ఊహల మూట కాదిది.
పిల్లల ఊహల తెలివితేట. తెలివితేట ఏ సమాసమో?
కొండ మామయ్య ఎత్తుకి నిచ్చెనెక్కి బుర్రలోకి చూడడం,
ఆకాశం మెత్తగా దూది పరుపులా ఉండడం,
హరివిల్లు మీద కాలుమీద కాలేసుకు కూర్చోవాలనుకోవడం
చదివితే మనం బాల్యంలో విహరిస్తాం. గుత్తులు గుత్తులుగా జ్ఞాపకాలు మొలుస్తాయేమో
ఊహలతో చూసే కళ్ళకి కనబడతాయన్న వాక్యం
చాగంటి తులసిగారి సాహితీ బలం తెలియజేస్తుంది, మనకి ఇంకా కావాలంటే ఆనందపు, ఆలోచనలెక్కి నిచ్చెనెలెక్కి చూడాలి.
చివరిగా చీకటంటే తెలియనిది, వెలుతురంటే తెలియడమని ఒక తాత్వికత అమాయకత కలగలిపిన వాక్యం. ఎవరి స్థాయికి తగ్గట్టు వారు అన్వయించుకోవచ్చు
అభినందనలందుకోండి అనేంత పెద్దవాణ్ణి కాదు.
మరిన్ని ఊహాల ఊటల కోసం వేచిచూస్తూ
విరహాంకుని వృత్తజాతిసముచ్చయమును తిరగవేస్తుంటే నిన్న రచితా అనే ఒక జాతి పద్యము కనబడినది. ఇది సంస్కృతములోని వైతాళీయము వంటిది. ప్రథమార్ధములో మాత్రా ఛందస్సు, ద్వితీయార్ధములో గణ ఛందస్సు. ద్వితీయార్ధములోని మొదటి రెండు చతుర్మాత్రలు స-గణములు (IIU), పిదప ఒక నరేంద్ర గణము (అనగా జ-గణము), చివర ఒక గురువు. వీటిని కలిపి ఇలా వ్రాద్దామా? IIU IIU IUI U లేక IIUII UIUIU. ఈ రెండవ భాగపు గురు లఘువుల అమరిక చంపకోత్పలమాలల యందలి ద్వితీయార్ధమే! మొదటి భాగపు అమరిక చ/పం/పం. ఇందులో ఏ మాత్రాగణమునైనను వాడవచ్చును. మాలికావృత్తములలోని ప్రథమార్ధమునకు కూడ ఈ లక్షణములు ఉన్నాయి! వీటిని వివరిస్తూ ప్రాకృతములోని లక్షణ-లక్ష్య పద్యము:
ఇందులోని చివరి పాదము ఉత్పలమాలకు సరిపోతుంది. మనకు తెలిసి మొట్టమొదటి చంపకమాలను మాఘకవి శిశుపాలవధలో వ్రాసినాడు (తురగకులాకులస్య..) అతని చంపకమాల ధృతశ్రీ అనే పేరుతో వ్యవహరించబడుతున్నది. మాఘుడు ఏడవ శతాబ్దపు ఉత్తర భాగములో నివసించినట్లు ఊహ. విరహాంకుని వృత్తజాతిసముచ్చయములోని ఈ రచితా జాతిని చూచిన పిదప సృజించినాడా? అలాగైతే విరహాంకుని కాలము మాఘునికంటె ముందు. విరహాంకుడు క్రీ.శ. ఆఱు నుండి ఎనిమిదవ శతాబ్దపు కాలము వాడని అంటారు. నా ఊహ నిజమయితే విరహాంకుని కాలము ఆఱు నుండి ఏడవ శతాబ్దపు పూర్వార్ధమని చెప్ప వీలగును.
Sreedhar Sir! The story is heartbreaking. Have we become so cruel and indifferent that turned out to be disastrous to our little cuties? Are we taking heroism in flouting the norms and cause irreparable loss to Nature? We should learn to respect the Nature otherwise be ready to pay heavily for our misdeeds.
Sreedhar Sir! U have made me cry in silence. The story is heartbreaking. Have we become so cruel and indifferent that turned out to be disastrous to our little cuties ? We should learn to respect the Nature otherwise be ready to pay heavily for our misdeeds.
