ఒక కుర్చీ ద్వారా కథ చెప్పడం చాల బాగుంది. The character Nasreen represents struggle for survival and adaptability. There is no judgement here, no right of wrong. A very good description of human traits and attributes that are in play. Apt title for the story. Great work!
Thanks for the succinct response. It teaches the reader some more Telugu and clarifies the writer’s intent. If appended to the main body of work, it will be useful to future critics to make comparisons with other works at multiple levels.
Thanks to you, (you give plenty home work, and I love it) I am now into the Opera National de Paris’ stage production of Massenet’s Manon, of March 10, 2020. It is a recording done without audience. In this version, in the last scene Manon is shot in front of her lover’s eyes. I am also into M’s M, in Ballet form, previously performed by Royal Ballet at Royal Opera house, Covent Garden, London.
Since shutdown of travel, concerts etc., last April on, I started watching Medici.tv. It has extensive collection of concerts, ballets, operas, master classes, documentaries etc. Subscribers can join in live streaming of programs from opera houses, concert halls, churches of the world. The quality of broadcasting is superlative.
As I enjoy other Manon s on Medici.tv, I will also be studying yours, in eemaata magazine, making my enjoyment exponential.
-Lyla
ముందుగా… భగవానుడి “నాలుగో వరం” ఇచ్చిన దంతుర్తి శర్మ గారికి కృతజ్ఞతలు. భౌతికమైన రోగాలకి జీవ శాస్త్రవేత్త లూయీ పాశ్చర్ లాంటి వాళ్లు, మానసిక రుగ్మతలకి మహాబోధి తధాగతుడు కావాలనుకునే వాళ్లల్లో నేనూ ఒకడిని.
మత్తుమందుగా పనిచేసే మతం కాదు, మానవ సంస్కృతిని ముందుకు నడిపిస్తున్న ఆధ్యాత్మికత కావాలి. యీ జర్మని హిట్లర్లూ, యీ రష్యా స్టాలిన్లూ, యీ ఉగాండా ఈదీ అమీన్లూ, యీ కంబోడియా ఖ్మెర్ రౌగె, పోల్ పాట్లూ, ఇరాకీ కుద్రిష్‍ల ఊచకోత; అట్టుడుకుతున్న ఆఫ్ఘనిస్తాన్; బర్మా / మయన్మార్‌లోని మైనారిటీ ముస్లిం రోహింగ్యాల మారణహోమం లాంటివెన్నెంటినో శాస్త్రవేత్తలు నివారించలేరు. ఆ పాత్ర సామాజిక శాస్త్రవేత్తలు, ప్రజా నాయకులు, ఓ మహాబోధి చెయ్యగలడు అనుకుంటున్నాను.
మీరన్నది నిజమే కనిగిరి భాస్కర్ మాస్టర్ గారూ! నస్రీన్ రత్నానికి కొనసాగింపులా కనిపిస్తుంది. కానీ బతకడం తెలిసిన రత్నానికి లేని ఒడుపులు, నలుగురిని చూసి నేర్చుకుని ఎదగటాలు నస్రీన్ కున్నాయి.
రత్నం బ్యూటీపార్లర్లో చిన్న ఉద్యోగానికి కుదురుకున్న పదహారేళ్ళ నస్రీన్ (ఊర్లో ఒక మాదిరి పేదరికం ఉన్న కుటుంబం నుంచి అంతగా చదువుకోని, కొంచెం హిందీ తెలిసిన అమ్మాయి నస్రీన్). తక్కువ మాట్లాడటం, నిజాయితీ, వినయ విధేయతలు పెట్టుబడి పెట్టి… రత్నాన్ని, బ్యూటీపార్లర్ కొచ్చే కస్టమర్లని, రత్నంపై వింతైన అభిమానం చూపిస్తూ రత్నానికి నమ్మినబంటు అయిన సంతోష్‍ని అర్ధం చేసుకుని వాళ్లందరితో నెగ్గుకొచ్చింది.
బ్యూటీ పార్లర్ పనులు, బ్యాంకు పనులు నేర్చుకుని, విలువైన కస్టమర్ల నమ్మకాన్ని, అభిమానాన్ని సంపాదించుకున్న నస్రీన్ … ( బ్యూటీపార్లర్ చిరు ఉద్యోగిగా) తను పెట్టిన దానికి తగ్గ సరైన రాబడిలేనప్పుడు తనో స్వతంత్రురాలిగా మారి సొంతంగా యూ గ్లో నస్రీన్ బ్యూటీ పార్లర్ పెట్టుకున్న నస్రీన్ చేసింది మోసం కానే కాదు.
మనుషులని మచ్చిక చేసుకోవాలంటే అందంగా కనపడటం, ఉండటం, మాట్లాడటం అవసరమని తెలుసుకుని; ఎవరికి ఏమి కావాలో అది ఇవ్వగలననే నమ్మకాన్ని మనుషులకి ఇవ్వడంతో నస్రీన్ విజయం సాధించింది. మనుషుల బలహీనతల్ని పట్టేసి, రత్నంపై మానసికంగా పైచేయిని సాధించే ప్రయత్నమొక్కటే కాకుండా తన భవిష్యత్ జీవిత విజయాలకి కావాల్సిన వ్యూహాలు రచించుకున్న నస్రీన్ చేసింది మోసం కానే కాదు. స్వతంత్రురాలిగా ఎదిగి తన గమ్యాన్ని తను ఎంచుకోవటమే అవుతుంది.
