పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16453

  1. జనవరి 2022 గురించి Amarendra అభిప్రాయం:

    01/01/2022 9:26 pm

    నీ కోసం నువ్వు బతకడం
    గౌరవాన్ని కాపాడుకోడానికి ప్రయత్నించడం
    అందుకు అవసరమైన ధైర్యం ఇవ్వడం..
    – ఈ పంథా సమస్య వ్యక్తిగతం అయితే సరిపోవచ్చు

    కానీ సమస్య వ్యవస్థాగతం అయినప్పుడు
    ఆ సమస్య పరిమాణం, దాన్ని అధిగమించేందుకు ఊపకరించే పద్ధతులు- వీటిల్లో scale difference ఉంటుంది.

  2. ఊహల ఊట 8 గురించి Palagiri Viswaprasad అభిప్రాయం:

    01/01/2022 11:10 am

    ‘ఊహల ఊట’ వరుసగా చదువుతున్నాను. అద్భుత మనిపిస్తున్నాయి. ఒక విషయాన్ని చెబుతూ, ఆ విషయంలో దొర్లిన మరో పదంలోకి ఎగురుతూ దాని గురించి చెబుతూ గొలుసుకట్టులా సాగుతోంది. అలా చెప్పడంలో భాషాప్రావీణ్య ప్రదర్శన కాకుండా, ఒక సంస్కృతిని చెబుతున్నారు. ఊహల ఊట -7 లో శర్మాజీ’గారి’ ఉదక ఋణానుబంధం, 8 లో కుటుంబరావు దొడ్డ చుట్టపుచూపు ప్రహసం లాంటివన్నీ బాగున్నాయి. ఇలాంటి వారే కాదు, ఎప్పుడో తీసుకున్న అప్పును నెలకొకసారి వచ్చి నాలుగు రూపాయల వంతున ఇచ్చే నిజాయితీ మనుషులను తెలుసుకుంటాం.
    చాగంటి తులసి గారికి అభినందనలు.

  3. ఊహల ఊట 8 గురించి Palagiri Viswaprasad అభిప్రాయం:

    01/01/2022 10:56 am

    ‘ఊహల ఊట’ వరుసగా చదువుతున్నాను. అద్భుతమనిపించింది. ఒక మాట గురించి చెబుతూ, మధ్యలో తగిలిన మరో పదానికి ఎగిరి దాని గురించి చెబుతూ – ఆ చెప్పడంలో కేవలం భాషా ప్రావీణ్యం చాటుకోవడం కాకుండా – ఒక జీవన సంస్కృతిని చెప్పడం నిజంగా అద్భుతమనిపించింది.
    ఊహల ఊట -7 లో శర్మాజీ’గారి’ ఉదకఋణానుబంధం, 8లో కుటుంబరావు దొడ్డ ప్రహసనాలతో కలిసిన ఊహల ఊటలు చాలా బాగున్నాయి.

    చాగంటి తులసిగారికి అభినందనలు!

  4. ఆర్. కె. లక్ష్మణ్ – నా కథ 3 గురించి srinivasa rao vuppala అభిప్రాయం:

    01/01/2022 6:33 am

    అన్నదమ్ముల అనుబంధం, మదరాసు ప్రయణాలూ, మేనమామల సంగతులూ, కళ్ళకు కనబడ్డయి. రచన అనువాదంలా కాక సహజంగా సాగింది. 3వ భాగం కన్నా 1, 2 భాగాలే ఎక్కువగా నచ్చాయి.

  5. అయిదో గోడ: కల్పన రెంటాల కథలు గురించి annapurna appadwedula అభిప్రాయం:

    01/01/2022 5:16 am

    కల్పనగారి తనహాఈ ఎప్పటికీ మరువలేని నవల. చాలా మంది పైకి చెప్పని అంతరంగమధనం. ఆమె నుంచి వచ్చిన మరొక కథల సంపుటి చదవాలని వుంద

    అన్నపూర్ణ.

  6. అబ్బలనాన్న గురించి Indraganti Prasad అభిప్రాయం:

    01/01/2022 4:58 am

    కథ బావుంది. కథ చెప్పే పాత్రలో కథకుడు ప్రవేశం చేయకుండా ఉంటే ఇంకా బావుండును. మూర్తి లాంటి వదరబోతులు ఉంటారు. ఇతరులని బాధించడానికి వెనకాడరు.వాళ్ళని అదుపు చేసే వాళ్లు ఉండకపోవడం కూడా వాస్తవమే. ఎందుకు అలా వదిలేస్తారో ఆశ్చర్యమే.

  7. నా స్నేహితులు గురించి Mrutyunjaya sarma అభిప్రాయం:

    01/01/2022 4:50 am

    Nicely penned sridhar👍👍👍really thought provoking. Cool and sedate expressions 👏👏👏 keep on plz!

  8. నా స్నేహితులు గురించి Ganga Rao అభిప్రాయం:

    01/01/2022 3:09 am

    కవిత బాగుంది.

  9. ఏనుగు డాక్టర్ గురించి ప్రసాద్ చరసాల అభిప్రాయం:

    12/31/2021 2:43 pm

    కథ అద్భుతంగా వుంది. ఎన్నెన్నో ఆలోచనల తేనెతుట్టెను కదిపింది. ❤️

  10. ఏనుగు డాక్టర్ గురించి Padmapadmapv అభిప్రాయం:

    12/31/2021 12:30 pm

    ❤️❤️ అడివి, అడివి జంతువులు పట్ల, ఎంతో ప్రేమ ఉంటే తప్ప..! ఇలాంటి కథ రాయడం కష్టం!.