ఇప్పుడే చదివాను ఈ వ్యాసం — నేను ఇంతకు ముందే రెండవ పుస్తకం చదివాను. ఈ విధంగా రచయితల వైవిధ్యం చూపించడం బాగుంది. నిరంతర పథికులు వీరు. అనికేత్ పుస్తకం చదవాలని ఉంది. థాంక్యూ.
ఊహల ఊట 4 గురించి చాగంటి ప్రసాద్ అభిప్రాయం:
09/14/2021 11:24 am
ఊహల మూట కాదిది.
పిల్లల ఊహల తెలివితేట. తెలివితేట ఏ సమాసమో?
కొండ మామయ్య ఎత్తుకి నిచ్చెనెక్కి బుర్రలోకి చూడడం,
ఆకాశం మెత్తగా దూది పరుపులా ఉండడం,
హరివిల్లు మీద కాలుమీద కాలేసుకు కూర్చోవాలనుకోవడం
చదివితే మనం బాల్యంలో విహరిస్తాం. గుత్తులు గుత్తులుగా జ్ఞాపకాలు మొలుస్తాయేమో
ఊహలతో చూసే కళ్ళకి కనబడతాయన్న వాక్యం
చాగంటి తులసిగారి సాహితీ బలం తెలియజేస్తుంది, మనకి ఇంకా కావాలంటే ఆనందపు, ఆలోచనలెక్కి నిచ్చెనెలెక్కి చూడాలి.
చివరిగా చీకటంటే తెలియనిది, వెలుతురంటే తెలియడమని ఒక తాత్వికత అమాయకత కలగలిపిన వాక్యం. ఎవరి స్థాయికి తగ్గట్టు వారు అన్వయించుకోవచ్చు
అభినందనలందుకోండి అనేంత పెద్దవాణ్ణి కాదు.
మరిన్ని ఊహాల ఊటల కోసం వేచిచూస్తూ
చాగంటి ప్రసాద్
9000206163
ఊహల ఊట 2 గురించి ఉప్పలూరి ఆత్రేయ శర్మ అభిప్రాయం:
09/14/2021 10:08 am
చాగంటి తులసిగారి ఊహల ఊట తరుగెరగని అసలు సిసలైన “జల”తారు వన్నెల తెలుగు అందాల బంగరు నీటి గని. చిన్న వయసులోని చిలిపి ఆడపిల్ల చెంగుచెంగున వాకిలంతా, పెరడంతా కాళ్ళ గజ్జెలు ఘల్లుఘల్లుమని గంతులేసినట్లు చిన్న తులసిగారి మాటల మూటల బుల్లి తూటాలు అన్నివైపులా పేలుతూ అపుడపుడు తికమక పెడుతున్నట్లు కనపడినా చదువరులనందరినీ తమకానికి గురి చేస్తాయి. బాల్య స్మృతుల హరివిల్లు రంగులను తెలుగు సొగసులతో మిళితం చేసి “ఈమాట” ద్వారా చక్కని బాట వేస్తున్న చాగంటి చిఱుతకు నా ఉల్లపు లోతులనుంచి వెల్లువలా జారువాలే అభినందన పారిజాతాలు.
నాకు నచ్చిన పద్యం: తొలికోడి కూత గురించి VSYSSARMA RANI అభిప్రాయం:
09/13/2021 10:13 am
ఎంతైనా మేము కూడా వారి వంశస్తులు కదా.. మా ఇంటి పేరు రాణీ వారు ..
విషాద నగరం గురించి Srinivasulu k అభిప్రాయం:
09/13/2021 3:17 am
Very touching incident. I can’t address it as story, it is reality, which is nothing but man made disaster!