నస్రీన్ వ్యక్తిత్వ గుణ, గణ, లక్షణాలు… విశేషణాలు “అట్రిబ్యూట్” అన్న కధ పేరుకి వన్నె తెచ్చింది. నస్రీన్ వ్యక్తిత్వం లోని పరిమళాలు పాఠకులకి చాన్నాళ్లు గుర్తుండిపోతాయి.
మానవ మనస్తత్వ విశ్లేషణలతో కూడిన మరో ఆణిముత్యం కధని ఇచ్చిన రచయిత్రి డా. శ్రీసుధ మోదుగు గారికి అభినందనలు! నెనర్లు!
నస్రీన్ అంటే అడవి రోజా పువ్వు (వైల్డ్ రోజ్) అనే అర్ధం వచ్చే పార్సీ భాష పదం. కుద్రిష్, అరబిక్, టర్కీ ప్రాంతాల్లో (ఇంకా పాకిస్తాన్, భారత్, బంగ్లాదేశాల్లో కూడా) ఆడబిడ్డలకు ఇష్టంగా పెట్టుకునే పేరు నస్రీన్.
మనిషి ప్రతి నిమిషం అంతరంగంతో వాదోపవాదాం చేస్తునే ఉంటాడు. చివరికి వ్యక్తి తనకున్న మేధో స్థాయి చేరాక ఇక అదే సత్యం అని నిర్ణయయించుకుంటాడు. కొందరు తామరకు మీది నీటి బిందువులా బతకాలనుకుంటారు. అటు నీటిలో కలవాలనుకోరు.ఇటు ఆకును అంటుకోవానుకోరు. కాని అక్కడే ఉండాలనుకుంటారు. సత్యా అటువంటిదే.
“నిజానికి ఆ తతంగం నాకు అంత ఇష్టం లేకుండా కూడా లేదు, అంత అందంగా తయారవ్వడం అదే మొదటిసారి జీవితంలో. నా అలంకరణ నాకు నచ్చింది. పెళ్లి ఒక తంతుగానే ఉంది. పెళ్ళీ, భర్త, పిల్లలు అదే జీవితం అంటే ఒప్పుకోదు.నాకు దేనిపైన అభ్యంతరం లేదు, అలాంటి చిన్న ఉత్సాహాల కోసం అతనితో జీవితాంతం ఉండడం కష్టం.” అంటుంది.
“ఏదీ వదిలేయాలని వదిలేయాలనుకోవట్లేదు. అన్నిటిని హత్తుకొని ఉంటాను. కానీ ఏదీ అంటుకోకుండా సమయానికి సాధారణంగా రాలిపోవడం ఎట్లా ఉంటుందో అది నా అనుభవంలోకి రావాలని ఉంది యోగీ” అని అంటుంది. గృహస్థ జీవితంలో ఉండి యోగీలా జీవించాలనుకుంటుంది.
రెండు విభిన్న దృక్పధాల సంవాదమే ఈ కథనం అనిపించిది. కథనంలో తార్కికత, మార్మికత అంత తొందరగా అంతు చిక్కదు.
నా అరవై సంవత్సరాల పాఠక జీవితంలో మైదానం, దాని మీద ప్రశంసలు, విమర్శలు చదివాను. మీ విశ్లేషణ విలక్షణంగా ఉంది. విమర్శనాత్మక వ్యాసం అనిపించింది. అన్ని కోణాల నుంచి స్పృశించి చాలా చక్కగా విశ్లేషించారు. అభినందనలు.
ఈ Manon, మేనక రెండిటి కథా లక్షణాలలో పెద్ద తేడాలేమీ నాకు తెలియలేదు. దేశికాచార్యులు గారు, భావించే ఈ భారతీయ సంస్కృతి ఎట్టిది? ఎలా ఇటాలియన్, ఫ్రెంచ్ సంస్కృతి, సంప్రదాయాలతో విభేదిస్తుంది, ఎక్కడెక్కడ ఈ మార్పులు ఈ తెలుగు రూపకం లో గమనించాలి? అన్న విషయాలు రచయిత నుండి వివరంగా వినాలని ఉంది.
ఛందోబద్ధకవిత్వమంటే సంపెంగను చూచిన తుమ్మెదలాగా పాఱిపోకుండా, ఓపికతో ఈ రచనను, బెవర్లీసిల్స్ యూట్యూబు ప్రదర్శనను చూచి పైవాక్యాలను వ్రాసిన లైలాగారికి నాకృతజ్ఞతలు. ఐతే, వారు నారచనను, పైయూట్యూబు ప్రదర్శనలోని సన్నివేశ పరంపరనూ నిశితంగా పోల్చుకోనట్లుగా తోస్తున్నది. అట్లా పోల్చుకొని ఉంటే వారే నాకు చెప్పేవారేమో నారచన దానికి మూలభూతమైన ఆపెరా లిబ్రెట్టోకంటె ఎక్కడెక్కడ భిన్నంగా ఉన్నదనే విషయం.
