతో, తాత్వికతతో అల్లడంలో మీరో ప్రత్యేక శైలిని స్థిరపరుచుకుంటున్నుటున్నారు. చక్కని కథ. అభినందనలు సుధగారు.
అప్పుడిక గురించి Ramu GSV అభిప్రాయం:
01/02/2021 9:53 am
Very good.
భరతఖండం: పలకలపై పయనం గురించి NS Murty అభిప్రాయం:
01/02/2021 9:16 am
త్రివిక్రమ్ గారూ, ఇలాంటి వైజ్ఞానిక విషయాలకు చెందిన వ్యాసాలను కుతూహలాన్ని రేకెత్తిస్తూ, రాగలిగిన సందేహాలనూ, వాటికి సమాధానాలనూ ఒకదాని వెనుక ఒకటి నడిపిస్తూ, ఒక చక్కని కథలా చెప్పడం అంత తేలికైన విషయం కాదు. ప్రారంభంనుండి చివరిదాకా ఏకబిగిన అపరాధపరిశోధన నవలలోలా సాగిన మీ కథనం చాలా బాగుంది. ఈ వ్యాసం ద్వారా నేను చాలా కొత్త విషయాలు తెలుసుకున్నాను. మీకు నా హృదయపూర్వక అభినందనలు, ధన్యవాదాలు.
A Solemn Vedic Wedding గురించి Bhavani అభిప్రాయం:
01/01/2021 10:41 pm
కన్యామ్ కనకసమ్పన్నామ్ కనకాభరణ భూషితామ్।
దాస్యామి విష్ణవే తుభ్యమ్ బ్రహ్మలోక జిగీషయా॥
ఈరోజుల్లో కూడా స్త్రీని ఈ రకంగా కించపరిచే శ్లోకాన్ని మీ స్క్రిప్ట్ లోకి ఎందుకు రానిచ్చారండి? అర్థం విపులంగా చెబితే పాపం ఆ పెళ్ళికూతురు బిక్కచచ్చిపోదూ?
భరతఖండం: పలకలపై పయనం గురించి nagamurali అభిప్రాయం:
01/01/2021 9:50 pm
విందు భోజనం లాంటి వ్యాసం. సైన్సు విషయాలు సామాన్యులకి అర్థమయ్యేలా తెలుగులో వ్రాయడం తేలికైన పని కాదు. మీరు చాలా గొప్పగా వ్రాశారు. హాస్యాన్ని జోడిస్తూ ఎక్కడా బోరు కొట్టకుండా వ్రాశారు. కాన్సెప్టులు అర్థం కావడానికి మంచి ఉపమానాలు ఎన్నుకుని హత్తుకుపోయేవిధంగా చెప్పారు.
మీ వ్యాసం నాకు కొన్ని గొప్ప ఇంగ్లీషు బ్లాగుల్లోని (ఉదా: waitbutwhy.com) సైన్సు వ్యాసాలు చదివినప్పుడు కలిగినంత సంతోషాన్ని కలిగించింది. ఇది తెలుగులో కాబట్టి ఈ ఆనందం అంతకన్నా చాలా ఎక్కువే అని చెప్పాలి.
ఇంకా ఇటువంటి వ్యాసాలు వ్రాయమని కోరుతూ.్