చంపకోత్పలమాలల కథ గురించి J K Mohana Rao అభిప్రాయం:
09/12/2021 4:51 pm
విరహాంకుని వృత్తజాతిసముచ్చయమును తిరగవేస్తుంటే నిన్న రచితా అనే ఒక జాతి పద్యము కనబడినది. ఇది సంస్కృతములోని వైతాళీయము వంటిది. ప్రథమార్ధములో మాత్రా ఛందస్సు, ద్వితీయార్ధములో గణ ఛందస్సు. ద్వితీయార్ధములోని మొదటి రెండు చతుర్మాత్రలు స-గణములు (IIU), పిదప ఒక నరేంద్ర గణము (అనగా జ-గణము), చివర ఒక గురువు. వీటిని కలిపి ఇలా వ్రాద్దామా? IIU IIU IUI U లేక IIUII UIUIU. ఈ రెండవ భాగపు గురు లఘువుల అమరిక చంపకోత్పలమాలల యందలి ద్వితీయార్ధమే! మొదటి భాగపు అమరిక చ/పం/పం. ఇందులో ఏ మాత్రాగణమునైనను వాడవచ్చును. మాలికావృత్తములలోని ప్రథమార్ధమునకు కూడ ఈ లక్షణములు ఉన్నాయి! వీటిని వివరిస్తూ ప్రాకృతములోని లక్షణ-లక్ష్య పద్యము:
జోఅ తురంగ వాణ వాణాసణ పాణిజుఅం ణరిందఓ
హోడ అ పాఅఅస్మి చందుజ్జలఓ విరమమ్మి ఆరఓ
తం థోరోరు లడహవాహూలఇఏ మఅముద్ధమడచ్ఛిఏ
జాణసు ఛందఅస్మి రడఅంతి పిఏ మహురక్ఖరిల్లిఏ
ఇందులోని చివరి పాదము ఉత్పలమాలకు సరిపోతుంది. మనకు తెలిసి మొట్టమొదటి చంపకమాలను మాఘకవి శిశుపాలవధలో వ్రాసినాడు (తురగకులాకులస్య..) అతని చంపకమాల ధృతశ్రీ అనే పేరుతో వ్యవహరించబడుతున్నది. మాఘుడు ఏడవ శతాబ్దపు ఉత్తర భాగములో నివసించినట్లు ఊహ. విరహాంకుని వృత్తజాతిసముచ్చయములోని ఈ రచితా జాతిని చూచిన పిదప సృజించినాడా? అలాగైతే విరహాంకుని కాలము మాఘునికంటె ముందు. విరహాంకుడు క్రీ.శ. ఆఱు నుండి ఎనిమిదవ శతాబ్దపు కాలము వాడని అంటారు. నా ఊహ నిజమయితే విరహాంకుని కాలము ఆఱు నుండి ఏడవ శతాబ్దపు పూర్వార్ధమని చెప్ప వీలగును.
విధేయుడు – మోహన
విషాద నగరం గురించి J NAGESH అభిప్రాయం:
09/11/2021 10:22 am
Sreedhar Sir! The story is heartbreaking. Have we become so cruel and indifferent that turned out to be disastrous to our little cuties? Are we taking heroism in flouting the norms and cause irreparable loss to Nature? We should learn to respect the Nature otherwise be ready to pay heavily for our misdeeds.
విషాద నగరం గురించి J NAGESH అభిప్రాయం:
09/11/2021 10:16 am
Sreedhar Sir! U have made me cry in silence. The story is heartbreaking. Have we become so cruel and indifferent that turned out to be disastrous to our little cuties ? We should learn to respect the Nature otherwise be ready to pay heavily for our misdeeds.
ఊహల ఊట 4 గురించి Amarendra అభిప్రాయం:
09/11/2021 8:14 am
పసితనం కొల్పోని అరుదైన వ్యక్తుల్లో ఒకరు చాగంటి తులసి.
ఈ వూట ఇలా సాగుగాక…
నలుగురు యాత్రికులు: ఒకే పిపాస గురించి ramarao kanneganti అభిప్రాయం:
09/10/2021 5:49 am
ఇప్పుడే చదివాను ఈ వ్యాసం — నేను ఇంతకు ముందే రెండవ పుస్తకం చదివాను. ఈ విధంగా రచయితల వైవిధ్యం చూపించడం బాగుంది. నిరంతర పథికులు వీరు. అనికేత్ పుస్తకం చదవాలని ఉంది. థాంక్యూ.
నలుగురు యాత్రికులు: ఒకే పిపాస గురించి మల్లీశ్వరి అభిప్రాయం:
09/09/2021 10:01 am
యూనివర్సిటీలలో పాఠంగా పెట్టదగిన వ్యాసం, ధన్యవాదాలు అమరేంద్ర గారు.