నాదృష్టి కథను పూర్తిగా మార్చాలని కాదు. దేశాలు వేరైనా, మానవప్రకృతి అంతటా ఒక్కటే అని నాభావం. అందుచేత మనోఁ కథ ఫ్రాన్సులో జరిగినట్లే భారతదేశంలోనూ జరుగవచ్చు. ఇట్లా జరుగగలిగినప్పుడు కథాశరీరాన్ని మార్చవలసిన అవసరం లేదు. ఐతే ఆకథాపరిధిలో దేశభేదాలనుబట్టి సన్నివేశపరికల్పనను దేశసంస్కృతికి అనుగుణంగా మార్చవలసి ఉంటుంది. ఇదే నేను వ్రాస్తున్న ఆపెరాలలో చేస్తున్న పునస్సృజన. ఈమార్పు నేను పాత్రలకు, ప్రదేశాలకు ఇచ్చే పేర్లదగ్గరినుండి ప్రారంభమౌతుంది. ఉదాహరణకు ఈ ఆపెరాలో పారిస్ పేరు భోగపురంగాను, ఏమియన్ విజయపురంగాను మార్చబడడమే కాక, బుద్ధపురము, రాజపురము, శాలిగ్రామము అనే మూడు క్రొత్త ఊర్లుగూడ ప్రవేశపెట్టబడినవి. పారిస్‌లో ఉండే St.Sulpice మొనాష్టరీ బుద్ధపురంలోని బుద్ధాశ్రమంగా మార్చబడింది. పారిస్ భోగాలకు, విలాసాలకు పెట్టింది పేరు. అందుచేత దీని పేరు భోగపురంగా మార్చబడ్డది. మేనక ఊరు శాలిగ్రామంగా పేర్కొనబడ్డది. సంస్కృతంలో ‘శాలి’ అంటే వరి అని అర్థం. ఆ ఊరిలో వరి ఎక్కువగా పండటంవల్ల ఆపేరు వచ్చిందని ఊహించవచ్చు. అట్లే వృద్ధుడయ్యును కాంతావ్యామోహమును మానని క్రూరుడైన Guillot పేరు శాకునికునిగను, అత్యంతధనవంతుడైన de Brétigny పేరు భౌరికునిగను మార్చబడినవి. సంస్కృతంలో శాకునికుడంటే వేటకాడని, భౌరికుడంటే బంగారునిధి కధికారి యని , స్థాయుకుడంటే గ్రామాధికారి అని అర్థాలు. (‘జీవాన్తకశ్శాకునికః, భౌరికః కనకాధ్యక్షః, స్థాయుకోఽధికృతో గ్రామే – అని అమరకోశము). అంతేకాక Guillot స్వభావం శూద్రకుని మృచ్ఛకటకంలోని శకారుని పోలియున్నది. అందుచేత పడుచుపిల్లల వేటకాడైన క్రూరస్వభావియగు Guillot ను శాకునికగా పేర్కొనడమే కాక, అతని పాత్రీకరణ శకారునికివలెనే చేయడం జరిగింది. అట్లే మహాధనవంతుడైన de Brétigny కి భౌరికనామధేయం సార్థకమైంది. వేశ్యలైన Poussette, Javotte, Javotte లకు రమణి,రంజని రాగిణి అనే పేర్లుంచడం వారి వేశ్యాస్వభావద్యోతకంగా ఉన్నది. Manon ను మేనక అనడం ఆమే విలాసలాలసతకు, సొమ్ములయందలి అభిలాషతకును తగినట్లుగాను, Manon అను శబ్దమునకు సన్నిహితంగాను ఉన్నది. అట్లే జూదరియైన Lescaut దేవనదత్తుడుగా పేర్కొనబడినాడు. ‘దేవనాః పాశకాశ్చ తే’ అని అమరకోశంలో చెప్పబడినట్లుగా దేవనములంటే పాచిలకలని అర్థం. అందుచే పాచికలాటకు దాసుడైన అతనిని దేవనదత్తు డనటం జరిగింది.
ఇట్లా వ్రాస్తూ పోతే ఇదొక మహాగ్రంథమౌతుంది. అందుచేత సంగ్రహంగా నేను చేసిన సన్నివేశములయందలి మార్పులను పేర్కొంటాను:
1. మొనాష్టరీని బుద్ధాశ్రమంగా మార్చడం. బుద్ధుని కాలంనుండి బుద్ధాశ్రమాలలో శ్రమణికల నియోగం జరిగింది. అందుచే మేనకను శ్రమణికాత్వము స్వీకరించుటకు పంపడం, తరుణార్కుడు బుద్ధాశ్రమంలో చేరడం అనేవి భారతీయసంస్కృతికి తగినట్లుగా జరిగినవి.
2. ప్రథమాంకంలో విశ్రాంతిగృహంలో లభించే ఆహారనామాలు భారతదేశీయుల ఆహారనామాలుగా మార్చబడినవి
3. ద్వితీయాంకంలో ప్రథమ, ద్వితీయదృశ్యములు అమూలకములు. ఇవి కథాపుష్టికై పరికల్పింపబడినవి. తృతీయదృశ్యంలో అదే చిన్న రూములో కిటికీకి దగ్గర దేవనతరుణార్కులు కూర్చున్నారనుటకు బదులుగా, వారు ఆరూముకు ముందుండే అంగణంలో కూర్చున్నారని, అందుచేత భౌరికుడు మేనకకు తరుణార్కుని అపహరణవిషయం తరుణార్కునికి దెలియకుండా రహస్యంగా చెప్పడానికి అనుకూలంగా ఉండిందనే కల్పన చేయబడ్డది.
