పాలగిరి విశ్వప్రసాద్, అనురాధ కొంకేపూడి, మల్లాప్రగడ రామారావు, శ్యామల, వెనిగళ్ళ బాలకృష్ణా రావు గార్లు మీ అందరికీ ’ఊహల ఊట నచ్చినందుకు, మీ అభిప్రాయాలు తెలియచేస్తున్నందుకు పేరు పేరున ధన్యవాదాలు.
చాగంటి తులసి
చాలా మంచి కథ. అనువాదం చాలా చక్కగా చేసారు అవినేనిగారు. మనుషులు అప్పుడప్పుడు ఇలాంటివి చదవాలి, తాము ఇతర ప్రాణుల కంటే ఎంత తక్కువో తెలుసుకోవడానికి!అధికారి బాధపడినప్పుడు వాడిన ఒకే పదం అమ్మ ఒడి. ఇదిగో ఇది తప్ప మనుషులకు ఇంకేమి మిగలలేదు. కొన్ని వాక్యాలతోనే అధికారం మనిషిని ఎంత కృత్రిమంగా పరుగులు పెట్టిస్తుందో చాలా బాగా వ్రాసారు. ఆపకుండా చదివించింది. కాకుంటే ఏనుగును తమిళ్ వాళ్ళు ఓన్ చేసుకోవడం మాకు కొంచెం చురుగ్గా ఉంది☺️☺️👍
ఈమాట చూడడం ఇది రెండోసారి. రాగాల గురించి, చిత్రసీమలో వాటి వినియోగం… నాలాంటి వారికి ఉపయుక్తమైన ఈ రాగలహరి చదువుతుంటే మహదానందంగా, ఒక పెన్నిధివలే తోస్తోంది. ధన్యవాదాలతో సరిపోదు; ఈ విషయాలు నా సంగీతజ్ఞానంతో జోడించి ఫేస్‌బుక్‌లో నేనందిస్తున్న ఘంటసాలగారి శతజయంతి ఉత్సవాల సందర్భంగా రాగాల పరిచయం… కార్యక్రమంలో తెలియజేస్తాను. అన్నట్లు… అలకలు తీరిన కన్నులు, విన్నానులే ప్రియా… రెండూ మియాకీ మల్హర్ రాగంలో చేయబడ్డాయి అని విన్నాను. నిజమెంతో! ధన్యోస్మి… శాంతిశ్రీ.
క్షమించాలి. ఇన్నాళ్ళకు చూశాను. ‘A Reference Grammar of Modern Telugu’ పేరుతో అచ్చైంది. ఇది తెలుగువాక్యానికి కొంత చేర్పుతో ఆంగ్లంలో 2017 జూన్ లో ఎమెస్కో ప్రచురణగా వచ్చింది.
ఇకపోతే, చేకూరి రామారావు రచనలన్నిటినీ (కవిత్వం, వ్యాసాలు (ఆంగ్లం కూడా), ఉత్తరాలూ…) కలిపి “మనసు ఫౌండేషన్” ప్రచురుస్తోంది. ఈ జూలై 1 న ఆవిష్కరణ.
చేరా 1969లో రాసిన “A Grammatical Sketch of Telugu” కూడా ఆచార్య ఎ. ఉషాదేవిగారి వద్ద దొరికింది.
ఎంతో మనోహరమైన గీతాలు. సాలూరి వారి చవులూరించే బాణీలు. చెవుల్లో అమృతం పొసే సుశీలగారి రసరాగగానం. ఐతే, ఇందులో సుశీల గారు పాడిన ధీరసమీరే మోహనకల్యాణి రాగంలోని అష్టపది ఉన్నదా లేదా అన్నది నా సందేహం.
ఈ వ్యాసంలో ప్రస్తావించిన కొన్ని కథల అనువాదాలు ఈ పత్రికలో ఇంతకుముందు ప్రచురించారు కదా, వాటికి లింకు చేసివుంటే చాలా వీలుగా ఉండేది. కనీసం భాస్కర్ అవినేని గారి అనువాదాల జాబితాకు లింకు చేసినా బాగుండేది.
మూల రచయితకు, అనువాదం చేసిన రచయితకు మనఃపూర్వక అభినందనలు. ఇది తెలుగు భాషకు అనువాదం కాకపోయుంటే ఎంత కోల్పోయి ఉండేవారము. ఊపిరి బిగబట్టి చదివించింది. ఈ నాగరికత ప్రపంచంలొ ఎంత కోల్పోయాము, ఎన్ని అందాలు కోల్పోయాము. ఎన్నో విషయాలు అడవిగురించి, అడవిలోని ప్రాణులగురించి, ముఖ్యంగా ఏనుగుల గురించి గజరాజులగురించి తెలుసుకొన్నాను. కళ్ళలొ నీళ్ళు నిలిచాయి. 🙏🙏🙏🙏🙏🙏
ఊహల ఊట 8 గురించి చాగంటి తులసి అభిప్రాయం:
01/26/2022 9:13 am
పాలగిరి విశ్వప్రసాద్, అనురాధ కొంకేపూడి, మల్లాప్రగడ రామారావు, శ్యామల, వెనిగళ్ళ బాలకృష్ణా రావు గార్లు మీ అందరికీ ’ఊహల ఊట నచ్చినందుకు, మీ అభిప్రాయాలు తెలియచేస్తున్నందుకు పేరు పేరున ధన్యవాదాలు.
