పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16453

  1. విశాఖ గురించి sudha అభిప్రాయం:

    02/07/2022 10:43 pm

    కథ, కథనం చాల బావుంది భాస్కర్ గారు, చరిత్ర కథాంశంలో ఒక డిఫెరెంట్ కోణంలో రాస్తున్నారు, అవీ చాల పదునైన విషయాలు… ఇలాంటి కథలు ఇంకా రావాలి.

  2. వోర్టెక్స్‌లో వాన గురించి sudha అభిప్రాయం:

    02/07/2022 10:36 pm

    బావుంది శ్రీనివాస్ గారు, కాని నెరేషన్ Discontinuity కి subtlety మధ్య ఎడ్జ్ లో ఉంది.

  3. ఆమె ఇల్లు గురించి sudha అభిప్రాయం:

    02/07/2022 10:29 pm

    అనువాదం బావుంది భాస్కర్ గారు, కథ గురించి వస్తే ఏదో మిస్ ఐంది అనిపించింది కథలో.

  4. చల్ మోహనరంగా గురించి తః తః అభిప్రాయం:

    02/07/2022 1:53 pm

    శ్రీ పరుచూరి: టేకు అనసూయగారి పాటలో సాహిత్యం వింటుంటే ‘ఈ పాటకు ఒక ‘రచయిత’ కూడా వున్నాడు’ అనే అనిపిస్తోంది.

    నమస్కారాలతో- తః తః

  5. తెలుగు వాళ్ళకిది వర్తించదు! గురించి తః తః అభిప్రాయం:

    02/07/2022 12:50 pm

    నాకు తెలిసినంతవరకూ దాదాపు పదిహేను సంవత్సరాలుగా ఆంధ్రలో – పుస్తకాల దుకాణాలన్నీ (ఐ ఏ యస్ , ఐ ఐ టి ల వంటి) ప్రవేశ పరీక్షల పోటీ పుస్తకాలతో- గైడ్లతో – నిండి పోయి ఉంటున్నాయి. అంతే. ఈ కారణంగా – దాదాపు కొత్తగా వచ్చిన సైన్స్- ఇంజనీరింగ్ – టెక్నాలజీ పుస్తకాలతో పాటు , ఫొంటానా మోడర్న్ మాస్టర్స్, పెంగ్విన్ చిన్న కథల పుస్తకాలూ- ఎడ్ మెక్‍లైన్ పోలీసు నవలలూ- విశాఖపట్టణంలో ప్రసిద్ధమైన వరహాలు చెట్టిగారి బుక్ సెంటర్లో కొనుక్కుని చదువుకున్న ఆనందం ఇప్పుడు దొరకదు.

    తః తః

  6. రెండు అక్షరసామ్య యతులు గురించి తః తః అభిప్రాయం:

    02/07/2022 11:39 am

    1. ఇలాంటి విషయాల్లో నాకు – రాగానికి కనీసం ఐదు స్వరాలుండాలన్న వేంకటమఖిని పక్కకు నెట్టి మూడు స్వరాలతో రాగనిర్మాణం చేసి, సాహిత్యం సమకూర్చి కృతిని చేసి పాడి వినిపించి నెగ్గిన బాలమురళి ప్రతిభని గుర్తుకు తెచ్చుకోక తప్పదు.

    2. ఒకే వర్గులో నే ఉన్నా ‘మ’ కు ‘ప’, ‘బ’ లతో యతి కుదరదన్న విషయాన్ని గురించి కూడా ఆలోచించాలి. ‘మ’ కు ‘ప ,బ లతో యతి కుదరదు. ప, బ లు బిందు పూర్వక ‘ప’, ‘బ’ లై ఉండాలని అంటారు. “మాయా మేయ జగంబె నిత్యమని సంభావించి…”(సత్య హరిశ్చంద్రీయము – బలిజేపల్లి లోవలె?). దీని వల్ల చంపకోత్పలాలు ఎంతో అందాన్ని పోగొట్టుకోవాల్సి వస్తోంది. నా ప్రతిపాదన ఏమంటే అచ్చతెలుగు పదాలకు ఇలా బిందు పూర్వాలే ఉండాలని కట్టేయొద్దు. యతిలో పాల్గొంటున్న “రెండు పదాలూ” సంస్కృత వాసన గల్గినవయితే పైన పెర్కొన్న నియమం ఉండనిచ్చి రెండూ తెలుగు పదాలయితే మామిడి పనస పలక బలపము-లకు యతి వేసుకుని ఆనందిద్దామని.