4. తృతీయాంకంలో ప్రథమదృశ్యం అమూలకం. ఇది కథాపరిపుష్టికై కల్పింపబడినది. ద్వితీయదృశ్యం, అందులో సౌందరనందమనే బుద్ధగాథాత్మకమైన అంతర్నాటకం పూర్తిగా మూలంలో లేని, భారతసంస్కృతికి అన్వయించే నూత్నకల్పనలు. మూలంలో des Grieux (తరుణార్కుడు) మొనాష్టరీలో చేరుటకు ప్రేరకం సహేతుకంగా నిరూపింపబడలేదు. కాని ఇచ్చట ఈ ద్వితీయతృతీయ దృశ్యములద్వారా తరుణార్కుడు బుద్ధాశ్రమంలో చేరుటకు సిద్ధమగుట సహేతుకంగా కల్పింపబడింది. ఈవిధంగా ఈ అంకమంతా అమూలకమైన నూతనకల్పనయే.
5. మూలంలోని చతుర్థాంకంలో పారిస్‌లో ఒక కార్నివాల్ జరిగినట్లు, అక్కడ ఒక బాలే డాన్సుగూడ ప్రదర్శింపబడినట్లు, ఆసందర్భంలోనే తరుణార్కుడు మొనాష్టరీలో చేరినవిషయం అతని తండ్రినుండి మేనక నేరుగా విన్నట్లును కథ నడిచింది. కాని ఇటువంటి కార్నివాల్, బాలే భారతసంస్కృతికిపనికిరావు. అందుచే వసంతోత్సవసందర్భంలో భోగపురసమీపంలోని ఒక తోటలో మేనకాదులు విలాసంగా పాల్గొన్నట్లును, ఆసందర్భంలో తరుణార్కుడు బుద్ధాశ్రమంలో చేరిన విషయం స్థాయుకుడు భౌరికునికి చెప్పుచుండగా చెట్లచాటునుండి మేనక పరోక్షంగా విన్నట్లును కల్పించినాను. ఆవనవిహారానికి ముందుగా ప్రథమదృశ్యంలో మేనక సేవికలచేత అలంకరింపబడుట అనే అమూలకమైన దృశ్యాన్ని కల్పించి ఆమె భౌరికుని పోషణలో అనుభవించిన వైభవము నిరూపించినాను. అట్లే తృతీయదృశ్యంలో ఆవైభవములపట్ల అమె అనాసక్తి, పునః తరుణార్కుని యందలి అభిలాష చక్కగా నిరూపింపబడినవి. మూలంలో మొనాష్టరీలోనికి మేనకప్రవేశించి అతనిని తనతో పునస్సంగమమునకు సుముఖుని చేసికొన్నట్లున్నది. కాని అది అసంగతంగా ఉన్నదని, ఈఅంకంలోని చతుర్థదృశ్యంలో బుద్ధాశ్రమోద్యానంలో తరుణార్కుడు ధ్యాననిమగ్నుడై ఉండగా మేనక అతనిని సమీపించి, తనకు పునర్వశవర్తుని చేసికొన్నట్లు కల్పించినాను. ఈవిధంగా ఈ అంకమంతా అమూలకమైన నూతనకల్పనయే.
ఈవిధంగా ఎన్నో మార్పులు, చేర్పులు చేసి, కేవలం భారతసంస్కృతికి సంబంధితమైన స్వతంత్రరచనగా గోచరించే విధంగా నేనిది వ్రాసినానని అనుకొంటున్నాను. దీనిని సమగ్రంగా పరిశీలించి, ఇందులో నేనెంతవఱకు కృతకృత్యుడ నైనానో మీవంటివారు తేల్చవలసియుంటుందని విన్నవించుకొనుచున్నాను. అందుచేత లైలాగారూ, ఈవిషయంలో మీరు చేయవలసిన HomeWork చాలా ఉన్నది.
పాపం సమాచరతి వీతఘృణో జఘన్యః ప్రాప్యాపదం సఘృణ ఏవ తు మధ్య బుద్ధిః
ప్రాణాత్యయేపి తు న సాధుజనః స్వవృత్తిం వేలాం సముద్ర ఇవ లంఘయితుం సమర్ధః
ఘృణా = కనికరం, కరుణ.
కనికరం లేనివాడైన అధముడు పాపాన్ని చేస్తూ ఉంటాడు.
కరుణ కలిగినవాడైనప్పటికీ, మధ్యముడు (మనోబలం లేనివాడు) తనకి ఆపద కలిగినప్పుడు పాపం చేస్తాడు.
సాధువైన ఉత్తమమానవుడు ప్రాణాపాయ సమయంలో కూడా, చెలియలి కట్ట దాటడానికి సముద్రం ఎలా సమర్థం కాలేదో, అలాగే పాపం చెయ్యడానికి సమర్థుడు కాలేడు.
—
లైలా గారికి,
నమస్కారాలు. మీ రచనలు, కామెంట్లు నాకు చాలా నచ్చుతాయి.
లూయీ పాస్చర్ – బుద్ధుల పోలిక గురించి – నేనూ ఇలాగే అనుకునేవాణ్ణి కదా అని నవ్వు వచ్చింది.
అట్రిబ్యూట్ గురించి కిషోర్ అభిప్రాయం:
04/24/2021 11:16 am
ఒక కుర్చీ ద్వారా కథ చెప్పడం చాల బాగుంది. The character Nasreen represents struggle for survival and adaptability. There is no judgement here, no right of wrong. A very good description of human traits and attributes that are in play. Apt title for the story. Great work!
మేనక గురించి Lyla yerneni అభిప్రాయం:
04/23/2021 9:16 am
Desikachari garu:
Thanks for the succinct response. It teaches the reader some more Telugu and clarifies the writer’s intent. If appended to the main body of work, it will be useful to future critics to make comparisons with other works at multiple levels.