చాగంటి తులసి
ఏనుగు డాక్టర్ గురించి Sasikala అభిప్రాయం:
01/21/2022 12:56 am
చాలా మంచి కథ. అనువాదం చాలా చక్కగా చేసారు అవినేనిగారు. మనుషులు అప్పుడప్పుడు ఇలాంటివి చదవాలి, తాము ఇతర ప్రాణుల కంటే ఎంత తక్కువో తెలుసుకోవడానికి!అధికారి బాధపడినప్పుడు వాడిన ఒకే పదం అమ్మ ఒడి. ఇదిగో ఇది తప్ప మనుషులకు ఇంకేమి మిగలలేదు. కొన్ని వాక్యాలతోనే అధికారం మనిషిని ఎంత కృత్రిమంగా పరుగులు పెట్టిస్తుందో చాలా బాగా వ్రాసారు. ఆపకుండా చదివించింది. కాకుంటే ఏనుగును తమిళ్ వాళ్ళు ఓన్ చేసుకోవడం మాకు కొంచెం చురుగ్గా ఉంది☺️☺️👍
రాగలహరి: ఆభేరి గురించి Santhisree అభిప్రాయం:
01/19/2022 6:42 am
ఈమాట చూడడం ఇది రెండోసారి. రాగాల గురించి, చిత్రసీమలో వాటి వినియోగం… నాలాంటి వారికి ఉపయుక్తమైన ఈ రాగలహరి చదువుతుంటే మహదానందంగా, ఒక పెన్నిధివలే తోస్తోంది. ధన్యవాదాలతో సరిపోదు; ఈ విషయాలు నా సంగీతజ్ఞానంతో జోడించి ఫేస్‌బుక్‌లో నేనందిస్తున్న ఘంటసాలగారి శతజయంతి ఉత్సవాల సందర్భంగా రాగాల పరిచయం… కార్యక్రమంలో తెలియజేస్తాను. అన్నట్లు… అలకలు తీరిన కన్నులు, విన్నానులే ప్రియా… రెండూ మియాకీ మల్హర్ రాగంలో చేయబడ్డాయి అని విన్నాను. నిజమెంతో! ధన్యోస్మి… శాంతిశ్రీ.
చేరాతో ముఖాముఖి గురించి సతీశ్ అభిప్రాయం:
01/17/2022 6:57 am
సౌమ్యగారూ,
క్షమించాలి. ఇన్నాళ్ళకు చూశాను. ‘A Reference Grammar of Modern Telugu’ పేరుతో అచ్చైంది. ఇది తెలుగువాక్యానికి కొంత చేర్పుతో ఆంగ్లంలో 2017 జూన్ లో ఎమెస్కో ప్రచురణగా వచ్చింది.
ఇకపోతే, చేకూరి రామారావు రచనలన్నిటినీ (కవిత్వం, వ్యాసాలు (ఆంగ్లం కూడా), ఉత్తరాలూ…) కలిపి “మనసు ఫౌండేషన్” ప్రచురుస్తోంది. ఈ జూలై 1 న ఆవిష్కరణ.
చేరా 1969లో రాసిన “A Grammatical Sketch of Telugu” కూడా ఆచార్య ఎ. ఉషాదేవిగారి వద్ద దొరికింది.
కృష్ణం వందే జగద్గురుం గురించి Santhisree అభిప్రాయం:
01/17/2022 3:08 am
ఎంతో మనోహరమైన గీతాలు. సాలూరి వారి చవులూరించే బాణీలు. చెవుల్లో అమృతం పొసే సుశీలగారి రసరాగగానం. ఐతే, ఇందులో సుశీల గారు పాడిన ధీరసమీరే మోహనకల్యాణి రాగంలోని అష్టపది ఉన్నదా లేదా అన్నది నా సందేహం.
ఉత్తర మొరాకో శోధనలు 2 గురించి Sujata Pulavarthi అభిప్రాయం:
01/15/2022 11:51 pm
అద్భుతం మీ ట్రావెలోగ్. మీ రచనాశైలి చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేస్తుంది. చాలా బావుంది.
ప్రపంచమే ఒక కథనరంగం గురించి A Reader అభిప్రాయం:
01/14/2022 1:10 am
ఈ వ్యాసంలో ప్రస్తావించిన కొన్ని కథల అనువాదాలు ఈ పత్రికలో ఇంతకుముందు ప్రచురించారు కదా, వాటికి లింకు చేసివుంటే చాలా వీలుగా ఉండేది. కనీసం భాస్కర్ అవినేని గారి అనువాదాల జాబితాకు లింకు చేసినా బాగుండేది.
[లింకులు జతచేశాము. సూచనకు కృతజ్ఞతలు – సం.]
ఏనుగు డాక్టర్ గురించి C.Suseela అభిప్రాయం:
01/13/2022 10:20 am
మూల రచయితకు, అనువాదం చేసిన రచయితకు మనఃపూర్వక అభినందనలు. ఇది తెలుగు భాషకు అనువాదం కాకపోయుంటే ఎంత కోల్పోయి ఉండేవారము. ఊపిరి బిగబట్టి చదివించింది. ఈ నాగరికత ప్రపంచంలొ ఎంత కోల్పోయాము, ఎన్ని అందాలు కోల్పోయాము. ఎన్నో విషయాలు అడవిగురించి, అడవిలోని ప్రాణులగురించి, ముఖ్యంగా ఏనుగుల గురించి గజరాజులగురించి తెలుసుకొన్నాను. కళ్ళలొ నీళ్ళు నిలిచాయి. 🙏🙏🙏🙏🙏🙏
బహుదూరం గురించి Amarendra Dasari అభిప్రాయం:
01/13/2022 1:13 am
ఈ కథను తట్టుకోవడం చాలా కష్టం..
బతుక్కి అక్షరానికి మధ్య అంతరం లేకుండా రాయడం చాలా కొద్ది మందికే సాధ్యం..
బహుదూరం గురించి Kirankumari అభిప్రాయం:
01/11/2022 6:04 am
కథ బాగుంది. రాబందుల పైన కథ చదవటం ఇదే మొదలు. Thank You!