పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16454

  1. ఊహల ఊట 1 గురించి డా. ఎల్ కె సుధాకర్ అభిప్రాయం:

    06/01/2021 10:21 pm

    అప్పుడెప్పుడో సీగాన పెసూనాంబ… పాపం బుడుక్కి ఎదురు చెప్పలేక ఉడుక్కునేది. ఇప్పుడిలా చేగోడీలు తింటూ హన్నా… ఎన్ని ఊసులు! పురాణం సీతగారు చిన్నప్పుడు ఇలానే ఉండేదని తెలిసింది ఇచ్చదివాకా. పొడుగు లాల్చీలో నాన్న చుట్ట కాలుస్తున్న చాసోగారే అనుకునేసరికి ఎంత ముచ్చటగా ఉందే నా తల్లీ…

  2. పై గదిలో ప్రేమికుడు గురించి R B R SARMA అభిప్రాయం:

    06/01/2021 3:57 pm

    A minor error crept in in the spelling of the original author of the story, P G Wodehouse.

    [Corrected. Error regretted – Ed.]

  3. జూన్ 2021 గురించి Sundar అభిప్రాయం:

    06/01/2021 2:21 pm

    ఈ కష్టకాలంలో నెలకొన్న విషాద పరిస్థితులను అక్షరాలా వివరించారు. ప్రతీ ఒక్క కుటుంబంలో ఏదో ఒక్క విషాదం చోటుచేసుకున్న రోజులివి. ఈ విపత్తులో నుంచి మంచి మనుషులుగా కోలుకుంటారు అని ఆశించాలి. కృతజ్ఞతలు.
    సుందర్ UK

  4. సంక్షోభం-శోకం-సాహిత్యం గురించి విశీ అభిప్రాయం:

    06/01/2021 1:10 pm

    ఈ కవితలు చదివాక ఏదో ఊపిరాడనితనం నన్ను చుట్టుముట్టింది..

  5. ఊహల ఊట 1 గురించి అహోబిలం ప్రభాకర్ ఆర్టిస్ట్ అభిప్రాయం:

    06/01/2021 12:15 pm

    మాటకి మాటా అంటాన్ట! ఏంటో, ఎదురుగా కనబడుతున్నవే కదా నే చెప్పినవీ! ఏదడిగినా అడ్డదిడ్డం ప్రశ్నలు అడక్కు అంటారు. ప్రశ్నలు అడ్డదిడ్డంగా ఉంటాయా… ఈ మాటలు అలాంటి సందర్భాలు పెద్దవాళ్లకు కొత్తసవాళ్ళు. ఊహల ప్రశ్నలకు వయసుతో సంబంధం వుంటుందా ఇక్కడే కదా తత్తరపాట్లు. చదుతున్నంతసేపు చిట్టి బుర్రలోకి దూరిపోయాను ప్రశ్నలకాడే నొక్కివేయబడ్డ గతంలోకి. అభినందనలు తులసిగారు.

  6. ఊహల ఊట 1 గురించి G S CHALAM అభిప్రాయం:

    06/01/2021 11:29 am

    మళ్లీ బుడుగు చదువుతున్నట్టుంది. పిల్లల ఊహల్ని పిల్లల భాషలో చెప్పడం కష్టం. ఆ పసిడి ఛాయలు ఇంకా పచ్చిగా, తాజాగా నిలుపుకోబట్టే తులసిగారికి ఇలా రాయడం సాధ్యమైంది.

  7. ఊహల ఊట 1 గురించి P Vasanta Lakshmi అభిప్రాయం:

    06/01/2021 11:08 am

    ఎంత బాగుందో! అలా ఆ పొడుగు గౌనుకి ఉన్న రెండేసి పెద్ద జేబుల్లో నుంచీ ప్రశ్నలు, ఊహలు, కబుర్లు, చేగోడీలు, అవి కూడా నూనె కారని చేగోడీలు తీస్తూ ఉంటే మేం కూడా ఇక్కడ కూర్చుని, ఈ బాలిక చెప్పే కబుర్లు, ఊహలు వింటూ ఉంటాం, ఇంకా ఇంకా…
    అవును, తిరగేస్తే ప్రశ్నలు నూతిలో వేసే కొక్కేలులాగే ఉంటాయి. ఎంత బాగా చెప్పేరు!
    మన మెదడు నూతిలో నుంచి ఎన్ని ప్రశ్నలకి జవాబులు లాగొచ్చు, కొక్కేనికి తగిలించి…
    తులసిగారూ, ఇప్పటికే నేను మీకు అభిమానిని. ఈ ఊహల ఊటతో మరింత బిగ్ ఫాన్ ని అయిపోయాను.
    మిగిలిన భాగాల కోసం ఎదురుచూస్తూ ఉంటాను.
    వసంత లక్ష్మి.

  8. ఊహల ఊట 1 గురించి వారణాసి నాగలక్ష్మి అభిప్రాయం:

    06/01/2021 10:52 am

    ముళ్లపూడివారి బుడుగులాగే తులసిగారి బుడిగి భలే తెలివైనది. ప్రపంచాన్ని పరిశీలించి చూస్తూ ప్రశ్నల కొక్కేలతో బుర్ర నూతిలోంచి జవాబులు పైకి తీస్తుంది 🙂
    Enjoyed reading it 👌

  9. ఊహల ఊట 1 గురించి పవన్ కుమార్ రెడ్డి.సి అభిప్రాయం:

    06/01/2021 10:25 am

    😊 ఆ చిన్న జేబులు, అందులోని కొన్ని చేగోడీలకే ఇన్ని కబుర్లయితే

    ఇహ వాళ్ల నాన్నారికున్నట్లు పే…ద్ద జేబులున్న గౌను కుట్టిస్తే
    వాటినిండా అమ్మ చేసిన నూనంటని చేగోడీలు నింపుకుంటే
    అవయిపోయేదాకా ఇంకెన్ని కబుర్లో కదా

    మొత్తానికి నాగమణి రాకముందే అన్నీ పలారం కానిచ్చేసిందనమాట😊😊

    పాపం నాగమణి…😎

  10. ఊహల ఊట 1 గురించి ప్రగతి అభిప్రాయం:

    06/01/2021 10:23 am

    ఊహల ఊట పిచ్చిగా నచ్చేసింది. ఒకటి అనుకుంటానా, ఇంకేదో గుర్తుకు వస్తుంది. దాంతో మరోటేదో వచ్చేస్తుంది. పరిగెట్టుకెళ్లి చెప్పకపోతే నా బుర్రలోంచి అది ఎగిరి చక్కాపోతుంది. నాకూ అంతే.
    ఎంచక్కా ప్రశ్నలన్నిటినీ తిరగేసి పందిరి కొక్కేలతో బుర్రనూతిని గాలిస్తే కొక్కేలకి తగులుకొని జవాబులు వచ్చేస్తాయి. భలే ఐడియా కదా! అభినందనలు తులసిగారూ, అన్వర్ బొమ్మ కూడా భలే కుదిరింది.