Thanks to you, (you give plenty home work, and I love it) I am now into the Opera National de Paris’ stage production of Massenet’s Manon, of March 10, 2020. It is a recording done without audience. In this version, in the last scene Manon is shot in front of her lover’s eyes. I am also into M’s M, in Ballet form, previously performed by Royal Ballet at Royal Opera house, Covent Garden, London.
Since shutdown of travel, concerts etc., last April on, I started watching Medici.tv. It has extensive collection of concerts, ballets, operas, master classes, documentaries etc. Subscribers can join in live streaming of programs from opera houses, concert halls, churches of the world. The quality of broadcasting is superlative.
As I enjoy other Manon s on Medici.tv, I will also be studying yours, in eemaata magazine, making my enjoyment exponential.
-Lyla
నాలుగో వరం గురించి కె.కె. రామయ్య అభిప్రాయం:
04/22/2021 12:46 pm
డా. లైలా ఏర్నేని గారు, నమస్తే.
ముందుగా… భగవానుడి “నాలుగో వరం” ఇచ్చిన దంతుర్తి శర్మ గారికి కృతజ్ఞతలు. భౌతికమైన రోగాలకి జీవ శాస్త్రవేత్త లూయీ పాశ్చర్ లాంటి వాళ్లు, మానసిక రుగ్మతలకి మహాబోధి తధాగతుడు కావాలనుకునే వాళ్లల్లో నేనూ ఒకడిని.
మత్తుమందుగా పనిచేసే మతం కాదు, మానవ సంస్కృతిని ముందుకు నడిపిస్తున్న ఆధ్యాత్మికత కావాలి. యీ జర్మని హిట్లర్లూ, యీ రష్యా స్టాలిన్లూ, యీ ఉగాండా ఈదీ అమీన్లూ, యీ కంబోడియా ఖ్మెర్ రౌగె, పోల్ పాట్లూ, ఇరాకీ కుద్రిష్‍ల ఊచకోత; అట్టుడుకుతున్న ఆఫ్ఘనిస్తాన్; బర్మా / మయన్మార్‌లోని మైనారిటీ ముస్లిం రోహింగ్యాల మారణహోమం లాంటివెన్నెంటినో శాస్త్రవేత్తలు నివారించలేరు. ఆ పాత్ర సామాజిక శాస్త్రవేత్తలు, ప్రజా నాయకులు, ఓ మహాబోధి చెయ్యగలడు అనుకుంటున్నాను.
అట్రిబ్యూట్ గురించి కె.కె. రామయ్య అభిప్రాయం:
04/19/2021 7:25 am
మీరన్నది నిజమే కనిగిరి భాస్కర్ మాస్టర్ గారూ! నస్రీన్ రత్నానికి కొనసాగింపులా కనిపిస్తుంది. కానీ బతకడం తెలిసిన రత్నానికి లేని ఒడుపులు, నలుగురిని చూసి నేర్చుకుని ఎదగటాలు నస్రీన్ కున్నాయి.
అట్రిబ్యూట్ గురించి కె.కె. రామయ్య అభిప్రాయం:
04/19/2021 7:23 am
రత్నం బ్యూటీపార్లర్లో చిన్న ఉద్యోగానికి కుదురుకున్న పదహారేళ్ళ నస్రీన్ (ఊర్లో ఒక మాదిరి పేదరికం ఉన్న కుటుంబం నుంచి అంతగా చదువుకోని, కొంచెం హిందీ తెలిసిన అమ్మాయి నస్రీన్). తక్కువ మాట్లాడటం, నిజాయితీ, వినయ విధేయతలు పెట్టుబడి పెట్టి… రత్నాన్ని, బ్యూటీపార్లర్ కొచ్చే కస్టమర్లని, రత్నంపై వింతైన అభిమానం చూపిస్తూ రత్నానికి నమ్మినబంటు అయిన సంతోష్‍ని అర్ధం చేసుకుని వాళ్లందరితో నెగ్గుకొచ్చింది.
బ్యూటీ పార్లర్ పనులు, బ్యాంకు పనులు నేర్చుకుని, విలువైన కస్టమర్ల నమ్మకాన్ని, అభిమానాన్ని సంపాదించుకున్న నస్రీన్ … ( బ్యూటీపార్లర్ చిరు ఉద్యోగిగా) తను పెట్టిన దానికి తగ్గ సరైన రాబడిలేనప్పుడు తనో స్వతంత్రురాలిగా మారి సొంతంగా యూ గ్లో నస్రీన్ బ్యూటీ పార్లర్ పెట్టుకున్న నస్రీన్ చేసింది మోసం కానే కాదు.
మనుషులని మచ్చిక చేసుకోవాలంటే అందంగా కనపడటం, ఉండటం, మాట్లాడటం అవసరమని తెలుసుకుని; ఎవరికి ఏమి కావాలో అది ఇవ్వగలననే నమ్మకాన్ని మనుషులకి ఇవ్వడంతో నస్రీన్ విజయం సాధించింది. మనుషుల బలహీనతల్ని పట్టేసి, రత్నంపై మానసికంగా పైచేయిని సాధించే ప్రయత్నమొక్కటే కాకుండా తన భవిష్యత్ జీవిత విజయాలకి కావాల్సిన వ్యూహాలు రచించుకున్న నస్రీన్ చేసింది మోసం కానే కాదు. స్వతంత్రురాలిగా ఎదిగి తన గమ్యాన్ని తను ఎంచుకోవటమే అవుతుంది.