    నమస్కారాలతో
    -తః తః

  7. ఉత్తర మొరాకో శోధనలు 3 గురించి G K S Raja అభిప్రాయం:

    02/06/2022 11:15 pm

    అమరేంద్రగారూ! మీ వ్యాస పరంపర కేవలం ట్రావెలాగ్ గా కాకుండా చరిత్ర పరిశోధనగా ఉంది. చెప్పే తీరు కూడా సరళంగా ఆకట్టుకొనే విధంగా ఉంది. రిఫరెన్సులు కూడా జోడించడం వల్ల చాలా ఉపయుక్తంగా కూడా ఉంది. కొనసాగించండి. అభినందనలు.
    రాజా.

  8. రెండు అక్షరసామ్య యతులు గురించి Desikachary అభిప్రాయం:

    02/06/2022 5:48 pm

    మీరు ప్రస్తావించిన ఋకారమునకు రి, రె, రే,రు ఇత్యాది యతులు పూర్వకవులు ఉపయోగించినవే కాని అన్యములు గావు. కానిదంత్య చ,జ లకు ఏమాత్రము ధ్వనిసామ్యము లేని తవర్గాక్షరములతో యతి నంగీకరించుట అభిలషణీయ మను మీ నూతనప్రతిపాదన నాదృష్టిలో సమర్థనీయముగా లేదు. మీరిచ్చిన పుచ్చుకొని = పుత్సుకొని, పచ్చలు = పత్సలు అను ఉదాహరణములలోని పత్సలు, పుత్సుకొని అను పదాలలో తకారమునకు గల సకారసంయోగముతో చకారసామ్యధ్వని యుండుటచేత, చ,ఛ, జ,ఝ,శ,ష,స- లకు లక్షణగ్రంథములలో చెప్పబడిన యతిమైత్రిద్వారా ‘చ్చు’, ‘చ్చ’లతో ధ్వనిసామ్యం కల్గింది గాని, కేవలం పుత్తుకొని, పత్తలు అని ఉంటే యతిమైత్రికి ఆస్కారమనేదే లేదని నా ఉద్దేశ్యం. ఇక్కడ చ,జ లంటే, చ,ౘ, జ, ౙ లను నాల్గక్షరాలని గుర్తుంచుకొనవలెను.

  9. ఉత్తర మొరాకో శోధనలు 3 గురించి B. Rama Naidu అభిప్రాయం:

    02/06/2022 8:54 am

    ఆసక్తికరంగా ఉంది. అనువాదం చాలాబాగుంది.

  10. విశాఖ గురించి కె.కె. రామయ్య అభిప్రాయం:

    02/05/2022 11:56 am

    క్రీ. పూ 232 లో అశోకుడు మరణించిన సుమారు 50 సంవత్సరాల తరువాత మౌర్య సామ్రాజ్యం చివరి పాలకుడు బృహద్రథమౌర్య చక్రవర్తిని ఆయన సైన్యాధ్యక్షుడు పుష్యమిత్ర శుంగుడు ( బ్రాహ్మణుడు ) హత్య చేసి శుంగవంశానికి మొదటి చక్రవర్తిగా సింహాసనాన్ని అధిష్టించాడు. దీని రాజధాని పాటలీపుత్ర. క్రీ. పూ.187 నుండి 78 వరకు మగధ నుండి మధ్య, తూర్పు ప్రాంతాల్లో భారత ఉపఖండంలో వీరి పాలన సాగింది.

    పుష్యమిత్ర బౌద్ధ మఠాలను తగలబెట్టించి, స్థూపాలను నాశనం చేయించి, బౌద్ధ సన్యాసులను ఊచకోత కోయించాడు. ఇది బౌద్ధమతాన్ని కాశ్మీరు, గాంధార, బాక్ట్రియా వరకూ నెట్టివేసింది. శుంగ సామ్రాజ్యం కాలంలో గంగా మైదానంలో బ్రాహ్మణిజం బౌద్ధమతంతో రాజకీయ, ఆధ్యాత్మిక విషయాలలో పోటీ పడిందని కొంతమంది విశ్వసించారు