నస్రీన్ వ్యక్తిత్వ గుణ, గణ, లక్షణాలు… విశేషణాలు “అట్రిబ్యూట్” అన్న కధ పేరుకి వన్నె తెచ్చింది. నస్రీన్ వ్యక్తిత్వం లోని పరిమళాలు పాఠకులకి చాన్నాళ్లు గుర్తుండిపోతాయి.
మానవ మనస్తత్వ విశ్లేషణలతో కూడిన మరో ఆణిముత్యం కధని ఇచ్చిన రచయిత్రి డా. శ్రీసుధ మోదుగు గారికి అభినందనలు! నెనర్లు!
నస్రీన్ అంటే అడవి రోజా పువ్వు (వైల్డ్ రోజ్) అనే అర్ధం వచ్చే పార్సీ భాష పదం. కుద్రిష్, అరబిక్, టర్కీ ప్రాంతాల్లో (ఇంకా పాకిస్తాన్, భారత్, బంగ్లాదేశాల్లో కూడా) ఆడబిడ్డలకు ఇష్టంగా పెట్టుకునే పేరు నస్రీన్.
అ దృశ్యం గురించి M A Siddhiq అభిప్రాయం:
04/17/2021 4:32 pm
మనిషి ప్రతి నిమిషం అంతరంగంతో వాదోపవాదాం చేస్తునే ఉంటాడు. చివరికి వ్యక్తి తనకున్న మేధో స్థాయి చేరాక ఇక అదే సత్యం అని నిర్ణయయించుకుంటాడు. కొందరు తామరకు మీది నీటి బిందువులా బతకాలనుకుంటారు. అటు నీటిలో కలవాలనుకోరు.ఇటు ఆకును అంటుకోవానుకోరు. కాని అక్కడే ఉండాలనుకుంటారు. సత్యా అటువంటిదే.
“నిజానికి ఆ తతంగం నాకు అంత ఇష్టం లేకుండా కూడా లేదు, అంత అందంగా తయారవ్వడం అదే మొదటిసారి జీవితంలో. నా అలంకరణ నాకు నచ్చింది. పెళ్లి ఒక తంతుగానే ఉంది. పెళ్ళీ, భర్త, పిల్లలు అదే జీవితం అంటే ఒప్పుకోదు.నాకు దేనిపైన అభ్యంతరం లేదు, అలాంటి చిన్న ఉత్సాహాల కోసం అతనితో జీవితాంతం ఉండడం కష్టం.” అంటుంది.
“ఏదీ వదిలేయాలని వదిలేయాలనుకోవట్లేదు. అన్నిటిని హత్తుకొని ఉంటాను. కానీ ఏదీ అంటుకోకుండా సమయానికి సాధారణంగా రాలిపోవడం ఎట్లా ఉంటుందో అది నా అనుభవంలోకి రావాలని ఉంది యోగీ” అని అంటుంది. గృహస్థ జీవితంలో ఉండి యోగీలా జీవించాలనుకుంటుంది.
రెండు విభిన్న దృక్పధాల సంవాదమే ఈ కథనం అనిపించిది. కథనంలో తార్కికత, మార్మికత అంత తొందరగా అంతు చిక్కదు.
అట్రిబ్యూట్ గురించి భాస్కర్ కె అభిప్రాయం:
04/16/2021 8:58 am
నస్రీన్ రత్నానికి కొనసాగింపులా కనపించిందండి. బలమైన కథ
మైదానానికి చెలియలి కట్ట గురించి సత్యనారాయణ దేవభక్తుని అభిప్రాయం:
04/15/2021 9:14 am
నా అరవై సంవత్సరాల పాఠక జీవితంలో మైదానం, దాని మీద ప్రశంసలు, విమర్శలు చదివాను. మీ విశ్లేషణ విలక్షణంగా ఉంది. విమర్శనాత్మక వ్యాసం అనిపించింది. అన్ని కోణాల నుంచి స్పృశించి చాలా చక్కగా విశ్లేషించారు. అభినందనలు.
మేనక గురించి desikachary అభిప్రాయం:
04/13/2021 7:04 pm
ఛందోబద్ధకవిత్వమంటే సంపెంగను చూచిన తుమ్మెదలాగా పాఱిపోకుండా, ఓపికతో ఈ రచనను, బెవర్లీసిల్స్ యూట్యూబు ప్రదర్శనను చూచి పైవాక్యాలను వ్రాసిన లైలాగారికి నాకృతజ్ఞతలు. ఐతే, వారు నారచనను, పైయూట్యూబు ప్రదర్శనలోని సన్నివేశ పరంపరనూ నిశితంగా పోల్చుకోనట్లుగా తోస్తున్నది. అట్లా పోల్చుకొని ఉంటే వారే నాకు చెప్పేవారేమో నారచన దానికి మూలభూతమైన ఆపెరా లిబ్రెట్టోకంటె ఎక్కడెక్కడ భిన్నంగా ఉన్నదనే విషయం.
నాదృష్టి కథను పూర్తిగా మార్చాలని కాదు. దేశాలు వేరైనా, మానవప్రకృతి అంతటా ఒక్కటే అని నాభావం. అందుచేత మనోఁ కథ ఫ్రాన్సులో జరిగినట్లే భారతదేశంలోనూ జరుగవచ్చు. ఇట్లా జరుగగలిగినప్పుడు కథాశరీరాన్ని మార్చవలసిన అవసరం లేదు. ఐతే ఆకథాపరిధిలో దేశభేదాలనుబట్టి సన్నివేశపరికల్పనను దేశసంస్కృతికి అనుగుణంగా మార్చవలసి ఉంటుంది. ఇదే నేను వ్రాస్తున్న ఆపెరాలలో చేస్తున్న పునస్సృజన. ఈమార్పు నేను పాత్రలకు, ప్రదేశాలకు ఇచ్చే పేర్లదగ్గరినుండి ప్రారంభమౌతుంది. ఉదాహరణకు ఈ ఆపెరాలో పారిస్ పేరు భోగపురంగాను, ఏమియన్ విజయపురంగాను మార్చబడడమే కాక, బుద్ధపురము, రాజపురము, శాలిగ్రామము అనే మూడు క్రొత్త ఊర్లుగూడ ప్రవేశపెట్టబడినవి. పారిస్‌లో ఉండే St.Sulpice మొనాష్టరీ బుద్ధపురంలోని బుద్ధాశ్రమంగా మార్చబడింది. పారిస్ భోగాలకు, విలాసాలకు పెట్టింది పేరు. అందుచేత దీని పేరు భోగపురంగా మార్చబడ్డది. మేనక ఊరు శాలిగ్రామంగా పేర్కొనబడ్డది. సంస్కృతంలో ‘శాలి’ అంటే వరి అని అర్థం. ఆ ఊరిలో వరి ఎక్కువగా పండటంవల్ల ఆపేరు వచ్చిందని ఊహించవచ్చు. అట్లే వృద్ధుడయ్యును కాంతావ్యామోహమును మానని క్రూరుడైన Guillot పేరు శాకునికునిగను, అత్యంతధనవంతుడైన de Brétigny పేరు భౌరికునిగను మార్చబడినవి. సంస్కృతంలో శాకునికుడంటే వేటకాడని, భౌరికుడంటే బంగారునిధి కధికారి యని , స్థాయుకుడంటే గ్రామాధికారి అని అర్థాలు. (‘జీవాన్తకశ్శాకునికః, భౌరికః కనకాధ్యక్షః, స్థాయుకోఽధికృతో గ్రామే – అని అమరకోశము). అంతేకాక Guillot స్వభావం శూద్రకుని మృచ్ఛకటకంలోని శకారుని పోలియున్నది. అందుచేత పడుచుపిల్లల వేటకాడైన క్రూరస్వభావియగు Guillot ను శాకునికగా పేర్కొనడమే కాక, అతని పాత్రీకరణ శకారునికివలెనే చేయడం జరిగింది. అట్లే మహాధనవంతుడైన de Brétigny కి భౌరికనామధేయం సార్థకమైంది. వేశ్యలైన Poussette, Javotte, Javotte లకు రమణి,రంజని రాగిణి అనే పేర్లుంచడం వారి వేశ్యాస్వభావద్యోతకంగా ఉన్నది. Manon ను మేనక అనడం ఆమే విలాసలాలసతకు, సొమ్ములయందలి అభిలాషతకును తగినట్లుగాను, Manon అను శబ్దమునకు సన్నిహితంగాను ఉన్నది. అట్లే జూదరియైన Lescaut దేవనదత్తుడుగా పేర్కొనబడినాడు. ‘దేవనాః పాశకాశ్చ తే’ అని అమరకోశంలో చెప్పబడినట్లుగా దేవనములంటే పాచిలకలని అర్థం. అందుచే పాచికలాటకు దాసుడైన అతనిని దేవనదత్తు డనటం జరిగింది.
ఇట్లా వ్రాస్తూ పోతే ఇదొక మహాగ్రంథమౌతుంది. అందుచేత సంగ్రహంగా నేను చేసిన సన్నివేశములయందలి మార్పులను పేర్కొంటాను:
1. మొనాష్టరీని బుద్ధాశ్రమంగా మార్చడం. బుద్ధుని కాలంనుండి బుద్ధాశ్రమాలలో శ్రమణికల నియోగం జరిగింది. అందుచే మేనకను శ్రమణికాత్వము స్వీకరించుటకు పంపడం, తరుణార్కుడు బుద్ధాశ్రమంలో చేరడం అనేవి భారతీయసంస్కృతికి తగినట్లుగా జరిగినవి.
2. ప్రథమాంకంలో విశ్రాంతిగృహంలో లభించే ఆహారనామాలు భారతదేశీయుల ఆహారనామాలుగా మార్చబడినవి
3. ద్వితీయాంకంలో ప్రథమ, ద్వితీయదృశ్యములు అమూలకములు. ఇవి కథాపుష్టికై పరికల్పింపబడినవి. తృతీయదృశ్యంలో అదే చిన్న రూములో కిటికీకి దగ్గర దేవనతరుణార్కులు కూర్చున్నారనుటకు బదులుగా, వారు ఆరూముకు ముందుండే అంగణంలో కూర్చున్నారని, అందుచేత భౌరికుడు మేనకకు తరుణార్కుని అపహరణవిషయం తరుణార్కునికి దెలియకుండా రహస్యంగా చెప్పడానికి అనుకూలంగా ఉండిందనే కల్పన చేయబడ్డది.
4. తృతీయాంకంలో ప్రథమదృశ్యం అమూలకం. ఇది కథాపరిపుష్టికై కల్పింపబడినది. ద్వితీయదృశ్యం, అందులో సౌందరనందమనే బుద్ధగాథాత్మకమైన అంతర్నాటకం పూర్తిగా మూలంలో లేని, భారతసంస్కృతికి అన్వయించే నూత్నకల్పనలు. మూలంలో des Grieux (తరుణార్కుడు) మొనాష్టరీలో చేరుటకు ప్రేరకం సహేతుకంగా నిరూపింపబడలేదు. కాని ఇచ్చట ఈ ద్వితీయతృతీయ దృశ్యములద్వారా తరుణార్కుడు బుద్ధాశ్రమంలో చేరుటకు సిద్ధమగుట సహేతుకంగా కల్పింపబడింది. ఈవిధంగా ఈ అంకమంతా అమూలకమైన నూతనకల్పనయే.
5. మూలంలోని చతుర్థాంకంలో పారిస్‌లో ఒక కార్నివాల్ జరిగినట్లు, అక్కడ ఒక బాలే డాన్సుగూడ ప్రదర్శింపబడినట్లు, ఆసందర్భంలోనే తరుణార్కుడు మొనాష్టరీలో చేరినవిషయం అతని తండ్రినుండి మేనక నేరుగా విన్నట్లును కథ నడిచింది. కాని ఇటువంటి కార్నివాల్, బాలే భారతసంస్కృతికిపనికిరావు. అందుచే వసంతోత్సవసందర్భంలో భోగపురసమీపంలోని ఒక తోటలో మేనకాదులు విలాసంగా పాల్గొన్నట్లును, ఆసందర్భంలో తరుణార్కుడు బుద్ధాశ్రమంలో చేరిన విషయం స్థాయుకుడు భౌరికునికి చెప్పుచుండగా చెట్లచాటునుండి మేనక పరోక్షంగా విన్నట్లును కల్పించినాను. ఆవనవిహారానికి ముందుగా ప్రథమదృశ్యంలో మేనక సేవికలచేత అలంకరింపబడుట అనే అమూలకమైన దృశ్యాన్ని కల్పించి ఆమె భౌరికుని పోషణలో అనుభవించిన వైభవము నిరూపించినాను. అట్లే తృతీయదృశ్యంలో ఆవైభవములపట్ల అమె అనాసక్తి, పునః తరుణార్కుని యందలి అభిలాష చక్కగా నిరూపింపబడినవి. మూలంలో మొనాష్టరీలోనికి మేనకప్రవేశించి అతనిని తనతో పునస్సంగమమునకు సుముఖుని చేసికొన్నట్లున్నది. కాని అది అసంగతంగా ఉన్నదని, ఈఅంకంలోని చతుర్థదృశ్యంలో బుద్ధాశ్రమోద్యానంలో తరుణార్కుడు ధ్యాననిమగ్నుడై ఉండగా మేనక అతనిని సమీపించి, తనకు పునర్వశవర్తుని చేసికొన్నట్లు కల్పించినాను. ఈవిధంగా ఈ అంకమంతా అమూలకమైన నూతనకల్పనయే.
6. పంచమాంకంలోని ప్రథమదృశ్యంలో మేనకాదేవనులు తరుణార్కుని జూదమునకు ప్రేరేచినసన్నివేశం అమూలకం.
ఈవిధంగా ఎన్నో మార్పులు, చేర్పులు చేసి, కేవలం భారతసంస్కృతికి సంబంధితమైన స్వతంత్రరచనగా గోచరించే విధంగా నేనిది వ్రాసినానని అనుకొంటున్నాను. దీనిని సమగ్రంగా పరిశీలించి, ఇందులో నేనెంతవఱకు కృతకృత్యుడ నైనానో మీవంటివారు తేల్చవలసియుంటుందని విన్నవించుకొనుచున్నాను. అందుచేత లైలాగారూ, ఈవిషయంలో మీరు చేయవలసిన HomeWork చాలా ఉన్నది.
నాలుగో వరం గురించి nagamurali అభిప్రాయం:
04/13/2021 12:45 am
Hence, my translation!
పాపం సమాచరతి వీతఘృణో జఘన్యః ప్రాప్యాపదం సఘృణ ఏవ తు మధ్య బుద్ధిః
ప్రాణాత్యయేపి తు న సాధుజనః స్వవృత్తిం వేలాం సముద్ర ఇవ లంఘయితుం సమర్ధః
ఘృణా = కనికరం, కరుణ.
కనికరం లేనివాడైన అధముడు పాపాన్ని చేస్తూ ఉంటాడు.
కరుణ కలిగినవాడైనప్పటికీ, మధ్యముడు (మనోబలం లేనివాడు) తనకి ఆపద కలిగినప్పుడు పాపం చేస్తాడు.
సాధువైన ఉత్తమమానవుడు ప్రాణాపాయ సమయంలో కూడా, చెలియలి కట్ట దాటడానికి సముద్రం ఎలా సమర్థం కాలేదో, అలాగే పాపం చెయ్యడానికి సమర్థుడు కాలేడు.
—
లైలా గారికి,
నమస్కారాలు. మీ రచనలు, కామెంట్లు నాకు చాలా నచ్చుతాయి.
లూయీ పాస్చర్ – బుద్ధుల పోలిక గురించి – నేనూ ఇలాగే అనుకునేవాణ్ణి కదా అని నవ్వు వచ్చింది.
భౌతికమైన రోగానికి లూయీ పాశ్చరులు. భవరోగం ఉందనుకునేవాడికి బుద్ధుడో మరొకరో. భవరోగమే లేదనేవాళ్ళు ధన్యులు కాదూ!!